హీరోయిన్‌కు ముద్దివ్వొద్దు! | dont put kiss to heroine | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌కు ముద్దివ్వొద్దు!

Published Sat, Oct 26 2013 1:29 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM

హీరోయిన్‌కు ముద్దివ్వొద్దు!

హీరోయిన్‌కు ముద్దివ్వొద్దు!

 ‘ముద్దిమ్మంది ఓ చామంతి... మనసిమ్మంది ఓ పూబంతి...’ ఇలాంటి పాటల్లో ఆడటం, పాడటం, ముద్దులిచ్చి పుచ్చుకోవడం హీరో హీరోయిన్లకు సర్వసాధారణమైన విషయం. అయితే అలాంటి ముద్దులకు తానొప్పుకోనంటోంది యువ గాయని. ఇంతకీ ఈమె కేంటి అభ్యంతరం అంటారా? ఎవరీమె అనే ప్రశ్న రేకెత్తుతోందా? ఈ గాయని పేరు సైంధవి. ఈమె నిబంధనలు పెడుతోంది తన భర్త యువ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్‌కుమార్‌కు. గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట ఇటీవలే వివాహ బంధంతో ఒకటయ్యారు. కాగా సంగీత దర్శకుడిగా బిజీగా వున్న జి.వి.ప్రకాష్ కుమార్ తాజాగా హీరోగా అవతారమెత్తుతున్నారు.
 
 ‘పెన్సిల్’ అనే చిత్రంలో నటించనున్నారు. ఈయనకు జంటగా శ్రీ దివ్య నటించనున్నారు. అసలు విషయం ఏమిటంటే హీరోగా నటించడం వరకూ ఓకే. హీరోయిన్‌తో డ్యూయెట్లు పాడడం వరకూ కూడా ఓకే. అయితే ముద్దు సన్నివేశాలకు మాత్రం ‘నో’... అని సైంధవి ఆయనకు నిబంధనలు విధించారట. ఈ విషయాన్ని జి.వి.ప్రకాష్ కుమారే స్వయంగా చెప్పడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement