g v prakash
-
స్కూల్ డేస్ గుర్తొస్తాయి!
సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ దృష్టంతా ఇప్పుడు యాక్టింగ్‌పై ఉంది. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘ప్రేమకథా చిత్రమ్’ తమిళ రీమేక్ ‘డార్లింగ్’ ద్వారా జీవీ హీరోగా మారారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ ఉత్సాహంతో ‘త్రిష ఇల్లేనా నయనతార’లో హీరోగా నటించారు. ఇప్పుడు జీవీ నటించిన మూడో చిత్రం ‘పెన్సిల్’ ఈ నెల 13న విడుదల కానుంది. తెలుగమ్మాయి శ్రీదివ్య ఇందులో కథానాయిక. ఎం.పురుషోత్తం సమర్పణలో మణి నాగరాజ్ దర్శకత్వంలో జి.హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘పాఠశాల జీవితాన్ని, చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసే చిత్రం ఇది. పాటలకు, ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది’’ అని జీవీ అన్నారు. ‘‘డిస్ట్రిబ్యూటర్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసిన నేను తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రం ఇది. జీవీ ప్రకాశ్‌గారు హీరోగా నటించడంతో పాటు మంచి పాటలిచ్చారు’’ అని నిర్మాత హరి చెప్పారు. ఈ చిత్రానికి నిర్మాణ నిర్వహణ: వడ్డీ రామానుజం. -
జి వి ప్రకాశ్‌కు జోడీగా అమిజాక్సన్
-
హీరోయిన్‌కు ముద్దివ్వొద్దు!
‘ముద్దిమ్మంది ఓ చామంతి... మనసిమ్మంది ఓ పూబంతి...’ ఇలాంటి పాటల్లో ఆడటం, పాడటం, ముద్దులిచ్చి పుచ్చుకోవడం హీరో హీరోయిన్లకు సర్వసాధారణమైన విషయం. అయితే అలాంటి ముద్దులకు తానొప్పుకోనంటోంది యువ గాయని. ఇంతకీ ఈమె కేంటి అభ్యంతరం అంటారా? ఎవరీమె అనే ప్రశ్న రేకెత్తుతోందా? ఈ గాయని పేరు సైంధవి. ఈమె నిబంధనలు పెడుతోంది తన భర్త యువ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్‌కుమార్‌కు. గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట ఇటీవలే వివాహ బంధంతో ఒకటయ్యారు. కాగా సంగీత దర్శకుడిగా బిజీగా వున్న జి.వి.ప్రకాష్ కుమార్ తాజాగా హీరోగా అవతారమెత్తుతున్నారు. ‘పెన్సిల్’ అనే చిత్రంలో నటించనున్నారు. ఈయనకు జంటగా శ్రీ దివ్య నటించనున్నారు. అసలు విషయం ఏమిటంటే హీరోగా నటించడం వరకూ ఓకే. హీరోయిన్‌తో డ్యూయెట్లు పాడడం వరకూ కూడా ఓకే. అయితే ముద్దు సన్నివేశాలకు మాత్రం ‘నో’... అని సైంధవి ఆయనకు నిబంధనలు విధించారట. ఈ విషయాన్ని జి.వి.ప్రకాష్ కుమారే స్వయంగా చెప్పడం విశేషం.