pencil
-
అక్కడ వారికి పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్‌లు మాత్రమే దొరుకుతాయి!
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంపై సీబీఐ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. గతంలో కూడా ఇలాంటి దాడులే జరిగాయని, ఏమి కనగొనలేకపోయారని అన్నారు. అమెరికా ప్రసిద్ధ వార్త పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఆయన పనితీరుని ప్రశంసించి ఫ్రంట్ పేజీలో ప్రచురిస్తే... కేంద్ర ప్రభుత్వం సీబీఐ దాడులు నిర్వహిస్తుందని పెద్ద ఎత్తున్న ఆరోపణలు చేశారు. అయినా మనీష్ సిసోడియా ఇంట్లో కేవలం పుస్తకాలు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు మాత్రేమ కనిపిస్తాయని ఆప్ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు సుమారు వంద మందికి పైగా ఆప్ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని, ప్రతికేసులో ఒక్కొక్కరిగా తాము కేసు నుంచి బయటపడ్డామని రాఘవా అన్నారు. ఐతే సీబీఐ విద్య, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా తొమ్మిది నెలలుగా అమలు చేసిన కొత్త మద్యం పాలసీపై విచారణ జరుపుతోంది. ఢిల్లీలో కేంద్ర ప్రతినిధిగా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా మద్యం విక్రయించడానికి ఎవరికి అనుమతి ఇవ్వాలనే దానిపై సిసోడియా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారని సీబీఐ పేర్కొంది. అంతేకాదు లైసెన్సులతో మధ్యం విక్రయించుకునేలా ప్రైవేట్ వ్యక్తులకే అధిక సంఖ్యలో కట్టబెట్టేందుకు చూసిందని సీబీఐ ఆరోపిస్తోంది. ఐతే అవినీతిని అరికట్టేందుకు, శక్తివంతమైన మద్యం మాఫియాపై పోరాడేందుకు ఈ విధానాన్ని ఉద్దేశించినట్లు సిసోడియా చెబుతుండటం గమనార్హం. (చదవండి: సీబీఐ దాడుల మధ్య కేజ్రీవాల్ ‘మిస్డ్ కాల్’ క్యాంపెయిన్) -
‘అమ్మ కొడుతోంది.. ధరలు మండుతున్నాయ్ మోదీ జీ’.. ఆరేళ్ల పాప లేఖ
PM Narendra Modi: జీఎస్టీ (GST) బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు ఇది సామాన్యుల బిల్లని వారికి ఎంతో ఊరట కలిగిస్తుందన్నారు. దీన్ని అమలు తర్వాత విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని మాటలు చెప్పారు నేతలు. అయితే జీఎస్టీ మాత్రమే కాదు ఏది వచ్చినా ప్రజలపై బాదుడు ప్రక్రియ మాత్రం కొనసాగుతుందని తాజాగా మరోసారి నిరూపించింది కేంద్రం. ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో కొత్తగా కొన్ని నిత్యవసరాల వస్తువులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. నిన్నటి వరకు ఎలా ఉన్నా, ప్రస్తుత పన్నుల ప్రభావం, ధరల భారం దెబ్బకు పసి పిల్లలు కూడా భయపడుతున్నారు. అందుకు నిదర్శనమే ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన ఓ చిన్నారి లేఖ. ధరలు మండిపోతున్నాయని ఒకటో తరగతి చదివే ఓ బాలిక ఏకంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. పాపం ఎంత కష్టం వచ్చిందో.. ఆ చిట్టి తల్లికి! ఏముంది ఆ లేఖలో.. పేపర్, పెన్సిల్ తీసుకొని నేరుగా ప్రధాని మోదీని ఉద్దేశించి.. మీరు ఇంతలా ధరలు పెంచేస్తే ఎలా? అని ప్రశ్నించింది. "నా పేరు కృతి దూబే. నేను 1వ తరగతి చదువుతున్నాను. మోదీజీ, మీరు విపరీతంగా ధరల పెంచుతున్నారు. ఈ క్రమంలోనే నా పెన్సిల్, రబ్బరు (ఎరేజర్) కూడా ఖరీదైనవిగా మారిపోయాయి. అంతేనా నా మ్యాగీ ధర కూడా పెరిగింది. స్కూల్లో ఎవరో నా పెన్సిల్ని దొంగిలించారు. ఇప్పుడు మా అమ్మ నన్ను కొట్టింది. పెన్సిల్ అడుగుతున్నారు. నేను ఏమి చేయాలి? మీరే చెప్పండంటూ నేరుగా ప్రధానికే లేఖ పేరుతో తన బాధని అక్షరాల రూపంలో రాసి పంపింది. కాగా ఈ చిన్నారి యూపీలోని కనౌజీ జిల్లాలో చదువుకుంటోంది. ప్రస్తుతం ఈ లేఖ వైరల్‌గా మారి నెట్టింట హల్ చేస్తోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలనే మాత్రమే కాదు పసి పిల్లలను కూడా కదిలిస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చదవండి: Narendra Modi: ‘అమ్మ కొడుతోంది.. ధరలు మండుతున్నాయ్ మోదీ జీ’.. ఈ పాపకి ఎంత కష్టం వచ్చిందో! -
పెన్సిళ్ల పై మహాభారతాన్ని లిఖించింది!
కారంచేడు: సూక్ష్మకళపై మక్కువతో సీస లేఖినిలపై (పెన్సిళ్లపై) మహాభారతాన్ని లిఖించింది ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత. మహాభారతంలోని 18 పర్వాలను.. 700 శ్లోకాలను సంస్కృత భాషలో అవలీలగా లిఖించగలిగింది. ఇందుకు ఆమె 810 పెన్సిళ్లను ఉపయోగించింది. వాటిపై 67,230 అక్షరాలను, 7,238 పదాలను లిఖించింది. ఇందుకోసం పెన్సిళ్లను ముందుగా బద్దగా చీల్చి అందులోని లిడ్ 2 మిల్లీమీటర్ల మందం ఉండేలా చూసుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకోవడం లక్ష్యమని మహిత చెబుతోంది. బియ్యపు గింజలపై సూక్ష్మ కళాకృతులు మహిత మొదట్లో బియ్యపు గింజలపై సూక్ష్మ కళాకృతులను చెక్కడం ప్రారంభించింది. గింజలపై జాతీయ జెండా, తాళం, బాణం, వినాయకుడు, కొంగ, మినప్పప్పుపైన కూడా వినాయకుడు వంటి ఆకృతులను చక్కగా చెక్కి శభాష్ అనిపించుకుంది. ఆ తరువాత పెన్సిల్‌పై మహాభారతాన్ని చెక్కాలనే ఆలోచనకు పదునుపెట్టింది. సూక్ష్మ కళలను ప్రోత్సహించాలి కళలలో సూక్ష్మకళ ఒకటి. అధికారులు, ప్రభుత్వం, ప్రజలు ఇలాంటి సూక్ష్మకళను ప్రోత్సహించాలి. నాలాంటి వారెందరో ఉన్నా.. ప్రతిభను కనబర్చుకునే వీలు లేక ఇలాంటి కళలు మరుగున పడుతున్నాయి. ఆర్థికం, శిక్షణ పరంగా ఈ కళలను ప్రోత్సహించాలి. – అన్నం మహిత (చదవండి: సరికొత్త శకం) -
కర్నూలు: ‘సార్ వీడు నా పెన్సిల్ తీసుకున్నాడు.. కేసు పెట్టండి’
సాక్షి, కర్నూలు: బాల్యం అంటే ఎన్నో మధురానుభూతుల సమ్మేళనం. కల్మషం లేని మనసు.. బోసి నవ్వులు, దోస్తనాలు, ఆటలు, బాల్యంలో చేసే ఆ అల్లరి.. అబ్బో చెప్పుకుంటూ పోతే ఇప్పట్లో ఆగదు. అయితే ఈ తరం పిల్లల బాల్యంలో ఇవన్ని కనుమరుగవుతున్నాయి. ఇక 10 ఏళ్ల క్రితం.. పిల్లలను భయపెట్టాలంటే తల్లిదండ్రులు వారి స్కూల్ టీచర్ల పేరో, పోలీసుల పేరో చెప్పి.. బెదిరించేవారు. మరీ ముఖ్యంగా ఖాకీల పేరు చెపితే.. గజ్జున వణికేవారు అప్పటి పిల్లలు. మరీ ఈ కాలం పిల్లలు.. అబ్బే వారికి పోలీసులంటే ఏమాత్రం భయంలేదు. పైగా తమకు సమస్య వస్తే.. పోలీసులే తీరుస్తారని కూడా తెలుసు. అందుకే డైరెక్ట్‌గా పోలీసు స్టేషన్‌కే వెళ్లి.. వారితో ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈ తరహ సంఘటన ఒకటి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ చిన్నారి.. తోటి విద్యార్థి తన పెన్సిల్, పుస్తకాలు తీసుకుంటున్నాడు.. రోజు ఇలానే చేస్తున్నాడని.. పోలీసులకు తెలిపాడు. అతని మీద కేసు పెట్టమని కోరాడు. చివరకు పోలీసులు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి పంపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. (చదవండి: Video: మరికొన్ని గంటల్లో పెళ్లి.. వధువు చేసిన పనికి అంతా షాక్!) చిన్నారి హన్మంతు తోటి విద్యార్థి మీద ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. సదరు విద్యార్థి తన పెన్సిల్, పుస్తకాలు తీసుకుంటున్నాడని.. రోజు ఇలానే చేస్తున్నాడని హన్మంతు పోలీసులకు తెలిపాడు. విద్యార్థి మీద కేసు పెట్టాలని పోలీసులను కోరాడు. (చదవండి: నీ కడుపుకోత తీర్చలేం.. ‘జై హింద్ మాజీ’) చిన్నారి వాదన విన్న పోలీసులు కేసు పెట్టడం మంచి పద్దతి కాదని.. ఇద్దరు స్నేహంగా ఉండాలని హన్మంతుకు సూచించారు. అలానే వేరే వారి పెన్సిళ్లు, పుస్తకాలు తీసుకోకూడదని విద్యార్థికి చెప్పి.. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి పంపారు. చదవండి: రేయ్.. ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి వచ్చార్రా? -
భవిష్యత్‌ను పెన్సిల్‌తో డిజైన్ చేసుకోవాలి.. ఎందుకంటే?
‘పెన్సిల్ మరియు కల ఈ రెండు మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళతాయి’ అన్నాడు పెన్సిల్‌ను అమితంగా అభిమానించే కళాకారుడు. ‘భవిష్యత్‌ను పెన్సిల్‌తో డిజైన్ చేసుకోవాలి. ఎందుకంటే మార్పుచేర్పులకు అవకాశం ఉంటుంది’ అన్నాడు తాత్వికుడు. ఎవరు ఏ కోణంలో తమ ‘ఫేవరెట్’ చేసుకున్నా, పెన్సిల్ ప్రేమికులకు కొదవ లేదు. ‘హైపర్ రియలిస్టిక్ పెన్సిల్ డ్రాయింగ్’పై ఇప్పుడు యూత్ మనసు పారేసుకుంటోంది... జేడీ హిల్బెరీ సంగీతకారుడు కావాలనుకొని పెన్సిల్ చిత్రకారుడయ్యారు. అయితేనేం... ఈ ఆర్ట్‌లో జేడీకి వచ్చిన పేరు ఇంతా అంతా కాదు. ఆయన వెబ్సైట్లోకి వెళితే అద్భుతమైన ఎన్నో పెన్సిల్ చిత్రాలు పలకరిస్తాయి. ‘లెర్న్ మై టెక్నిక్’ అంటూ వీడియో ట్యుటోరియల్స్ విజయవంతంగా నడుపుతున్నారు జేడీ. ‘పెన్సిల్ అంటే స్కూల్ రోజులు గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు అద్భుతమైన కళారూపాలు మదిలో మెదులుతున్నాయి’ అంటున్నాడు 20 సంవత్సరాల స్పానిష్ స్టూడెంట్ నికోలస్. ‘లెర్న్ మై టెక్నిక్’ను ఫాలో అవుతూ తనదైన సొంతశైలిని సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నాడు నికోలస్. హైపర్ రియలిస్టిక్ పెన్సిల్ డ్రాయింగ్ కళలో ఇండోనేషియన్ ఆర్టిస్ట్ వెరి ఆప్రియాంటో ఉద్దండ పిండం. మాట్లాడే భాష అర్థం కాకపోయినా ఆయన టాలెంట్ ఏమిటో నెట్డాట్ టాక్ షోలో చూడవచ్చు. మాట్లాడుతూనే కెమెరాతో ఫోటో తీసినట్టు పెన్సిల్‌తో ‘ఆహా ’అనిపించే బొమ్మ గీస్తాడు. కాలేజీ విద్యార్థులు ఎంత శ్రద్ధగా వింటున్నారో! (ఆయన మాటలు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌గా వస్తే మనలాంటి వాళ్లకు ఎంత ప్రయోజనమో కదా!) బ్రిటన్ పెన్సిల్ ఆర్టిస్ట్ కెల్విన్ వోకఫోర్కు ముఖాలు మాత్రమే గీయడం అంటే ఇష్టం. దీనికి ముఖ్య కారణం... ‘ప్రతి ముఖం తనదైన భావోద్వేగాలను, చరిత్రను చెప్పకనే చెబుతుంది’ అంటారు కెల్విన్. ఇక సెల్ఫ్–టాట్ సౌత్ ఆఫ్రికన్ ఆర్టిస్ట్ జోనో డ్రై ఫోటోరియలిజం, సర్రియలిజంలను మిక్స్ చేసి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నైజీరియన్ ఆర్టిస్ట్ ఎ.స్టాన్లీ ఎగ్బెన్గ్యూ ఆరు సంవత్సరాల వయసు నుంచే పెన్సిల్ పట్టాడు. 28 సంవత్సరాల స్టాన్లీ ఇంజనీర్, యాక్టివిస్ట్, ఫోటోగ్రాఫర్, ఎంటర్ప్రెన్యూర్. అయితే ఆయనకు హైపర్ రియలిస్టిక్ పెన్సిల్ ఆర్టిస్ట్‌గానే ఎక్కువ గుర్తింపు ఉంది. ‘మనలోని సృజనను బొమ్మగా మార్చే శక్తి పెన్సిల్ కు ఉంది’ అంటాడు స్టాన్లీ. ఇక మన దేశంలో వైభవ్ తివారి... మొదలైన వాళ్లు ‘వాహ్వా! పెన్సిల్ డ్రాయింగ్’ అనిపిస్తున్నారు. యూత్‌ను తెగ ఆకట్టుకుంటున్నారు. మరి మీరెప్పుడు! మీరు సైతం... స్కెచింగ్ డ్రాయింగ్ ఫోటో ఎడిటర్ ‘పెన్సిల్ ఫోటో స్కెచ్’ యాప్‌తో మీరు కూడా ముచ్చటగా ఆర్టిస్ట్‌గా మారవచ్చు. మీ ఫోటో లేదా మీ ఫ్రెండ్స్ ఫోటోలను ఆకట్టుకునే పెన్సిల్ స్కెచ్‌లుగా మార్చవచ్చు. పెన్సిల్ స్కెచ్‌తో పాటు లైట్ స్కెచ్, కార్టూన్ ఆర్ట్, కలర్ డ్రాయింగ్...మొదలైన ఎఫెక్ట్లు ఇందులో ఉన్నాయి. ఇలా ఎందుకు? రియల్‌గానే నేర్చుకుందాం... అని డిసైడైతే డ్రాయింగ్ రియలిస్టిక్ పెన్సిల్ పోట్రాయిట్స్ స్టెప్ బై స్టెప్(జస్టిన్ మాస్)... మొదలైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక మీ ఇష్టం! చదవండి: పద్మశ్రీ పంకజాక్షి మనుమరాలు ఏదో చేయాలి.. ఏం చేద్దాం.. ‘కొబ్బరి చిప్పలను ఏం చేస్తున్నారు’ -
పెన్సిల్ ముల్లుపై షిర్డీసాయిబాబా
గురుపౌర్ణమి పర్వదినం సందర్భంగా ఒక కళాకారుడు పెన్సిల్ ముల్లుపై షిర్డీసాయిబాబాను చెక్కాడు. కొత్తపేట మండలం అవిడి గ్రామానికి చెందిన లంక వీరభద్రం అనే కళాకారుడు పెయింటింగ్స్ వేస్తాడు, సుద్దముక్కలు, సబ్బులపై బొమ్మలు చెక్కుతాడు. ఇటీవలే పెన్సిల్ ముల్లుపై వరల్డ్‌కప్ తదితర చిత్రాలను కూడా తీర్చిదిద్దాడు. మంగళవారం గురుపౌర్ణమి సందర్భంగా పెన్సిల్ ముల్లుపై సాయిబాబా రూపాన్ని చెక్కి భక్తిని చాటుకున్నాడు. -
‘పెన్సిల్’ వెనక పెద్ద చరిత్రే ఉంది!
సాక్షి, న్యూఢిల్లీ :ఐదు వేల సంవత్సరాల మానవ జాతి వికాసంలో ‘పెన్సిల్’ నిర్వహించిన పాత్ర చిన్నదేమీ కాదు. ఆదిమానవుడు బొమ్మలు గీయడానికి మొట్టమొదట సీసంను, రంగు రాళ్లను ఉపయోగిస్తే నాగరికత నేర్చుకున్న మానవుడు రాయడానికి, గీయడానికి సీసంను ఉపయోగించారు. ఆధునిక మానవుడు గ్రాఫైట్‌తో చేసిన పెన్సిల్‌ను ఉపయోగిస్తున్నారు. పెన్సిల్ లేకపోతే మన ఆధునిక విద్యా వికాసమే లేదంటే అతిశయోక్తి కాదు. పెన్సిల్ అనే పదం ‘పిన్సిల్’ అనే ఫ్రెంచ్ పదం, ‘పిన్సిలస్’ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఆ పదాలకు అర్థం ‘చిన్న కుంచె’ అని. ఒకప్పుడు చిత్రకారులు ఒంటె తోక వెంట్రుకలను ఉపయోగించి పెయింటింగ్ కుంచెలను తయారు చేసేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ‘పెన్సిల్’కు ఆ పేరు పెట్టారు. నెపోలియన్ ఆర్మీలో పనిచేసిన నికోలస్ జాక్వస్ కాంటే అనే శాస్త్రవేత్త 1795లో ఆధునిక పెన్సిల్‌ను కనుగొన్నారు. ఆయన నీళ్లు, బంక మట్టి, గ్రాఫైట్ ఖనిజాన్ని ఉపయోగించి బట్టీలో 1900 డిగ్రీల ఫారిన్‌హీట్ వద్ద వేడిచేసి పెన్సిళ్లను తయారు చేశారు. ఇరువైపుల బంకమట్టి బద్దల మధ్య గ్రాఫైట్ బద్దను ఘనీభవించి వాటిని తయారు చేసే వాళ్లు. అవసరాలనుబట్టి నాలుగు మూలలు, గుడ్రిటి పెన్సిళ్లను కూడా తయారు చేశారు. కాలక్రమంలో కర్ర పెన్సిళ్లు వచ్చాయి. పెన్సిల్లో ఉపయోగించే గ్రాఫైట్ ఖనిజ నిల్వలను మొట్టమొదట 16వ శతాబ్దంలో యూరప్‌లో కనుగొన్నారు. కార్బన్‌కు రూపాంతరమైన ఈ గ్రాఫైట్ గనులను ఇంగ్లీష్ లేక్ డిస్టిక్ట్‌లోని కెస్విక్ వద్ద 1564లో కనుగొన్నట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అందుకని కెస్విక్ పరిసర ప్రాంతాల్లో 19వ శతాబ్దంలో పెన్సిల్ పరిశ్రమ విస్తరించింది. 1832లో ‘బ్యాంక్స్, సన్ అండ్ కంపెనీ’ పేరిట మొట్టమొదటి పెన్సిల్ పరిశ్రమ ఏర్పాటయింది. అదే కాలక్రమంలో ‘డెర్వంట్ కంబర్లాండ్ పెన్సిల్ కంపెనీ’గా రూపాంతరం చెందింది. కంబర్లాండ్ పెన్సిళ్లను ప్రపంచంలోనే నాణ్యమైన పెన్సిళ్లుగా పరిగణిస్తారు. కారణం అక్కడ దొరికే గ్రాఫైట్‌కు దుమ్మూ దూళి ఉండదు. మధ్యయుగంలో మధ్యయుగంలో మానవులు బొమ్మలు గీసేందుకు సీసం, రంగురాళ్లను ఉపయోగించేవారు. చివరి గోథెక్ లేదా యూరప్ పునరత్థానం (14 నుంచి 17వ శతాబ్దం)కాలంలో మానవులు బొమ్మలు గీసేందుకు రాసేందుకు మూడు రకాల సీసం రాళ్లును ఉపయోగించేవారు. ప్రపంచ ప్రసిద్ధ కళాకారులు జాన్ వాన్ ఐక్, లియోనార్డో డావిన్చీ, ఆల్బ్రెక్ట్ డ్యూరర్, రాఫేల్లు ఈ సీసం రాళ్లను ఉపయోగించి బొమ్మలు గీశారు. సీసంతో రాస్తే వెండి రంగులో కనిపిస్తుంది. వాటిని ఇప్పటి సిరాతో సులభంగానే చెరిపేయవచ్చు. చెరిపేసినా సులభంగా చెరిగిపోకుండా ఉండేందుకు ఆ సీసం రాళ్ల నుంచి ‘సిల్వర్ పాయింట్’ను కళాకారులు కనుగొన్నారు. ఆటవికుల సున్నపు రాయి నుంచి ఇప్పటి ఆధునిక పెన్సిల్ వరకు దాదాపు దాదాపు వంద రూపాలు సంతరించుకుందని ప్రస్తుతం లండన్‌లో బ్రిటీష్ లైబ్రరీ మ్యూజియం రాత చరిత్ర మీద నిర్వహిస్తోన్న ఓ ఎగ్జిబిషన్ తెలియజేస్తోంది. -
పెన్సిల్ గుచ్చి కన్ను పోగొట్టాడు..!
ముంబై : బడి పిల్లల మధ్య మొదలైన గలాట ఓ విద్యార్థి కంటి చూపు పోయేందుకు కారణమైంది. ఓ విద్యార్థి కంట్లో పెన్సిల్‌తో గుచ్చడంతో అతని కుడి కన్ను పూర్తిగా గుడ్డిదైపోయింది. ఈ ఘటన ఘట్కోపర్లో గతేడాది జూలై 21న జరిగింది. అయితే, చికిత్స చేస్తే తమ కుమారుడి (9) కన్ను బాగవుతుందని ఆశించిన ఆ కుటుంబానికి నిరాశే ఎదురైంది. ఇప్పటివరకు రెండు లక్షల రూపాయలు ఖర్చయ్యాయని, అయినా ఫలితం లేకుండా పోయిందని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు కారణమైన విద్యార్థి కుటుంబం నుంచి నష్టపరిహారం ఇప్పించడని పోలీసులను ఆశ్రయించారు. పెన్సిల్‌తో పెద్ద ప్రమాదమేమీ లేదని చెప్పి స్కూల్ యాజమాన్యం నమ్మబలికిందని... ఇప్పుడు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నష్టపరిహారం ఇప్పించకపోగా.. రూ.3 వేలు ఫీజు కట్టలేదని తమ పిల్లాడి మార్కుల మెమోను నిలుపుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడు సర్జరీలు చేయించామని తమ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని వాపోయారు. పెన్సిల్ లెడ్ చిన్నారి కంటిలోనే ఉండిపోవడంతో చూపు తిరిగిరావడం అసాధ్యమని వైద్యులు అంటున్నారని తెలిపారు. కాగా, ఈ ఆరోపణల్ని స్కూల్ యాజమాన్యం తోసిపుచ్చింది. పిల్లాడి కంట్లో దాడి చేసిందెవరో ఖచ్చితంగా తెలియదన్నారు. ఘటన జరిగినప్పుడు అక్కడ టీచర్లెవరూ లేదని ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఇక బాధితుని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నట్టుగా తాము ఎవరినుంచీ నష్టపరిహారం ఇప్పించలేమని స్పష్టం చేశారు. కావాలంటే.. స్థానికంగా ఉండే నాయకుల సహకారంతో పిల్లాడి కంటి చికిత్సకు అవసరమైన సాయం అందించేలా కృషి చేస్తామని అన్నారు. గతేడాది కాలంగా బాధిత విద్యార్థి ఫీజు తనే చెల్లిస్తున్నానని వెల్లడించారు. బాధితుని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేసి నిజానిజాలు కనగొంటామని పంత్నగర్ సీనియర్ ఇన్స్పెక్టర్ రోహిణీ కాలే తెలిపారు. -
విద్యార్థిని కంటిలో పెన్సిల్ ముక్క
రాజేంద్రనగర్: తోటి విద్యార్థి దాడిలో ఓ బాలిక తీవ్రంగా గాయపడింది. పెన్సిల్ ముక్క కంటిలోపలికి వెళ్లడంతో వైద్యులు విజయవంతంగా తొలగించారు. అయితే ఆ విద్యార్థి కంటిచూపు కోల్పోయే పరిస్థితి ఉందని వైద్యులు చెప్పడంతో బాధిత కూతురు తల్లి ఆందోళన చేపట్టింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. బుద్వేల్ ప్రాంతానికి చెందిన విజయ్‌కుమార్, సుహాసిని దంపతుల కూతురు సుప్రియ (7). ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని కృషి హైస్కూల్లో పాప నాల్గో తరగతి చదువుతోంది. మంగళవారం మధ్యాహ్నం ‘‘మీ పాపకు గాయమైంది వచ్చి తీసుకెళ్లండి’ అని పాఠశాల నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే పాఠశాలకు వెళ్లగా సుప్రియ ఏడుస్తూ కూర్చుంది. కంటికి ఉన్న చేతిరుమాలు తీసి చూడగా తీవ్రంగా గాయమైంది. తన తోటి విద్యార్థి పెన్సిల్‌తో కంటిలో పొడిచాడని తల్లికి పాప చెప్పింది. వెంటనే ఆమె హైదరాబాద్‌లోని ఎల్.వీ.ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించింది. అక్కడ వైద్య సేవలు ఆలస్యమవడంతో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఎక్స్‌రే తీయగా కంటి లోపల పెన్సిల్ ముక్కను గుర్తించారు. వెంటనే వైద్యులు ఆపరేషన్ చేసి ఆ పెన్సిల్ ముక్క తీసేశారు. అయినా కంటి లోపల రక్తం పేరుకుపోవడంతో ఇన్ఫెక్షన్ అయ్యిందని, చూపుపోయే స్థితిలో ఉందని వైద్యులు చెప్పారు. దీంతో తల్లి బోరున విలపించింది. ఈ విషయమై బుధవారం పాఠశాలకు వచ్చి ప్రిన్సిపల్‌తో పాటు నిర్వాహకులు ప్రకాశ్‌రావు, భాస్కర్, టీచర్ జమునను ప్రశ్నిస్తే తమకేమి తెలియదని బదులిచ్చారు. సుప్రియనే కళ్లల్లో పెన్సిల్‌తో గాయం చేసుకుందని చెప్పారని తెలిపారు. పాఠశాలలోని సీసీ కెమెరాలను చూపించాలని కోరినా తనపై దౌర్జన్యం చేశారని బాధిత తల్లి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించింది. తన కూతురుకు న్యాయం చేయాలని కోరుతోంది. -
నేడు ‘పెన్సిల్’ పోర్టల్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: జాతీయ బాల కార్మిక నిర్మూలన వ్యవస్థ ప్రాజెక్టును మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పెన్సిల్ (ప్లాట్‌ఫాం ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్) వెబ్ పోర్టల్‌ను హోం మంత్రి రాజ్‌నాథ్ మంగళవారం ఆవిష్కరిస్తారు. -
పెన్సిల్ ములికితో వీరజవాన్లకు స్థూపం
చైతన్యపురి: కశ్మీర్లో పాకిస్థాన్ ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన వీరజవాన్లకు నివాళులు అర్పించేందుకు దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ఓ సూక్ష్మ కళాకారుడు వినూత్నంగా పెన్సిల్ మొలికిపై అమరవీరుల స్థూపాన్ని రూపొందించాడు. రాచకొండ రాజు అనే స్వర్ణకారుడు రెండు గంటలు కష్టపడి పెన్సిల్ మొలికిపై ఈ స్థూపాన్ని రూపొందించినట్లు ‘సాక్షి’కి తెలిపాడు. -
పెన్సిల్ ములికిపై పార్వతీపుత్రుడు
పెద్దాపురం : గణపతి నవరాత్రులను పురస్కరించుకుని స్వర్ణకారుడు తాళాబత్తుల సాయి పెన్సిల్ ములికిపై వినాయక ఆకృతిని చెక్కారు. ఇందుకు మెుత్తం 3 గంటల 30 నిమిషాల 30 సెకన్ల సమయంలో ఆరు రోజుల వ్యవధిలో ఈ ఆకృతిని చెక్కినట్టు సాయి తెలిపారు. నైపుణ్యంతో గణనాథుని ఆకృతిని మలచిన ఆయనను పట్టణంలోని పలువురు ప్రముఖులు,కళాభిమానులు అభినందించారు. -
విధికే ‘కన్ను’కుట్టింది!
* చూపు కోల్పోయిన ఆరేళ్ల బాలుడు * పెన్సిల్ తగిలి ఎడమ కన్ను.. టీచర్ బెత్తం తగిలి కుడి కన్ను * ఏపీలోని ఒంగోలులో ఘటన ఒంగోలు: ఆరేళ్ల వయసులోనే ఆ బాలునిపై విధికి కన్ను కుట్టింది. తోటిపిల్లలతో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పెన్సిల్ తగిలి గతంలో ఒక కంటి చూపు పోగా, ఇప్పుడు స్కూల్ టీచర్ ఆగ్రహానికి మరో కంటి చూపునూ కోల్పోయి అంధుడిగా మారాడు. తన బిడ్డకు చూపు తెప్పించేందుకు ఆదుకోవాలంటూ ఆ బాలుని తండ్రి జిల్లా కలెక్టర్‌ను కలసి విన్నవించాడు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో గురువారం చోటుచే సుకుంది. కంభం మండలం రావిపాడుకు చెందిన కాళ్ల గోపాల్ కుమారుడు మోహనరంగ(6) స్థానిక ఆల్ఫా పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. గతంలో పాఠశాలలో ఆడుకుంటూ ఉండగా తోటి విద్యార్థి చేతిలో పెన్సిల్ పొరపాటున రంగ ఎడమ కంటిలో గుచ్చుకుంది. దీంతో ఆ కంటిచూపు పోయింది. తాజాగా ఈ నెల 13న పాఠశాలలో బాబుపై ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు బెత్తం ప్రయోగించింది. అది కుడికంటిపై తగిలిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. వెంటనే హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరిశీలించి చూపు వచ్చే అవకాశం లేదని, అయినప్పటికీఈ నెల 28న మరోమారు వైద్య పరీక్షలకు తీసుకురావాలని సూచించారంటూ కలెక్టర్ సుజాతశర్మకు బాలుడి తండ్రి విన్నవించుకున్నాడు. చిన్నారిని చూసిన కలెక్టర్ దిగ్భ్రాంతి చెందారు. ఆ టీచర్ ఎవరు, యాజమాన్యం ఏం చేస్తోంది అంటూ ఆగ్రహించారు. వెంటనే సంబంధిత వ్యవహారంపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని డీఈవోను ఆదేశించారు. -
ఈ వారం ఆ సినిమాలకే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సమ్మర్ సీజన్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. స్టార్ హీరోలతో పాటు చిన్న హీరోలు కూడా ఈ సీజన్లో తమ సినిమాలను రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలనుకుంటారు. అందుకే సమ్మర్ సీజన్లో ప్రతీవారం కనీసం ఒక్క సినిమా అయినా థియేటర్లలో సందడి చేసేది. కానీ ఈ వారం ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ కావటం లేదు. చాలా మంది హీరోలు తమ సినిమాల రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నా.. ఈ టైంలో రిలీజ్ చేయడానికి మాత్రం ఇంట్రస్ట్ చూపించటం లేదు. దీంతో ఈ వారం ఏకంగా ఆరు డబ్బింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు రానున్నాయి. వీటిలో జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న పెన్సిల్ సినిమా ఒక్కటే కొంత హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాతో పాటు విజయ్ ఆంటోని హీరోగా తమిళ్లో ఘన విజయం సాధించిన పిచ్చైకారన్ సినిమాను తెలుగులో బిచ్చగాడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. శివకార్తీకేయన్ హీరోగా తెరకెక్కిన పాత సినిమాను కేడి బిల్లా కిలాడి రంగాగా రిలీజ్ చేస్తున్నారు. వీటితో పాటు రహదారి, స్ట్రాబెర్రీ, టీనేజ్ లాంటి మరో మూడు డబ్బింగ్ సినిమాలు ఈ శుక్రవారమే థియేటర్లలోకి వస్తున్నాయి. అయితే వీటిలో చాలా సినిమాలకు థియేటర్లు కూడా పెద్దగా దొరికే అవకాశం కనిపించటం లేదు. ఇప్పటికీ సరైనోడు, సుప్రీం సినిమాల హవా కొనసాగుతుండటం. 24 సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి వసూళ్లను సాధిస్తుండటంతో ఈ డబ్బింగ్ సినిమాలకు థియేటర్ల సమస్య తప్పేలా లేదు. -
డబ్బింగ్ సినిమా ఆడియో రిలీజ్‌కి మహేష్
గతంలో మీడియాకు, పబ్లిక్ ఫంక్షన్స్‌కు చాలా దూరంగా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కాలం చాలా మారిపోయాడు. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉండటంతో పాటు, పబ్లిక్ ఫంక్షన్స్‌లో కూడా తరుచూ దర్శనమిస్తున్నాడు. తన సినిమాల ఫంక్షన్స్కే కాదు, ఇతర హీరోలను ప్రమోట్ చేయడానికీ చొరవ చూపుతున్నాడు. అయితే ఇప్పటి వరకు ఎక్కువగా బావ సుధీర్ బాబు ఆడియో ఫంక్షన్లలోనే కనిపించిన మహేష్ ఇప్పుడో డబ్బింగ్ సినిమా ఆడియో రిలీజ్ వేడుకకు హాజరుకావడానికి అంగీకరించాడట. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, జివి ప్రకాష్ హీరోగా తెరకెక్కిన పెన్సిల్ సినిమా ఆడియో రిలీజ్‌కు మహేష్ హాజరుకానున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే త్రిష లేదా నయనతార సినిమాతో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్న జివి ప్రకాష్ టాలీవుడ్లో మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకే తన సినిమా ఆడియోను మహేష్ లాంటి సూపర్ స్టార్ చేతుల మీదుగా రిలీజ్ చేయిస్తే సినిమాకు చాలా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. -
ఇదో రొమాంటిక్ పెన్సిల్
సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ కథా నాయకుడిగా మరోసారి తెరపై అలరించనున్నారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన మణి నాగరాజ్ దర్శక త్వంలో ప్రముఖ పంపిణీదారుడు జి.హరి నిర్మాతగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం‘పెన్సిల్’ (తమిళ పేరు ‘మాలై నేరత్తు మయక్కమ్’). తెలుగ మ్మాయి శ్రీదివ్య ఇందులో కథానాయిక. ఎం.పురుషోత్తం సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను గౌతమ్ మీనన్ విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘కళాశాల నేపథ్యంలో సాగే చిత్రమిది. యూత్ ఫుల్‌గా సాగిపోయే ఈ కథలో ఓ ఆసక్తికరమైన అంశం ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు ప్రధానంగా యువతకి నచ్చే సినిమా ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వేసవి కానుకగా ఏప్రిల్ 14న తెలుగు, తమిళాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్. -
పళ్ల మధ్య పెన్సిల్‌తో తలనొప్పి మాయం!
పరిపరి శోధన టెన్షన్ పెరిగితే చాలామందికి తలనొప్పి మొదలవుతుంది. తలనొప్పి తగ్గడానికి మందులు, మాత్రలు ఎడాపెడా వాడేస్తుంటారు. అయితే, ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే తలనొప్పికి పెద్దగా మందులు వాడాల్సిన పనిలేదని, చిన్న చిట్కా పాటిస్తే చాలని బ్రిటన్‌కు చెందిన అనెస్థీషియా నిపుణురాలు డాక్టర్ జేన్ లియోనార్డ్ చెబుతున్నారు. ఆమె చెబుతున్న చిట్కా చాలా సింపుల్. పళ్ల మధ్య పెన్సిల్‌లాంటి వస్తువేదైనా కరచి పట్టుకుని కాసేపు ఉంటే చాలు, తలనొప్పి మటుమాయమవుతుందని అంటున్నారు. పళ్ల మధ్య పెన్సిల్ వంటి వస్తువేదైనా కరచి పట్టుకున్నప్పుడు దవడ కండరాలు, కణతల వద్ద ఉండే కండరాలు రిలాక్స్ అవుతాయని, నెమ్మదిగా తలనొప్పి కూడా తగ్గుతుందని ఆమె వివరిస్తున్నారు. -
చిన్నారి నవల సూపర్‌హిట్టు
పట్టుమని పదేళ్ల వయసైనా లేని పిల్లలు ఆవు వ్యాసం రాయడానికే ఆపసోపాలు పడుతుంటారు. అలాంటిది ఇంగ్లాండ్‌లో తొమ్మిదేళ్ల చిన్నారి ఏకంగా ఒక నవల రాసి పారేసింది. అయితే, పదమూడేళ్ల వయసులో ఆమె రచనా వ్యాసంగాన్ని మానేసింది. చిరుత కూకటి నాడు 1890లో రాసిన ఆ నవలను ఆమె చాలాకాలం మర్చిపోయింది కూడా. వయసొచ్చాక ఆమెకు పెళ్లయింది. ఇక సంసార సాగరంలో పడింది. ఆమె తల్లి 1919లో మరణించడంతో పుట్టింటికి వచ్చింది. అంత్యక్రియలన్నీ అయ్యాక చెల్లెళ్లతో కలసి ఇంట్లోని వస్తువులన్నీ చూస్తుంటే, అప్పుడెప్పుడు తన చిన్నతనంలో పెన్సిల్‌తో రాసిన నవల కనిపించింది. తిరిగి ఆ నవల చదివింది. ఒక స్నేహితురాలికి కూడా చూపించింది. నవల అద్భుతంగా ఉందంటూ స్నేహితురాలు భరోసా ఇవ్వడంతో ప్రచురణకర్తలను సంప్రదించింది. విక్టోరియన్ కాలం నాటి కులీన వ్యవస్థను కళ్లకు కడుతూ రాసిన ఆ నవల ‘ది యంగ్ విజిటర్స్’. ఆ రచయిత్రి డైసీ ఆష్‌ఫోర్డ్. ఆ నవలకు ప్రముఖ రచయిత జె.ఎం.బ్యారీ ముందుమాట రాశాడు. మార్కెట్లోకి విడుదల కావడమే తడవుగా హాట్‌కేకుల్లా అమ్ముడుపోయింది. ఆ నవలపై వచ్చిన రాయల్టీతో రచయిత్రి డైసీ ఆష్‌ఫోర్డ్ ఒక వ్యవసాయ క్షేత్రాన్ని కొనుక్కుని, అందులోనే నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. -
ప్రాణాలు పోశారు
-
హీరోగా జి.వి.ప్రకాష్
టీనగర్: డార్లింగ్ చిత్రంలో హీరోగా పరిచయమయ్యారు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్. ఈ చిత్రం విజయవంతం కావడంతో హీరోగా నటించేందుకు జీవీ ప్రకాష్‌కుమార్‌కు అనేక అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘పెన్సిల్’, ‘త్రిష ఇల్లేనా నయనతార’ వంటి కొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలు ముగింపు దశలో ఉన్నాయి. కాగా, ప్రస్తుతం దర్శకుడు వెట్రిమారన్ కథలో హీరోగా నటిస్తున్నారు జీవీ ప్రకాష్‌కుమార్. ఈ చిత్రాన్ని విజయ్ వద్ద సహాయ దర్శకులుగా పని చేసిన శంకర్, గుణ కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. గోపురం ఫిలింస్ ఆధ్వర్యంలో అన్భళగన్ రూపొందిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. -
పెన్సిల్ మేకర్...
ఆఫీసు అన్నాక కాగితాల వాడకం తప్పదు... వాడిన తరువాత ఆ కాగితాలను చెత్తబుట్టలోకి చేర్చకా తప్పదు. అయితే ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరముంటే కాగితాలను అలా చెత్తబుట్టలోకి చేర్చే అవసరముండకపోవచ్చు. ఎందుకంటే... ఈ పరికరం వాడేసిన కాగితాలను కాస్తా అందమైన పెన్సిళ్లమాదిరిగా మార్చేస్తుంది మరి!. పెన్సిల్‌లోని గ్రాఫైట్ ముందుగానే ఆ పరికరంలో ఏర్పాటు చేసి ఉంటారు. కాగితాన్ని పైన అందిస్తే సరి... గాలిచొరబడని రీతిలో చక్కగా గ్రాఫైట్ చుట్టూ చుట్టేస్తుంది. ఒకవైపున మనం వాడుకునేందుకు వీలుగా పెన్సిల్‌ను షార్పెన్ చేసి ఇచ్చేస్తుంది. -
సూక్ష్మ శివలింగం
మండపేట పట్టణానికి చెందిన కళాకారుడు అండలూరి వీరవెంకటసత్యనారాయణ పెన్సిల్ ముల్లుపై శివలింగాన్ని రూపొందించారు. కార్తికమాసం సందర్భంగా దీనిని తయారు చేసినట్టు ఆయన తెలిపారు. 0.5 ఎంఎం లిడ్పెన్సిల్ ముల్లును శివలింగం ఆకారంలో తయారు చేశారు. మిల్లీగ్రామ్ బంగారాన్ని ఉపయోగించి పానుమట్టాన్ని రూపొందించారు. ఇది తయారుచేయడానికి గంట సమయం పట్టిందని సత్యనారాయణ తెలిపారు. గతంలో ఆయన అనేక సూక్ష్మ రూపాలను తయారుచేసిన విషయం తెలిసిందే. - మండపేట, తూర్పుగోదావరి జిల్లా. -
జపాన్‌లో పెన్సిల్ చిత్రీకరణ
పెన్సిల్ కోసం యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్ జపాన్ వెళుతున్నారు. ఆయనతోపాటు యువ నటి శ్రీ దివ్య కూడా బయలుదేరుతోంది. ఈ యువ జంట అక్కడ డ్యూయెట్స్ పాడేసుకుని చెన్నైకి తిరిగి రానున్నారు. అసలు విషయానికొస్తే అతి పిన్న వయసులోనే సంగీత దర్శకుడైన వాడిగా పేరు తెచ్చుకున్న జి.వి.ప్రకాష్‌కుమార్ హీరోగా అవతారమెత్తి నటిస్తున్న తొలి చిత్రం పెన్సిల్. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే మరో రెండు చిత్రాల్లో హీరో అయిపోయిన జి.వి. తన తొలి చిత్రం పెన్సిల్ కోసం హీరోయిన్ శ్రీ దివ్యతో కలిసి యువళ గీతం పాడుకోవడానికి జపాన్ వెళ్లనున్నారు. వీటిలో ఒక రొమాన్స్ గీతం కూడా ఉందట. దీని గురించి జి.వి.ప్రకాష్‌కుమార్ తెలుపుతూ ఆదివారం రాత్రి బయలుదేరి టోక్యో చేరనున్నట్లు చెప్పారు. అక్కడి సుందర నగర అందాలను పెన్సిల్ చిత్రంలోని పాటల కోసం చిత్రీకరించనున్నట్లు తెలిపారు. చిత్ర షూటింగ్ ఇప్పటికే 80శాతం పూర్తి అయినట్లు వెల్లడించారు. పాటల చిత్రీకరణ పూర్తి అయితే ఇక చిన్న చిన్న ప్యాచ్ వర్కు మాత్రమే మిగిలి ఉంటుందన్నారు. దర్శకుడు మణి నాగరాజ్ చిత్రాన్ని చాలా లావిష్‌గా తెరకెక్కిస్తున్నారని చిత్ర విజయంపై చాలా నమ్మకం ఉందన్నారు. పెన్సిల్ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. మరో పక్క జి.వి. సంగీత దర్శకుడిగా 50వ చిత్రానికి రెడీ అవుతున్నారు. రాజారాణి చిత్రం ఫేమ్ అట్లీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు చెప్పకపోయినా ఈ చిత్రంలో ఇళయదళపతి నటించనున్నట్లు సమాచారం. -
గాజులతో పెన్సిల్ స్టాండ్
తయారు చేసి చూడండి పాత గాజులతో అందమైన పెన్సిల్ స్టాండు ఎలా చేయొచ్చో తెలుసుకుందామా! కావలసినవి: పాతగాజులు (దాదాపు ఒకే సైజులో ఉండేవి), జిగురు, దళసరి అట్ట, కత్తెర, పెన్సిల్. ఎలా చేయాలి? ఒక పెద్ద గాజును తీసుకొని దళసరి అట్టపై ఉంచండి. దానిచుట్టూ పెన్సిల్‌తో గీత గీయండి. గీతగీసిన మేరకు కత్తెరతో అట్టను కత్తిరించాలి. ఇప్పుడు ఆ గుండ్రని అట్టముక్కను ఆధారంగా చేసుకొని ఒక గాజును జిగురుతో అతికించండి. దానిపై మరొకటి... దానిపై ఇంకొకటి... అలా వాటి ఎత్తు నాలుగైదు అంగుళాలు వచ్చేవరకు గాజుల్ని వరుసగా ఒకదానిపై ఒకటి అతికిస్తూ పోవాలి. జిగురు ఆరే వరకూ గాజులు కదపకుండా చూసుకోవాలి. ఆపై పెన్సిల్ స్టాండ్ రెడీ. అందమైన డిజైన్లు ఉన్న గాజులు తీసుకుంటే మీ స్టాండు మరింత ఆకర్షణీయంగా తయారవుతుంది. ఒకవేళ గాజులు మరీ పాతగా అనిపిస్తే మీకు నచ్చిన రంగుల్లో పెయింట్ వేసి ఆరాక రంగురంగుల చమ్కీలు, పూసలు, చిన్నచిన్న అద్దాలు అతికించవచ్చు లేదా పెయింట్‌తోనే డిజైన్లూ వేసుకొవచ్చు. మీకు నచ్చిందా? -
పెన్సిల్, పుస్తకం ఇవ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య
పుస్తకాలు, పెన్సిల్ లాంటి చిన్న చిన్న వస్తువులు కొనేందుకు కూడా వెంటనే డబ్బులు ఇవ్వలేని తల్లిదండ్రుల నిస్సహాయత.. ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. రోజుకూలీగా పనిచేసే తండ్రి బిజోయ్ నాయక్.. ఇటీవల పక్షవాతం రావడంతో పనిలోకి వెళ్లలేకపోగా, మందుల ఖర్చు మరింతగా ఆ కుటుంబంపై పడింది. కుటుంబానికి నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లడానికి తల్లి ఈశ్వరి నాలుగు ఇళ్లలో పనిమనిషిగా చేస్తోంది. ఒడిషాలోని గంజాం జిల్లా ఆస్కా పట్టణానికి చెందిన ఈ పేద కుటుంబంలోని పెద్ద కుమార్తె జయంతి (14) ఇటీవలే ఏడో తరగతిలోకి వచ్చింది. తనకు పెన్సిళ్లు, పుస్తకాలు, ఇతర స్టేషనరీ సామగ్రి కొనివ్వాలని తల్లిదండ్రులను అడిగింది. అయితే, తమవద్ద ప్రస్తుతం అంత డబ్బు లేదని, కొన్నాళ్లు ఆగితే కొనిస్తామని వారు చెప్పారు. దీంతో ఏమీ లేకుండా స్కూలుకు వెళ్లడం అవమానంగా భావించిన ఆ చిన్నారి.. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇరుగుపొరుగు వారు ఆమె కేకలు విని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే 50 శాతానికి పైగా కాలిన గాయాలైన ఆమె.. చికిత్స పొందుతూ మరణించింది.