gv prakash
-
విడాకుల తర్వాత ఒకే స్టేజీపై కోలీవుడ్ జంట.. ఫ్యాన్స్ ఎమోషనల్
తమిళ సంగీత దర్శకుడు, గాయకుడు, హీరో జీవీ ప్రకాశ్ కుమార్, సింగర్ సైంధవి ఈ ఏడాది మేలో విడిపోయారు. బాల్య స్నేహితులైన వీరు 2013లో పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట సడన్‌గా విడిపోవడానికి సిద్ధపడటం అభిమానులను షాక్‌కు గురి చేసింది. విడాకులు తీసుకున్నజంట11 ఏళ్ల దాంపత్య జీవితానికి ఫుల్స్టాప్ పెడుతూ ఎవరి దారి వారు చూసుకున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి కనిపించారు. మలేషియాలోని ఓ సంగీత కచేరీలో పాల్గొన్న జీవీ ప్రకాశ్, సైంధవి జంటగా పాటలు ఆలపించారు. అది చూసిన అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కచేరీ కోసం జీవీ ప్రకాశ్ రిహార్సల్స్ చేసేటప్పుడు కూడా సైంధవి.. తన కూతుర్ని తండ్రి దగ్గరకు పంపించింది.మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా, హీరోగా..ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇకపోతే జీవీ ప్రకాశ్ కుమార్ తమిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా సింగర్‌గా, హీరోగానూ ఫామ్‌లో ఉన్నాడు. సైంధవితో కలిసి తమి ఎన్నో పాటలు పాడాడు. ఈయన తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, కథానాయకుడు, యుగానికి ఒక్కడు, పందెం కోళ్లు, డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట, రాజా రాణి, ఆకాశమే నీ హద్దురా.., సార్, టైగర్ నాగేశ్వరరావు, లక్కీ భాస్కర్, మట్కా.. ఇలా పలు సినిమాలకు సంగీతం అందించాడు.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి ప్రస్తుతం జీవీ ప్రకాశ్ చేతిలో మ్యూజిక్ డైరెక్టర్‌గా పదికి పైగా సినిమాలున్నాయి. హీరోగా ఈ ఏడాది మూడు సినిమాలతో పలకరించిన జీవీ ప్రస్తుతం కథానాయకుడిగా మరో మూడు సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. Omg ❤️🥺 bt the professionalism btwn them is! 🥹#GVPrakash #gvprakashconcert #GVPrakashKumar #Saindhavi pic.twitter.com/jgarTEbmY9— Mr.D 🤍 ᵈⁱˡˡᵘ (@dilson_raj) December 9, 2024 உங்களுக்கு என்ன நா Rights இருக்கு 🥲🥲😭 எங்க அழ வைக்க @gvprakash #GVPrakash #GVPrakash @singersaindhavi #Saindhavi pic.twitter.com/RCXgse4wFO— 𝕽𝖔𝖇𝖎𝖓 𝕮𝖍𝖗𝖎𝖘 😈🛡️🗡️ (@robinthebadguy) December 8, 2024Pirai Thedum song hits really hard now especially after their separation 💔🥺#gvprakashliveinkl #gvprakashconcert #GVPrakash #saindhavi pic.twitter.com/RXP3G0Wzrx— Ramya Subhashinie ✨ (@blxckfame_) December 8, 2024 Thanks #Malaysia kuala lampur for making my live in concert a BLOCKBUSTER hit …. @dmycreationoffl pic.twitter.com/SUigJNaVwK— G.V.Prakash Kumar (@gvprakash) December 8, 2024 చదవండి: టాప్ 5 కంటెస్టెంట్లతో ప్రభాకర్, ఆమని పోటీ! వీళ్లే కాదు ఇంకా.. -
‘తంగలాన్’కి అదే పెద్ద సవాలు : జీవీ ప్రకాశ్
‘తంగలాన్’ కోసం 50 రోజుల రీరికార్డింగ్ చేశాను. కొన్నిసార్లు రెండు మూడు రోజుల ముందు ట్యూన్ చేయాల్సి వచ్చేది. టైమ్ తక్కువగా ఉండటం ఒక్కటే ఈ సినిమాకు మ్యూజిక్ చేయడంలో నేను ఎదుర్కొన్న సవాలు. అయినా పర్పెక్ట్ ఔట్ పుట్ తీసుకురాగలిగాం. దర్శకుడు పా.రంజిత్ విజన్‌ను అర్థం చేసుకొని అందుకు తగినట్లుగా మ్యూజిక్ చేశాను’అని అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్. చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ మూవీ ‘తంగలాన్’. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు మ్యూజిక్ అందించిన జీవీ ప్రకాశ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ ‘తంగలాన్’ సినిమా ఆఫర్ నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. "తంగలాన్" ఇండియానా జోన్స్ వంటి భారీ మూవీ. ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు ఈ కథకు ఎలాంటి మ్యూజిక్ చేయాలి అనేది అర్థమైంది. ట్రైబల్ నేపథ్యంగా ప్రీ ఇండిపెండెన్స్ టైమ్ లో జరిగే స్టోరీ ఇది. ట్రైబల్స్ ఎలాంటి మ్యూజిక్ క్రియేట్ చేస్తారు అనేది ఆలోచించాను. ఆస్ట్రేలియన్, ఆఫ్రికన్ ట్రైబ్స్ క్రియేట్ చేసే కొన్ని మ్యూజిక్స్ అబ్సర్వ్ చేశాను. ఇలాంటి సినిమాకు మోడరన్ మ్యూజిక్ సెట్ కాదు. ఒరిజినల్ గా , ఆ కథా నేపథ్యానికి తగినట్లు మ్యూజిక్ క్రియేట్ చేశాం. "తంగలాన్"కు మ్యూజిక్ ఇవ్వడంలో నా టీమ్ ఎంతో సపోర్ట్ చేసింది.⇢ దర్శకుడు పా.రంజిత్ గారు ఒక గొప్ప మూవీని మీ ముందుకు తీసుకురాబోతున్నారు. ఆయన మ్యాజికల్ రియలిజం స్క్రీన్ ప్లేతో సినిమాను రూపొందించారు. మ్యాజికల్ రియలిజంతో గతంలోనూ కొన్ని పీరియాడిక్ మూవీస్ వచ్చినా..ఇందులో మరికొన్ని అదనపు లేయర్స్ ఉంటాయి. పా రంజిత్ గారితో వర్క్ చేయడం ఫెంటాస్టిక్ ఎక్సీపిరియన్స్ ఇచ్చింది.⇢ విక్రమ్ గారు ఈ సినిమా కోసం మారిపోయిన తీరు ఆశ్చర్యపరిచింది. ఇది నటీనటులకు ఫిజికల్ గా స్ట్రెయిన్ చేసే సినిమా. విక్రమ్ గారు తన గత చిత్రాల్లాగే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. "తంగలాన్"లో ఫీమేల్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. పార్వతీ తిరువోతు, మాళవిక ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు.⇢ ‘తంగలాన్’ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. నేను మీతో పాటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తున్నాను. మీరంతా "తంగలాన్" చూసి థ్రిల్ ఫీలవుతారని మాత్రం చెప్పగలను.⇢ ఏఐ సహా ఎన్నో కొత్త టెక్నాలజీలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే టెక్నాలజీపైనే ఆధారపడటం సరికాదు. ఎంతవరకు మనం టెక్నాలజీ ఉపయోగించుకోవాలి అనే ఐడియా ఉండాలి.⇢ తెలుగులో దుల్కర్ హీరోగా నటిస్తున్న లక్కీ భాస్కర్, నితిన్ హీరోగా చేస్తున్న రాబిన్ హుడ్ తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. దిల్ రాజు గారితో, వైజయంతీ బ్యానర్స్ లో మూవీస్ చేయాల్సిఉంది. తమిళంలో ధనుష్ గారి డైరెక్షన్ లో మూవీ, శివకార్తికేయన్ అమరన్ తో పాటు మరికొన్ని బిగ్, ఎగ్జైటింగ్ సినిమాలు చేస్తున్నాను. నటుడుగా, సంగీత దర్శకుడిగా నా ప్రయారిటీస్ క్లియర్ గా పెట్టుకున్నాను. ఏ సినిమాలకు ఎప్పుడు వర్క్ చేయాలనేది ఎవరికీ ఇబ్బంది రాకుండా ప్లాన్ చేసుకుంటున్నా. -
అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
సినీ ఇండస్ట్రీలో మరో జంట విడాకులు ప్రకటించింది. తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ షాకింగ్ ప్రకటన చేశారు. తన భార్య.. సింగర్ సైంధవితో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మరోవైపు సైంధవి కూడా తనవైపు నుంచి అధికారికంగా ప్రకటించారు.ఈ ఇద్దరూ విడిపోతున్నట్లు ఈ మధ్య కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. అయితే.. ఆ కథనాల్ని ధృవీకరిస్తూ.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వీళ్ల అభిమానులు విస్మయానికి గురి అయ్యారు. సైంధవి జీవీ ప్రకాష్‌కు బాల్య మిత్రురాలు. ఇద్దరూ 12 ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించారు. 2013లో వీళ్లిద్దరూ వివాహం చేసుకోగా.. ఈ జంటకు ఓ పాప ఉంది.‘‘చాలా ఆలోచించిన తర్వాత ‘సైంధవి, నేను 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాం. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగుకోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి కీలక తరుణంలో మా గోప్యతకు భంగం కలిగించకుండా ఉండేందుకు మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక నుంచి మేము వేరవుతున్నట్లు అంగీకరిస్తున్నాం. ఈ నిర్ణయం ఇద్దరికీ ఉత్తమమని నమ్ముతున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీ అవగాహన, మద్దతు చాలా అవసరం’’ అని జీవీ ప్రకాశ్ మీడియాను కోరారు. pic.twitter.com/73IbnNZfEf— G.V.Prakash Kumar (@gvprakash) May 13, 2024 pic.twitter.com/M6GDxgAFqn— Saindhavi (@singersaindhavi) May 13, 2024 మ్యూజిక్ దిగ్గజం ఏఆర్ రెహమాన్ మేనల్లుడు అయిన జీవీ ప్రకాష్.. కోలీవుడ్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా ఇప్పటిదాకా హీరోగానూ డజనుకు పైగా చిత్రాలతో అక్కడి ఆడియొన్స్‌ను అలరించారు. తెలుగులోనూ పలు చిత్రాలకు ఆయన మ్యూజిక్ అందించారు. ఇక 12వ ఏట టీవీ షో ద్వారా సింగర్‌గా గుర్తింపు దక్కించుకున్న సైంధవి.. విక్రమ్ అన్నియన్(అపరిచితుడు) చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించారు. తమిళ్, తెలుగు చిత్రాల ద్వారా ఆమె అలరిస్తూ వస్తున్నారు. -
ధనుష్‌తో గొడవలు నిజమే.. ఆరేళ్లు మాటల్లేవ్: హీరో
జీవీ ప్రకాశ్ కుమార్.. మల్టీ టాలెంటెడ్. సంగీత దర్శకుడిగా, నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా తమిళ చిత్రపరిశ్రమలో రాణిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా సెంచరీ సినిమాలు దాటేసిన అతడు హీరోగా దాదాపు 25 చిత్రాలు చేశాడు. ఇతడికి కోలీవుడ్‌లో ధనుష్ క్లోజ్ ఫ్రెండ్. కానీ గతంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని.. అప్పటినుంచి వీరికి మాటల్లేవని ప్రచారం జరిగింది. ఫ్రెండ్స్ మధ్య గొడవలు కామన్ ఎట్టకేలకు ఈ ప్రచారంపై స్పందించాడు జీవీ ప్రకాశ్. ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ఫ్రెండ్స్ అన్నాక గొడవలు సర్వసాధారణమే! అలా మా మధ్య కూడా భేదాభిప్రాయాలు వచ్చాయి. చిన్నపాటి గొడవలు జరిగాయి. అలా ఆరేళ్లు మాట్లాడుకోలేదు. కానీ తర్వాత అంతా సెట్టయిపోయింది. ఫ్రెండ్షిప్ అంటేనే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కదా.. ఆ డిస్టబెన్స్ తర్వాత మేమిద్దరం ఇంకా క్లోజయ్యాం. తనతో క్రికెట్ ఆడటం ఇష్టం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తను నా కోసం అండగా నిలబడతాడు. నేను కూడా ఎప్పుడూ తనకు తోడుగా ఉంటాను. ధనుష్‌కు ఎవరైనా నచ్చారంటే వారికోసం ఎంతవరకు వెళ్లడానికైనా సిద్ధపడతాడు. తనలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. నాకు ధనుష్‌తో క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. కాగా జీవీ ప్రకాశ్ వెయిల్ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా చిత్ర రంగప్రవేశం చేశాడు. డార్లింగ్ మూవీతో హీరోగా మారాడు. మదయానై కూట్టం(2013) చిత్రం ద్వారా నిర్మాతగా అవతారం ఎత్తాడు. చదవండి: కీరవాణి అబ్బాయితో నా కూతురు పెళ్లి నిజమే: మాగంటి రూప -
సౌత్ టు నార్త్.. దూసుకెళ్తోన్న జీవీ.ప్రకాశ్
తమిళసినిమా: ఇప్పుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ స్థాయి మామూలుగా లేదు. నటుడిగా, సంగీత దర్శకుడిగా రెండు పడవలపైనా సక్సెస్‌ఫుల్‌గా పయనిస్తున్నారు. ఈ రెండు శాఖల్లోనూ బిజీగా ఉంటున్నారు. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన రెబల్ చిత్రం ఈనెల 22న తెరపైకి రానుంది. నికేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. కాగా తాజాగా ఈయన బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారనే టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించనున్న బహుభాషా (హిందీ,తమిళం) చిత్రంలో జీవీ ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటించనున్నట్లు సమాచారం. దీన్ని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అనురాగ్ కశ్యప్ కోలీవుడ్ ప్రేక్షకులకు నటుడిగా పరిచయమే. ఇమైకా నొడిగల్ చిత్రంలో ఈయన విలన్‌గా నటించి మెప్పించారు. ఇకపోతే ఈయన జీవీ ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటించనున్న ఈ క్రేజీ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం కానున్నారన్న మాట. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా ఇప్పుటికే నటుడు ధనుష్, విజయ్‌సేతుపతి వంటి నటులు బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. -
Prabuthwa Junior Kalashala: మంగ్లీ మార్కుతో ‘డూడుం డుక్కుడుం’
కాలేజీ నేపథ్యంలో టాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. వాటిల్లో చాలా వరకు సూపర్ హిట్లుగా నిలిచాయి. త్వరలోనే మరో కాలేజీ ప్రేమ కథ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓ యదార్థ సంఘటన ఆధారంగా డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం తెరకెక్కించిన తాజా చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమైన క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్లు టీజర్ రిలీజ్ చేయగా అన్ని మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మోస్ట్ హపెనింగ్ సింగర్ మంగ్లీ పాడిన డూడుం డుక్కుడుం సాంగ్ ను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ చేతులమీదుగా రిలీజ్ చేశారు. కాలేజీ జంట మధ్య డూడుం డుక్కుడుం అంటూ సాగుతున్న ఈ సాంగ్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఈ పాటకు కార్తీక్ రోడ్రిగ్జ్ అందించిన బాణీలు అందించగా.. శ్రీ సాయి కిరణ్ అర్థవంతమైన లిరిక్స్ రాశాడు. మంగ్లీ అద్భుతంగా ఆలపించారు. -
సూర్య కోసం సెన్సేషనల్ హీరోయిన్, విలన్ ఎంట్రీ
సౌత్ ఇండియా స్టార్ హీరో 'సూర్య' ఇప్పుడు తన పాన్ ఇండియా చిత్రం 'కంగువ' షూటింగ్లో బిజీగా ఉన్నాడు, ఇందులో అతను గిరిజన లెజెండ్‌గా నటిస్తున్నాడు. ఇదీ పూర్తి అయిన వెంటనే తన 43వ చిత్రం కోసం దర్శకురాలు సుధా కొంగర, స్వరకర్త జివి ప్రకాష్‌తో మళ్లీ జతకట్టనున్నట్లు ఇప్పటికే సమాచారం. ఈ ముగ్గురూ ఇప్పటికే నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ 'సూరరై పొట్రు' (ఆకాశం నీ హద్దురా)లో కలిసి పనిచేశారు. (ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?) 'సూర్య 43' ప్రాజెక్ట్ అక్టోబర్‌లో ప్రారంభం కానుందని సూర్య ఇటీవల ధృవీకరించిన విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా మరో ఆసక్తకరమైన వార్త ఒకటి వైరల్ అవుతుంది. ప్రముఖ నటి నజ్రియా నజీమ్ ఫహద్ కూడా సూర్య 43 లో ఒక ప్రధాన పాత్రతో తమిళ సినిమాలో తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కోలీవుడ్‌లో ఇది సెన్సేషనల్ న్యూస్ అని చెప్పవచ్చు. ఆమె గతంలో తమిళ చిత్రసీమలో భారీ హిట్ సినిమాల్లో నటించి పలు విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఫహద్ ఫాసిల్‌తో పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం ఆమె తగ్గించారని చెప్పవచ్చు. ఈ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమచారం. అలాగే, సూర్య 43లో విలన్‌గా నటించడానికి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను మేకర్స్ సంప్రదిస్తున్నట్లు సమాచారం. వెండితెరపై ఆతని విలనిజం సరికొత్తగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్ వర్మ డార్లింగ్స్ వంటి పలు చిత్రాలలో తన నటనతో విశ్వసనీయ నటుడిగా స్థిరపడ్డాడు, దహాద్, పింక్, గల్లీ బాయ్, సూపర్ 30, లస్ట్ స్టోరీస్ 2 వంటి చిత్రాలతో ఆయనకు పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు ఉంది. దీంతో దర్శకులు,నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. సుధా కొంగర ప్రస్తుతం అక్షయ్ కుమార్ కథానాయకుడిగా సూరరై పొట్రు హిందీ రీమేక్‌ని పూర్తి చేసే దశలో ఉంది. అది పూర్తి అయిన వెంటనే సూర్య 43 ప్రాజెక్ట్ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో సెట్స్‌పైకి వెళ్తుందని సమచారం. -
సెంచరీ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్, హీరోగా కొత్త సినిమా
సంగీత దర్శకుడిగా, నటుడుగా, గాయకుడిగా, నిర్మాతగా రాణిస్తున్న బహుముఖ ప్రతిభాశాలి జీవీ ప్రకాష్ కుమార్. ఈయన అతి చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా రంగ ప్రవేశం చేశారు. అలా 25 ఏళ్ల వయసులోనే 25 చిత్రాలకు పనిచేసిన సంగీత దర్శకుడిగా ముద్ర వేసుకున్నారు. వెయిల్ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా చిత్రం రంగప్రవేశం చేసి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత తమిళంలో డార్లింగ్ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన జీవీ ప్రకాష్ కుమార్ మదయానై కూట్టం చిత్రం ద్వారా నిర్మాతగాను అవతారం ఎత్తారు. అలా సంగీత దర్శకుడిగా సెంచరీ కొట్టిన ఈయన కథానాయకుడిగా 25 చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు పరిచయం పరిచయం అవుతున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ నిర్మాతగా కూడా వ్యవహరించనట్లు సమాచారం. జి స్టూడియోస్ సంస్థతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కాగా జీవీ ప్రకాష్ కుమార్ 2013లో నిర్మాతగా మారి మదయానై కూట్టం చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఆయన మళ్లీ నిర్మాతగా చేస్తున్న చిత్రం ఇదే అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: జైలర్‌కు తెలుగు సెంటిమెంట్.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు? -
సూర్య సినిమా నుంచి వైదొలగిన జీవీ?, ఇదిగో క్లారిటీ
తమిళ సినిమా: నటుడు సూర్య కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్న మరో చిత్రం వాడివాసల్. వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను భారీ ఎత్తున నిర్మించ తలపెట్టారు. సీఎస్ చెల్లప్ప రాసిన నవల ఆధారంగా జల్లికట్టు నేపథ్యంలో సాగే కథ ఇది. వాస్తవానికి ఈ చిత్రం 2020లోనే ప్రారంభం కావాల్సి ఉంది. అందుకు సూర్య రిహార్సల్స్ కూడా చేశారు. అయితే దర్శకుడు వెట్రిమారన్ హాస్య నటుడు సూరిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ విడుదలై చిత్రాన్ని ముందుగా తెరకెక్కించడానికి సిద్ధం కావడంతో వాడివాసల్ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. దీంతో సూర్య కంగువా చిత్రానికి సిద్ధమయ్యారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చారిత్రాత్మక నేపథ్యంగా సాగే ఈ చిత్రం ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. కాగా చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ వాడివాసల్ చిత్ర షూటింగ్ ప్రారంభంకావడంలో జాప్యం జరగడంతో ఆ చిత్రం నుంచి వైదొలగినట్లు ప్రచారం వైరల్ అవుతోంది. (చదవండి: టాప్ డైరెక్టర్‌తో శివకార్తికేయన్.. హీరోయిన్గా సీతారామం బ్యూటీ!) అయితే దీని గురించి ఆయన వర్గం స్పందిస్తూ వాడివాసల్ చిత్రం గురించి ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఈ చిత్రానికి పనిచేయడానికి జీవీ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అయితే వాడివాసల్ చిత్రం సెట్ పైకి వెళ్లడానికి ఇంకా కాస్త టైమ్ పడుతుందనే చెప్పాలి. -
అయన్ ప్రణతి ‘మాష్టారు..మాష్టారు’ పాటకు జీవీ ప్రకాశ్ ఫిదా
ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ‘ఇండియన్ ఐడల్ 2’కి విశేష స్పందల లభిస్తోంది. . ఈ షో ద్వారా తమ గాన ప్రతిభతో వరల్డ్ సెలబ్రిటీలు మారుతునారు మన కంటెస్టెంట్స్. ముఖ్యంగా 14 ఏళ్ల అయ్యన్ ప్రణతికి రోజురోజూకూ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఆమె ముద్దు, ముద్దుగా శ్రవణానందంగా పాడిన సార్ చిత్రంలోని ‘మాష్టారు..మాష్టారు’ పాటతో ఆమె తెలుగువారందరకీ బాగా చేరువయ్యింది. సంగీతకారులను మెప్పించింది. ఎంతలా అంటే ఆ పాట కంపోజ్ చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ప్రత్యేకంగా ప్రణతిని మెచ్చుకునేంత. భవిష్యత్తులో గాయనిగా ఆమె అద్భుతంగా రాణిస్తుందని జడ్జెస్ సైతం కితాబిస్తున్నారు. అయ్యన్ ప్రణతి నాన్నగారు కూడా సంగీతకారుడు కావడం, ఇండియన్ ఐడల్ స్టేజ్ పై ఆయన ప్రదర్శన చూసి షో జడ్జ్ మరియు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆయనతో కలిసి పనిచేస్తానని చెప్పడం ఆశ్చర్యకరమైన విషయం. -
Orey Bammardhi: ఎవరితోనూ నిజాయతీగా ఉండలేకపోతున్నాను
‘ఈ లోకంలో ఎవరితో ఒకరితోనైనా 200 శాతం హానెస్ట్‌గా ఉండాలనుకుంటన్నాను’అంటున్నాడు హీరో సిద్ధార్థ్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఒరేయ్ బామ్మర్ది’. ‘బిచ్చగాడు’ చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రం ఆగస్ట్ 13న థియేటర్లలో విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో సిద్దార్థ్ ట్రాఫిక్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్లో సిద్దార్థ్, జీవీ ప్రకాశ్‌ల నటన ఆకట్టుకునేలా సాగింది. బైక్ రేసులంటూ తిరిగే యువకుడి పాత్రలో జీవీ ప్రకాశ్ కనిపిస్తే.. నగరంలో రేసర్స్‌ను పట్టుకునే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాత్రలో సిద్ధార్థ్ కనిపించున్నారు. వీరిద్ధరి మధ్య ప్రొఫెషనల్‌గా..పర్సనల్‌గా ఉండే టచ్‌ను చూపిస్తూ సినిమా ఉంటుందనేది ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. పోలీస్ లైఫ్‌లో క్రిమినల్స్‌తోనూ, వాళ్లు చేసే క్రైమ్స్‌తోనే బతకాల్సి వస్తుంది. డిపార్ట్మెంట్ లోపలైనా బయటైనా ఎవరితోనూ నిజాయతీగా ఉండలేకపోతున్నాను. కాబట్టి, ఈ లోకంలో ఎవరో ఒక్కరితోనైనా 200శాతం నిజాయతీగా ఉండాలనుకుంటున్నాను’ అంటూ సిద్ధార్థ్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. -
ఫ్యాన్స్ చేసిన పనికి ఫిదా అయిన నటుడు
చెన్నై: నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ అభిమానులు మానవత్వం చాటుకున్నారు. ఆదివారం జీవీ పుట్టినరోజు సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అన్నదానం చేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అభిమానులకు జీవీ ప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. చదవండి : ఇప్పటివరకు రూ.24 లక్షలు పైనే ఖర్చు చేశాం: సోహైల్ పది కేజీఎఫ్‌లు ఒక్క పుష్పతో సమానం: ఉప్పెన డైరెక్టర్ -
సిస్టరాఫ్ జీవీ
తమిళంలో మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరోగా మారిన వారిలో జీవీ ప్రకాశ్ ఒకరు. తమిళ సినిమాలో ప్రస్తుతం మినిమమ్ గ్యారెంటీ హీరోల లిస్ట్‌లో జీవీ ఉన్నారు. చేతిలో రెండు, మూడు సినిమాలు ఉండేట్టు వరుస సినిమాలు చేస్తున్నారు. తాజాగా ప్రకాశ్ సోదరి జీవీ భవాని శ్రీ కూడా సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. విజయ్ సేతుపతి – విరుమాండి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో కీలక పాత్రలో భవాని శ్రీ కనిపిస్తారట. ఈ సినిమా ఇటీవలే ప్రారంభం అయింది. ఇటీవల అమల చేసిన ‘హై ప్రీస్టెస్’ వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటించారామె. -
జీవీతో నికిషాపటేల్
సినిమా: జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందని నటి నికిషాపటేల్ పేర్కొంది. టాలీవుడ్లో పులి చిత్రం ద్వారా పరిచయమైన ఈ గుజరాతీ బ్యూటీ ఆ తరువాత కోలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. కరైయోరం వంటి త్రిభాషా చిత్రంలోనూ నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. గ్లామర్ పాత్రల్లో నటించడానికి వెనుకాడని ఈ అమ్మడికి ఎందుకనో పెద్దగా స్టార్డమ్ అందలేదు. సరైన కథా చిత్రాలు అమరకపోవడం కారణం కావచ్చు. ఆ మధ్య తమిళంలో అరవిందస్వామి కథానాయకుడిగా నటించిన భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రంలో అతిథిగా మెరిసినా ప్రేక్షకుల్లో మంచి పేరునే తెచ్చుకుంది. కాగా తాజాగా ఎళిల్ దర్శకత్వంలో జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రంలో నికిషాపటేల్ ఆయనతో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకుంది. దర్శకుడు ఎళిల్ చిత్రాల్లో హీరోతో పాటు హీరోయిన్లకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ చిత్రం తరువాత కోలీవుడ్ దృష్టి నికీషాపటేల్‌పై పడుతుందని భావించవచ్చు. దీని గురించి ఈ సంచలన నటి మాట్లాడుతూ ఈ చిత్రంలో తాను ఐటీ కంపెనీలో పని చేసే యువతిగా నటిస్తున్నానని చెప్పారు. చిత్రంలో వినోదానికి తన పాత్రనే కేంద్ర బిందువుగా ఉంటుందని అన్నారు. తొలిరోజే తాను యోగా చేసే సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. ఆ సన్నివేశాల్లో జీవీ కూడా నటించారని తెలిపారు. ఆయన కోలీవుడ్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటున్న స్టార్ నటుడిగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన కామెడీ టైమింగ్ సూపర్ అని అన్నారు. ఇక దర్శకుడు ఎళిల్ చిత్రాలకు కుటుంబ సమేతంగా చూసే అభిమానులున్నారని, ఆయనతో చాలా సార్లు కథా చర్చల్లో పాల్గొన్నానని చెప్పారు. అయితే ఇప్పటికి ఎళిల్ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చిందని అన్నారు. ఆయన చాలా ప్రశాంతంగా కనిపించినా, ఎంతో శ్రమజీవి అని పేర్కొన్నారు. ఈ చిత్ర యూనిట్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని నటి నికిషా పటేల్ అన్నారు. -
నచ్చితేనే చేస్తా!
సినిమా: నచ్చితేనే చేస్తానంటోంది నటి నిక్కీగల్రాణి. డార్లింగ్ అంటూ జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా కోలీవుడ్‌కు పరిచయం అయిన నటి ఈ అమ్మడు. తొలి చిత్రమే హిట్ అవడంతో వచ్చిన అవకాశాలన్నీ ఎడా పేడా ఒప్పేసుకుని నటించేసింది. లక్కీగా మంచి విజయాలనే అందుకుంది. అందాలారబోతకు ఎలాంటి అభ్యంతరం చెప్పని నటిగా పేరు తెచ్చుకున్న నిక్కీగల్రాణి ఆ మధ్య నటించిన చిత్రం కలగలప్పు 2. ఆ చిత్రం సక్సెస్ అనిపించుకుంది. ఇక ఇటీవల ప్రభుదేవాతో జతకట్టిన చార్లీచాప్లిన్–2 చిత్రం కూడా పర్వాలేదనిపించుకుంది.కార్తీ హీరోగా నటించిన దేవ్ చిత్రంలో అతిథిగా మెరిసింది. అయినా ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయనే ప్రచారం సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. అయితే అంతగా నిక్కీగల్రాణికి అవకాశాలు మరీ అడుగంటలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ జీవాతో రొమాన్స్ చేసిన కీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా నటుడు శశికుమార్‌కు జంటగా నటిస్తోంది. ఈ సందర్భంగా నిక్కీగల్రాణి మాట్లాడుతూ తనకు అవకాశాలు తగ్గాయనడం సరికాదని అంది. నిజం చెప్పాలంటే చిత్రాల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు చెప్పింది. పాత్ర నచ్చితేనే నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఒక కథను విన్నప్పుడు అందులో తాను నటిస్తే ఎలా ఉంటుందని ఒక అభిమానిగా ఆలోచిస్తానని అంది. అలా పాత్ర నచ్చితేనే నటించడానికి సమ్మతిస్తున్నానని చెప్పింది. వైవిద్యభరిత పాత్రల్లో నటించాలన్నది తన ఆశ అని, అందుకే పాత్రల ఎంపికలో ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నానని నిక్కీగల్రాణి చెప్పింది. -
గొప్ప సంగీతభరిత చిత్రాన్ని చూశా
‘శంకరాభరణం, సాగరసంగమం’ వంటి అద్భుత సంగీతభరిత చిత్రాలను అందించారు కళా తపస్వి కె.విశ్వనాథ్. సంగీతం నేపథ్యంలో రాజీవ్ మీనన్ తెరకెక్కించిన చిత్రం ‘సర్వం తాళమయం’. జీవీ ప్రకాష్, అపర్ణ బాలమురళి జంటగా నటించారు. నెడుముడి వేణు, వినీత్, దివ్యదర్శిని ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘సర్వం తాళమయం’ చిత్రాన్ని వీక్షించిన అనంతరం కె.విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘చాలా కాలం తర్వాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూశాను. రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమాను రూపొందించారు. పైగా ఒక మంచి సందేశాన్ని కూడా అందించిన రాజీవ్ మీనన్‌కి నా ఆశీర్వాదాలు’’ అన్నారు. రాజీవ్ మీనన్ మాట్లాడుతూ– ‘‘దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, నాగ్ అశ్విన్, మహి వి. రాఘవ్ తదితరులు మా చిత్రాన్ని చూసి అభినందించడం సంతోషంగా ఉంది. ఏఆర్ రహమాన్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవి యాదవ్, నిర్మాత: లత. -
నే తమిళ పాట పాడితే...
కథానాయిక అదితీరావ్ హైదరి యాక్టింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘చెలియ, పద్మావత్, సమ్మోహనం’ వంటి చిత్రాలు అందుకు నిదర్శనం. ఇప్పుడు సింగింగ్‌లోనూ సత్తా చాటాలనుకుంటున్నారు. సంగీతదర్శకుడు జీవీ ప్రకాష్ హీరోగా నటించిన ‘జైలు’ సినిమాలో ఓ పాట పాడారామె. ఈ చిత్రానికి వసంతబాలన్ దర్శకుడు. ‘‘తమిళంలో నా తొలి సాంగ్‌ను రికార్డ్ చేసినందుకు ఆనందంగా ఉంది. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. నన్ను గైడ్ చేసిన జీవీ ప్రకాశ్‌కి ధన్యవాదాలు. ‘జైలు’ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు అదితీ. అలాగే స్టూడియోలో జీవీతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారామె. సుధీర్‌బాబు ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఇంతకు ముందు బాలీవుడ్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సౌత్‌లో మంచి ఊపు మీద ఉన్నారు. తెలుగు ‘అంతరిక్షం 9000 కేఎమ్‌పిహెచ్’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసిన అదితీ తమిళంలో ‘సైకో’ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
ప్రేమను వెతుక్కుంటూ నిత్యానంద
సినిమా మీద ఇంట్రెస్ట్ తెప్పించడానికి, ఆడియన్స్‌ను థియేటర్ వరకూ రప్పించడానికి కొన్నిసార్లు సినిమా టైటిల్ చాలు. ఆ ఫార్ములాను గట్టిగా నమ్ముతున్నట్టున్నారు తమిళ దర్శకుడు ఆదిక్. ఆల్రెడీ తన గత సినిమాలకు ‘త్రిష ఇల్లన నయనతార (తెలుగులో ‘త్రిషా లేదా నయనతార’) అఅఅ (అన్బానవన్ అసరదావన్ అడంగాదవన్) అని పెట్టారు. ప్రస్తుతం సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ హీరోగా చేస్తోన్న సినిమాకు ఆయన పెట్టిన టైటిల్ ‘కాదలై తేడి నిత్యానంద’ (అంటే ప్రేమను వెతుకుతూ నిత్యానంద). ఈ పాటికే మీకు అర్థం అయ్యింటుంది ఎంత క్రేజీ టైటిల్‌ని తన సినిమాకు పెట్టారో. పోస్టర్ కూడా డిఫరెంట్‌గా ఉంది కదూ. సోనియా అగర్వాల్, అమైరా దస్తూర్, సంచితా శెట్టి హీరోయిన్లుగా ఈ సినిమాను త్రీడీలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రేమను వెతుక్కునే అమర ప్రేమికుడిగా జీవీ ప్రకాశ్ కనిపిస్తారని ఊహించవచ్చు. -
పడ్డాడండి ట్రాక్‌లో మరి!
గతేడాది ‘గృహం’ సినిమాతో హిట్ ట్రాక్‌లో పడ్డ సిద్ధార్థ్ ఇప్పుడు కోలీవుడ్‌లో స్పీడ్ పెంచారు. రెండు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లారు. సాయి శంకర్ దర్శకునిగా పరిచయం అవుతూ సిద్ధార్థ్ సోలో హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ రీసెంట్గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్ హీరోలుగా శశి దర్శకత్వంలో రూపొందనున్న మల్టీస్టారర్ మూవీ గురువారం మొదలైంది. ఈ సినిమాను ఓన్లీ తమిళంలోనే కాదు తెలుగు, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇందులో ఒక కథానాయికగా కాశ్మీరి పర్దేశీ ఎంపికయ్యారట. ఈ పేరు టాలీవుడ్లో ఎక్కడో విన్నట్లు ఉంది కదూ. నిజమే.. నాగశౌర్య హీరోగా తెలుగులో రూపొందుతోన్న ‘నర్తనశాల’ సినిమాలో కాశ్మీరినే కథానాయిక. ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే కోలీవుడ్ నుంచి కాశ్మీరికి కాల్ రావడం గొప్ప విశేషమే కదా. -
జైలుకెళ్లిన జీవీ ప్రకాశ్
జైల్లో ఊసలు లెక్కపెడుతున్నారు సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్. తప్పేం చేయలేదు కానీ చేసిన వారిని ప్రశ్నిస్తే చేతికి బేడీలు వేశారట. మరి.. ఆయన జైలు జీవితం ఎలా గడిచిందనేది సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. వసంతబాలన్ దర్శకత్వంలో జీవీ ప్రకాశ్ హీరోగా రూపొందుతోన్న సినిమా ‘జైలు’. ఈ సినిమాలో కరుణ అనే క్యారెక్టర్లో జీవీ నటిస్తున్నారు. ‘‘జైలు’ నా కెరీర్లో ఇంపార్టెంట్ మూవీగా నిలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది’’ అన్నారు జీవీ ప్రకాశ్. లోయర్ మిడిస్ క్లాస్ ఫ్యామిలీస్ ఎదుర్కొంటున్న హౌసింగ్ ప్రాబ్లమ్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని కోలీవుడ్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. పన్నెండేళ్ల క్రితం వసంతబాలన్ దర్శకత్వంలో వచ్చిన ‘వెయిల్’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన జీవీ ప్రకాశ్ ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే హీరోగా నటిస్తుండటం విశేషం. అంతేకాదు ఈ చిత్రానికి కూడా జీవీనే స్వరకర్త అట. -
స్పీడ్ పెరిగింది
సూపర్‌స్టార్ కృష్ణ కూతురు మంజుల తొలిసారి దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’ సినిమాలో బాగా నటించి తెలుగు ప్రేక్షకులకు నచ్చేశారు ముంబై బ్యూటీ అమైరా దస్తూర్. తెలుగు తెరపైకి రాకముందే తమిళ చిత్రాల్లో నటించిన అమైరా ఇప్పుడు మరో తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జీవీ ప్రకాశ్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందనున్న ఫాంటసీ లవ్ \చిత్రంలో నటించనున్నారామె. మూడేళ్ల క్రితం జీవీ, రవిచంద్రన్ కాంబినేషన్లోనే వచ్చిన తమిళ చిత్రం ‘త్రిష ఇల్లా నయనతార’తెలుగులో ‘త్రిష లేదా నయనతార’ అనే పేరుతో రిలీజైంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. రాజ్ తరణ్, అమైరా దస్తూర్ జంటగా నటించిన తెలుగు చిత్రం ‘రాజుగాడు’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇలా ఒక సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాను లైన్లో పెడుతూ స్పీడ్ పెంచారు అమైరా. అంతేకాదండోయ్. ఒక హిందీలో చిత్రంలో నటించడం కోసం ఆమె జిమ్నాస్టిక్స్ను ప్రాక్టీస్ చేస్తున్నారు కూడా. -
సూపర్‌స్టార్ తరువాత జీవీనే..
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ తరువాత కోలీవుడ్‌లో ఆ స్థాయికి చేరుకున్న నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌నే. ఏమిటీ నమ్మశక్యంగా లేదా? అయితే రండి చూద్దాం. అప్పుడెప్పుడో నటుడు పార్థిబన్ ప్రధాన పాత్రలో అంబలి అనే 3డి చిత్రం రూపొందింది. రజనీకాంత్ ఈ మధ్య కోచ్చడయాన్ అనే 3డీ యానిమేషన్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అదే విధంగా తాజాగా ఆయన నటిస్తున్న 2.ఓ చిత్రం 3డీ ఫార్మెట్‌లోనే రూపొందుతోంది. రజనీకాంత్ మినహా కోలీవుడ్ మరే హీరో 3డీ చిత్రంలో నటించలేదు. అయితే తాజాగా యువ నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ 3డీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈయన హీరోగా ఇంతకు ముందు త్రిష ఇల్లన్నా నయనతార చిత్రాన్ని తెరకెక్కించిన ఆధిక్ రవిచంద్రన్ ఆ తరువాత శింబు హీరోగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం ఫ్లాప్ అవడంతో ఆధిక్ రవిచంద్రన్ తదుపరి చిత్రం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో జీవీ ఆయనకు అవకాశం కల్పించారు. వీరి కాంబినేషన్లో 3డీ చిత్రం తెరకెక్కుతోందన్నది తాజా సమాచారం. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో కథానాయకిగా నటి అమిరదస్తూర్ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో నటి సంజితాశెట్టి, సోనియా అగర్వాల్ వచ్చి చేరారు. 2.ఓ చిత్రానికి పనిచేసిన కొందరు సాంకేతిక నిపుణులు జీవీ చిత్రానికి పనిచేస్తున్నారట. తాజా షూటింగ్ చెన్నై, కారైక్కుడి ప్రాంతాల్లో నిర్వహించడానికి చిత్ర వర్గాలు రెడీ అవుతున్నారని సమాచారం. -
జ్యోతిక డైలాగ్పై విరుచుకుపడుతున్న నెటిజన్లు
-
జ్యోతిక సంభాషణలపై మండిపడుతున్న నెటిజన్లు
తమిళసినిమా: నటి జ్యోతిక సంభాషణలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తనేం మాట్లాడింది పాపం అనుకుంటున్నారా? నటి జ్యోతిక వివాహనంతరం 36 వయదినిలే చిత్రంతో నటిగా రీఎంట్రీ అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇటీవల తెరపైకి వచ్చిన మగళీర్ మట్టుం చిత్రంలోనూ ప్రధాన పాత్రను పోషించారు. చాలా కాలం తరువాత బయటి సంస్థలో నాచియార్ అనే చిత్రంలో నటిస్తున్నారు. హీరోగా జీవీ.ప్రకాశ్‌కుమార్ నటిస్తున్న ఈ చిత్రానికి బాలా దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. నటి జ్యోతిక పోలీస్ అధికారిణిగానూ, జీవీ.నేరస్తుడిగానూ నటిస్తున్న చిత్రం నాచియార్. ఇందులో జ్యోతిక పోలీస్‌స్టేషన్‌లో కొందరిపై అసభ్య పదజాలంతో తిట్టిన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. దీంతో విమర్శకులు, నెటిజన్లు అలాంటి సంభాషణలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. పలువరు అభిమానులు దర్శకుడు బాలా చిత్రాల్లో అలాంటి సంభాషణలు చోటు చేసుకోవడం సర్వసాధారణమే అయినా జ్యోతిక లాంటి నటి వాటిని చెప్పడానికి ఎలా అంగీకరించారని దుయ్యబడుతున్నారు. ప్రచారం కోసమే చిత్రాల్లో ఇలాంటి బూతులు పొందుపరుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెన్సార్ సభ్యులైనా ఇలాంటి అసభ్య సంభాషణలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాఉండగా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంటున్న నాచియార్ చిత్రం మున్ముందు ఇంకెంత సంచలనం కలిగిస్తుందో చూడాలి. -
లావణ్య ప్లేస్‌లో అర్జున్ రెడ్డి హీరోయిన్..!
తెలుగులో నాగచైతన్య, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా 100% లవ్. రొమాటింక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ఇప్పుడు కోలీవుడ్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. చంద్రమౌళి తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో చాలా రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా హెబ్బా పటేల్ ను హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు. కానీ చివరి నిమిషంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుందంటూ ప్రకటించారు. అయితే లావణ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించటంతో మరోసారి హీరోయిన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా అర్జున్ రెడ్డి సినిమాతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిన షాలిని పాండేనే ఈ రీమేక్ లో హీరోయిన్ గా ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వరుస ఆఫర్లతో బిజీ అవుతున్న షాలిని, ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందేమో చూడాలి. -
అందాల రాక్షసి బయటకొచ్చేసింది.!
అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఈ శుక్రవారం యుద్ధంశరణం సినిమాతో నాగచైతన్యకు జోడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలుగులో సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలతోనూ జోడి కడుతున్న ఈ బ్యూటీ కోలీవుడ్ లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ లావణ్య కోలీవుడ్ ఆశలు ఇప్పట్లో తీరేలా కనిపించటం లేదు. ఈ రీమేక్ సినిమాతో తమిళనాట సక్సెస్ సాధించాలని భావించిన లావణ్య కోరిక తీరేలా లేదు. నాగచైతన్య, తమన్నా కాంబినేషన్లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 100% లవ్. ఈ సినిమాను జీవీ ప్రకాష్ హీరోగా తమిళ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు ముందుగా హెబ్బా పటేల్‌ను హీరోయిన్గా తీసుకోవాలని భావించినా.. తరువాత లావణ్యత్రిపాఠినే ఫైనల్ చేశారు. ఈ సినిమాలో కాలేజ్ అమ్మాయిగా కనిపించేందుకు స్లిమ్ అవ్వాలని నిర్ణయించుకుంది లావణ్య. కానీ ప్రస్తుతం ఈ బ్యూటీ రీమేక్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు సినిమాలతో బిజీగా ఉండటంతో రీమేక్ కు డేట్స్ అడ్జస్ట్ చేయలేకే ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసిందట. దీంతో మరో హీరోయిన్ కోసం అన్వేషణలో పడ్డారు జీవీ ప్రకాష్ టీం. -
రీమేక్‌లో రాక్షసి..!
కాస్త స్లోగా కెరీర్ కొనసాగిస్తున్న అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మరో క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలతోనూ జోడి కడుతున్న ఈ బ్యూటీ, కోలీవుడ్ లోనూ దూసుకుపోతోంది. తాజాగా ఓ రీమేక్ సినిమాలో హీరోయిన్గా నటించే చాన్స్ కొట్టేసింది లావణ్య. ఈ సినిమా టాలీవుడ్లో సూపర్ హిట్ అయిన సినిమాకు రీమేక్ కావటంతో కోలీవుడ్‌లో హిట్ గ్యారెంటీ అన్న నమ్మకంతో ఉంది. నాగచైతన్య, తమన్నా కాంబినేషన్లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 100% లవ్. ఈ సినిమాను జీవీ ప్రకాష్ హీరోగా తమిళ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు ముందుగా హెబ్బా పటేల్‌ను హీరోయిన్గా తీసుకోవాలని భావించినా.. ఫైనల్‌గా లావణ్యత్రిపాఠినే ఫైనల్ చేశారట. ప్రస్తుతం కాలేజ్ అమ్మాయిగా కనిపించేందుకు స్లిమ్ అయ్యే పనుల్లో బిజీగా ఉంది లావణ్య. -
సుకుమార్ నిర్మాణంలో తమిళ సినిమా
లెక్కల మాస్టారు సుకుమార్ తీసిన రొమాంటిక్ డ్రామా... 100% లవ్. నాగచైతన్య, తమన్నా జంటగా నటించిన ఈ సినిమా బ్రహ్మాండమైన హిట్ అయింది. కేవలం చదువు తప్ప మరేమీ తెలియని బాలు, అతడి మరదలి పాత్రలో తమన్నా చేసిన ఈ సినిమా ఇప్పుడు తమిళంలోకి రీమేక్ అవుతోంది. మరి తమిళ సినిమాలో సుకుమార్ పాత్ర ఏంటా అని చూస్తున్నారా.. పక్కా కాకినాడ కుర్రోడయిన ఆయన ఈ సినిమాకు దర్శకత్వం వహించట్లేదు.. నిర్మాతగా వ్యవహరిస్తున్నారట. చంద్రమౌళి తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్ ఈ సినిమాలో లీడ్‌రోల్ పోషిస్తున్నాడు. ఈ వివరాలన్నింటినీ ప్రకాషే ట్వీట్ చేశాడు. తెలుగు దర్శకుడు సుకుమార్ తన తదుపరి సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారని చెప్పాడు. 100% లవ్ సినిమాను రీమేక్ చేస్తున్నారని, చెన్నై ఎక్స్‌ప్రెస్, దిల్వాలే లాంటి సినిమాలకు పనిచేసిన డూడ్లీ.. ఈ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా ఉంటారని కూడా చెప్పాడు. మొత్తానికి ఇన్నాళ్లూ మెగాఫోన్ పట్టుకుని యాక్షన్.. కట్ చెప్పిన మన లెక్కల మాస్టారు నిర్మాతగానూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే కుమార్ 21ఎఫ్ సినిమాతో నిర్మాతగానూ సూపర్ హిట్ కొట్టిన సుక్కు, త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న దర్శకుడు సినిమాకు నిర్మాత వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు కోలీవుడ్ లోనూ నిర్మాతగా తొలి అడుగు వేస్తున్నాడు. Yes telugu director Sukumar is producing my next . 100% love remake . Dir chandramouli . Dop dudely (chennai express , dilwale ) #100%love pic.twitter.com/nh87ToN5L0 — G.V.Prakash Kumar (@gvprakash) 5 May 2017 -
సమంత, ఆ యంగ్ హీరోకు ఓకె చెప్తుందా..?
నాగాచైతన్యతో ప్రేమలో ఉన్న విషయం బయటికి వచ్చిన తరువాత సమంత సినిమాలు ఒప్పుకోవటం మానేసింది. జనతా గ్యారేజ్ సినిమా తరువాత చాలా రోజుల వరకు ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు సామ్. తరువాత తమిళ సినిమాలకు సైన్ చేసిన సమంత, ఈ మధ్యే ఓ తెలుగు సినిమా షూటింగ్లో పాల్గొందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా మామ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా రాజుగారి గది 2లో. తమిళ్లో రెండు మూడు ప్రాజెక్ట్ లకు ఓకె చెప్పిన సమంతపై ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. వరుసగా అడల్ట్ కామెడీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ యంగ్ హీరో జీవీ ప్రకాష్ సినిమాలో సమంత హీరోయిన్గా నటించనుందట. అయితే ఇది ఓ తెలుగు సినిమాకు రీమేక్ అన్న టాక్ వినిపిస్తోంది. నిఖిల్ హీరోగా ఘనవిజయం సాధించిన ఎక్కడికీపోతావు చిన్నవాడా సినిమాను జీవీ ప్రకాష్ తమిళ్లో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్గా హన్సికను ఫైనల్ చేయగా ఇప్పుడు మరో హీరోయిన్ పాత్రకు సమంతను సంప్రదిస్తున్నారు. చేతి నిండా సినిమాలతో పాటు పెళ్లి పనులతోనూ బిజీగా ఉన్న సమంత జీవీ ప్రకాష్‌కు ఓకె చెపుతుందో లేదో చూడాలి. -
కోలీవుడ్ చిన్నవాడు జీవి
లో బడ్జెట్ సినిమాలతో కోలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తున్న యంగ్ హీరో జీవి ప్రకాష్. ముఖ్యంగా రీమేక్ సినిమాల మీద దృష్టి పెట్టిన ఈ యువ నటుడు మంచి విజయాలు సాధిస్తున్నాడు. టాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ప్రేమ కథాచిత్రం సినిమాను తమిళ్లో డార్లింగ్ పేరుతో రీమేక్ చేసిన మంచి విజయం సాధించాడు. ఆ తరువాత కూడా యూత్‌ను ఆకట్టుకునే కథాంశాలతో దూసుకుపోతున్న ఈ యంగ్, హీరో ఇప్పుడు మరో రీమేక్ మీద కన్నేశాడు. ఇటీవల నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికీ పోతావు చిన్నవాడా సినిమాను కోలీవుడ్‌లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు జీవి. పెద్ద నోట్ల రద్దు సమయంలో రిలీజ్ అయి కూడా మంచి కలెక్షన్లు సాధించిన ఎక్కడికీ పోతావు చిన్నవాడా, రీమేక్ రైట్స్ కోసం చాలా మంది హీరోలు ప్రయత్నించారు. ఫైనల్‌గా ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న జీవి, త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. -
పదిహేనేళ్ల తరువాత మళ్లీ డైరెక్ట్ చేస్తున్నాడు
రాజీవ్ మీనన్.. దక్షిణాది సినిమాలను ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు. బొంబాయి సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా దేశావ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజీవ్ మీనన్. ఆ తరువాత కూడా మణిరత్నం తెరకెక్కించిన గురు, కడలి లాంటి సినిమాలతో పాటు మార్నింగ్ రాగా లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించాడు. యాడ్ ఫిలిం మేకర్‌గా కూడా మంచి పేరున్న రాజీవ్ మీనన్ రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. మెరుపు కలలు సినిమాతో దర్శకుడిగా మారిన రాజీవ్ మీనన్ తొలి సినిమాతోనే నాలుగు జాతీయ అవార్డులు సాధించి సత్తా చాటాడు. తరువాత ప్రియురాలు పిలిచింది సినిమాతో మరోసారి దర్శకుడిగా మారి జాతీయ అవార్డు సాధించాడు. దాదాపు 15 ఏళ్ల తరువాత మరోసారి తన దర్శకత్వంలో సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజీవ్ మీనన్. కోలీవుడ్ యంగ్ హీరో జివి ప్రకాష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
తమిళ సినిమా రీమేక్‌లో సునీల్
కమెడియన్‌గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సునీల్, హీరోగా ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాడు. అడపాదడపా హిట్ సినిమాలు వస్తున్నా కెరీర్‌ను మలుపు తిప్పే స్థాయి సక్సెస్‌లు మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇటీవల విడుదలైన ఈడు గోల్డ్ ఏహె కూడా నిరాశపరచటంతో రీమేక్ సినిమాల మీద దృష్టి పెడుతున్నాడు. కొత్త కథలతో ప్రయోగాలు చేసే కన్నా.. ఆల్రెడీ సక్సెస్ అయిన కథ అయితే సేఫ్ అని భావిస్తున్నాడు. అందుకే తమిళ్లో జీవి ప్రకాష్ హీరోగా తెరకెక్కిన 'ఎన్నక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు' సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. తమిళ్లో ఈ సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థే తెలుగులోనూ నిర్మిస్తోంది. జీవీ చేసిన పాత్రకు సునీల్ అయితే కరెక్ట్ అని భావించిన నిర్మాణ సంస్థ 'నాకు ఇంకో పేరుంది' పేరుతో ఈ సినిమాను రీమేక్ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
కోలీవుడ్ లో 'గీతాంజలి'
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ఫుల్ జానర్ హర్రర్ కామెడీ. భారీ బడ్జెట్ సినిమాలకు ధీటుగా సక్సెస్‌లు సాధిస్తున్న ఈ జానర్లో సినిమాలు చేయడానికి యంగ్ హీరోస్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అదే బాటలో తెలుగులో సక్సెస్ సాధించిన ఓ హర్రర్ కామెడీని కోలీవుడ్‌లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ హీరో జీవి ప్రకాష్ హీరోగా నటించనున్నాడు. ప్రముఖ రచయిత కోనా వెంకట్.. కథా స్క్రీన్ ప్లే అందించటంతో పాటు తానే నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా గీతాంజలి. అంజలి, శ్రీనివాస్ రెడ్డిలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగునాట ఘనవిజయం సాధించింది. తరువాత కన్నడలో రీమేక్ అయి అక్కడ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ హిట్ సినిమా మీద తమిళ వర్గాల కన్ను పడింది. నాన్ పేయి పేసురేన్ అనే తమిళ హర్రర్ కామెడీని డైరెక్ట్ చేసిన ప్రసాద్, గీతాంజలి రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ప్రేమకథాచిత్రం రీమేక్‌లో నటించి సక్సెస్ సాధించిన జీవి, గీతాంజలితో మరోసారి అదే రిజల్ట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. -
కోలీవుడ్ గీతాంజలిలో జీవి
ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ జానర్ హర్రర్ కామెడీ. భారీ బడ్జెట్ సినిమాలకు ధీటుగా సక్సెస్‌లు సాధిస్తున్న ఈ జానర్లో సినిమాలు చేయడానికి యంగ్ హీరోస్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అదే బాటలో తెలుగులో సక్సెస్ సాధించిన ఓ హర్రర్ కామెడీని కోలీవుడ్‌లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ హీరో జీవి ప్రకాష్ హీరోగా నటించనున్నాడు. ప్రముఖ రచయిత కోనా వెంకట్.. కథా స్క్రీన్ ప్లే అందించటంతో పాటు తానే నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా గీతాంజలి. అంజలి, శ్రీనివాస్ రెడ్డిలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగునాట ఘనవిజయం సాధించింది. తరువాత కన్నడలో రీమేక్ అయి అక్కడ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ హిట్ సినిమా మీద తమిళ వర్గాల కన్ను పడింది. నాన్ పేయి పేసురేన్ అనే తమిళ హర్రర్ కామెడీని డైరెక్ట్ చేసిన ప్రసాద్, గీతాంజలి రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ప్రేమకథాచిత్రం రీమేక్‌లో నటించి సక్సెస్ సాధించిన జీవి, గీతాంజలితో మరోసారి అదే రిజల్ట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. -
ఈ వారం ఆ సినిమాలకే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సమ్మర్ సీజన్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. స్టార్ హీరోలతో పాటు చిన్న హీరోలు కూడా ఈ సీజన్లో తమ సినిమాలను రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలనుకుంటారు. అందుకే సమ్మర్ సీజన్లో ప్రతీవారం కనీసం ఒక్క సినిమా అయినా థియేటర్లలో సందడి చేసేది. కానీ ఈ వారం ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ కావటం లేదు. చాలా మంది హీరోలు తమ సినిమాల రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నా.. ఈ టైంలో రిలీజ్ చేయడానికి మాత్రం ఇంట్రస్ట్ చూపించటం లేదు. దీంతో ఈ వారం ఏకంగా ఆరు డబ్బింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు రానున్నాయి. వీటిలో జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న పెన్సిల్ సినిమా ఒక్కటే కొంత హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాతో పాటు విజయ్ ఆంటోని హీరోగా తమిళ్లో ఘన విజయం సాధించిన పిచ్చైకారన్ సినిమాను తెలుగులో బిచ్చగాడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. శివకార్తీకేయన్ హీరోగా తెరకెక్కిన పాత సినిమాను కేడి బిల్లా కిలాడి రంగాగా రిలీజ్ చేస్తున్నారు. వీటితో పాటు రహదారి, స్ట్రాబెర్రీ, టీనేజ్ లాంటి మరో మూడు డబ్బింగ్ సినిమాలు ఈ శుక్రవారమే థియేటర్లలోకి వస్తున్నాయి. అయితే వీటిలో చాలా సినిమాలకు థియేటర్లు కూడా పెద్దగా దొరికే అవకాశం కనిపించటం లేదు. ఇప్పటికీ సరైనోడు, సుప్రీం సినిమాల హవా కొనసాగుతుండటం. 24 సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి వసూళ్లను సాధిస్తుండటంతో ఈ డబ్బింగ్ సినిమాలకు థియేటర్ల సమస్య తప్పేలా లేదు. -
డబ్బింగ్ సినిమా ఆడియో రిలీజ్‌కి మహేష్
గతంలో మీడియాకు, పబ్లిక్ ఫంక్షన్స్‌కు చాలా దూరంగా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కాలం చాలా మారిపోయాడు. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉండటంతో పాటు, పబ్లిక్ ఫంక్షన్స్‌లో కూడా తరుచూ దర్శనమిస్తున్నాడు. తన సినిమాల ఫంక్షన్స్కే కాదు, ఇతర హీరోలను ప్రమోట్ చేయడానికీ చొరవ చూపుతున్నాడు. అయితే ఇప్పటి వరకు ఎక్కువగా బావ సుధీర్ బాబు ఆడియో ఫంక్షన్లలోనే కనిపించిన మహేష్ ఇప్పుడో డబ్బింగ్ సినిమా ఆడియో రిలీజ్ వేడుకకు హాజరుకావడానికి అంగీకరించాడట. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, జివి ప్రకాష్ హీరోగా తెరకెక్కిన పెన్సిల్ సినిమా ఆడియో రిలీజ్‌కు మహేష్ హాజరుకానున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే త్రిష లేదా నయనతార సినిమాతో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్న జివి ప్రకాష్ టాలీవుడ్లో మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకే తన సినిమా ఆడియోను మహేష్ లాంటి సూపర్ స్టార్ చేతుల మీదుగా రిలీజ్ చేయిస్తే సినిమాకు చాలా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. -
షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు
సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి.. తరువాత హీరోగా మారిన తమిళ స్టార్ జివి ప్రకాష్ కుమార్ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకున్న ఆయన స్వల్పంగా గాయపడ్డారు. చిన్నపాటి గాయాలతో జీవీ బయటపడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం జీవీ ప్రకాష్ 'కడవుల్ ఇరుక్కన్ కుమార' అనే తమిళ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్, ఆర్జే బాలజీలపై పాండిచ్చేరిలో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తమిళ దర్శకుడు రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిక్కి గల్రానీ, అవికాగోర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జివి గత సినిమాల మాధిరిగానే ఈ సినిమాను కూడా రొమాంటిక్ కామెడీ జానర్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే జివి ప్రకాష్ నటించిన 'నాకు ఇంకో పేరుంది' సినిమా టాలీవుడ్లో రిలీజ్‌కు రెడీగా ఉండగా, ఈ మూవీని కూడా తెలుగులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
ఇదో రొమాంటిక్ పెన్సిల్
సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ కథా నాయకుడిగా మరోసారి తెరపై అలరించనున్నారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన మణి నాగరాజ్ దర్శక త్వంలో ప్రముఖ పంపిణీదారుడు జి.హరి నిర్మాతగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం‘పెన్సిల్’ (తమిళ పేరు ‘మాలై నేరత్తు మయక్కమ్’). తెలుగ మ్మాయి శ్రీదివ్య ఇందులో కథానాయిక. ఎం.పురుషోత్తం సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను గౌతమ్ మీనన్ విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘కళాశాల నేపథ్యంలో సాగే చిత్రమిది. యూత్ ఫుల్‌గా సాగిపోయే ఈ కథలో ఓ ఆసక్తికరమైన అంశం ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు ప్రధానంగా యువతకి నచ్చే సినిమా ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వేసవి కానుకగా ఏప్రిల్ 14న తెలుగు, తమిళాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్. -
'నాకు ఇంకో పేరుంది' మూవీ స్టిల్స్
-
నాకు ఇంకో పేరుంది..!
సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ హీరోగా బిజీ అయిపోతున్నారు. ఆయన హీరోగా ‘నాకు ఇంకో పేరుంది’ పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఆనంది కథానాయిక. ‘రోబో-2’ నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ శ్యామ్ ఆంటోన్ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మిస్తోంది. ఇది యాక్షన్‌తో కూడిన చక్కని కుటుంబ కథాచిత్రమని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రం మొదటి ప్రచార చిత్రాన్ని బుధవారం ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్. ప్రేమ్. -
జీవీతో మరోసారి ఆనంది రొమాన్స్
యువ కథానాయకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో నటి ఆనంది మరోసారి రొమాన్స్‌కు రెడీ అవుతోంది. వీరిద్దరూ ఇంతకు ముందు త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలో నటించారు. ఆ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అంతే కాదు శ్రుతిమించిన గ్లామర్ సన్నివేశాలతో కూడుకున్న చిత్రంగా విమర్శలను బాగాను మూటగట్టుకుంది. మరో విషయం ఏమిటంటే అందులో నన్ను అశ్లీల సన్నివేశాల్లో నటింపజేశారంటూ నటి ఆనంది దర్శకుడిపై ఆరోపణలు గుప్పించింది. దీంతో ఆమెకు కోలీవుడ్‌లో అవకాశాలు రావడం కష్టమే అనే ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆనందికి మరోసారి జీవీతో రొమాన్స్ చేసే అవకాశం రావడం విశేషమే అవుతుంది. ఇప్పుడు వీరిద్దరు కలిసి నటిస్తున్న తాజా చిత్రానికి ఇనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఇది బాషా చిత్రంలో రజినీకాంతో ఒక సన్నివేశంలో చెప్పే డైలాగ్ అన్నది గమనార్హం. ఇక పోతే ఇంతకు ముందు జీవీతో డార్లింగ్ వంటి హిట్ చిత్రాన్నిచ్చిన దర్శకుడు శ్యామ్ ఆంటోన్ ఈ చిత్రానికి మోగాఫోన్ పట్టారు. రజినీకాంత్ హీరోగా ఎందిరన్-2 చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థనే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రం ఇటీవలే సెట్‌పైకి వెళ్లింది. ఇందులో నటి ఆనందికి అభినయానికి అవకాశం ఉన్న పాత్ర అట. చిత్రాన్ని అధిక భాగాన్ని పాండిచ్చేరి, చెన్నై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు. -
విజయ్ అభిమానులకు దీపావళి గిఫ్ట్
పులి సినిమాతో అభిమానులను నిరాశపరిచిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, వీలైనంత త్వరగా తన అభిమానులకు సక్సెస్ ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాడు. తన తదుపరి సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావటం కోసం శరవేగంగా షూటింగ్ చేస్తున్నాడు. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. పులి డిజాస్టర్‌తో నిరాశలో ఉన్న ఇలయ దళపతి అభిమానులకు దీపావళికి భారీ కానుక ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు విజయ్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన నెక్ట్స్ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు టీజర్‌ను కూడా రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు విజయ్ 59గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా టైటిల్‌ను కూడా అదే రోజు ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. విజయ్ సరసన సమంత, అమీజాక్సన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. సీనియర్ డైరెక్టర్ మహేంద్రన్‌తో పాటు, సత్యారాజ్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ వరకు షూటింగ్ పూర్తి చేసి 2016 సమ్మర్లో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
టాలీవుడ్లో మరో 'బ్రూస్ లీ'
తెలుగు ఇండస్ట్రీకి టైటిల్ వివాదాలు కొత్తేం కాదు. అయితే ఈసారి మాత్రం ఈ టైటిల్ వివాదం మరింత రసవత్తరంగా కనిపిస్తోంది. ఒకే టైటిల్‌తో ఇద్దరు హీరోలు తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో పోటీపడుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'బ్రూస్ లీ'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకున్నా, కలెక్షన్ల పరంగా మాత్రం మంచి వసూళ్లనే రాబడుతోంది. తెలుగులో 'బ్రూస్ లీ ద ఫైటర్' పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాను కోలీవుడ్‌లో మాత్రం 'బ్రూస్ లీ 2' పేరుతో రిలీజ్ చేశారు. అప్పటికే కోలీవుడ్ యంగ్ హీరో జివి ప్రకాష్ 'బ్రూస్ లీ' టైటిల్ రిజిస్టర్ చేసుకోవటంతో చెర్రీ తన సినిమాను 'బ్రూస్ లీ 2' పేరుతో రిలీజ్ చేశాడు. టైటిల్ విషయంలో రామ్ చరణ్ ఫాలో అయిన అదే ఫార్ములాను జివి ప్రకాష్ కూడా ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యాడట. తమిళ్లో 'బ్రూస్ లీ' పేరుతో రిలీజ్ అవుతున్న తన సినిమాను తెలుగులో 'బ్రూస్ లీ 2' పేరుతో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు జివి ప్రకాష్. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేయకపోయినా ఫిలిం ఛాంబర్ లో 'బ్రూస్ లీ 2' టైటిల్ రిజిస్టర్ కావటంతో ఇదే వార్త నిజమే అని భావిస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. రామ్ చరణ్, జివి ప్రకాష్‌లు ఒకే టైటిల్ కోసం కొట్టుకుంటుంటే, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ లిస్ట్ జాయిన్ అయ్యాడు. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్లో లేడీ ఓరియంటెడ్‌గా తెరకెక్కించిన 'బ్రూస్ లీ' సినిమా టీజర్ ను రిలీజ్ చేసిన వర్మ, ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు. ఇంతమంది బ్రూస్ లీలు ఒకేసారి వెండితెర మీద దాడిచేస్తే అభిమానులు ఎవరిని ఆదరిస్తారో మరి. -
బ్రూస్ లీ vs బ్రూస్ లీ
టాలీవుడ్లో సినిమాలకు టైటిల్ సమస్య చాలా కామన్. అయితే ఇలా వివాదాలు వచ్చిన సమయంలో పెద్దలు జోక్యం చేసుకొని సర్దుబాటు చేయటం, లేదా.. ఎవరో ఒకరు వెనక్కి తగ్గి టైటిల్ మార్చుకోవటం జరుగుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం రామ్‌చరణ్ లాంటి టాప్ స్టార్కే ఈ సమస్య ఎదురైంది. పోటీకి వచ్చింది కూడా వాళ్లూ వీళ్లూ కారు. ఎవరి మాట వినని సీతయ్య లాంటి రామ్‌గోపాల్ వర్మ కావటంతో చెర్రీ కూడా చేసేది లేక తన సినిమాను ట్యాగ్ లైన్ తో కలిపి ప్రమోట్ చేసుకుంటున్నాడు. 'గోవిందుడు అందరివాడేలే' సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న చెర్రీ.. ఇప్పుడు శ్రీను వైట్ల డైరెక్షన్ లో 'బ్రూస్ లీ' సినిమా చేశాడు. మాస్ ను అలరించే యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా పర్ఫెక్ట్ గా ఉన్న ఈ సినిమా చెర్రీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నారు. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. సినిమా ప్రమోషన్ స్పీడు పెంచే సమయానికి అదే పేరుతో మరో సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తొలి భారతీయ మార్షల్ ఆర్ట్ చిత్రం అంటూ 'బ్రూస్ లీ' టీజర్ రిలీజ్ అయ్యింది. అందమైన అమ్మాయితో మార్షల్ ఆర్ట్స్ ఫైటింగులు చేయిస్తూ.. తనదైన శైలిలో టీజ్ చేస్తున్నాడు వర్మ. దీంతో ఆలోచనలో పడ్డ రామ్ చరణ్ బ్రూస్ లీ టీం తమ సినిమాను 'బ్రూస్ లీ ది ఫైటర్' పేరుతో ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటివరకు తన ట్వీట్ లతో స్టార్ హీరోలను ఇబ్బంది పెట్టే వర్మ.. ఈ సారి ఏకంగా సినిమాతోనే ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఇలాంటివేవీ పట్టించుకొని వర్మ ఇప్పటికే టీజర్ తో పాటు వీడియో సాంగ్ ను కూడా రిలీజ్ చేశాడు. అయితే వర్మ తన సినిమా రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. చరణ్ కి ఈ సమస్య తెలుగులోనే కాదు, తమిళ ఇండస్ట్రీలో కూడా తప్పటం లేదు. జివి ప్రకాష్ హీరోగా తమిళ్ లో రూపొందుతున్న ఓ సినిమాకు 'బ్రూస్ లీ' అనే టైటిల్ ను ఇప్పటికే ఫిక్స్ చేశారు. దీంతో చేసేదేమీ లేక చరణ్ తమిళ్ వర్షన్ కు 'బ్రూస్ లీ2' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు, ఇలా ఒకే పేరుతో ఒకే సమయంలో మూడు సినిమాలు సందడి చేయటం బహుశా భారతీయ సినిమా చరిత్రలోనే ఇదే తొలిసారి. -
రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో బ్రూస్ లీ
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరో వివాదానికి తెరతీశాడు. ఇప్పటివరకు ఎలాంటి ఎనౌన్స్మెంట్ లేకపోయినా బ్రూస్లీ పేరుతో ఏకంగా ట్రైలర్ రిలీజ్ చేశాడు. మార్షల్ ఆర్ట్స్ చేస్తున్న ఓ అమ్మాయికి సంబంధించిన వీడియోతో రూపొందించిన ఈ ట్రైలర్లో ఇది తొలి భారతీయ మార్షల్ ఆర్ట్స్ చిత్రమని ప్రకటించాడు వర్మ. అయితే ఇప్పటికే బ్రూస్లీ పేరుతో తెలుగులో రామ్‌చరణ్ హీరోగా సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగా, తమిళ్లో జివి ప్రకాష్ హీరోగా మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా రేసులోకి వర్మ కూడా వచ్చి చేరాడు. అయితే వర్మ చేస్తున్న ఈ సినిమా, ఏ భాషలో చేస్తున్నాడు, ఇందులో నటీనటులు ఎవరెవరు అన్న విషయాలు మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. బ్రూస్ లీకి వీరాభిమాని అయిన వర్మ.. ట్రైలర్ లో ఆయన గొంతును కూడా అక్కడక్కడ ఉపయోగించినట్లు చెప్పాడు. తన ప్రతి సినిమాను వివాదాల తోనే ప్రమోట్ చేసుకునే వర్మ ఈ సారి తన సినిమా ప్రమోషన్ కోసం టైటిల్ వివాదాన్ని తెరమీదకు తెచ్చాడన్న వాదన వినిపిస్తుంది. మరి రామ్‌గోపాల్ వర్మ బ్రూస్ లీ పై రామ్‌చరణ్ బ్రూస్లీ యూనిట్ ఎలా స్పందించారో చూడాలి. -
కొరియర్ బాయ్ కష్టాలు
సక్సెస్ఫుల్ హీరో అనిపించుకున్న తరువాత కూడా నితిన్ కు కష్టాలు తప్పడం లేదు. చాలా కాలం తరువాత మంచి మార్కెట్ సొంతం చేసుకున్న నితిన్ తను హీరోగా నటించిన 'కొరియర్‌బాయ్ కళ్యాణ్' మూవీ రిలీజ్ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దాదాపు రెండేళ్లకు పైగా ఆలస్యం అయిన ఈ సినిమా ఫైనల్‌గా సెప్టెంబర్ 17న రిలీజ్ కు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ అయినా నితిన్ కష్టాలు మాత్రం తీరినట్టుగా కనిపించటం లేదు. గ్యాప్ దొరికింది కదా అని సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేసుకుంటే అదే సమయంలో రిలీజ్‌కు రెడీ అవుతున్న రెండు డబ్బింగ్ సినిమాలు నితిన్ మార్కెట్‌ను ఎఫెక్ట్ చేసేలా కనిపిస్తున్నాయి. నయనతార లీడ్ రోల్లో నటిస్తున్న లేడి ఓరియంటెడ్ ఫిలిం 'మయూరి'తో పాటు జీవి ప్రకాష్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ 'త్రిష లేదా నయనతార' సినిమాలు సెప్టెంబర్ 17న రిలీజ్ అవుతున్నాయి. 'డార్లింగ్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జివి ప్రకాష్ 'త్రిష లేదా నయనతార' సినిమాతో తెలుగు మార్కెట్ మీద దృష్టిపెట్టాడు. హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న నయనతార 'మయూరి' సినిమాతో భారీ ఓపెనింగ్స్ మీద కన్నేసింది. ఈ రెండు సినిమాల రిలీజ్‌లతో మరోసారి ఆలోచనలో పడ్డాడు నితిన్. -
జీవీకి నయన గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?
నయనతార ఈ పేరు చాలా కాలం నుంచీ ఒక సంచలనం. టాప్ హీరోల నుంచి అప్ కమింగ్ హీరోల వరకూ ఆమెతో జత కట్టాలని కోరుకుంటారు. నయనతార కూడా ఈ విషయంలో కాస్త ఉదార ధోరణినే అవలంభిస్తున్నారని చెప్పవచ్చు. ఇవాళ ప్రముఖ కథానాయికల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఏకైక నటి నయనతార. అలాంటి నాయకి స్టార్ హీరోలతోనే, ప్రముఖ దర్శకులతోనే, పెద్ద నిర్మాణ సంస్థల్లోనే నటిస్తారని చెప్పవచ్చు. కానీ నయనతార అలాంటి భేదాబిప్రాయాలకు తావివ్వడంలేదు. వర్ధమాన హీరోలతోనూ నటించడానికి సై అంటున్నారు. అయితే ఆమె కొన్ని కట్టుబాట్లను విధించుకున్నారు. తనకిష్టం అయితేనే ఎవరయినా ఆమెను కలవడానికి అనుమతిస్తారు. అలాగే కథ, తన పాత్ర నచ్చితేనే ఆ చిత్రంలో నటించడానికి అంగీకరిస్తారు. ప్రస్తుతం ఆ విధంగానే వర్ధమాన నటుడు ఆరితో మాయ చిత్రం యువ నటుడు విజయ్‌సేతుపతి సరసన నానుమ్ రౌడీదాన్ తరితర చిత్రాల్లో నటించడానికి సమ్మతించారు.ఆ ధైర్యంతోనే నటుడు జీవీ.ప్రకాష్‌కుమార్ సరసన ఆమెను నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నూతన దర్శకుడు ప్రసాద్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి బ్రూస్లీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో నాయకి పాత్రకు నయనతార అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.అంతే కదు ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు మొదలెట్టారు. నయనతార జీవీ సరసన నటించడానికి పచ్చజండా ఊపుతారా? అన్నదే ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. ఎందుకంటే పర్శనాలిటీ పరంగా చూస్తే జీవీకి నయనతారకు మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. కథ అందుకు తగ్గట్టుగా ఉంటే నయనతార అంగీకరించే అవకాశం ఉంటుంది. ఇక ఈ విషయం ఆమె నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
ఈ కార్తీ చెడ్డబ్బాయి అంటున్న జీవీ
చెన్నై : సినిమాల్లోనే కాదు చిత్ర పేర్లలోనూ వైవిధ్యం ఉండేలా చూసుకుంటున్నారు యువ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్. సంగీత దర్శకుడిగా అర్ధ శతానికి చేరుకున్న ఈయన ఇప్పుడు హీరోగానూ బిజీ అయ్యారు. పెన్సిల్ పట్టి కథానాయకుడిగా నటనకు శ్రీకారం చుట్టిన జీ వీ... డార్లింగ్ అంటూ తొలుత తెరపైకి వచ్చి విజయాన్ని సాధించారు. ప్రస్తుతం త్రిష ఇల్లన్న నయనతార చిత్రంలో అందాల భామలు ఆనంది, మనీషాలతో డ్యూయెట్లు పాడుతున్నారు. అదనపు ఆకర్షణగా ఆర్య, సిమ్రాన్ మెరవనున్నారు. ఆధిక్ రవిశంకర్ దర్శకుడు. నిర్మాణ కార్యక్రమా లు తుది దశకు చేరుకున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. జీవీ ప్రకాశ్‌కుమార్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈసారి కెట్ట పయడా ఇంద కార్తీ(ఈ కార్తీ చెడ్డ అబ్బాయి) అంటూ తెరపైకి రానున్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు విజయ్ శిష్యులు గుణ,శంకర్ కలిసి మెగాఫోన్ పట్టనున్నారు. జయంరవి, హన్సిక జంటగా రోమియో జూలియట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఎస్ నందగోపాల్ ఈ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. హీరోయిన్, ఇతర తారాగణం వివరాలు త్వరలోనే వెల్లడికానున్నట్లు కోడంబాక్కం వర్గాల సమాచారం. -
హీరోగా జి.వి.ప్రకాష్
టీనగర్: డార్లింగ్ చిత్రంలో హీరోగా పరిచయమయ్యారు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్. ఈ చిత్రం విజయవంతం కావడంతో హీరోగా నటించేందుకు జీవీ ప్రకాష్‌కుమార్‌కు అనేక అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘పెన్సిల్’, ‘త్రిష ఇల్లేనా నయనతార’ వంటి కొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలు ముగింపు దశలో ఉన్నాయి. కాగా, ప్రస్తుతం దర్శకుడు వెట్రిమారన్ కథలో హీరోగా నటిస్తున్నారు జీవీ ప్రకాష్‌కుమార్. ఈ చిత్రాన్ని విజయ్ వద్ద సహాయ దర్శకులుగా పని చేసిన శంకర్, గుణ కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. గోపురం ఫిలింస్ ఆధ్వర్యంలో అన్భళగన్ రూపొందిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. -
అతిథులుగా ఈ ఇద్దరూ?
అందమైన ఊహలకు ప్రతిరూపం సినిమా. ఎవరు అవునన్నా, కాదన్నా గ్లామర్ అందులో ఒక భాగం. కథ, కథనాలకు ప్రాముఖ్యత నిచ్చే స్టార్ దర్శకుడు శంకర్ కూడా భారీ విలువలతో రూపొందించిన ఐ చిత్రంలో కథానాయికి ఎమిజాక్సన్ పాత్రలో గ్లామర్‌ను గుప్పించారు. ఇక అసలు విషయానికొస్తే యువ సంగీత దర్శకుడిగా దూసుకుపోతున్న జి.వి.ప్రకాష్‌కుమార్ ఇప్పుడు కథానాయకుడిగా కూడా కాలు మోపారు. ఇటీవల విడుదలైన డార్లింగ్ పేరుకు తగ్గట్టుగానే ప్రేక్షకుల ప్రేమను పొందుతోంది. త్వరలో త్రిష ఇల్లన్నా నయనతార అంటూ సెట్‌పైకి వెళ్లనున్నారు. మొదట ఈ టైటిల్‌కు త్రిష, నయనతార అనుమతిస్తారా? అన్న సందేహం వ్యక్తమైంది. అయితే ఆ ఇద్దరు భామలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్రిష ఇల్లన్నా నయనతార చిత్ర చిత్రీకరణకు మార్గం సుగమం అయింది. నవ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో జీవీ కి జంటగా కయల్ చిత్రం ఫేమ్ ఆనంది నటించనుంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా ఒక ప్రముఖ నటి నటించనున్నారట. ముఖ్యపాత్రలో అతిలోకసుందరి శ్రీదేవి, ప్రముఖ దర్శకుడు భారతీరాజా నటించనున్నారు. దీంతోనే త్రిష ఇల్లన్నా నయనతారకు భారీతనం వచ్చేసింది. మరిన్ని హంగులు చేర్చడానికి ఏకంగా టైటిల్లో చేరిన తారలు నయనతార, త్రిషలను అతిథి పాత్రలో నటింప చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు యూనిట్ వర్గాలు అంటున్నారు. ఇప్పటికే ఈ విషయమై వారితో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఆ ఇద్దరు బ్యూటీస్ గనుక పచ్చజెండా ఊపేస్తే తిష ఇల్లన్నా నయనతార చిత్రం రేంజ్ మారిపోతుంది. ఈ చిత్రం ఈ నెలలోనే సెట్‌పైకి వెళ్లనుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి.