డబ్బింగ్ సినిమా ఆడియో రిలీజ్కి మహేష్
గతంలో మీడియాకు, పబ్లిక్ ఫంక్షన్స్కు చాలా దూరంగా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కాలం చాలా మారిపోయాడు. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉండటంతో పాటు, పబ్లిక్ ఫంక్షన్స్లో కూడా తరుచూ దర్శనమిస్తున్నాడు. తన సినిమాల ఫంక్షన్స్కే కాదు, ఇతర హీరోలను ప్రమోట్ చేయడానికీ చొరవ చూపుతున్నాడు. అయితే ఇప్పటి వరకు ఎక్కువగా బావ సుధీర్ బాబు ఆడియో ఫంక్షన్లలోనే కనిపించిన మహేష్ ఇప్పుడో డబ్బింగ్ సినిమా ఆడియో రిలీజ్ వేడుకకు హాజరుకావడానికి అంగీకరించాడట.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, జివి ప్రకాష్ హీరోగా తెరకెక్కిన పెన్సిల్ సినిమా ఆడియో రిలీజ్కు మహేష్ హాజరుకానున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇప్పటికే త్రిష లేదా నయనతార సినిమాతో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్న జివి ప్రకాష్ టాలీవుడ్లో మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకే తన సినిమా ఆడియోను మహేష్ లాంటి సూపర్ స్టార్ చేతుల మీదుగా రిలీజ్ చేయిస్తే సినిమాకు చాలా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.