బనశంకరి(బెంగళూరు): స్మార్ట్ ఫోన్ నిత్య జీవితంలో భాగమైపోగా, దానివల్ల సంసార జీవితం సమస్యల్లోనూ పడుతోందని తరచూ జరిగే ఉదంతాలు చాటుతున్నాయి. మొబైల్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, కానీ విపరీతంగా వినియోగంతో భార్యభర్తల బాంధవ్యం బీటలు వారే ప్రమాదముంది. తద్వారా కుటుంబాల్లో సంక్షోభం ఏర్పడుతోందని బెంగళూరుతో సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నిర్వహించిన ఒక సర్వే హెచ్చరించింది. అందులో 88 శాతం సమీక్షలో స్మార్ట్ ఫోన్ల వినియోగంతో తలెత్తే దుష్పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
కుటుంబానికి తక్కువ సమయం
► సైబర్ మీడియా రీసెర్చ్ సంస్థతో కలిసి వివో అధ్యయనం సాగించింది. స్మార్ట్ ఫోన్లు, మానవ సంబంధాలపై వాటి పరిణామాలు – 2022 అనే పేరుతో సర్వే చేయగా, ఎక్కువమంది దంపతులు స్మార్ట్ ఫోన్‌ను మితిమీరి వినియోగిస్తున్నట్లు ఒప్పుకున్నారు.
► దీని వల్ల కుటుంబంతో తక్కువ సమయం గడుపుతున్నట్లు 89 శాతం మంది తెలిపారు.
► స్మార్ట్ ఫోన్ తమ దృష్టి ఆకర్షిస్తుందని సమీక్షలో పాల్గొన్న 69 శాతం మంది తెలిపారు. అంతేగాక జీవిత భాగస్వామిపై దృష్టి సారించడంలేదని చెప్పారు.
► ఖాళీ సమయం దొరికితే మొబైల్‌తో గడుపుతున్నామని చెప్పారు. మొబైల్ కారణంగా తమ ప్రవర్తనలో మార్పు వచ్చిందని 88 శాతం మంది అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment