Nokia 5.4 Specifications | Nokia 5.4 Launch Date and Price In India - Sakshi
Sakshi News home page

14వేలకే నోకియా 5.4 మొబైల్

Published Tue, Dec 15 2020 3:15 PM | Last Updated on Tue, Dec 15 2020 6:05 PM

Nokia 5.4 With 48MP Rear Camera and 4000mAh Battery Launched - Sakshi

హెచ్ఎండీ గ్లోబల్ త్వరలో నోకియా 5.4 అనే కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుందని వార్తలు జోరుగా వస్తున్నాయి. గతంలో లాంచ్ అయిన నోకియా 5.3కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ రానుంది. ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం ప్రకారం.. నోకియా మొబైల్ మీడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో నోకియా 5.4ను తీసుకొస్తునట్లు నోకియా అధికారికంగా ప్రకటించింది. దీనిలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో, 6జీబీ ర్యామ్ + 64జీబీలో ఈ ఫోన్లు లభించనున్నాయి. నోకియా 5.4ను ఈ నెలాఖరులో(డిసెంబర్ 2020) కింగ్డమ్ అఫ్ సౌదీ అరేబియాలో 699 ఏఈడీ లేదా 190 డాలర్లు(సుమారు 14,000) ప్రారంభ ధరలో తీసుకురానున్నారు. ఇదే ధరలో మిగతా ప్రపంచ వ్యాప్తంగా 2021 జనవరి ప్రారంభంలో తీసుకురానున్నట్లు సమాచారం. (చదవండి: జియోకు వ్యతిరేకంగా విష ప్రచారం!)

నోకియా 5.4 ఫీచర్స్:

పేరు: నోకియా 5.4 
డిస్ప్లే: 6.39 అంగుళాల హెచ్ ఢీ ప్లస్ పంచ్ హోల్ డిస్ప్లే
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662
ర్యామ్: 4జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్
స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రధాన కెమెరా: 48ఎంపీ(f1.8) + 2ఎంపీ డెప్త్ + 5ఎంపీ అల్ట్రావైడ్ + 2ఎంపీ మాక్రో కెమెరా
సెల్ఫీ కెమెరా: 16ఎంపీ(f2.0)
కనెక్టివిటీ: నానో సిమ్, జిఎస్ఎమ్/ఎల్‌టిఇ, బ్లూటూత్ ® 4.2, జిపిఎస్/ఎజిపిఎస్, గ్లోనాస్, బిడిఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎన్‌ఎఫ్‌సి
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్, 10వాట్ ఛార్జర్
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్™ 10( ఆండ్రాయిడ్ 11 సపోర్ట్)
బరువు: 181 గ్రా.
కలర్స్: పోలార్ నైట్, డస్క్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement