అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్‌-సైంధవిల ప్రకటన | Reason Behind GV Prakash and Saindhavi Announce Divorce | Sakshi
Sakshi News home page

అందుకే విడిపోతున్నాం.. వివాహ బంధానికి ముగింపు ప్రకటన చేసిన జీవీ ప్రకాష్‌-సైంధవి

Published Tue, May 14 2024 8:02 AM | Last Updated on Tue, May 14 2024 11:18 AM

Reason Behind GV Prakash and Saindhavi Announce Divorce

సినీ ఇండస్ట్రీలో మరో జంట విడాకులు ప్రకటించింది. తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్‌ షాకింగ్‌ ప్రకటన చేశారు. తన భార్య.. సింగర్‌ సైంధవితో విడిపోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. మరోవైపు సైంధవి కూడా తనవైపు నుంచి అధికారికంగా ప్రకటించారు.

ఈ ఇద్దరూ విడిపోతున్నట్లు ఈ మధ్య కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. అయితే.. ఆ కథనాల్ని ధృవీకరిస్తూ.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఇద్దరూ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వీళ్ల అభిమానులు విస్మయానికి గురి అయ్యారు. 

సైంధవి జీవీ ప్రకాష్‌కు బాల్య మిత్రురాలు. ఇద్దరూ 12 ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించారు.   2013లో వీళ్లిద్దరూ వివాహం చేసుకోగా.. ఈ జంటకు ఓ పాప ఉంది.

‘‘చాలా ఆలోచించిన తర్వాత ‘సైంధవి, నేను 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాం. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగుకోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి కీలక తరుణంలో మా గోప్యతకు భంగం కలిగించకుండా ఉండేందుకు మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. 

ఇక నుంచి మేము వేరవుతున్నట్లు అంగీకరిస్తున్నాం. ఈ నిర్ణయం ఇద్దరికీ ఉత్తమమని నమ్ముతున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీ అవగాహన, మద్దతు చాలా అవసరం’’ అని జీవీ ప్రకాశ్‌ మీడియాను కోరారు. 

 


 

 

 మ్యూజిక్‌ దిగ్గజం ఏఆర్‌ రెహమాన్‌ మేనల్లుడు అయిన జీవీ ప్రకాష్‌.. కోలీవుడ్‌లో స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గానే కాకుండా ఇప్పటిదాకా హీరోగానూ డజనుకు పైగా చిత్రాలతో అక్కడి ఆడియొన్స్‌ను అలరించారు. తెలుగులోనూ పలు చిత్రాలకు ఆయన మ్యూజిక్‌ అందించారు.  ఇక 12వ ఏట టీవీ షో ద్వారా సింగర్‌గా గుర్తింపు దక్కించుకున్న సైంధవి.. విక్రమ్‌ అన్నియన్‌(అపరిచితుడు) చిత్రంతో సినీ కెరీర్‌ ప్రారంభించారు. తమిళ్‌, తెలుగు చిత్రాల ద్వారా ఆమె అలరిస్తూ వస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement