ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్‌మీ ఈ నెల 28న ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రెడ్‌మి నోట్11 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ని ఆవిష్కరించనుంది. ఈ లాంచింగ్ ఈవెంట్‌లో రెడ్‌మి వాచ్ 2 కూడా విడుదల కానుంది. రెడ్‌మి నోట్11 సిరీస్ పోస్టర్ నుంచి రాబోయే సిరీస్ డిజైన్ వెల్లడైంది. రెడ్‌మి నోట్11 సిరీస్‌లో చాలా ఫోన్‌లను ప్రారంభించవచ్చని సమాచారం. చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ వీబోలో.. రెడ్‌మి నోట్11 సిరీస్ 120డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు కంపెనీ దృవీకరించింది.
అలాగే, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లతో రానున్నట్లు పోస్ట్ చేసింది. రెడ్‌మి నోట్ 11 మొబైల్ మీడియాటెక్ డిమెన్సిటీ 810 ప్రాసెసర్, రెడ్‌మి నోట్ 11 ప్రో మీడియాటెక్ డిమెన్సిటీ 920 ప్రాసెసర్, రెడ్‌మి నోట్ 11 ప్రో+ మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ఏఐ ప్రాసెసర్ ద్వారా పనిచేయనుంది. రెడ్‌మి నోట్11 సిరీస్ ఫోన్లు 120హెర్ట్జ్ డిస్ ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీలతో వస్తాయని సమాచారం. వీటిలో 108 ఎంపీ ప్రైమరీ సెన్సార్ కెమెరా, క్వాడ్ కెమెరా సెటప్, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఫీచర్లు ఉన్నట్లు టెక్ బ్లాగ్ సినావిబో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment