marriage life
-
నెరుస్తున్న బంధాలు
పెళ్లయిన కొత్త... పడలేదు..విడిపోయారు...పెళ్లయ్యి పదేళ్లు... విడిపోయారు... ఇవి అందరికీ తెలిసినవే.కాని పెళ్లయ్యి ముప్పై, నలబై ఏళ్లు అయ్యాక కూడా విడిపోవాలా?వీటిని ‘గ్రే డివోర్స్’లని ‘సిల్వర్ స్పిల్టింగ్’ అంటున్నారు.నటుడు ఆశీష్ విద్యార్థి తన 60వ ఏట విడాకులు తీసుకుంటే ఇప్పుడు రెహమాన్ జంట కేసు కూడా గ్రే డివోర్స్ను చర్చాంశం చేసింది. సైకాలజిస్ట్‌లు మాత్రం జట్టు తెల్లబడేకొద్దీ వైవాహిక జీవితం గట్టిపడేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ఆశీష్ విద్యార్థి కుమారుడు అమెరికాలో చదువుకుంటున్నారు. అతని గ్రాడ్యుయేషన్ సెరిమనీకి ఆశీష్ తన భార్య రాజోషి బారువాతో వెళ్లాడు. కాని వారు మరోసారి అలా కలిసి వెళ్లలేని విధంగా 2022లో విడిపోయారు. ‘మా సొంత ఇష్టాలు, ఆసక్తులు నెరవేర్చుకునే సమయం ఇది అనిపించింది’ అన్నారు వారు. ‘తండ్రిగా ఆషిష్లో ఏ వంకా వెతకలేము. భార్యగా నాకుండే కంప్లయింట్లు ఉంటాయి’ అని విడిపోయాక అతని గురించి రాజోషి అంది. వారు ఒకరి మీద ఒకరు గౌరవం చూపుతూనే విడిపోయారు. కాని సైకాలజిస్టులు ఏమంటారంటే ఒకరి మీద ఒకరు గౌరవం చూపుతూ కలిసి ఉండొచ్చుగా?హృదయాలు ఎందుకు పగలాలి?ఏ.ఆర్.రెహమాన్ 57 ఏళ్ల వయసులో అతని భార్య సైరా బాను 57 సంవత్సరాల వయసులో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ‘ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ అలాగే ఉంది. కాని హృదయాలు పగిలేంతగా అగాథాలు వచ్చాయి’ అని వారిద్దరూ తెలిపారు. అయితే అగాథాలు ఒక్కరోజే వచ్చిపడవు. పగుళ్లు కనిపిస్తూనే ఉంటాయి. వాటిని గుర్తించి సరి చేసుకునేందుకు ప్రయత్నించాలి. 99 సార్లు ప్రయత్నం చేసి నూరవసారి ఈ తీవ్ర నిర్ణయానికి రావచ్చు.జాగ్రత్త పడాల్సింది ఇప్పుడేఅమెరికాలో గ్రే డివోర్సులు గత పదేళ్లలో పెరిగాయి. ఆశ్చర్యం ఏమంటే 50 ఏళ్ల వయసులో డివోర్స్ తీసుకునే వారు 13 శాతం ఉంటే 65 ఏళ్ల తర్వాత డివోర్స్ తీసుకునేవారు 29 శాతం ఉన్నారు. భారత దేశంలో విడాకుల వరకూ వెళ్లే వారి సంఖ్య తక్కువే అయినా ఏళ్ల తరబడి భర్త ఒక సంతానం దగ్గర, భార్య ఒక సంతానం దగ్గర, లేదంటే ఒకే చూరు కింద అపరిచితుల్లా ఉన్నవారు అనేకమంది ఉన్నారు. పెళ్లినాటి నుంచే మొదలయ్యే బంధాల నిర్వహణాలోపం కాలక్రమంలో ఇక్కడిదాకా తెస్తుంది. ఇక్కడ దాకా వచ్చాక విడిపోవడంలో సౌలభ్యం ఉందని చెప్పినా కొత్త జీవితంలో కూడా అంతే సౌలభ్యం పొందగలరా అనేది ప్రశ్నార్థకం. అందులో ఎదురయ్యే సవాళ్లు అల్రెడీ ఉన్న సంసారిక జీవితంలో ఎదురయ్యే సవాళ్ల కంటే గట్టివైతే ఏమిటి చేయడం?గ్రే డివోర్సులకు కారణాలు– నివారణ→ ఖాళీ ఇల్లు: పిల్లలు పెద్దవారయ్యే వెళ్లిపోయాక అంత వరకూ తల్లిదండ్రులుగా ఉన్నవారు తాము భార్యాభర్తలుగా ఉండటం మర్చిపోయామని గ్రహిస్తారు. భార్యాభర్తలుగా ఉండటం కొత్తగా మొదలెట్టాక సమస్యలు మొదలవుతున్నాయి. అంటే పిల్లలతో పాటుగా కుటుంబంగా ఉండటం సాధన చేస్తే ఈ ‘ఖాళీ’ రాదు. పిల్లలు లేని ఏకాంతం భార్యాభర్తల్లో మరింత ఇష్టాన్ని, విహారాన్ని, కబుర్లని ఇవ్వాలిగాని తగూలాటను కాదు. సమస్యను దాచి పిల్లల ముందు వ్యవహరించడం వల్ల ఇప్పుడు ఆ సమస్య విడాకులు కోరుతోంది. → మరింత అధికారం: భార్యాభర్తల మధ్య పొజెసివ్‌నెస్ ఉంటుంది. నాకే చెందాలి అని. ఉద్యోగాల్లో ఉండగా పట్టిపట్టి చూడటం కుదరుదు. ఈ రిటైర్మెంట్ తర్వాత భర్త తరచూ క్లబ్లో కూచుంటున్నా భార్య తరచూ బంధువులతో గంటల ఫోన్లలో ఉన్నా చిరాకులు తలెత్తుతాయి. ఏం చేసినా వీలైనంత వరకూ ఉమ్మడి అనుబంధాలలో గడపడం ఈ వయసులో చాలా ముఖ్యం. అంటే కామన్ ఫ్రెండ్సే, కామన్ ఆసక్తులే బంధాలను నిలుపుతాయి. ఇక అనుమానాలకు చోటిచ్చే ఇతర ఏ ఆకర్షణవైపుకు వెళ్లకపోవడమే ఉత్తమం.→ రూపాయి తగాదా: డబ్బు నీది, నాది అంటూ కాపురం సాగి ఉంటే ఆ రూపాయి భూతంలా మారే సందర్భం ఇదే. నా డబ్బు నేను ఇచ్చుకుంటాను, నా ఆస్తి నేను పంచుకుంటాను అని భార్య/భర్త ఎప్పుడైతే అనుకుంటారో అగాధాలు మొదలవుతాయి. డబ్బు ఒకరికి తెలియకుండా మరొకరు దాచకుండా ముందు నుంచి సంసారం సాగాలి. ఆర్థిక నిర్ణయాలు పరస్పర అంగీకారంతో జరగాలి. రిటైర్మెంట్ తర్వాత ఎలా ఆర్థికంగా ఉండబోతున్నారో ఆస్తులు ఎవరికి ఎలా ఇవ్వబోతున్నారో పదే పదే చర్చించుకుని సంతృప్తి పడితే సమస్య రాదు. → అనారోగ్య సమయాలు: అనారోగ్యాలు ఎదురయ్యే ఈ సమయంలో భార్య/భర్త దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉంటే ఓదార్పు కోసం కొత్త స్నేహానుబంధాల్లోకి వెళ్లడం విడాకులకు మరో కారణం. ఈ సమయంలో ఉండే అభద్రతను దృష్టిలో ఉంచుకుని జీవిత భాగస్వామి మరింత బాధ్యతగా ఉండాలి. ఇలాంటి సమయాల్లో విడిపోయే దాకా రావడం భార్యాభర్తల కంటే పిల్లలకు పెద్ద విఘాతం కాగలదు. కలిసి ఉంటే కలదు సుఖముపెళ్లయిన నాటి నుంచి తగాదాల కాపురం అయితే అందులో ఒక సమర్థింపు ఉండొచ్చుగాని హఠాత్తుగా ముప్పయి నలబై ఏళ్ల తర్వాత విడాకులంటే ఏదో నిర్లక్ష్యం భార్యాభర్తల్లో ఉన్నట్టే. జవాబుదారీతనం లేదులే అనుకోవచ్చుగాని విడిపోవడం అంత సులువు కాదు. పైగా అది ఒకరు గట్టిగా తీసుకొంటే మరొకరి పెనుఘాతం కావచ్చు. ఇష్టంతో, గౌరవంతో విడిపోయినా మళ్లీ ‘సాధారణస్థితి’కి రావడానికి చాలా కాలం పడుతుంది. కలిసి జీవించి పిల్లలకు జన్మనిచ్చి వారితో సంతోషంగా కాలం గడపాల్సిన ఈ వేళలో మరింత శ్రద్ధ. ప్రేమలను అనుబంధంలో పెంచడమే భార్యాభర్తలు చేయాల్సింది. -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: అల్లుడు కోడలు ఆయుర్దాయం..!
కోడలు.... ఆమె నాకు పుట్టిన పిల్ల కాదు. ఎక్కడో పుట్టినపిల్ల. ఎక్కడో చదువుకుంది.. ఎవరి ఇంటినుండో వచ్చింది. అయితే నాకు కోడలిగా వచ్చింది. నా కొడుకును సంతోష పెట్టింది. నా వంశాన్ని పెంచింది. నాకు మనవడిని, మనవరాలిని ఇచ్చింది. నాకు, నా భార్యకు ఊతకర్ర.. చేతికర్ర అయింది. ముప్పూటలా ప్రేమను పంచిపెడుతున్నది. అటువంటి కోడలును చూసుకుని అత్తామామలు మురిసిపోతారు. అందుకే శాస్త్రం కోడలికి పెద్దపీట వేసింది. మామగారు కాలం చేస్తే... తద్దినం పెట్టేటప్పుడు కొడుకు అక్కడే ఉన్నా దీపం పెట్టే అధికారం మాత్రం కోడలికే ఇచ్చింది. ఏ కారణంచేతనయినా ఆమెకు అవాంతరం ఏదయినా వస్తే... ఆమె మళ్ళీ యోగ్యత పొందినప్పుడే తద్దినం పెట్టాలని చెప్పింది. అంత గొప్ప ఉపకారం చేస్తున్న కోడలిని... మా కిచ్చిన కన్యాదాతకు ప్రతిఫలంగా ఏమిచ్చి గౌరవించగలం!!నా కూతురిని వేరొకరి ఇంటి కోడలిగా పంపితే.. నేను ఒక మహోపకారం చేసినట్లు. నా కూతురు వేరొకరికి ధర్మపత్ని అయింది. ఆయన తరిస్తున్నాడు. ఆయన సంతోషంగా ఉన్నాడు. ఆయన సంతానాన్ని పొందాడు. నేను తాతయినట్టుగానే ఆయన తల్లిదండ్రులు తాత, నాయనమ్మలయి వారు సంతోషిస్తున్నారు. భగవంతుడు నాకేమి ఇచ్చాడో వేరొకరికి కూడా ఇచ్చాడు. అది నాకు గొప్ప సంతృప్తి. ఎవరంటారు శాస్త్రం ఆమెకు తక్కువ చేసిందని!!! తండ్రికి ఆమె 21 తరాలు తరించే అవకాశం ఇచ్చింది.పిల్లను ఇస్తున్నాం... కన్యాదానం చేస్తున్నామంటే... ఏదో పంచలచాపు ఇస్తున్నట్లు కాదు... ఆ పిల్ల మీద అధికారం తల్లిదండ్రులకు ఎప్పుడూ ఉంటుంది. పరమ మర్యాద, గౌరవం అల్లుడి దగ్గరే మొదలవుతుంది. మంచి అల్లుడిని పొందడం అంటే మరో కొడుకును కన్నంత ఆనందం. కొడుకు చూపే అభిమానంకన్నా కోడలి అభిమానం పొందిన వారు మరో పదేళ్ళు ఎక్కువగా బతుకుతారు. మా అల్లుడు బంగారం. మా అమ్మాయిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడన్న ఆనందం వారి ఆయుర్దాయాన్ని పెంచుతుంది.కాంచీపురంలో ఒక వృద్ధ వేదపండితుడు తటస్థపడి మాటల సందర్భంలో ఇలా అన్నాడు.. ‘‘అల్లుడు మంచివాడయితే మీకు మరో కొడుకున్నట్టే. మంచివాడు కాకపోతే మీరు నిత్యం చచ్చిపోయినట్లే. కారణం కూతురి బాధను చూడలేక, చూసి.. మింగలేక.. కక్కలేక మీకు ఆ స్థితి ఏర్పడుతుంది.’’ అని.మనిషిని మనిషి బాధపెట్టుకోవడమయినా, బతికించుకోవడమయినా మన అనుబంధాలనుబట్టి ఉంటుంది. గృహస్థాశ్రమ వైశిష్ట్యాన్ని అర్థం చేసుకుంటే... ఓహ్... ఇంత గొప్పగా మాట్లాడి ఇస్తున్నారా పిల్లను... అనిపిస్తుంది. అందుకనే ‘ధర్మేచ అర్థేచ కామేచ....ఏషా నాతి చరితవ్యా... ధర్మప్రజాసంపత్తి అర్థం స్త్రీయం ఉద్వహే’ .. నేను ఈమెను దేనికోసం స్వీకరిస్తున్నాను..ధార్మికమైన సంతానం కోసం... జీవితంలో మొదట భార్య ఊరట, తరువాత కొడుకు ఊరట, తదుపరి కోడలు ఊరట, పిదప మనవడు, మనవరాలు ఊరట...అదీ గృహస్థాశ్రమ వైభవం... తాత పక్కన ఉంటే మనుమలకు ఒక విశ్వవిద్యాలయం పక్కన ఉన్నట్టే.– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఈ తరానికి అవసరమైన సప్తపది..
‘పెళ్లంటే నూరేళ్ల పంట, అది పండాలి కోరుకున్న వారి ఇంట పండాలి’... అనే పాట ఒకప్పుడు చాలా పాపులర్. ఈతరం ఒక్కసారి కూడా విని ఉండదు. ఈ పాటలాగే పెళ్లి కూడా పాతబడిపోతోంది. ఈ మాట అంటే చాలామందికి కోపం రావచ్చు. కానీ పెళ్లి స్వరూపం మారిపోతోందనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెళ్లి స్థానంలో లివ్ ఇన్ రిలేషన్షిప్ వచ్చేస్తోంది. పెళ్లికి ముందే ఒకే ఇంట్లో కలిసి ఉండే జంటల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.ఇది ఎక్కడకు వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. అయితే పెళ్లయినా, లివ్ ఇన్ అయినా మరెలాంటి బంధమైనా నిలబడాలంటే ఏడు సూత్రాలు పాటించాలని ‘ఫ్యామిలీ జర్నల్’ జరిపిన సైకాలజికల్ రీసెర్చ్‌లో వెల్లడైంది. ఈ ఏడు సూత్రాలు పాటించడం ద్వారా జీవిత భాగస్వాముల మధ్య ప్రేమ, సామరస్యం వెల్లివిరుస్తుందని ఆ అధ్యయనం చెబుతోంది. అవేమిటో ఈరోజు తెలుసుకుందాం.లోపాలను బలాలుగా మార్చుకోగల సామర్థ్యం..పెళ్లంటే చాలా సవాళ్లు ఉంటాయి. భార్యాభర్తల్లో లోపాలుంటాయి, దిగులుపడే సందర్భాలు ఉంటాయి. ఆ సవాళ్లను ఎలా పరిష్కరించుకుంటారు, వారి లోపాలను ఎలా మార్చుకుంటారనేదే వారి బంధంలోని బలాన్ని నిర్ణయిస్తుం దని ఈ అధ్యయనంలో వెల్లడైంది. కష్టసమయాల్లో ఒకరికొకరు ఓదార్పు, మద్దతు, ప్రోత్సాహం అందిస్తూ కలిసి సమస్యలు ఎదుర్కోవడమే తొలిమెట్టు.కలిసి పంచుకోవడం కీలకం..‘నా స్పేస్ నాకు కావాలి’ అంటూ గొడవపడే జంటలు మన చుట్టూ కనిపిస్తూ ఉంటారు. పెళ్లంటేనే కలిసి జీవితాన్ని పంచుకోవడం. ఇద్దరూ కలిసి ఆనందించే చర్యల ద్వారా తమదైన ప్రపంచాన్ని సృష్టించుకోవడం అవసరమని ఈ అధ్యయనం హైలైట్ చేస్తుంది. ఇలా చేయడం జంట మధ్య భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. అందువల్ల తరచుగా కలిసి నడవడం, వంటచేయడం, పరస్పర హాబీలను ప్రోత్సహించుకోవడం లాంటి పనులు చేయాలి.విభేదాలు, మార్పును సహించడం..పెళ్లంటే భిన్న వ్యక్తిత్వాలున్న ఇద్దరు కలిసి ఒకటిగా జీవించడం. అంటే వారిద్దరి మధ్య విభేదాలు సహజం. వాటిని అంగీకరించడం, సహించడం అవసరం. అలాగే బంధంలో, భాగస్వామిలో వచ్చే మార్పును ముప్పుగా భావించకుండా, దాన్ని పరిణామానికి ఒక అవకాశంగా చూడాలి. విభేదాలతో విడిపోకుండా, అవి ఒకరి గురించి మరొకరు మరింత తెలుసుకోవడానికి అమూల్యమైన అవకాశాలుగా వినియోగించుకోవాలి.రాజీతోనే విభేదాలు పరిష్కారం..వైవాహిక జీవితంలో విభేదాలు సహజం. తప్పెవరిదైనా విభేదాలను పరిష్కరించు కోవడానికి రాజీ పడటం అవసరం. అలా రాజీపడి విభేదాలను పరిష్కరించుకోగల జంటలు ఎక్కువ సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తారని అధ్యయనం చెబుతోంది. అందువల్ల లోపాల గురించి విమర్శించుకునే బదులు బలాలు, సానుకూల లక్షణాలను ప్రశంసించడంపై దృష్టి పెట్టండి. ఒకరిపట్ల మరొకరికి అవగాహన, కృతజ్ఞత కలిగి ఉండటం సామరస్య వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.అప్పుడప్పుడైనా మెచ్చుకోవాలి..భార్య వంట చేస్తే లొట్టలేసుకుంటూ తినడం, భర్త బంగారం కొనిస్తే తీసుకోవడమే కాదు.. వారికెప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా? చిన్న చిన్న విషయాలకు కూడా థాంక్స్ చెప్పడం అవసరమని అధ్యయనం నొక్కి చెబుతుంది. అలా చేయడం జంట మధ్య ప్రేమ, అనుబంధాన్ని పెంపొందిస్తుంది. అందుకే మీ పార్ట్నర్ సహకారాన్ని, లవ్ సిగ్నల్స్‌ను గుర్తించి అభినందించేందుకు ప్రయత్నించండి.బంధంలో నిబద్ధత..భారతదేశంలో పెళ్లంటేనే జీవితకాల బంధం. అది విజయవంతం కావాలంటే నిబద్ధత కీలకం. జీవితంలో వచ్చే చెడు కాలాలను దాటి బంధం నిలబడాలంటే జంటలో అంకితభావం, పట్టుదల అవసరం. అన్నింటికంటే వైవాహిక బంధమే ముఖ్యమైనదని గుర్తించి, దాన్ని కాపాడుకోవడానికి సమయం వెచ్చించాలి. అలా కాల పరీక్షను తట్టుకుని నిలబడే ప్రేమ, విశ్వాసాలకు పునాదిని నిర్మించుకోవచ్చు.తనను తాను గౌరవించుకోవాలి..ఆరోగ్యకరమైన సంబంధాలకు ఆత్మగౌరవం ఆధారం. అది మీరు మీ భాగస్వామితో వ్యవహరించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. బలమైన ఆత్మగౌరవం ఉన్నవారు సంతృప్తికరమైన సంబంధాలను కొనసాగించడానికి మెరుగ్గా సన్నద్ధమవుతారని అధ్యయనం సూచిస్తోంది. ఆత్మగౌరవం లేనివారు చిన్నచిన్న విషయాలకు కూడా నొచ్చుకుని గొడవపడుతుంటారు. అందుకే ముందుగా మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, ప్రేమించుకోండి. అది మీ వైవాహిక బంధానికి పునాదిగా నిలుస్తుంది.ఇవి చదవండి: Father's Day 2024: హాయ్..! నాన్న..!! -
అదీ.. దాంపత్యం అంటే..!
పిల్లలకు వివాహం నిర్ణయించేటప్పుడు పెద్దలు పాటించే ప్రామాణికాల్లో శీలం, వయస్సు, వ్యక్తిత్వం, అభిజనం తరువాత చివరిది లక్షణం. లక్షణం అంటే భౌతికమైన అందం. లోకంలో గుణాలు ఎంత గొప్పవో, అందం కూడా అంత గొప్పది. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. రుక్మిణీదేవి శ్రీ కృష్ణ పరమాత్మను ఇష్టపడింది కేవలం ఆయన బాహ్య సౌందర్యం చూసి కాదు.ఎన్నో గుణాలు వివరించి... ‘కృష్ణా! ఇన్ని గుణాలు నీలో ఉన్నాయి కాబట్టే నాకు నీవంటే అంత ప్రీతి’’ అని ఆమె ప్రకటించింది. భౌతికమైన అందం ఉండాలి. వధూవరులు ఒకరికి ఒకరు తగినవారయి ఉండాలి. నూతన దంపతులను చూసినప్పుడు ‘ఆ పిల్ల చేసుకున్న అదృష్టం’ అనో, ‘ఆ పిల్లవాడిది అదృష్టం అంటే’... అని అనకూడదు. ఒకరికొకరు సరిగ్గా సరిపోయారు’ అనాలి. ఆ తరువాత ప్రేమతో, ఆర్ద్రతతో గృహస్థాశ్రమాన్ని పండించుకోవడం ఆ దంపతుల వంతు.దేవుడి విషయంలో అయినా సరే, ఇదే మర్యాద పాటిస్తారు. శంకరాచార్యులవారు శివానందలహరిలో పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతను ప్రస్తావిస్తూ.. ‘‘ఆమె ఎంత తపస్సు చేసిందో ఈయనకు భార్య కాగలిగింది. ఈయన ఎంత తపస్సు చేసాడో అటువంటి భార్య లభించింది. అదీ దాంపత్యం అంటే. అలా అల్లుకుపోవాలని భగవంతుడే మనకు నేర్పాడు.– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
సినీ ఇండస్ట్రీలో మరో జంట విడాకులు ప్రకటించింది. తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ షాకింగ్ ప్రకటన చేశారు. తన భార్య.. సింగర్ సైంధవితో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మరోవైపు సైంధవి కూడా తనవైపు నుంచి అధికారికంగా ప్రకటించారు.ఈ ఇద్దరూ విడిపోతున్నట్లు ఈ మధ్య కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. అయితే.. ఆ కథనాల్ని ధృవీకరిస్తూ.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వీళ్ల అభిమానులు విస్మయానికి గురి అయ్యారు. సైంధవి జీవీ ప్రకాష్‌కు బాల్య మిత్రురాలు. ఇద్దరూ 12 ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించారు. 2013లో వీళ్లిద్దరూ వివాహం చేసుకోగా.. ఈ జంటకు ఓ పాప ఉంది.‘‘చాలా ఆలోచించిన తర్వాత ‘సైంధవి, నేను 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాం. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగుకోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి కీలక తరుణంలో మా గోప్యతకు భంగం కలిగించకుండా ఉండేందుకు మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక నుంచి మేము వేరవుతున్నట్లు అంగీకరిస్తున్నాం. ఈ నిర్ణయం ఇద్దరికీ ఉత్తమమని నమ్ముతున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీ అవగాహన, మద్దతు చాలా అవసరం’’ అని జీవీ ప్రకాశ్ మీడియాను కోరారు. pic.twitter.com/73IbnNZfEf— G.V.Prakash Kumar (@gvprakash) May 13, 2024 pic.twitter.com/M6GDxgAFqn— Saindhavi (@singersaindhavi) May 13, 2024 మ్యూజిక్ దిగ్గజం ఏఆర్ రెహమాన్ మేనల్లుడు అయిన జీవీ ప్రకాష్.. కోలీవుడ్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా ఇప్పటిదాకా హీరోగానూ డజనుకు పైగా చిత్రాలతో అక్కడి ఆడియొన్స్‌ను అలరించారు. తెలుగులోనూ పలు చిత్రాలకు ఆయన మ్యూజిక్ అందించారు. ఇక 12వ ఏట టీవీ షో ద్వారా సింగర్‌గా గుర్తింపు దక్కించుకున్న సైంధవి.. విక్రమ్ అన్నియన్(అపరిచితుడు) చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించారు. తమిళ్, తెలుగు చిత్రాల ద్వారా ఆమె అలరిస్తూ వస్తున్నారు. -
సంసారంలో స్మార్ట్‌ఫోన్ చిచ్చు.. గంటల తరబడి అదే పని!
బనశంకరి(బెంగళూరు): స్మార్ట్ ఫోన్ నిత్య జీవితంలో భాగమైపోగా, దానివల్ల సంసార జీవితం సమస్యల్లోనూ పడుతోందని తరచూ జరిగే ఉదంతాలు చాటుతున్నాయి. మొబైల్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, కానీ విపరీతంగా వినియోగంతో భార్యభర్తల బాంధవ్యం బీటలు వారే ప్రమాదముంది. తద్వారా కుటుంబాల్లో సంక్షోభం ఏర్పడుతోందని బెంగళూరుతో సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నిర్వహించిన ఒక సర్వే హెచ్చరించింది. అందులో 88 శాతం సమీక్షలో స్మార్ట్ ఫోన్ల వినియోగంతో తలెత్తే దుష్పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబానికి తక్కువ సమయం ► సైబర్ మీడియా రీసెర్చ్ సంస్థతో కలిసి వివో అధ్యయనం సాగించింది. స్మార్ట్ ఫోన్లు, మానవ సంబంధాలపై వాటి పరిణామాలు – 2022 అనే పేరుతో సర్వే చేయగా, ఎక్కువమంది దంపతులు స్మార్ట్ ఫోన్‌ను మితిమీరి వినియోగిస్తున్నట్లు ఒప్పుకున్నారు. ► దీని వల్ల కుటుంబంతో తక్కువ సమయం గడుపుతున్నట్లు 89 శాతం మంది తెలిపారు. ► స్మార్ట్ ఫోన్ తమ దృష్టి ఆకర్షిస్తుందని సమీక్షలో పాల్గొన్న 69 శాతం మంది తెలిపారు. అంతేగాక జీవిత భాగస్వామిపై దృష్టి సారించడంలేదని చెప్పారు. ► ఖాళీ సమయం దొరికితే మొబైల్‌తో గడుపుతున్నామని చెప్పారు. మొబైల్ కారణంగా తమ ప్రవర్తనలో మార్పు వచ్చిందని 88 శాతం మంది అంగీకరించారు. చదవండి: ఘరానా దొంగలు..ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లారు ! -
పార్టీలో నువ్వు 5 నిమిషాలు కనబడలేదు.. వాడిని రమ్మన్నావు కదూ! ఈ పెనుభూతం వల్లే
అనుమానం పెనుభూతం. అకారణ అనుమానం ఎదుటివారికి ప్రాణాంతకం. భర్త మంచివాడే.. ఉద్యోగం చేస్తాడు.. కష్టపడతాడు. ఇంటిని పోషించాలనుకుంటాడు. కాని అతనికి తీవ్రమైన అనుమానం ఉంటే? భార్యను విసిగిస్తూ ఉంటే? అదొక మానసిక అవస్థ అని తక్షణమే గుర్తించాలి. ఆత్మీయుల సాయం పొందాలి. వైద్యం అందించాలి. ఇటీవల పత్రికలలో ఈ మానసిక అవస్థతో జరుగుతున్న దుర్ఘటనలు ఇంటిని, ఇంటి మనిషిని కాపాడుకోమని అప్రమత్తం చేస్తున్నాయి. కేస్‌స్టడీ 1: మధు ఆఫీస్ నుంచి హఠాత్తుగా ఇంటికి వచ్చాడు. అప్పటికి ఆమె వంటపనిలో ఉంది. తలుపు తట్టి నేరుగా లోపలికి దూసుకువచ్చాడు. బెడ్రూమ్ అంతా కలియతిరిగాడు. బాత్రూమ్ చూశాడు. కప్‌బోర్డులు వెతికాడు. ‘ఎక్కడ దాచి పెట్టావ్ వాణ్ణి’ అన్నాడు. ఆమె హతాశురాలు కాలేదు. అలా అతణ్ణి చూస్తూ ఉంది. ఈ మధ్య అలాగే చేస్తున్నాడు. ‘చెప్తాను నీ సంగతి’ అని పళ్లు కొరుకుతూ వెళ్లిపోయాడు. ఆమెకు ఏడుపొచ్చింది. కాని ఎన్నిసార్లని ఏడుస్తుంది. ఈ అనుమానం మొగుణ్ణి గతంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు. ఇతను ఇలా తయారవుతాడని కలగందా? ఏం చేయాలి? ఇంటి నుంచి బయటపడి కుటుంబాన్ని డిస్ట్రబ్ చేయడమా? లేదా అతణ్ణి భరించడమా? కేస్ స్టడీ 2: బర్త్‌డే పార్టీ నుంచి ఇంటికి తిరిగొస్తున్నప్పుడు ముభావంగా మారిపోయాడు శివ. భార్య గతుక్కుమంది. అలా మారాడంటే ఏదో అయ్యిందన్నమాటే. ‘ఏమైందండీ’ అడిగింది బైక్ వెనుక నుంచి. ‘పార్టీలో నువ్వు ఐదు నిమిషాలు కనిపించలేదు. ఎవరితో మాట్లాడటానికి వెళ్లావ్’ అన్నాడు. ‘అయ్యో. వాష్‌రూమ్‌కు వెళ్లానండీ’. ‘అంటే వాష్‌రూమ్ దగ్గరకు వాణ్ణి రమ్మన్నావా?’. ‘దేవుడా.. వాడెవడండీ’. ‘అదే... ఆ శ్రీనివాస్గాడు. భోజనాల దగ్గర నీతో మాట్లాడుతున్నాడు కదా’. ‘అయ్యో. నాతో ఏం మాట్లాడలేదండీ. ప్లేట్ అందించాడంతే’. కాని శివ ఏమిటే మిటో అంటున్నాడు. ఇల్లు చేరేవరకూ అంటూనే ఉన్నాడు. చేరాక అన్నాడు. తెల్లార్లూ అన్నాడు. కేస్‌స్టడీ 3: ఆమెకు హఠాత్తుగా మెలకువ వచ్చింది. భర్త మంచం మీద లేడు. కంగారుగా లేచి చూసింది. హాల్లో ఒక్కడే పడుకుని శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. ‘ఏంటండీ... ఇక్కడ ఏం చేస్తున్నారు’.... ‘నాకు చచ్చిపోవాలని ఉంది. నేనంటే నీకు ఇష్టం లేదు. అది తెలిసిపోయాక నిన్నేదైనా చేస్తానేమోనని భయంగా ఉంది’ చెప్పి భోరుమన్నాడు. ఆమె భయంతో ఆందోళనతో సతమతమైపోయింది. ‘మీరంటే ఇష్టం లేదని ఎవరు చెప్పారు’. ‘ఒకరు చెప్పాలా... నాకు తెలుసు’. ఆమె నెత్తి కొట్టుకుంది. ∙∙ పారనోయ ‘పారనోయ’ అనేది ఒక మానసిక అనారోగ్యం. ఈ అనారోగ్యం ఉన్నవారికి అనుమానం, అపనమ్మకం, అక్కసు, భ్రాంతి... వంటి రకరకాల భావాలు ఉంటాయి. వీరు అందరిలా నార్మల్‌గానే ఉంటారు. నార్మల్‌గా జీవిస్తున్నట్టుగానే కనపడుతుంటారు కాని ఈ సమస్య ఉంటుంది. వారు ఎవరిని ఆ సమస్యతో ఇబ్బంది పెడుతున్నారో వారికే అది తెలుస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరు చేసే ఆరోపణలు ‘ఏనుగు గాల్లో ఎగురుతుంది’ లాంటివి కావు. ‘ఏవి జరగడానికి ఆస్కారం ఉంటుందో ఆ విషయాల పట్ల వారికి అనుమానం ఉంటుంది’. అంటే ‘భార్యకు మరొకరితో బంధం ఉండే ఆస్కారం ఉంటుంది కనుక అనుమానం ఉంటుంది’. ‘కొలీగ్ తన డెస్క్‌ను చెక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కనుక అనుమానం ఉంటుంది’. ‘పక్కింటివారు తనకు ఏదో హాని చేసే అవకాశం ఉంటుంది కనుక అనుమానం ఉంటుంది’. అంటే జరగగలిగిన వాటి గురించే వీరు వర్రీ అవుతూ ఉంటారు. కాని వాటికి వారి దగ్గర ఆధారాలు ఉండవు. కాని గట్టిగా నమ్ముతుంటారు. ‘నీకు పక్కింటి వ్యక్తితో సంబంధం ఉంది’ అని భార్యతో వాదిస్తారు. ‘లేదు’ అని భార్య వాదించే కొద్దీ వారి అనుమానం బలపడుతుంది. దీనిని నసగా, చాదస్తంగా, పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కానట్టుగా, భరించక తప్పదు అని లోలోపల కుళ్లే విషయంగా చాలామంది భార్యలు భావిస్తుంటారు. అది ప్రమాదం. ఇది ‘మానసిక అనారోగ్యం’ అని గుర్తించాలి. అలా ఎప్పుడైతే గుర్తిస్తామో పరిష్కారం వైపు అడుగులు వేసినట్టు. ప్రమాదం నుంచి దూరం జరుగుతున్నట్టు. లేకపోతే ఈ అవస్థ ముదిరితే నూటికి ఇద్దరు తమకు తాము హాని చేసుకోవడమో ఎదుటివారికి హాని తలపెట్టడమో చేస్తారు. పేపర్లలో ఇప్పుడు చూస్తున్నవి అలాంటి వారి వల్ల జరుగుతున్న ఉత్పాతాలే. ఏం చేయాలి? ►మొదట ఆత్మీయుల మద్దతు తీసుకోవాలి. వైద్యానికి ఒప్పించాలి. ఇలాంటి వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో సైకియాట్రిస్ట్‌ల సలహా తీసుకోవాలి. భర్తతో ఈ ఇబ్బంది తప్ప వేరే సమస్య లేదు కనక అతణ్ణి కాపాడుకోవాలి (భార్యల్లో కూడా ఇదే సమస్య ఉంటుంది. ఆమె గురించి కూడా ఇదే వర్తిస్తుంది). ►వాదించకూడదు. భర్త చేసే ఆరోపణలను వాదించవద్దు. ఖండించవద్దు. విని ఊరుకుంటూ ఉండాలి. ►స్నేహంగా, ఓర్పుగా వారితో మాట్లాడాలి. ►ఈ సమస్య ఉన్నవారితో వేగాలంటే ముందు మన మానసిక, శారీరక ఆరోగ్యం దృఢంగా ఉండాలి. ►అందువల్ల మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏమిటి వైద్యం? ►సైకోథెరపీ, బిహేవియరల్ థెరపీ, కాగ్నిటివ్ థెరపీ లాంటివి ఉన్నాయి. ఇరవై ఏళ్ల క్రితం నుంచే మందులూ వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ డ్రగ్స్ ఉన్నాయి. అయితే కొన్ని మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి గమనించుకుంటూ వైద్యుణ్ణి సంప్రదిస్తూ సరైన మందులు ఇస్తూ ఈ అనుమాన భూతాన్ని అదుపులోకి తేవాలి. ►సమస్యను అయినవారితో చెప్పకుండా దాచడం మంచిది కాదు. చెప్తే నవ్వుతారేమో అనుకోకూడదు. ప్రమాదం వచ్చాక అందరూ ఏడ్వడం కన్నా ఇప్పుడు ఒకరిద్దరు నవ్వినా నష్టం లేదు. పరిష్కారం వైపు అడుగు ముందుకు పడటమే ముఖ్యం. చదవండి: Health Tips: పదే పదే గర్భస్రావం కావడానికి అది కూడా ఓ కారణమే! పార్ట్నర్కు సంబంధించి Sitterwizing: పిల్లలతో కూచోండి.. దగ్గరగా చూడండి -
మన బంధం.. గట్టిదే!
సాక్షి, అమరావతి: దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వైవాహిక జీవితం, బంధాలు, బంధుత్వాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటోంది. ఇందుకు నిదర్శనం.. పెళ్లయిన వారు ఎక్కువగా ఉన్న రాష్ట్రం దేశవ్యాప్తంగా ఏపీ కావడమే. దేశంలో వివాహ వయస్సు దాటిన వారిలో పెళ్లయిన వారు 45.2% ఉండగా.. ఏపీలోనే అత్యధికంగా 52.4 % మంది ఉండగా, పెళ్లి కాని వారు మాత్రం 42.9 % ఉన్నారు. ఈ వివరాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన శ్యాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ం (ఎస్ఆర్ఎస్) స్టాటిస్టికల్ రిపోర్ట్–2020 తెలియజేస్తోంది. మరోవైపు దేశ వ్యాప్తంగా పెళ్లయిన వారు 45.2 శాతం, పెళ్లి కాని వారు 51.6, పెళ్లయి కూడా వివిధ కారణాలతో ఒంటరిగా ఉంటున్న వారు 3.2 % మంది ఉన్నారు. తెలంగాణలో పెళ్లయిన వారు 48.6, పెళ్లి కాని వారు 47.4 శాతం ఉన్నారు. పెళ్లి కాని ప్రసాద్‌ల నెలవు బిహార్! పెళ్లి కాని వారు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా బిహార్ నిలిచింది. ఈ రాష్ట్రంలో పెళ్లికాని వారు 59.3, పెళ్లయిన వారు 39.1, విడాకులు తీసుకోవడం, భాగస్వామి మరణించడం, ఇతర కారణాలతో ఒంటరిగా ఉన్న వారు 1.6 %గా ఉన్నారు. బిహార్ తర్వాత అత్యధికంగా పెళ్లి కాని వారు ఉత్తరప్రదేశ్ (57.2 %)లో ఉన్నారు. దేశంతో పాటు, రాష్ట్రంలోను పెళ్లి కాని వారిలో ఎక్కువగా పురుషులే ఉంటున్నారు. దేశంలో పెళ్లి కాని పురుషులు 56.7, స్త్రీలు 46.2 %గా ఉన్నారు. రాష్ట్రంలో పురుషులు 48.3, స్త్రీలు 37.5 % మంది ఉన్నారు. దేశంలోనే అత్యధికంగా బిహార్‌లో పెళ్లికాని పురుషులు 63.5 శాతం ఉన్నారు. అత్యధికంగా పెళ్లి కాని స్త్రీలు ఉన్న రాష్ట్రంగా కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ నిలిచింది. ఇక్కడ పెళ్లి కాని స్త్రీలు 54.5 % ఉన్నారు. తెలంగాణలో పెళ్లి కాని వారు 47.4 % ఉండగా.. వీరిలో పురుషుల వాటా 53.1 %గా ఉంది. -
పెళ్లై రెండేళ్లవుతున్నా అక్క కాపురం చక్కబడటం లేదని..
సాక్షి, రంగారెడ్డి: పెళ్లి జరిగి రెండేళ్లవుతున్నా అక్క కాపురం చక్కబడటం లేదన్న మనస్తాపంతో తమ్ముడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన చేవెళ్ల మండలంలోని గుండాల అనుబంధ గ్రామమైన లక్ష్మీగూడలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. లక్ష్మీగూడకు చెందిన కొలన్ శేఖర్‌రెడ్డికి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి(30), కూతురు మాధవి ఉన్నారు. శ్రీకాంత్‌రెడ్డి డిగ్రీ వరకు చదువుకొని వ్యవసాయం చేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. మాధవికి రెండేళ్ల కిత్రం శంకర్పల్లి మండలం సింగపూర్ గ్రామానికి చెందిన రాంచంద్రారెడ్డితో వివాహం జరిపించారు. కొంత కాలంగా అదనపుకట్నంతో పాటు భూమి కూడా ఇవ్వాలని భర్త నుంచి వేధింపులు పెరిగాయి. పలుమార్లు గ్రామ పెద్దల సమయంలో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. మాధవి ఆరోగ్యం కూడా క్షీణించడంతో అక్క జీవితం ఏమవుతుందోనని శ్రీకాంత్‌రెడ్డి మదనపడసాగాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం స్నేహితుల వద్దకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లి రాత్రి వరకు తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు డ్రిప్ పైపుతో ఉరి వేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కామారెడ్డి ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా -
సంస్కారాలలో ఏది అత్యంత ప్రధానం..?
మనుష్య జీవనానికి సంబంధించి సనాతన ధర్మం చెప్పిన సంస్కారాలలో అత్యంత ప్రధానమైనది– వివాహం. జన్మించిన ప్రతి వ్యక్తి కూడ తాను గృహస్థాశ్రమంలో ప్రవేశించడం కోసం పొందవలసిన సంస్కారం ఇది. దార్శనికులయిన రుషులు ఒక ప్రత్యేక ప్రయోజనం అపేక్షించి దీనిని వివాహం అని పిలిచారు. వి–అంటే విశిష్టమైన. వాహము–అంటే పొందుట. లోకంలో ఏది విశిష్టంగా ఉన్నదో...అంటే భగవంతుడిని పొందడానికి ఏ ఆశ్రమ ప్రవేశం చేయాలో దాని పేరే వివాహం. (చదవండి: సంస్కారాలను బోధించే కల్పసూత్రాలు) అప్పటివరకు పురుషుడు బ్రహ్మచారి. బ్రహ్మచారి గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించే క్రతువే వివాహం. మరొక ముఖ్యమైన విషయం. సనాతన ధర్మ సంబంధ వాఙ్మయంలో వివాహం అనే మాటకు పక్కన విడాకులు అన్న మాట ఎక్కడా కనిపించదు. రామాయణాన్నికానీ, భారతాన్ని కానీ, భాగవతాన్ని కానీ పరిశీలించండి. ఎక్కడ కూడా ‘‘నేను నా భార్యకు విడాకులిచ్చాను’’ అని కానీ, ‘‘నేను నా భర్తకు విడాకులు ఇచ్చాను’’అని కానీ కనపడదు. ఒకసారి ఇద్దరూ కలిసి దంపతులుగా ఆ గృహస్థాశ్రమం లోకి ప్రవేశిస్తే– ఇక ఆ జీవితంలో ఇద్దరూ కలిసి అలా ఉండడమే. ఒకవేళ భార్య ఏదయినా పొరపాటు చేస్తే, భర్త ఆమెను దాని నుంచి ఉద్ధరించి మరలా తన పక్కన ఆ స్థానంలో కూర్చోబెట్టుకుంటాడు తప్ప ఈ దోషం చేసినదని చెప్పి విడాకులివ్వడం ఉండదు. ఇదే మనకు రామాయణం బాలకాండలో అహల్య వృత్తాంతం నిరూపిస్తుంది. జీవితాంతం కూడా పురుషుడు, స్త్రీ కలిసి ఉండడం, ధార్మికమైన సంతానాన్ని పొందడం, కామాన్ని ధర్మంతో ముడిపెట్టడం, తద్వారా భగవంతుడిని చేరుకోవడానికి కావలసిన ప్రయత్నం చేయడం అనేది వివాహం.. అనే వ్యవస్థ ద్వారా సాధింపబడుతుంది. (చదవండి: వేదవాఙ్మయం: ధర్మాలు అంటే ఏంటి..?) ఇందులో మూడు ప్రధానమైన ప్రయోజనాలున్నాయి. మొదటిది ధార్మికమైన సంతానాన్ని పొందడం. పురుషుడు సముద్రం లాటి వాడు. సముద్రం హద్దులు అతిక్రమించకుండా చెలియలికట్ట అనేది ఉంటుంది. అది వేదం యొక్క తాత్పర్యాన్ని ప్రతిపాదిస్తుంది. అలాగే పురుషుడు ఎంత శక్తిమంతుడయినా తాను మాత్రం తన తేజస్సును వేరొక చోట నిక్షేపించడానికి వీలు లేదు. అది కేవలం తన ధర్మపత్నియందు మాత్రమే నిక్షేపించి తనకు ప్రతిబింబమైన సంతానాన్ని పొందుతాడు. అందుకే ‘ఆత్మా వై పుత్రనామాసి’ అన్నారు. పురుషుని ఆత్మయే ఈ లోకంలో పుత్ర రూపంలో తిరుగుతుంటుంది....అంది వేదం. అలా ధార్మికమైన సంతానాన్ని పొందాలి. జన్మతః ప్రతి వ్యక్తి కూడా మూడు రుణాలతో ఉంటాడు. పితృ రుణం, రుషి రుణం, దేవ రుణం. పితృ రుణం అంటే తనకు తన తండ్రి ఎలా శరీరాన్ని ఇచ్చాడో, జన్మను ఇచ్చాడో అలా తాను కూడా సంతానానికి జన్మనివ్వాలి. అలా చేస్తే పిత రుణంనుంచి విముక్తి పొందుతాడు. యజ్ఞ యాగాది క్రతువులు చేస్తే దేవరుణం నుంచి, రుషులు ఇచ్చిన వాఙ్మయాన్ని చదువుకుంటే రుషి రుణంనుంచి విముక్తుడవుతాడు. కాబట్టి పితృరుణం నుంచి విముక్తి పొందాలంటే సంతానాన్ని పొందాలి. అదీ ధార్మికంగా పొందాలి. మనిషి వ్యక్తిగత జీవనంతోపాటూ, సామాజిక జీవనం కూడా గాడితప్పకుండా ఒక క్రమ పద్దతిలో నడవడానికి మన పెద్దలు ఎంతో పకడ్బందీగా రూపొందించిన వ్యవస్థ మన వివాహ వ్యవస్థ. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ముఖంపై పిడికిలితో గుద్దాడు.. జుట్టు పట్టుకొని!
ముంబై: పెళ్లి అయి పట్టుమని నెల రోజులు కాలేదు అప్పుడే భర్త వేధిస్తున్నాడంటూ కేసు పెట్టి రచ్చకెక్కారు నటి, మోడల్ పూనమ్ పాండే. కొంత కాలంగా తన భాయ్‌ఫ్రెండ్ సామ్ బాంబేను గాఢంగా ప్రేమించిన పూనమ్ పామ్ ఈనెల 1వ తేదిన వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే తన భర్త వేధిస్తున్నాడని, శారీరక దాడికి పాల్పడుతున్నాడని పూనమ్ సామ్‌పై గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ సినిమా షూటింగ్ కోసం గోవా వెళ్లిన ఈ బ్యూటీ అక్కడే స్థానిక పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేశారు. నటి ఫిర్యాదు మేరకు భర్త సామ్ బాంబేను గోవా పోలీసులు సెప్టెంబర్ 22న అరెస్టు చేశారు. అయితే ఆ మరుసటి రోజే సెప్టెంబర్ 23న బాంబేకు గోవా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భర్తపై ఫిర్యాదు చేయడంపై వివరణ ఇచ్చారు పూనమ్. (పూనమ్ భర్తకు బెయిల్ మంజూరు) సామ్‌తో బంధం ఎప్పుడూ హింసాత్మకంగానే ఉండేదని. అయితే పెళ్లి చేసుకోవడం వల్ల అతనిలో మార్పు వస్తుందేమోనని భావించినట్లు వెల్లడించారు. సామ్ తన విషయంలో ఆధిపత్యం చేలాయించేవాడని, చిన్న విషయాలకే ఆవేశపడుతుంటాడని పేర్కొన్నారు. గోవాలో జరిగిన విషయాల గురించి పూనమ్ మాట్లాడుతూ.. ‘సామ్‌కు నాకు ఓ విషయంలో వాదన మొదలైంది. అది మెల్లమెల్లగా పెరిగి గొడవలా మారింది. ఈ క్రమంలో అతను నన్ను కొట్టడం ప్రారంభించాడు. నన్ను అనేక రకాలుగా హింసించాడు. నా ముఖంపై పిడికిలితో గుద్దాడు. నా జుట్టు పట్టుకొని లాకెళ్లి మంచం మూలపై తలతో కొట్టాడు. ఆ సమయంలో నేను చనిపోతానేమో అనుకున్నాను. కానీ ఏదో విధంగా అక్కడి నుంచి బయటపడగలిగాను. హోటల్ సిబ్బంది సహాయంతో పోలీసులను సంప్రదించాను. అప్పుడు అతన్ని తీసుకెళ్లాను. నేను సామ్‌పై కేసు పెట్టాన’ని తెలిపారు. (పెళ్లి విషయం దాచాలనుకోలేదు) తనను ఓ జంతువులా కొట్టడంతో ఇక తన వైవాహిక జీవితాన్ని ముగించుకుంటానని ఆమె తెలిపారు. ఇక తన దగ్గరకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘నన్ను జంతువులాగా కొట్టిన వ్యక్తి దగ్గరికి తిరిగి వెళ్లాలన్న ఆలోచన లేదు. మా బంధాన్ని కాపాడుకునే ప్రయత్నంలో నేను చాలా బాధపడ్డాను. ఇలాంటి రిలేషన్లో ఉండటం కంటే నేను ఒంటరిగా ఉండటం మేలు. ఇక్కడితో మా పెళ్లికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాను’ అని వెల్లడించారు. కాగా మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పూనమ్ 2013లో ‘నాషా’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. ఈ ఏడాది జూలై 27న బాయ్‌ప్రెండ్ సామ్‌తో పూనమ్ నిశ్చితార్థం చేసుకున్నారు. సుమారు రెండేళ్లుగా సామ్‌తో సహజీవనం చేసి పూనమ్ బాంద్రాలోని వారి ఇంటిలో వివాహం చేసుకున్నారు. (ఏడడుగులు వేసిన వేళ) -
అవును.. మేం విడిపోయాం: నటి
ముంబై: కొన్నాళ్లుగా తాను, తన భర్త విడివిడిగా ఉంటున్నామని బాలీవుడ్ నటి మానిని డే వెల్లడించారు. భర్త మిహిర్ మిశ్రా నుంచి శాశ్వతంగా విడిపోనున్నట్లు తెలిపారు. పదహారేళ్ల వైవాహిక జీవితం ఆనందంగా గడిచిందని.. అయితే ప్రతీ బంధంలోనూ విభేదాలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. మనస్పర్థలతో కలిసి ఉండే బదులు.. విడిపోవడమే ఉత్తతమని అభిప్రాయపడ్డారు. కాగా టీవీ నటులు మానిని, మిహిర్ మిశ్రా 2004లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. అయితే గత ఆరు నెలలుగా దంపతుల మధ్య సఖ్యత చెడిందని, విడివిడిగా ఉంటున్నారంటూ వార్తలు వినిపించాయి.(అది సరైందే.. కానీ: నటి) ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన మానిని.. తమ బంధంలో కలతలు రేగిన మాట వాస్తవేమనని పేర్కొన్నారు. ‘‘ప్రతీ బంధంలోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి. వైవాహిక బంధం కూడా అలాంటిదే. అవును.. నిజమే గత ఆర్నెళ్లుగా నేను, మిహిర్ వేర్వేరుగా ఉంటున్నాం. ఇందుకు గల కారణాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి. నిజానికి నేను మా బంధాన్ని, దానికున్న పవిత్రతను గౌరవిస్తాను. బంధాన్ని నిలబెట్టుకోవడానికి మేం అన్ని రకాలుగా ప్రయత్నించాం. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందనే విషయం మన చేతుల్లో ఉండదు’’ అని చెప్పుకొచ్చారు. తమ మధ్య ప్రేమానురాగాలకు కొదవ లేదని.. అయితే గత జన్మలో చేసిన పాపమేదో ఇప్పుడు శాపంగా పరిణమించిందంటూ ఉద్వేగానికి లోనయ్యారు. తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. కాగా ప్రస్తుతం మిహిర్ తన తల్లిదండ్రులతో పుణెలో నివసిస్తుండగా.. మానిని తన కూతురు(మొదటి భర్త వల్ల కలిగిన సంతానం)తో కలిసి ముంబైలో ఉంటున్నారు. ఇక పలు టీవీ సీరియళ్లతో పాటు క్రిష్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ వంటి సినిమాల్లోనూ మానిని నటించిన సంగతి తెలిసిందే. -
‘ఆమెను కలవడం కుదరడం లేదు’
న్యూఢిల్లీ: తన భార్య కిరణ్ ఖేర్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత తామిద్దరం తరచుగా కలుసుకోవడం కుదరడం లేదని సీనియర్ నటుడు అనుమప్ ఖేర్ వెల్లడించారు. ఏకాంతంగా గడిపే సమయం చిక్కడం లేదని అన్నారు. ‘నా భార్య ఎంపీగా గెలిచినప్పటి నుంచి మేమిద్దరం కలిసి గడిపేందుకు టైమ్ దొరకడం లేదు. తన నియోజకవర్గ పనుల్లో కిరణ్ తీరిక లేకుండా గడుపుతోంది. చండీగఢ్ నియోజకవర్గానికి ఆమె ఎక్కువ సమయం కేటాయించి, ప్రజల కోసం పనిచేస్తోంద’ని అనుమప్ ఖేర్ అన్నారు. వీరిద్దరి వివాహ బంధానికి మూడు దశాబ్దాలు దాటింది. 1985లో వీరు పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ తమ తమ రంగాల్లో బిజీగా ఉన్నారు. అనుమప్ ఖేర్ సినిమాల్లో నటిస్తుండగా, కిరణ్ ఖేర్ చండీగఢ్ ఎంపీగా సేవలందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన 62 ఏళ్ల అనుమప్ 500పైగా సినిమాల్లో నటించారు. చండీగఢ్, ఢిల్లీలో ఉన్నప్పుడు మాత్రమే తామిద్దరం కలుసుకునేందుకు వీలవుతుందని అనుమప్ తెలిపారు. ‘ఈ రోజు ఢిల్లీలో ఉన్నాను. నా భార్యతో కలిసి కాఫీ తాగేందుకు అవకాశం చిక్కింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్న కిరణ్ ఢిల్లీలో ఉంది. ఈ రోజు రాత్రే నేను ఢిల్లీ నుంచి వెళ్లాల్సివుంది. కాబట్టి కాఫీకి మాత్రమే అవకాశముంది. పరస్పరం అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామ’ని అనుపమ్ ఖేర్ వివరించారు. -
బూటకపు పత్రాలతో భార్య హక్కుల బలి
జీవితాలు చూడకుండా కాగితాల మీద దొరికే న్యాయసూత్రాలకు అనుగుణంగా అతనికి సహాయం దొరికింది. ఒక్క సర్టిఫికెట్తో రెండు విజయాలు సాధించాడా భర్త. ఒకటి- ప్రభుత్వ సొమ్ముతో భార్యపైన కోర్టులో సమరం సాగించడం. రెండు- భార్యకు జీవనభృతి ఇవ్వాలనే న్యాయానికి గొడ్డలి వేటు వేసి, ఆ భార్యే తనకు భృతి ఇవ్వాలనే దారుణానికి ఆధారం సంపాదించడం. లంచాలు ఇచ్చి తీసుకున్న దొంగ సర్టిఫికెట్లు రాజ్యాంగం, చట్టాలూ ఇచ్చిన హక్కులను కూడా నాశనం చేస్తాయి. ఒక యువతి (సఖి) తన సహో ద్యోగిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నది. మతం అడ్డొచ్చినా ఆమె వెనుదీయలేదు. పెళ్లికీ, ప్రేమకూ షరతులు ఉండవు. ఉండకూడదు. ఉంటే మానవ సంబంధాలను స్వార్థానికి వాడుకున్నట్టే. ఇది తెలియని ఆ అమాయకురాలు తమది నిజమైన ప్రేమ అని భ్రమించింది. మతం మారాలన్న షరతును అంగీకరించింది. మతం మారా లన్న నిబంధన విధించడమే అతని స్వార్థమని ఆలో చించలేకపోవడం వల్ల ఆ యువతి వివాహ జీవితం దెబ్బతిన్నది. ఇదంతా తెలిసేలోపున కూతురు పుట్టింది. కుటుంబ హింస మొదలైంది. విడిపోక తప్పని పరిస్థి తులు తలెత్తాయి. అతడి కోసం కుటుంబాన్నీ, మతాన్నీ వదులుకున్న మహిళ ఒంటరిదైపోయింది. తన జీతం చాలదనీ, తనకూ, కూతురుకూ జీవనభృతి ఇవ్వాలనీ ఆమె కేసు వేసి, 498 ఎ కింద ఫిర్యాదు చేసింది. అలాగే అటువైపు నుంచి ఆమె భర్త, నెలకు రూ. 70,000 సంపా దించే ఉద్యోగం పోయిందని నమ్మబలికాడనీ, ఏ ఆదా యం లేదని అబద్ధం సృష్టించాడనీ, రెవెన్యూ అధికారికి లంచం ఇచ్చి ఏడాది ఆదాయం రూ.70,000 కు మించి లేదని వెల్లడించే సర్టిఫికెట్ సంపాదించాడనీ ఆమె ఆరోపించారు. ఈ ధ్రువీకరణ ఆధారంగా ఆ ‘నిరుపేద’ భర్త కోర్టు లో న్యాయసేవా సహాయ సంస్థ నుంచి లీగల్ ఎయిడ్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. జీవితాలు చూడకుండా కాగి తాల మీద దొరికే న్యాయసూత్రాలకు అనుగుణంగా అత నికి సహాయం దొరికింది. భార్య మీద న్యాయపోరాటం చేయడానికి న్యాయసేవ అతనికి సాయం చేసింది. ఒక్క సర్టిఫికెట్తో రెండు విజయాలు సాధించాడా భర్త. ఒకటి- ప్రభుత్వ సొమ్ముతో భార్యపైన కోర్టులో సమరం సాగించడం. రెండు- భార్యకు జీవన భృతి ఇవ్వాలనే న్యాయానికి గొడ్డలి వేటు వేసి, ఆ భార్యే తనకు భృతి ఇవ్వాలనే దారుణానికి ఆధారం సంపాదించడం. ఈ అన్యాయాల పరంపరతో సఖి నిర్ఘాంతపో యింది. అయినా ధైర్యంగా సమాచార హక్కు చట్టం కింద మరో పోరాటం ప్రారంభించింది. నెలకు రూ. 48,000 సంపాదించే తన భర్తకు ఏడాదికి రూ. 70,000 ఆదాయమే వస్తున్నదని చెప్పే సర్టిఫికెట్ ఇవ్వడానికి ఆధారంగా ఉన్న పత్రాల ప్రతులను కోరింది. రెవెన్యూ పీఐఓ తన వద్ద ఆ సమాచారం లేదన్నాడు. మొదటి అప్పీలు దాఖలు చేసిందామె. పది రోజులలో పూర్తి సమాచారం ఇవ్వాలని పీఐఓను ఆదేశించారు ఆ సీని యర్ అధికారి. గడువు పూర్తయింది. కానీ ఏ సమా చారమూ రాలేదు. రెండో అప్పీలును కేంద్ర సమాచార కమిషన్ ముందు దాఖలు చేసిందామె. పెండింగ్ కేసుల భారం వల్ల భారీ ఆలస్యం తరువాత కేసు విచారణకు వచ్చింది. ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ చేసిన వ్యవ సాయ ఈవో ఏఎన్ మిశ్రా అతడి ఫైలు పోయిందని చెప్పాడు. మిశ్రాను పీఐఓగా పరిగణించి జరిమానా ఎం దుకు విధించకూడదో, నష్ట పరిహారం ఎందుకు ఇవ్వ కూడదో వచ్చి వివరించాలని నేను ఆదేశించాను. ఫైలు పోయిందని వాదించిన మిశ్రా, తరువాత ఫైలు దొరి కిందని చెబుతూ, భర్త దరఖాస్తును, బ్యాంక్ ఖాతా ప్రతిని ఇచ్చారు. ఇవేనా అతని ఆదాయం నిర్ధారించే అధారాలు? ఇంకేమైనా ఉన్నాయా? అని అడిగితే; అం దుకు మిశ్రా ఇరుగు పొరుగును విచారించిన తరువాత ఆదాయాన్ని ధ్రువీకరించానని సమాధానం చెప్పారు. ఆ విచారణకు సంబంధించిన కాగితాలు ఏవని అడిగితే, అవీ దొరకడం లేదని చెప్పాడు. తన భర్త జీవన విధానం గురించీ, అంతకు ముందు ఏ విధంగా ఖర్చు చేసేవారు అనే అంశాలు తెలుసుకుంటే, సరిగ్గా విచారించి ఉంటే నిజమైన ఆదాయ వివరాలు బయటపడి ఉండేవని సఖి వాదించారు. ఒక పద్ధతీ, క్రమం లేకుండా అతడు చెప్పి న మేరకే ఆదాయం ఉందని ధ్రువీకరించడం అవినీతే అవుతుందని కూడా వాదించారు. ఈ వాదోపవాదాల న్నింటినీ పరిశీలించాక, మిశ్రా వివరణను చూశాక, మిశ్రా సకాలంలో సమాచారం ఇవ్వకుండా ఆమె హక్కు కు భంగం కలిగించారని స్పష్టమవుతుంది. ఆలస్యం, నిరాకరణ, తప్పుడు సమాచారం, అసం పూర్ణ సమాచారం వంటి తప్పులకు పాల్పడిన మిశ్రా పైన రూ. 25,000 జరిమానా విధించాలని ఆర్టీఐ చట్టం నిర్దేశిస్తున్నది. కనుక జరిమానా విధించడమే కాకుండా, సఖికి రూ. 10,000 నష్టపరిహారం చెల్లించాలని రెవెన్యూ శాఖను కూడా ఆదేశించారు. ఇది క్రిమినల్ నేరమనీ, కాబట్టి మరింత పరిశోధించి బాధ్యులను ప్రాసిక్యూట్ చేసే అంశాన్ని కూడా పరిశీలించాలనీ నేను ఆదేశిం చాను. బూటకపు ఆదాయ సర్టిఫికెట్ తయారుచేయడం నేరం. ఈ నేరం మరిన్ని నేరాలకు కారణమవుతుంది. ఎన్నో హక్కులకు భంగం వాటిల్లచేస్తుంది. ఆ నేరాలను అరికట్టే అస్త్రం ఆర్టీఐ చట్టమేనని సఖి నిరూపించింది. (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
ఏంజెలినా ఫ్లోటింగ్ ప్యాలెస్!
వైవాహిక జీవితాన్ని సరికొత్తగా ఆస్వాదించాలని డిసైడ్ అయినట్టున్నారు హాలీవుడ్ స్టార్ జంట బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ. దాదాపు 250 మిలియన్ పౌండ్లు వెచ్చించి విలాసవంతమైన నావను కొనుగోలు చేశారు. అలలపై అలాఅలా తేలిపోయే ఈ ఫ్లోటింగ్ ప్యాలెస్‌ను తమ అభిరుచికి అనుగుణంగా తయారు చేయించుకొంటున్నారు. అంతేకాదు... దీన్ని మరింత ఆధునీకరించేందుకు అక్షరాలా మరో రెండు లక్షల పౌండ్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారట ఈ కొత్త జంట. ఇటాలియన్ బోట్ మేకింగ్ సంస్థ రిజర్డీ దీన్ని రూపొందిస్తోందని ‘ది మిర్రర్’ కథనం. -
ఆ హక్కు నాకు లేదా?
వేదిక ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నాన్న శవాన్ని ముందు పెట్టుకుని అమ్మ ఏడుస్తోంది. అయిదో తరగతి చదువుతున్న నేను, ఒకటో తరగతి చదువుతోన్న చెల్లి జరిగేదంతా చూస్తున్నాం. నాన్న ఇక రారని అర్థమయ్యి నేను ఏడుస్తున్నాను. చెల్లికి అది కూడా అర్థం కాలేదు. అందరూ ఏడుస్తుంటే అదీ ఏడుస్తోంది. ఆ రోజు అమ్మను ఓదారుస్తున్న ఒకావిడ ‘‘దేవుడు నీకు చాలా అన్యాయం చేశాడు. నీ భర్తను తీసుకుపోయాడు, కనీసం ఒక మగపిల్లాడుంటే నీకు అండ అయ్యేవాడు, ఇద్దరూ ఆడపిల్లలైపోయారు...’’ అని అన్న మాటలను బట్టి మగపిల్లాడయితే అండ, ఆడపిల్ల అయితే బండ అని అందరూ అనుకుంటారన్న విషయం ఆ చిన్న వయసులోనే అర్థమైంది. దాంతో అమ్మకి బరువు కాకూడదని నిర్ణయించుకున్నాను. ఎలాగో పదో తరగతి వరకూ చదివాను. చెల్లెలిని చదివిద్దాం అని అమ్మతో చెప్పి, ఓ టైలర్ దగ్గర సహాయకురాలిగా చేరాను. పని వచ్చాక ఫాల్స్ కుట్టడం, చిరిగిన బట్టలకు చేతి కుట్లు వేసివ్వడం లాంటి పనులు చేసేదాన్ని. అమ్మ రెండు మూడిళ్లలో పని చేసేది. తనకు వచ్చేవి ఇంటి ఖర్చులకు సరిపోయేవి. నాకు వచ్చే దానిలో చెల్లెలి చదువుకి ఖర్చు పెడుతూ, కొద్ది కొద్దిగా వెనకేసుకుంటూ, ఎలాగైతేనేం... కొన్నేళ్లకు కుట్టు మిషను కొనుక్కున్నాను. దాంతో ఇంటి దగ్గర బట్టలు కుట్టడం మొదలుపెట్టాను. అందరికీ నా పని నచ్చడంతో తొందరలోనే మా ఇంటినే టైలరింగ్ షాపుగా మార్చాల్సి వచ్చింది. దాంతో పూర్తిస్థాయిలో ఇంటి దగ్గరే పని చేసేదాన్ని. నా కష్టం ఫలించింది. ఇప్పుడు నాకో షాపు ఉంది. నాలుగు మిషన్లు పెట్టి, నలుగురితో పని చేయిస్తున్నా. అమ్మతో పని మానిపించేశాను. చెల్లెలిని చదివిస్తున్నాను. నాకు జీవితంలో అనుకున్నవన్నీ జరిగాయన్న తృప్తి ఉంది. కానీ నన్ను చూస్తున్న వాళ్లు మాత్రం పలకరిస్తే చాలు పెళ్లెప్పుడంటున్నారు. నాకయితే చెల్లెలు జీవితంలో స్థిరపడాలి. తనకి పెళ్లి చేయాలి. అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అని. పెళ్లి చేసుకుంటే ఇవన్నీ చేయలేనని కాదు. చేయలేని పరిస్థితి వస్తే ఎలా అని! పెళ్లే జీవితం అని నేనెప్పుడూ అనుకోలేదు. నాకు ఆ జీవితం మీద పెద్దగా కలలు కూడా లేవు. అయినా అందరూ నన్ను బలవంత పెడుతున్నారు. మా అమ్మ కూడా అలానే ఆలోచిస్తుందేమోనని భయపడ్డాను కానీ, తను నా ఇష్టాన్నే గౌరవిస్తోంది. చుట్టుపక్కల వాళ్లంతా వంకరగా మాట్లాడి మమ్మల్ని బాధ పెడుతున్నారు. వాళ్లను నేనొక్కటే అడుగుతున్నాను... నా జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు నాకు లేదా? నాకంటూ ఇష్టానిష్టాలుండవా? అది నా స్వవిషయమని, నా నిర్ణయాన్ని ఎత్తి చూపకూడదని, హేళన చేసి బాధపెట్టకూడదని ఎందుకు అనుకోరు! - విజయలక్ష్మి, గోకవరం, తూ.గో.