
పెన్సిల్ ములికితో వీరజవాన్లకు స్థూపం
చైతన్యపురి: కశ్మీర్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన వీరజవాన్లకు నివాళులు అర్పించేందుకు దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ఓ సూక్ష్మ కళాకారుడు వినూత్నంగా పెన్సిల్ మొలికిపై అమరవీరుల స్థూపాన్ని రూపొందించాడు. రాచకొండ రాజు అనే స్వర్ణకారుడు రెండు గంటలు కష్టపడి పెన్సిల్ మొలికిపై ఈ స్థూపాన్ని రూపొందించినట్లు ‘సాక్షి’కి తెలిపాడు.