Dilsukhnagar
-
దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి పూజలు (ఫోటోలు)
-
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది
-
దిల్ సుఖ్ నగర్ బాబా ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
-
చెత్తబుట్టలో వేసేందుకు యత్నం.. చిన్నారిని రక్షించిన ట్రాఫిక్ హోంగార్డు
సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తాగిన మైకంలో ఓ యాచకురాలు ఏడాదిలోపు వయసున్న చిన్నారిని కోణార్క్ థియేటర్ ముందున్న చెత్తబుట్టలో వేసేందుకు ప్రయత్నించింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నహోంగార్డు రామకృష్ణకు సమాచారం చేరవేశారు. విషయం తెలుసుకున్న హోంగార్డు.. వెంటనే పరుగులు తీసి చిన్నారిని రక్షించాడు. చిన్నారికి సపర్యలు చేసి తల్లి ఒడికి చేర్చాడు. హోం గార్డు రామకృష్ణ చూపిన మానవత్వానికి పనికి అక్కడున్న స్థానికులు అభినందనలు తెలియజేశారు. -
తాగిన మత్తులో చిన్నారిని చెత్తబుట్టలో వేయబోయిన యాచకురాలు
-
సీపీఐ సీనియర్ నేత వెంకటేశ్వర్లు కన్నుమూత
దిల్సుఖ్నగర్: సీపీఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సహాయ కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు ఆదివారం రాత్రి మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడు తున్న ఆయన ఆర్కేపురం డివిజన్ గ్రీన్‌హిల్స్‌కాలనీలో తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లాలో జన్మించిన వెంకటేశ్వర్లు విద్యార్థి, యువజనోద్యమాల్లో కీలకపాత్రతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కొంతకాలంగా క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య సరళ న్యాయమూర్తిగా పనిచేసి, పదవీ విరమణ చేశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ తదితరులు సోమవారం ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ ఉత్తమ నాయకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. చైత్యన్యపురి కాలనీలోని వీవీనగర్‌లో ఉన్న స్మశానవాటికలో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. -
కొత్త కోణం: అమ్మాయిల కోసమే భూదేవి హత్య!
సాక్షి, హైదరాబాద్: నగరంలో సరూర్‌నగర్ తల్లి, దత్తపుత్రులు హత్యల కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. దత్తత తీసుకుని పెంచిన తల్లి భూదేవిని.. సాయి తేజ చంపడానికి స్నేహితుడు శివ పురిగొల్పడమే కారణమని తేలింది. మానసిక స్థితి సరిగాలేని సాయిని.. పెంపుడు తల్లి హత్యకు పురిగొల్పింది శివ అనే విషయం తాజాగా వెలుగు చూసింది. అమ్మాయిల కోసమే భూదేవిని శివ హతమార్చినట్లు వెల్లడైంది. అమ్మాయిలకు ఖర్చు పెట్టడానికే భూదేవి హత్యకు సాయిని పురిగొల్పిన శివ.. ఆపై నగదు, నగల దోపిడీకి పాల్పడ్డాడు. ఆపై హత్య విషయం ఎక్కడ బయటపడుతోందనని చివరకు స్నేహితుడైన సాయిని కూడా చంపేశాడు శివ. కాళ్లు, చేతులు కట్టేసి.. తలపై రాయితో కొట్టి.. ముఖమంతా ఛిద్రం చేసి చంపాడు. కానీ భయపడి పోలీసులకు లొంగిపోయాడు. ఇక ఈ హత్యలకు డ్రైవర్ నరసింహ కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు. భూదేవిని నలుగురు నిందితులు కలిసి చంపినట్లు ధృవీకరించారు పోలీసులు. అయితే సాయి తేజని చంపింది శివ కుమార్ ఒక్కడే వెల్లడించారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: తల్లిని దారుణంగా చంపి.. అంతే కిరాతకంగా హతమై.. -
తెలంగాణ పంచాయతీరాజ్ గ్రూప్ ఏర్పాటు చేయాలి
దిల్సుఖ్నగర్: ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ (ఐపీజీ) తరహాలోనె తెలంగాణ పంచాయతీరాజ్ గ్రూపును ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. పార్లమెంట్ స్పీకర్ అధ్యక్షుడుగా ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ 1949లో ఏర్పాటు అయిందని, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఈ గ్రూప్‌కు ఆద్యులని తెలిపారు. బీజేఆర్ భవన్లో స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు కలిసి తెలంగాణ పంచాయతీరాజ్ గ్రూప్‌ను చట్టబద్ధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. పంచాయతీరాజ్ చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులపై ఎప్పటికప్పుడు సమీక్షలు, అప్పుడప్పుడు సెమినార్లు, అంతర్‌జిల్లాల స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపి, ఆయా అంశాలను ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఎమ్మేల్సీల దృష్టికి తీసుకొని రావాలన్నారు. ప్రజాప్రతినిధులు సోషల్ ఇంజనీర్లని, సమాజ నిర్మాణంలో వారి పాత్ర కీలకమని అభిప్రాయపడ్డారు. -
ఎల్బి నగర్ ఏసీపీ చేతుల మీదుగా అశ్విని ప్రొడక్షన్స్ ప్రారంభం
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం వస్తున్న సినిమాలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయని, మంచి చిత్రాల నిర్మాణం జరిగితే పరిశ్రమ కళకళలాడుతుందని ఎల్.బి.నగర్ ఏసీపీ పి. శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్లో జరిగిన సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉత్తమ చిత్రాల నిర్మాణమే ధ్యేయంగా సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత సిరిసాల యాదగిరి మాట్లాడుతూ .. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉత్తమ విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రాలను నిర్మించాలన్న లక్ష్యంతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టామని, ఆ దిశగా చక్కటి చిత్రాలను నిర్మించి మంచి పేరు తెచ్చుకుంటామన్న గట్టి నమ్మకం ఉందని అన్నారు. ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కుటుంబంతో కలిసి హాయిగా సినిమాలు చూసే పరిస్థితి కొరవడుతుందని, మంచి సినిమాలను హృదయానికి హత్తుకునేలా నిర్మించినప్పుడే చిత్ర పరిశ్రమ పచ్చగా వర్ధిల్లుతుందని అన్నారు. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్న తేడా లేకుండా వినోదమే ప్రధానంగా చిత్రాలను నిర్మించి పరిశ్రమలో సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ అంటే ఉత్తమ ప్రొడక్షన్స్ అనేలా పేరు తెచ్చుకుంటామన్నారు. ఈ సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించబోయే తొలి చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడిస్తామని, ఇప్పటివరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వెలుగు చూడని కథలే మా బ్యానర్లో పురుడుపోసుకుంటాయని అన్నారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో చిత్ర దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి, గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్ధం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, ప్రముఖ నిర్మాత డా. సి.వి రత్నకుమార్, దర్శకుడు ముప్పిడి సత్యం, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ పక్షాన కిరణ్, వంశీగౌడ్, విష్ణు, నటుడు ఆకెళ్ళ గోపాల కృష్ణ, హయత్ నగర్ కో - ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ ముత్యాల రాజా శేఖర్, పొనుగోటి కరుణాకర్ రావు తదితరులు హాజరయ్యారు. -
బ్లేడ్‌తో చేయి కోసుకుని, తల పగులగొట్టుకొని, కప్పు పెంకులు నమిలి..
సాక్షి, మలక్‌పేట: వైట్నర్ మత్తులో ఓ యువకుడు కరెంట్ స్తంభం ఎక్కి హల్చల్ చేశాడు. విజయవాడ జాతీయ రహదారిపై దిల్సుఖ్నగర్ సీఎంఆర్ షోరూమ్ ఎదురుగా ఈ ఘటన జరిగింది. మలక్‌పేట పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సలీంనగర్ ఆఫ్జల్‌నగర్‌కు చెందిన ఇర్ఫాన్ (28) పాతనేరస్తుడు. మలక్‌పేట పీఎస్ పరిధిలో 2016లో చోరీ చేసి జైలుకెళ్లి వచ్చాడు. ఇలా ఉండగా, సోమవారం ఉదయం తనను గుర్తు తెలియని వ్యక్తు కొట్టారంటూ హంగామా చేశాడు. వైట్నర్ మత్తులో ఉన్న అతగాడు బ్లేడ్‌తో చేతులు కోసుకుని, కట్టెతో తల పగులగొట్టుకున్నాడు. చాయ్ కప్పు పెంకులు నమిలాడు. నన్ను ఎందుకు కొట్టారు..ఏం తప్పు చేశానంటూ వీరంగం చేశాడు. అంతటితో ఆగకుండా లోకల్ బస్టాండ్‌పైకి ఎక్కాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలోనే ఇర్ఫాన్ బస్టాండ్ పక్కనే ఉన్న కరెంట్ స్తంభం ఎక్కాడు. అక్కడి నుంచి దూకేస్తానని అరిశాడు. పోలీసులు వెంటనే విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం అందించి సరఫరాను నిలిపివేయించారు. అతడికి నచ్చజెప్పి కరెంట్ స్తంభం మీది నుంచి కిందికి దింపి స్టేషన్‌కు తరలించారు. మానస్థిక స్థితి సరిగా లేదని గ్రహించిన పోలీసులు అతడి కుటుంబసభ్యులను పిలిపించి ఆసుపత్రికి తరలించారు. -
దిల్‌షుఖ్‌నగర్ థియేటర్లోకి భారీగా వరద నీరు, 40 వాహనాలు ధ్వంసం
సాక్షి, హైదరాబాద్: రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం జలమయైంది. నగరంలో ఎక్కడ చూసిన రోడ్లన్ని నీట మునిగాయి. దీంతో ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక దిల్‌షుఖ్‌నగర్‌లోని ప్రముఖ శివగంగ థియేటర్లోకి భారీగా వరద నీరు చేరడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. అలాగే ఈ భారీ వర్షానికి థియేటర్ పక్కన ఉన్న గోడ కూలిపోవడంతో అక్కడ పార్క్ చేసిన 40 వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే ఆ గోడను పక్కనే ఉన్న నాళ పక్కనే కట్డడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. నాళ పక్కనే గోడ కట్టడంతో అది కూలడంతో నాళ దెబ్బతిందని, దీంతో భారీగా నీరు రోడ్లపైకి, థియేటర్లోకి, ఇళ్లలోకి చేరినట్లు స్థానికులు పేర్కొన్నారు. -
కరోనా బాధితులకు ఉచితంగా ఇంటికే భోజనం
దిల్సుఖ్నగర్: సేవయే తమ ధ్యేయమని ఆర్కేపురం డివిజన్ వాసవీ కాలనీలో నివాసం ఉండే తమ్మనాస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తమ్మన శ్రీధర్, లక్ష్మి సుజాతలు పేర్కొంటున్నారు. ఈ రోజుల్లో కరోనా వచ్చిందని తెలిస్తే రోగుల బంధువుల కూడా దగ్గరికి రావడం లేదు. అలాంటిది కరోనా బాధితుల బాధను చూసి వారి ఆకలిని తీరుస్తున్నారు. అది కూడా ఉచితంగా అందిస్తున్నారు. తమ్మనాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా బారినపడి ఇంట్లో చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఆహారం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. భోజనం లేక ఇబ్బంది పడే వారికి లక్ష్మీ సుజాతే స్వయంగా వంట చేసి ఆహారం అందజేస్తున్నారు. ప్రసుత్తం ఆర్కేపురం వాసవి కాలనీలో 35 మంది బాధితులకు ఉచితంగా రోజుకు రెండు పూటలా భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు తమకు సెల్ 9441128021లో ఫోన్ చేసి వివరాలు తెలిపితే ఇంటికే భోజనం పంపిస్తామని పేర్కొన్నారు. ( చదవండి: మాస్కే మంత్రం.. టీకానే దివ్య ఔషధం..! ) -
దిల్సుఖ్నగర్ ఏటీఎం లూటీ, మేనేజర్‌కు జైలు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: కెనరా బ్యాంక్ డబ్బులను స్వాహ చేసిన మేనేజర్‌కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ ఆరో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బుధవారం తీర్పునిచ్చింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహాలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం... కెనరా బ్యాంక్ దిల్సుఖ్నగర్ బ్రాంచ్‌లో మేనేజర్‌గా వి.భాస్కర్‌రావు 2007 మార్చి–1 నుంచి మే–31 వరకు పని చేశారు. అదే బ్యాంక్‌లో ఏటీఎం నిర్వహిస్తున్నారు. సదరు ఏటీఎం సైతం మేనేజర్ భాస్కర్‌రావు ఆధీనంలో ఉండేది. అప్పుడు ఏటీఎంలో మూడు నెలలుగా రూ.10,34,500 నగదు తక్కువగా చూపించింది. విషయాన్ని గమనించిన బ్యాంక్ ఉన్నతాధికారులు డిపార్టుమెంటల్ ఎంక్వైరీతో పాటు సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్రాంచ్ మేనేజర్ భాస్కర్‌రావు నిధులు నిర్వర్తించే సమయంలో మోసపూరితంగా డబ్బులు స్వాహా చేశారని తేలడంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో అభియోగ పత్రాలను నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ పై విధంగా తీర్పునిచ్చారు. -
శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకుల ధర్నా
సాక్షి, హైదరాబాద్ : దిల్సుఖ్నగర్ శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకులు మంగళవారం ధర్నా చేపట్టారు. 11 నెలలుగా జీతాలు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో క్లాస్ రూమ్‌లోకి వెళ్లి ఇద్దరు అధ్యాపకులు స్వీయ నిర్బంధం అయ్యారు. విధుల్లోకి తీసుకుని జీతాలు చెల్లించాలని అధ్యాపకులు డిమాండ్ చేశారు. చదవండి: నాకు తెలియకుండా షాప్ పెడ్తార్రా..! వెలుగులోకి నారాయణ, శ్రీచైతన్య కాలేజీల ఫీజుల బాగోతం -
హైదరాబాద్ యువకుడి ప్రపంచ రికార్డు!
సాక్షి, హైదరాబాద్: దేశంకాని దేశాలకు అతడు సందేశాలను తీసుకెళ్తున్నాడు. వాటిని పర్వతమంత ఎత్తున సమున్నతంగా నిలుపుతున్నాడు. ఈ ఫీట్ సాధించడానికి పర్వతారోహణపర్వం కొనసాగిస్తున్నాడు తుకారాం. అత్యంత పిన్నవయసులోనే అత్యున్నత రికార్డులు సృష్టిస్తున్నాడు. 7 ఖండాల్లోని 7 ఎత్తయిన పర్వతాల్లో నాలుగింటిని 10 నెలల్లో అధిరోహించి వరల్డ్ రికార్డు స్థాపించాడు. మరిన్ని శిఖర సమాన విజయాలను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు ఈ నగర యువకుడు. దక్షిణాది నుంచి మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించినవారిలో పిన్నవయస్కుడు తుకారాం. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కళాశాలలో పొలిటికల్ సైన్స్‌లో పోస్టుగాడ్యుయేట్ చేస్తున్న తుకారాంది వ్యవసాయ కుటుంబం. తాజాగా కేంద్రమంత్రిని కలసి అభినందనలు అందుకున్న తుకారాం ‘సాక్షి’తో తన మనోభావాలు పంచుకున్నాడిలా... ఆయన మాటల్లోనే.. ధైర్యే సాహసే విజయం... రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కెళ్లపల్లి తండా స్వస్థలం. ట్రైబల్ వెల్ఫే ర్ రెసిడెన్షియల్ స్కూల్లో 10 వతరగతి వరకూ చదువుకున్నా. చిన్నప్పటి నుంచి సాహసోపేతమైన ఆటలంటే నాకు ఇష్టం. ఏదో సాధించాలి, ఏదో చేయాలనే కోరిక ఉండేది. కష్టం గురించి ఆలోచించేవాడిని కాదు. ఒంటికాలు మీద కబడ్డీ ఆడే లంగ్డీ ఆటలో జాతీయస్థాయి ప్లేయర్‌ని. కర్రతో జిమ్నాస్టిక్స్ మల్లకంబ్ కూడా జాతీయ స్థాయిలో ఆడాను. ఇవన్నీ స్కూల్ స్థాయిలోనే చేశా. కాలేజీలో చదువుతుండగా ఎన్సీసీ శిక్షణలో భాగంగా ఉత్తర కాశీలో మౌంట్ ఇంజనీరింగ్ చేస్తూ 3 బంగారు పతకాలు సాధించాను. అప్పటి నుంచి పర్వతారోహణ మీదే దృష్టి పెట్టాను. సామాజిక ప్రయోజనం ఉండాలని... ప్రతి సాహసం నాకు లక్ష్యసిద్ధిగా మిగిలిపోకూడదని, దానికి సామాజిక ప్రయోజనం కూడా ఉండాలనే ఆలోచనతో విభిన్న సందేశాలను, సందర్భాలను జో డిస్తూ పర్వతారోహణను మరింత అర్థవంతంగా మార్చాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తూ హిమాచల్‌ప్రదేశ్‌లోని నర్బు అనే పర్వతం అధిరోహించాక, తెలంగాణ రాష్ట్ర పతాకాన్ని అక్కడ ఎగరవేశాను. బతుకమ్మలను ప్రతిష్టించి ఇక్కడి సంప్రదాయాలను తెలియజెప్పాను. రోజువారీగా ఖాదీ వాడాలని పిలిపిస్తూ గంగోత్రిలోని మౌంట్ రుడుగారియా పర్వతారోహణను పూర్తి చేశాను. దేశభక్తిని చాటి చెబుతూ లడ్డాఖ్‌లోని మౌంట్ స్టాకన్గిరిపైకి 19 అడుగుల జాతీయ పతాకాన్ని తీసుకెళ్లి ఎగరవేశాను. పంచభూతాలను కాపాడుకోవాలంటూ సందేశమిస్తూ అత్యంత క్లిష్టమైన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాను. మరికొన్ని సందేశాలివీ... ► ‘హెల్మెట్ మన కోసం కాదు.. మన కుటుంబం కోసం’అనే సందేశంతో ఆఫ్రికాలోని కిలిమంజారో ఎక్కాను. ► డ్రగ్స్ నిషేధించాలంటూ రష్యాలోని ఎల్బ్రస్ పర్వతారోహణ పూర్తి చేశాను. ► దేశ సర్వసత్తాక సార్వభౌమత్వానికి సూచికగా జనవరి 26న సౌత్ అమెరికాలోని మౌంట్ అకాంజాగువా అధిరోహించాను. ► ఆస్ట్రేలియా దేశంలో కార్చిచ్చు కారణంగా ఏర్పడుతున్న బుష్ ఫైర్స్ తదనంతర సమస్యలు, బాధితుల కోసం ఆస్ట్రేలియాలోని కొజియాస్కో పర్వతాన్ని ఎక్కాను. దీనిని ఆస్ట్రేలియా మంత్రి అభినందించారు. ప్రోత్సాహకాలూ.. పురస్కారాలూ... కేవలం 10 నెలల్లో 4 విభిన్న ఖండాలలో శిఖరాలను అధిరోహించిన పిన్న వయస్కుడిగా ప్రపంచరికార్డు స్థాపించాను. రాష్ట్రపతి చేతుల మీదుగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణలో బెస్ట్ స్పోర్ట్స్‌మెన్‌షిప్ అవార్డు 2 సార్లు అందుకున్నా. జమ్మూ, కశ్మీర్ ప్రభుత్వం నుంచి తొలి దక్షిణాది బెస్ట్ ఇన్ టెక్నిక్ అవార్డ్ అందుకున్నా. పర్వతారోహణ అనేది ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చేసేది మాత్రమే కాదు అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది కూడా. నాకు పురస్కారాలు మాత్రమే కాకుండా ఆర్థికంగా పలువురు స్పాన్సరర్లు లభించారు. ప్రస్తుతం చినజీయర్స్వామిసహా మరికొందరు నన్ను స్పాన్సర్ చేస్తున్నారు. ఇక నార్త్ అమెరికాలోని మౌంట్ డెనాలీ, అంటార్కిటికాలోని మౌంట్ విమ్సన్లు అధిరోహించాలనే లక్ష్యాలు మిగిలాయి. పర్వతారోహణవైపు యువతను బాగా ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను. అందుకు ప్రభుత్వ సహకారం కూడా కావాలి. -
సరూర్ నగర్ చెరువు నిండి కాలనీల్లో వరద
-
దిల్‌షుక్‌నగర్‌లో అర్థరాత్రి ఘోర ప్రమాదం
-
దిల్సుఖ్నగర్ బాంబ్ పేలుళ్లకు నేటితో ఏడేళ్లు
-
ప్రయాణికుడి పరేషాన్.. బస్ కండక్టర్ నిజాయితీ
సాక్షి, హైదరాబాద్ : టీఎస్ఆర్టీసీ దిల్సుఖ్నగర్ డిపోలో విధులు నిర్వహిస్తున్న ప్రవీణ అనే మహిళా కండక్టర్ నిజాయితీ చాటుకున్నారు. బస్‌లో ఓ ప్రయాణికుడు మర్చిపోయిన రూ.20 వేల నగదు బ్యాగ్‌ను మలక్‌పేట పోలీసుల సాయంతో తిరిగి అతనికి అప్పగించారు. శనివారం చోటుచేసుకున్న ఈ సంఘటనలో.. బస్సు సికింద్రాబాద్ నుంచి సరూర్‌నగర్ వెళ్తుండగా.. ఓ ప్రయాణికుడు స్టేజీ వచ్చిందనే తొందరలో క్యాష్ బ్యాగ్‌ను సీట్లోనో వదిలేసి బస్ దిగిపోయాడు. కండక్టర్ ప్రవీణకు ఆ బ్యాగ్ కనిపించడంతో దానిని తెరచి చూశారు. దాంట్లో రూ.20 వేల నగదు ఉండటంతో మలక్‌పేట పోలీసులకు సమాచారం ఇచ్చి.. వారి సాయంతో బాధితునికి బ్యాగ్ అందించారు. ప్రవీణ నిజాయితీపై ఆర్టీసీ అధికారులు, పోలీసులు ఆమెను అభినందించారు. పోయిందనుకున్న సొమ్ము తిరిగి దక్కడంతో ప్రయాణికుడు కండక్టర్ ప్రవీణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. -
బస్ కండక్టర్‌ను అభినందించిన పోలీసులు
-
కొత్తపేటలో బస్ టవర్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు హబ్‌లపై దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని 21.78 ఎకరాల్లో ఉన్న కొత్తపేట పండ్ల మార్కెట్.. ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ (ఐఎస్బీటీ) నిర్మాణానికి అనువైనదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.150 కోట్ల వ్యయంతో 11 అంతస్తులతో మూడు టవర్లు నిర్మించడం ద్వారా ప్రయాణికులకు సకల సౌకర్యాలను ఒకేచోట అందుబాటులోకి తేవచ్చని తేల్చింది. ఇక్కడున్న పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలిస్తారు. ఈట్, ఫన్, షాప్.. ప్రస్తుతం మార్కెటింగ్ విభాగం ఆధ్వర్యంలో ఉన్న పండ్ల మార్కెట్ స్థలంలో బస్సు ట్రాన్సిట్, పార్కింగ్, కమర్షియల్, రిటైల్ డెవలప్మెంట్, పోడియ మ్, హోటల్లు, మల్టీప్లెక్స్‌లను టవర్ స్ట్రక్చర్‌లో ఏర్పాటు చేస్తారు. బస్సుల రాకపోకలు, టెర్మినల్స్, ప్యాసింజర్ సౌకర్యాలు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్.. ఇలా అన్నీ ఒకేచోట ఉంటాయి. ఐఎస్బీటీ ఏర్పాటులో 3 టవర్లను నిర్మిస్తారు. ►1,29,275.96 చదరపు మీటర్ల ప్రాంతంలో 11 అంతస్తులతో కూడిన మొదటి టవర్‌లో బస్సుల హాల్టింగ్, పార్కింగ్ సౌకర్యాలు ►81,688.53 చ. మీ.లో రెండో టవర్‌లో షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్‌లు ►77,652.3 చ.మీలో మూడో టవర్‌లో హోటల్ అండ్ రెస్టారెంట్లు ఐఎస్బీటీ ఎందుకంటే.. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నగరానికి వందలాది ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. సిటీ బస్సులూ వేలల్లో తిరుగుతున్నాయి. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. ఇక్కడ ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గిస్తూ, ప్రత్యామ్నాయంగా సౌకర్యాలు కల్పిస్తూ ఐఎస్బీటీ నిర్మాణానికి హెచ్ఎండీఏ అధికారులు ప్రణాళిక రచించారు. విజయవాడ హైవేకు దగ్గరగా ఉండటంతో పాటు ఏ ప్రాంతం నుంచైనా బస్సులు సులువుగా వచ్చి వెళ్లే వీలుండటంతో కొత్తపేట పండ్ల మార్కెట్‌ను ఎంపిక చేశారు. ఇక్కడికి వచ్చే ప్రయాణికులు.. నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా మెట్రో రైలూ అందుబాటులో ఉంటుంది. దిల్సుఖ్నగర్ బస్ డిపోలో ఐసీబీటీ ప్రతిపాదిత ఐఎస్బీటీకి కూతవేటు దూరంలో దిల్సుఖ్నగర్ బస్ డిపో విస్తరించి ఉన్న 7.83 ఎకరాల ప్రాంతం ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ (ఐసీబీటీ) నిర్మాణానికి అనువైనదని హెచ్ఎండీఏ అధికారులు తేల్చారు. బస్సులు నిలిపేందుకు సువిశాల విస్తీర్ణం, స్టాఫ్ క్యాంటీన్, రెస్ట్ రూమ్‌లు, ఐదంతస్తుల మల్టీలెవల్ పార్కింగ్, స్టార్ హోటల్ తదితరాలను 2,46,317.75 చదరపు మీటర్లలో నిర్మించవచ్చని లెక్కలు వేశారు. ఇది దిల్సుఖ్నగర్ మెట్రోస్టేషన్‌కు సమీపంలోనే ఉండటంతో.. ఐఎస్‌బీటీలో దిగిన ప్రయాణికులు సులువుగా ఐసీబీటీకి చేరుకొని నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లొచ్చని, తద్వారా నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. -
దిల్‌సుఖ్‌నగర్‌లో నిధి అగర్వాల్ సందడి
-
ఆమె-ఆయన.. మధ్యలో ఇంకో ఆయన!
భార్యా భర్తల బంధం.. నమ్మకం, విశ్వాసం అనే పునాదులపై ఆధారపడి కొనసాగుతుంది. ఆ పరస్పర నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరికీ ఉంటుంది. ఇద్దరిలో ఎవరు ఎవర్ని మోసం చేసినా.. సంసారం చెదిరిపోతుంది. ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలతో అసలు బంధాలను దూరం చేసుకుంటున్న జంటల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఫ్యామిలీ కోర్టులకు వచ్చే మెజారిటీ కేసుల వెనుక వివాహేతర సంబంధాలే కారణాలుగా ఉంటున్నాయి. అలాంటి ఓ ఘటన దిల్ సుఖ్ నగర్లో వెలుగు చూసింది. భార్య చేస్తున్న మోసాన్ని బయటపెట్టేందుకు భర్త ఆస్ట్రేలియా నుంచి వచ్చి అర్థరాత్రి సమయంలో పోలీసులతో సహా భార్య ముందు ఎంట్రీ ఇచ్చాడు. అలా ఎంట్రీ ఇచ్చిన అతనికి మరో షాకింగ్ విషయం కూడా తెలిసింది. తేదీ- నవంబర్ 22 సమయం- అర్థరాత్రి 12 గంటల తర్వాత స్థలం- దిల్ సుఖ్ నగర్‌లోని వాసవీ కాలనీ పోలీసులు ఓ అపార్ట్మెంట్లోకి దూసుకెళ్లారు ఓ ఫ్లాట్ ముందు నిలబడి తలుపులు కొట్టారు చాలాసేపు తలుపులు తెరుచుకోలేదు చివరికి ఓ మహిళ తలుపు తీసింది.. పోలీసుల్ని చూసి ఎందుకొచ్చారు అన్నట్టుగా చూసింది.. ఆ ఖాకీల వెనుక నిలబడి తననే చూస్తున్న వ్యక్తి ఎవరా అని చూసి నిర్ఘాంతపోయింది ఆ వ్యక్తి ఎవరో కాదు ఆమె భర్త భర్తను చూసి ఆ భార్య ఎందుకు షాక్ తినాలి..? ఎందుకంటే అతను హైదరాబాద్‌లో లేడు ఆస్ట్రేలియాలో ఉంటాడు అక్కడి నుంచి ఎప్పుడొచ్చాడో ఆమెకు తెలియదు.. ఇంటికి ఎందుకు రాలేదో కూడా తెలియదు నేరుగా పోలీసులతో వచ్చాక మాత్రమే ఆమెకు అతను ముందుగా ఇంటికి ఎందుకు రాలేదన్న విషయం అర్థమైంది. తన విషయం భర్తకు పూర్తిగా తెలిసిపోయిన సంగతి కూడా ఆ క్షణంలోనే గ్రహింపులోకి వచ్చింది ఆ తర్వాత ఆమె అదరలేదు. బెదరలేదు. తన గుమ్మం ముందు నిలబడ్డ పోలీసులు ఇంట్లోకి వెళ్తోంటే అలా చూస్తూ నిలబడిపోయింది. ఇక్కడ కాస్త ఫ్లాష్ బ్యాక్ కథ చెప్పుకోవాలి. పదేళ్ల క్రితం పెళ్లి.. హాయిగా కాపురం పోలీసులతోపాటు వచ్చిన వ్యక్తి పేరు సంతోష్ రెడ్డి. సంతోష్ రెడ్డికి పదేళ్ల క్రితం సూర్యాపేటకు చెందిన సమతతో పెళ్లైంది. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లే. కాపురం కొన్నేళ్లపాటు హాయిగానే సాగింది. ఇంకా చెప్పాలంటే ఆమె.. పోలీసులతోపాటు తన భర్తను చూసిన ముందు క్షణందాకా కూడా బయటి ప్రపంచం దృష్టిలో వీళ్లది అన్యోన్య దాంపత్యమే. సంతోష్ రెడ్డి-సమత దంపతులకు ఇద్దరు చూడముచ్చటైన పిల్లలున్నారు. కొన్నేళ్ల క్రితం పైచదువుల కోసం సంతోష్‌రెడ్డి ఆస్ట్రేలియా వెళ్లారు. భార్యాపిల్లలకు తోడుగా తన తల్లిని ఇంట్లోనే ఉంచి.. వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి వెళ్లారు. ఏడాదికి ఓసారి వచ్చి నెల రోజులపాటు కుటుంబంతో గడిపి తిరిగి వెళ్లేవారు. అయితే, భార్యను కూడా తనతోపాటు ఓసారి ఆస్ట్రేలియా తీసుకెళ్లాలని సంతోష్ చాలా సార్లు అనుకున్నారు. ఇదే విషయం భార్యకు పదే పదే చెప్పారు కూడా.. నువ్వూ ఆస్ట్రేలియా రావచ్చు కదా.. కొన్నాళ్ల పాటు మొత్తం తిరిగి వద్దాం అంటూ ఎన్నో సార్లు చెప్పారు. ఎందుకో ఆమె ఒప్పుకునేది కాదు. పాస్ట్ పోర్టు సమస్యలున్నాయని చెప్పి తప్పించుకునేది. అప్పుడు కూడా సంతోష్ తన భార్యకు ఇల్లు వదిలి బయటికి రావడం ఇష్టం ఉండదనీ, తనను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టంలేకనే అలా చెప్తోందనీ అనుకున్నాడు. ఈ క్రమంలోనే తరచూ అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చేవి. మీ అమ్మను ఎంతమాత్రం భరించలేనని తరచూ భార్య నుంచి కంప్లైంట్. ఏడుపులు. పెడబొబ్బలు.. ఆ గొడవలు పెరిగిపోయి.. చివరికి కోడలితో పడలేనంటూ సంతోష్ రెడ్డి తల్లి తన ఇంటికి వెళ్లిపోయింది. భార్య ఆస్ట్రేలియా రమ్మన్నా రాకపోవడం... తల్లి ఇంటి నుంచి వెళ్లిపోవడం.. సంతోష్ రెడ్డికి ఏదో జరుగుతోందన్న అనుమానం కలిగించాయి.. మొహమాటపడుతూనే తన స్నేహితులను వాకబు చేశాడు. వాళ్లకు తెలిసిన సమాచారం వాళ్లు షేర్ చేశారు. అంతే.. తన అనుమానమే నిజమయ్యింది. ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు కానీ, ఇంటికి వెళ్లలేదు పదేళ్ల పాటు నిర్మించుకున్న నమ్మకం అనే గోడ తన కళ్లముందే కూలిపోయినట్లనిపించింది సంతోష్ రెడ్డికి. రోజూ భార్య ఫోన్లో తనతో మాట్లాడుతున్న మాటలన్నీ ఎందుకో అతన్ని వెక్కిరిస్తున్నట్లే అనిపించాయి.. ఇక ఆలస్యం చేసి లాభం లేదనుకున్నాడు. ఈ నెల మొదటి వారంలో ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. కానీ ఇంటికి వెళ్లలేదు. దూరంగా ఉంటూ రోజూ తన భార్య కదలికలు గమనించేవాడు. రాత్రివేళ తన అపార్ట్మెంట్ ముందు రహస్యంగా గస్తీకాసేవాడు.. తన అనుమానాలే నిజమయ్యాయి. తన కళ్లతోనే చాలా విషయాలను చూసి నిర్ధారించుకున్నాడు. నీ భార్యను భరించలేనంటూ తన తల్లీ ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందో అతనికి బోధపడింది. పదే పదే ఆస్ట్రేలియా రమ్మని పిలిచినా భార్య ఎందుకు ఒప్పుకోవడం లేదో సరైన కారణం అతనికి తెలిసింది.. కానీ తాను నేరుగా వెళ్లి తనకు తెలిసిన విషయాలను ఆమె తల్లిదండ్రులకు చెప్తే వింటారన్న నమ్మకం అతనికి లేదు. ఎందుకంటే.. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటావ్ కాబట్టి అనవసరంగా అనుమానాలు పెంచుకున్నావ్ అంటారనుకున్నాడు. అందుకే... నవంబర్ 22 అర్థరాత్రి పోలీసులకు ఫోన్ చేశాడు. తాను చూసినదీ.. తెలుసుకున్నదీ అన్నీ చెప్పాడు. పోలీసులు కూడా అతని వెంట రావడానికి ఒప్పుకున్నారు.. అంతా కలిసి వెళ్లి తన ఇంటి తలుపు కొట్టారు. అప్పటిదాకా తన భర్త ఆస్ట్రేలియాలోనే ఉన్నాడనుకున్న సమత.. పోలీసులతో కలిసి అర్థరాత్రి ఎంట్రీ ఇచ్చిన భర్తను చూసి నిర్ఘాంతపోయింది. సైలెంటుగా వాళ్లకు తన ఇంట్లోకి అనుమతిచ్చింది. అయితే.. అప్పటికే ఆ ఇంట్లో అలజడి మొదలైంది.. పోలీసులు నేరుగా బాత్రూమ్లోకి వెళ్లారు. అక్కడ నక్కి చూస్తున్న వ్యక్తిని బయటికి తీసుకొచ్చారు. ఆ వ్యక్తి సమత ప్రియుడు శివప్రసాద్. బెడ్రూమ్లోంచి మరో జంట.. షాక్ సంతోష్ రెడ్డి అనుకున్న విధంగానే పోలీసుల సమక్షంలో తన భార్య బండారాన్ని బయటపెట్టాడు. సరిగ్గా ఇక్కడే అతనికి ఇంకో కొత్త విషయం తెలిసింది. తన ఇంట్లో ఆ సమయంలో ఉన్నది భార్య.. ఆమె ప్రియుడు మాత్రమే కాదు.. మరో బెడ్రూమ్లోంచి మరో జంట బయటికొచ్చింది. వాళ్లను చూసి షాక్ తినడం సంతోష్ రెడ్డి వంతైంది. వాళ్లెవరు..? తన ఇంట్లో వాళ్లెందుకు ఉన్నట్టు..? నైటీలో ఉన్న ఆ మహిళ పేరు విశాల.. ఆమె సమత స్నేహితురాలు. ఆమెతో పాటు ఉన్న వ్యక్తి పేరు నరేష్.. సమతకు పెళ్లైనట్లే విశాలకూ పెళ్లై పిల్లలున్నారు. కానీ.. ప్రియుడితో కలిసి సమతలాగే విశాల కూడా రహస్య బంధాన్ని కొనసాగిస్తోంది. సమత భర్త పోలీసులతో రావడంవల్ల ఆమె వివాహేతర సంబంధం కూడా బయటపడింది. ఇదే ఇంట్లో నుంచే.. మహిళా కానిస్టేబుల్ విశాల భర్తకు ఫోన్ చేసి మీ భార్య తన స్నేహితురాలి ఇంట్లో ఉన్నట్లు సమాచారం ఇచ్చింది. సమత ప్రియుడు శివప్రసాద్.. ఓ డాక్టర్. అతనిదీ సూర్యాపేటే. సమత పుట్టింటికి దగ్గర్లోనే అతని ఇల్లు.. పెళ్లికి ముందు నుంచి ఉన్న పరిచయం.. పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత వివాహేతర సంబంధంగా కొనసాగుతోంది. శివప్రసాద్‌తో సంబంధం వల్లే సమత.. తనతోపాటు ఆస్ట్రేలియా వచ్చేందుకు ససేమిరా అనేదని సంతోష్ రెడ్డి అంటున్నారు. శివప్రసాద్‌తో ఇలా గడిపేందుకే తన తల్లితో తరచూ తగాదా పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేసిందంటున్నారు. అంతేకాదు.. తాను ఎప్పుడు ఫోన్ చేసినా ఆమె ఫోన్ బిజీగానే ఉండేదనీ.. తాను పిల్లలతో మాట్లాడాలని ప్రయత్నించినా.. మాట్లాడనిచ్చేది కాదంటున్నారు. కుటుంబాల్లో చిచ్చుపెడుతున్న స్మార్ట్ ఫోన్ కల్చర్ సంతోష్ రెడ్డి నుంచి ఫిర్యాదు తీసుకున్న చైతన్యపురి పోలీసులు మహిళా కానిస్టేబుళ్ల సాయంతో అర్థరాత్రి వేళ సమత ఇంటికి వెళ్లి సమతతోపాటు.. ఆ ఇంట్లో ఉన్న ఆమె ప్రియుడు శివప్రసాద్.. మరో జంట విశాల, నరేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై 408, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భార్య వివాహేతర సంబంధాన్ని భర్త బయటపెట్టే కేసులు.. భర్త రహస్య సంబంధాలను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. పెరిగిపోయిన స్మార్ట్ ఫోన్ కల్చర్ కుటుంబాల్లో చిచ్చుపెడుతోందని నిపుణులంటున్నారు. దూరంగా ఉండే ఇద్దరు వ్యక్తులు వాట్సప్‌లో తరచూ టచ్‌లో ఉండటం.. గంటలు గంటలు సోషల్ మీడియాల్లో గడపడం వివాహబంధాన్ని నిలువునా కోతకోస్తోందంటున్నారు. భార్యాభర్తల బంధం మధ్య వాళ్లిద్దరే కాకుండా పిల్లలు కూడా ఉన్నారన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. -
విలీనం డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదు
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఏ ఒక్క డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా బుధవారం దిల్సుఖ్ నగర్ బస్టాండ్‌లో ఆర్టీసీ ధూం ధాం కార్యక్రమంలో అశ్వత్థామరెడ్డి సహా పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘విలీనంపై వెనక్కి తగ్గినట్లు ఎక్కడైనా చెప్పినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం. ఆర్టీసీ కార్మికుల 26 డిమాండ్లపై చర్చలకు రావాలి. కార్మికులు, ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. కార్మికులను గందరగోళంలోకి నెట్టొద్దు’ అని అన్నారు. 2004లో టీడీపీ ఓటమికి ఆర్టీసీ సమ్మె కారణమని ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి గుర్తు చేశారు. తాము ప్రతిపాదించిన 26 డిమాండ్లు తమకు ప్రాధాన్యమే అని అన్నారు. ధనిక రాష్ట్రంలో ధనం ఏమైందని, అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం ఎలా చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. కార్మికులను, ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు, ఆర్టీసీ సమ్మెకు సంబంధం లేదని, కార్మికుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దని సూచించారు. టీఎంయూ కార్మిక సంఘం జెండా రంగు మార్చాల్సిన అవసరం వచ్చిందన్నారు. గులాబీ జెండా మోసింది తామేనని అన్నారు. కంటితుడుపు కమిటీలతో ఎలాంటి ప్రయోజనం లేదని అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యానించారు. కాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశాన్ని పక్కనపెట్టి మిగిలిన 21 డిమాండ్లను పరిశీలించా లని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి రెండు మూడు రోజుల్లో నివేదిక అందించేలా చూడాలంటూ ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మను ఆదేశించారు. ఆ నివేదిక అందిన తర్వాత చర్చలపై ప్రభుత్వం తుది నిర్ణ యం తీసుకోనుంది. ఈనెల 28న జరిగే విచారణలో హైకోర్టుకు అదే విషయాన్ని నివేదించనున్నారు. ఈ నేపథ్యంలో బస్ భవన్లో కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. -
డిపో ముందు ధూంధాం కార్యక్రమం
-
పాయల్ విత్ ఫ్యాన్స్
-
లెక్చరర్ల సంఘం నేత ఇంటిపై ఏసీబీ దాడులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పెరికి మధుసూదన్‌రెడ్డి ఇంటిపై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) శుక్రవారం దాడులు చేసింది. మూసారంబాగ్ డివిజన్ దిల్‌సుఖ్‌నగర్‌లోని వైష్టవీ నెస్ట్ అపార్ట్మెంట్లో మధుసూదన్‌రెడ్డికి చెందిన 302 ఫ్లాట్‌లో ఉదయం నుంచి ఏసీబీ సిటీ రేంజ్–1 డీఎస్పీ బీవీ సత్యనారాయణ నేతృత్వంలో అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారంటూ ఆరోపణలు రావడంతో దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆయన ఇంటితోపాటు బినామీలుగా భావిస్తోన్న రంగారెడ్డి, వికారాబాద్, కొడంగల్, కర్నూల్, చిల్‌మలైవర్ తదితర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లో మధుసూదన్‌రెడ్డి నివసిస్తున్న ఫ్లాట్‌ను రూ.24 లక్షలకు కొని కేవలం రూ.8 లక్షలకు రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారులు గుర్తించారు. నగరంలోని మాదాపూర్‌లో రూ.1.81 కోట్లకు కొన్న ఇంటిని కేవలం రూ.91 లక్షల విలువకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. మధుసూదన్‌రెడ్డి వద్ద రూ.3 కోట్ల ఆస్తులకు సంబంధించిన విలువైన కాగితాలు, డాక్యుమెంట్లు గుర్తించినట్లు చెప్పారు. వాటితోపాటు హోండాసిటీ కారు, ఇన్నోవా కారు సీజ్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం కేసు నమోదు చేసి మధుసూదన్‌రెడ్డిని అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. శనివారం ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణలు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మధుసూదన్‌రెడ్డి సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో లెక్చరర్‌గా, ఆయన భార్య విజయలక్ష్మి గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. మధుసూదన్‌రెడ్డి జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, జేఏసీ నేతగా పైరవీలు, ఇంటర్ పేపర్ లీకేజ్‌లతో అక్రమ ఆస్తులు కూడబెట్టారనే సమాచారం మేరకు దాడులు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. నన్నెందుకు టార్గెట్ చేశారో.. ‘ఏసీబీ రైడ్‌కు కారణలేంటి, నన్ను ఎందుకు టార్గెట్ చేశారనేదానిపై స్పందించదలుచుకోలేదు. అధ్యాపకుల సంఘం నేతగా అనేక ప్రజాసమస్యలపై, అనేక సందర్భాల్లో మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పటికి కూడా వాటికి నేను కట్టుబడి ఉన్నాను. ఇప్పడు నా దగ్గర ఉన్నది లక్ష రూపాయాలు మాత్రమే’ అని మధుసూదన్‌రెడ్డి అన్నారు. -
మనస్విని ఆరోగ్య పరిస్ధితి విషయం
-
నమ్మించి గొంతుకోశాడు...
హైదరాబాద్: అనుమానం పెనుభూతమైంది. ప్రేమికుడు ఉన్మాదిలా మారాడు. ప్రేమికురాలిపై కక్ష గట్టాడు. నమ్మించి గొంతుకోశాడు. తానూ ఆత్మహత్యకు యత్నించాడు. ప్రేమికురాలు ప్రాణాపాయస్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధి దిల్‌సుఖ్‌నగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వేమూరి ఆనంద్‌బాబు, కమలకుమారి దంపతులు కొంతకాలంగా బడంగ్‌పేటలో నివసిస్తున్నారు. వీరి కూతురు మనస్వి(22) బీటెక్ పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగాల కోసం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఇన్స్టిట్యూట్లో పోటీ పరీక్షకు శిక్షణ పొందింది. నెల్లూరు జిల్లా నారాయణరెడ్డిపేటకు చెందిన జానా జనార్దన్ కుమారుడు వెంకటేశ్(23)తో అదే ఇన్స్టిట్యూట్లో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ నాలుగు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఉదయమే నగరానికి వచ్చి... నెల్లూరు నుంచి ఉదయమే నగరానికి వచ్చిన వెంకటేశ్ ఓ యాప్ ద్వారా బృందావన్‌లో గది బుక్ చేశాడు. 10 గంటలకు రూంలో దిగి మనస్వికి ఫోన్ చేసి రప్పించాడు. 11.30 గంటల ప్రాంతంలో మనస్వి హోటల్‌కు చేరుకుంది. వేరే యువకుడితో సన్నిహితంగా ఉంటూ కొంతకాలంగా తనను నిర్ల క్ష్యం చేస్తోందని మనస్విపై వెంకటేశ్ కోపం పెంచుకున్నాడు. హోటల్ గదిలో ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంట తెచ్చుకున్న కూరగాయల కత్తితో మనస్వి గొంతు కోసి, తన రెండు చేతులను కోసుకున్నాడు. హోటల్‌కు వచ్చిన కొద్దిసేపటికే మనస్వి తన సోదరుడు శ్రీతేజకు ఫోన్ చేసి బృందావన్ హోటలో ఉన్నానని, తనపై దాడి జరుగుతోందని చెప్పింది. ఫోన్లో ఆమె కేకలు కూడా వినిపించాయి. శ్రీతేజ, తల్లి కమలకుమారి హుటాహుటిన బైక్‌పై బయలుదేరారు. మొబైల్లో గూగుల్ నావిగేషన్(మ్యాప్) సహాయంతో హోటల్‌కు చేరుకున్నారు. హోటల్ సిబ్బందితో కలసి రూంలోకి వెళ్లి చూడగా ఇద్దరూ రక్తపుమడుగులో పడి ఉన్నారు. బెడ్, గది అంతా రక్తసిక్తమైంది. మెడ కోసి ఉండటంతో తీవ్రంగా గాయపడ్డ మనస్విని వెంటనే కొత్తపేటలోని ఓమ్ని ఆసుపత్రికి తరలించారు. చేతిపై గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేశ్‌ను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పథకం ప్రకారమే... సంఘటనాస్థలంలో దొరికిన చాకుతోపాటు వెంకటేశ్ బ్యాగ్‌లో మరో రెండు చాకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి పథకం ప్రకారమే మనస్విపై దాడి చేసేందుకు వెంకటేశ్ వచ్చినట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలాన్ని ఎల్బీనగర్ ఏసీపీ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు. ఆమె వేరే యువకుడితో సన్నిహితంగా ఉంటూ తనను నిర్లక్ష్యం చేస్తోందని వెంకటేశ్ కక్ష గట్టి దాడికి పాల్పడి ఉండ వచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంటిలేటర్‌పై మనస్వి... మనస్వి కొత్తపేట ఓమ్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మెడ గాయానికి ఆపరేషన్ చేసినట్లు ఆసుప్రతి వైద్యులు శ్రీకర్ తెలిపారు. మనస్వి చేతివేళ్లు కూడా తెగాయని, రక్తం ఎక్కువగా పోయిందని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మనస్వి పరిస్థితి విషమంగా ఉందని 48 గంటలు గడిస్తేగాని ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. ఆ రూమే కావాలి... దిల్సుఖ్నగర్ వచ్చిన వెంకటేశ్ ముందుగా ఓయో యాప్‌లో బుక్ చేసిన రూం కాకుండా 501 రూం కావాలని బృందావన్ హోటల్ సిబ్బందిని అడిగినట్లు సమాచారం. కుదరదన్నా పట్టుపట్టి అదే రూం కావాలని కోరాడు. దీంతో సిబ్బంది తప్పని పరిస్థితిలో వెంకటేశ్‌కు ఆ రూం కేటాయించారు. ఫ్లోర్లో 501 రూం చివరిగా ఉండటం, గొడవ జరిగినా ఎవరూ పసిగట్టలేరని భావించి ఉండవచ్చని అనుమానాలు కలుగుతున్నాయి. దీన్ని బట్టి మనస్విని అంతమొందించాలని పథకం ప్రకారమే రప్పించినట్లు భావిస్తున్నారు. -
ప్రియురాలి గొంతుకోసిన ప్రియుడు
సాక్షి, హైదరాబాద్ : చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలి గొంతుకోసి హత్యాయత్నం చేశాడో వ్యక్తి. ఈ ఘటన దిల్‌సుఖ్‌నగర్‌లోని బృందావన్ లాడ్జిలో జరిగింది. మంగళవారం ఉదయం నెల్లూరుకు చెందిన వెంకటేష్ (22) అనే యువకుడు లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. కాగా, మధ్యాహ్న సమయంలో తనతోపాటు ఉన్న ప్రియురాలి గొంతుకోసి హత్యాయత్నం చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. చైతన్యపురి పోలీసులు విచారణ జరుపుతున్నారు. అమ్మాయి హైదరాబాద్‌లోని బడంగ్‌పేటకు చెందిన మనస్విని (22)గా పోలీసులు గుర్తించారు. -
దిల్‌సుఖ్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం
-
పల్టీలు కొట్టిన కారు,మహిళకు గాయాలు
-
నగరంలో భారీ వర్షం.. ఉరుములు, మెరుపులు!
సాక్షి, హైదరాబాద్ : నగరంలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని.. చీకట్లు అలుముకున్నాయి. దీంతో ఆకాశం మేఘావృతమై మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట, కర్మన్‌ఘాట్, ముషీరాబాద్, నారాయణగూడ, ట్యాంకుబండ్, కోఠి, ఆబిడ్స్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేటలో భారీ వర్షం కురుస్తోంది. దీనికితోడు పిడుగులు శబ్దాలు భీకరంగా వినిపిస్తుండటంతో భయాందోళనలో స్థానికులు ఉన్నారు. పాతబస్తీలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. -
ఎల్బీనగర్-దిల్సుఖ్నగర్ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో రేపు జరగబోయే లంబాడా ఐక్య వేదిక సభని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులు ఎల్బీ నగర్-దిల్సుఖ్ నగర్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సభ జరిగే దారిలో భారీ వాహనాలకు అనుమతి లేదు. తెలంగాణ లంబాడీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ సభ జరుగనుంది. అలాగే ఎల్బీనగర్ జంక్షన్ నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్లే వారు ఉప్పల్ ,రామంత పూర్, సంతోష్ నగర్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. మలక్‌పేట్ నుంచి వచ్చే వారు టీవీ టవర్ నుంచి రామంత్ పూర్, ఉప్పల్ మీదుగా లేదా సంతోష్ నగర్ ద్వారా ఎల్బీనగర్ వెళ్లాలన్నారు. సభకి వచ్చే వాహనాలకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు.. 1. వరంగల్, విజయవాడ వైపు నుంచి వచ్చేవారు నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలోని హెచ్ఎండీఏ లే ఔట్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు 2. ఇబ్రహీంపట్నం నుంచి వచ్చే వారు నాదర్ గుల్లోని ఏవియేషన్ అకాడమీ వద్ద ఏర్పాటు. 3. కర్మన్ ఘాట్ నుంచి వచ్చే వాహనాలకు హనుమాన్ గుడి వద్ద ఏర్పాటు 4. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలకు ఉప్పల్ స్టేడియం వద్ద ఏర్పాటు 5. ఎల్బీనగర్ నుంచి వచ్చే వాహనాలకు ఎక్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు -
డెంటల్ వైద్యురాలి సూసైడ్ కలకలం
సాక్షి, హైదరాబాద్ : యువకుడి చేతిలో మోసపోయిన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. దిల్‌సుఖ్‌నగర్‌లో డెంటల్ డాక్టర్ గీతాకృష్ణ ఆత్మహత్యకి పాల్పడింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన నరేష్ అనే వ్యక్తితో జగిత్యాలకు చెందిన గీతాకృష్ణ గత కొంత కాలంగా ప్రేమలో ఉంది. దిల్‌సుఖ్‌నగర్‌లో ఆమె ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటోంది. పెళ్లి చేసుకుంటానని నరేష్ మోసం చేయటంతో మనస్థాపం చెందిన ఆమె సూసైడ్‌కి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
దిల్‌సుఖ్‌నగర్‌లో ఘరానా మోసం
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆర్యన్ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉద్యోగాలని మభ్యపెట్టి కోర్సు పేరుతో రూ. కోట్లు వసూలు చేశారు. కాలేజీ యజమాని విద్యార్థులను హోటల్ మేనేజ్మెంట్ కోసం 30 మంది విద్యార్థులను మాల్దీవులకు పంపాడు. అక్కడి ఓ హోటల్లో 30 రోజులుగా బస ఏర్పాటు చేసి యజమాని నారాయణరెడ్డి పరారయ్యాడు. మోసపోయామని తెలుసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. కాలేజీలో ఉన్న అద్దాలను ధ్వంసం చేశారు. ఈ విషయం గురించి మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
వైభవ్ జ్యూయలరీ షోరూమ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన వైభవ్ జ్యూయలర్స్ 9వ, జ్యూయలరీ షోరూమ్‌ను తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. వైభవ్ జ్యూయలర్స్ తెలంగాణలో తొలి షోరూమ్‌ను ప్రారంభించి, విస్తృతమైన శ్రేణిలో ఆభరణాలను అందించడం శుభపరిణామమన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలని ఆకాంక్షించారు. ఏపీలో 8 శాఖలు... ఆంధప్రదేశ్‌లో విశాఖపట్నం, గాజువాక, కాకినాడ, రాజమండ్రి, పార్వతీ పురం, బొబ్బిలి, అనకాపల్లి, ఏలూరులో 8 బ్రాంచీలను నిర్వహిస్తున్నట్లు వైభవ్ సంస్థ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ గ్రంధి మల్లికా మనోజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద బంగారు ఆభరణాల షోరూమ్‌గా వైభవ్ జ్యూయలర్స్ (మనోజ్ వైభవ్ జెమ్స్ అండ్ జ్యూయలర్స్ ప్రైవేట్ లిమిటెడ్) విభిన్న డిజైన్లలో బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు, ప్లాటినం, రత్నాలు, వెండి ఆభరణాలు.. అసంఖ్యాక శ్రేణిని ఉత్తమ ధరలలో అందిస్తున్నామన్నారు. వ్యాపార సేవలతో పాటు సామాజిక సేవలను అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వైజాగ్ పరిసరప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిసర ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటామని, రెండు నెలల్లో సౌకర్యాల కల్ప నపై దృష్టి సారిస్తామన్నారు. ప్రారంభోత్సవ ఆఫర్ 9% నుంచి తరుగు హైదరాబాద్‌లో వివిధ ప్రదేశాల్లో విస్తరింపదలచి వినియోగదారులకు ప్రపంచ శ్రేణి షాపింగ్ అనుభవంతో పాటు విస్తృత శ్రేణిలో 916 హాల్మార్క్డ్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ డైమండ్స్, ఫైన్ జ్యూయలరీ, 925 స్వచ్చత కలిగి 100 శాతం తిరిగి కొనుగోలు హామీ గల స్టెర్లింగ్ సిల్వర్ ఆభరణాలను అందించాలనే ఉద్దేశ్యంతో దిల్‌సుఖ్‌నగర్‌లో 9వ, జ్యూయలరీ షోరూమ్‌ను ప్రారంభిస్తున్నామని జనరల్ మేనేజర్ మార్కెటింగ్ జె. రఘునాధ్ తెలిపారు. ఈ సందర్భంగా సాధారణ బంగారు ఆభరణాలకు తరుగు 9 శాతం నుంచి అందిస్తున్నామని తెలిపారు. ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గ్రంధి అమరేంద్ర, డైరెక్టర్ కుమారి కీర్తన, చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ఆర్. సతీష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
దిల్‌సుఖ్‌నగర్‌లో కారు బీభత్సం
-
ప్రభుత్వం తగిన పరిహారం ఇవ్వలేదు
-
ప్రభుత్వం తగిన పరిహారం ఇవ్వలేదు
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లలో క్షతగాత్రులకు ప్రభుత్వం సరైన పరిహారం ఇవ్వలేదని ఎన్ఐఏ కోర్టు అభిప్రాయపడింది. తీవ్రగాయాలైన 78 మందికి పరిహారం ఖరారు చేయాలని న్యాయ సేవాధికార సంస్థను కోర్టు ఆదేశించింది. ఈ కేసు తీర్పు కీలక అంశాలను శనివారం ప్రస్తావించిన కోర్టు.. ఏ వన్ మిర్చీ సెంటర్ నిర్వాహకుడికి రూ. లక్ష ఇవ్వాలని, పేలుళ్లలో 107 బస్టాప్ దెబ్బతిన్నందున ఆర్టీసీకి రూ. 50 వేలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో అనేక కోణాలు పరిశీలించాకే ఉరిశిక్ష విధించినట్లు 697 పేజీల తీర్పులో కోర్టు వెల్లడించింది. దోషులు జిహాద్ పేరుతో అమాయకుల ప్రాణాలను తీశారని, వారి సిద్ధాంతం చాలా ప్రమాదకరంగా ఉందని పేర్కొంది. చట్టాల నుంచి తప్పించుకోవడంలో దోషులు సుశిక్షితులుగా ఉన్నారని.. తమకు తాము హీరోలుగా భావించారని అంది. పేలుడు పదార్థాలు సరిపోతే.. మరో బాంబుకూడా పేల్చేవారని.. కోఠీ, అబిడ్స్, బేగంబజార్, సీబీఐ కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించారని ఎన్ఐఏ కోర్టు పేర్కొంది. -
కారులో పొగలు..తప్పిన ప్రమాదం
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ పరిధిలోని రాజీవ్ చౌక్ వద్ద ఏపీ 09సీక్యూ 3294 అనే నంబర్ గల వోక్స్వ్యాగన్ కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు వెలువడ్డాయి. పొగలకు కారులో ఉన్న 70 ఏళ్ల వృద్ధుడు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై వృద్ధుడిని రక్షించడంతో ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే పొగలు వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు. -
'ఉగ్రవాదులకు ఉరి శిక్షే సరైన శిక్ష'
-
'మా బాధ వారికి తెలిసేలా శిక్షించండి'
-
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు
హైదరాబాద్ సిటీ: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. రంగారెడ్డి జిల్లా ప్రత్యేక సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. ఈ కేసులోని ఆరుగురు నిందితులలో ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసీన్ భత్కల్ తో పాటు అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్, జియ ఉర్ రహమాన్, ఎజాజ్ షేక్‌లను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వీరంతా చర్లపల్లి జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. నిందితులపై దేశద్రోహం, హత్యానేరంతో పాటు పేలుడు పదార్థాల యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కాగా పేలుళ్ల సూత్రధారి రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అభియోగపత్రంలో 524 మందిని సాక్షులుగా చూపింది. ప్రాసిక్యూషన్ హాజరుపర్చిన 157 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు వారు నమోదుచేశారు. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్లలో 22 మంది మృతి చెందగా.. 140 మంది గాయపడ్డారు. -
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు
-
వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో టోకరా
సాక్షి, సిటీబ్యూరో: వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి, ఆకర్షితులై సంప్రదించిన వారి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేసి టోకరా వేస్తున్న మోసగాడిని సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. గడిచిన నాలుగు నెలల్లో అనేక మంది ఇతడి బారిన పడినట్లు డీసీపీ అవినాష్ మహంతి మంగళవారం తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎర్రం శివప్రసాద్ అలియాస్ గణేష్ కుమార్ బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి దిల్సుఖ్నగర్ ప్రాంతంలో స్థిరపడ్డాడు. నాలుగు నెలల క్రితం వికాస్‌నగర్‌లో స్పీడ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవాడు. ఆకర్షితులై సంప్రదించిన వారి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల పరుతో రూ.1000 వసూలు చేసే వాడు. కొన్ని టెక్టŠస్ బుక్స్‌లో ఉన్న అంశాలను చేతిరాత ద్వారా పెద్ద అక్షరాల్లో (క్యాపిటల్ లెటర్స్) తిరగరాయాలని, ఒక్కో ప్రాజెక్టుకు రూ.10 వేల చొప్పున చెల్లిస్తామంటూ నమ్మబలికే వాడు. ప్రాజెక్టు ఇచ్చే సమయంలోనే అడ్డదిడ్డమైన నిబంధనలు విధించే శివప్రసాద్ చివరకు పూర్తి చేసిన ప్రాజెక్టుల్ని తిరస్కరిస్తూ టోకరా వేసేవాడు. ఇటీవల ఎస్సార్‌నగర్ ప్రాంతానికి చెందిన మాయావతి పత్రికలో ప్రకటన చూసి శివప్రసాద్‌ను సంప్రదించారు. ఆమె నుంచి రూ.వెయ్యి వసూలు చేసిన నిందితులు ఓ ప్రాజెక్టు ఇచ్చాడు. అతికష్టమ్మీద ఆమె దాన్ని పూర్తి చేసినప్పటికీ చేతి రాతతో రాసిన దాంట్లో 50 తప్పులు ఉన్నాయంటూ తిరస్కరించి నగదు చెల్లించకుండా మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ ఏసీపీ కేసీఎస్ రఘువీర్ ఆదేశాల మేరకు మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ టీమ్ ఇన్ స్పెక్టర్ జి.శంకర్రావు నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. మంగళవారం నిందితుడైన శివప్రసాద్‌ను అరెస్టు చేసి సెల్ఫోన్లు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకుంది. -
‘స్వరూపానంద సరస్వతిని అరెస్ట్ చేయాలి’
హైదరాబాద్: షిరిడి సాయిబాబాపై అనుచిత వాఖ్యలు చేసిన శ్రీ స్వరూపానంద స్వామిని అరెస్ట్ చేయాలని కోరుతూ సాయిబాబా భక్తులు ఆందోళలనకు దిగారు. గతంలో కూడా స్వరూపానంద పలుమార్లు సాయిబాబాపై విరుచుకుపడ్డారని ఆయన పై కఠిన చర్యలు తీసుకోవాలని సాయి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు నగరంలోని దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయ సమీపంలో స్వరూపానంద స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. -
పెన్సిల్ ములికితో వీరజవాన్లకు స్థూపం
చైతన్యపురి: కశ్మీర్లో పాకిస్థాన్ ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన వీరజవాన్లకు నివాళులు అర్పించేందుకు దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ఓ సూక్ష్మ కళాకారుడు వినూత్నంగా పెన్సిల్ మొలికిపై అమరవీరుల స్థూపాన్ని రూపొందించాడు. రాచకొండ రాజు అనే స్వర్ణకారుడు రెండు గంటలు కష్టపడి పెన్సిల్ మొలికిపై ఈ స్థూపాన్ని రూపొందించినట్లు ‘సాక్షి’కి తెలిపాడు. -
షాపు షట్టర్ పగలగొట్టి... నగదు చోరీ
హైదరాబాద్: తాళం వేసి ఉన్న షాపు షట్టర్ పగలగొట్టిన దొంగలు దుకాణంలోని నగదుతో ఉడాయించారు. ఈ సంఘటన నగరంలోని దిల్సుఖ్నగర్ అనుపమ కళ్యాణమండపం సమీపంలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. బుధవారం షట్టర్ లేపి ఉండటాన్ని గమనించిన గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. రూ. 50 వేల నగదుతో పాటు కొన్ని విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సమీపంలోని సీసీ టీవీ ఫూటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
‘దిల్సుఖ్నగర్’ ఉగ్రవాదులకు ఢిల్లీలో ‘విముక్తి’
తెహసీన్, వఖాస్‌లపై అక్కడి కుట్ర కేసు నమోదు ఆధారాలు లేవంటూ డిశ్చార్జ్ చేసిన న్యాయస్థానం మిగిలిన నిందితుల్లో సయ్యద్ మగ్బూల్ సైతం మానవబాంబు దాడులకు కుట్రపై 2012లో కేసు సిటీబ్యూరో: హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాలతో సహా దేశ వ్యాప్తంగా మానవ బాంబులతో దాడులకు కుట్ర పన్నిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, జకీ ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్‌లకు ఢిల్లీ కోర్టు విముక్తి కల్పించింది. వీరిద్దరూ 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. ఢిల్లీ కుట్ర కేసులో హైదరాబాద్‌లో పట్టుబడిన సయ్యద్ మక్బూల్ సైతం ఉండటం గమనార్హం. ఐఎం కో-ఫౌండర్స్ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ 2012లోనూ సిటీలో మారణహోమం సృష్టించడానికి కుట్రపన్నారని, ఏకంగా మానవ బాంబులతో మూడు జనసమ్మర్ధ ప్రాంతాల్లో విరుచుకుపడాలని పథకం వేశారని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గుర్తించారు. పాతబస్తీలోని షాహిన్‌నగర్‌లో నివసించిన సయ్యద్ మక్బూల్ ఈ కుట్రలో ప్రధాన భాగస్వామిగా ఉన్నాడని తేల్చారు. దీపావళి టపాసులుల్లో ఉండే మందు, డీజిల్, యూరియాలతో అత్యాధునికమైన ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)లు తయారు చేయడానికి పథకం సిద్ధం చేసుకున్నట్లు తేల్చారు. 2012 అక్టోబర్ 26న నమోదు చేసిన కేసులో వీరి టార్గెట్‌లో హైదరాబాద్‌తో పాటు బీహార్‌లోని బుద్ధగయ ప్రాంతం కూడా ఉన్నాయని స్పెషల్ సెల్ పేర్కొంది. మక్బూల్ మరో ఉగ్రవాదైన ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి 2012లో హైదరాబాద్ వచ్చి, ద్విచక్ర వాహనంపై జనసమర్థ ప్రాంతాలైన దిల్సుఖ్నగర్, బేగంబజార్, అబిడ్స్ ప్రాంతాల్లో రెక్కీలు నిర్వహించినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసులో మక్బూల్, ఇమ్రాన్ సహా మరికొందరు అప్పుడే అరెస్టు కాగా... మిగిలిన వారిలో పరారీలో ఉన్న నిందితులైన తెహసీన్ అక్తర్, వఖాస్‌లు 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లో జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లకు అవసరమైన బాంబుల తయారు చేసిన, 107 బస్టాప్‌లో విధ్వంసానికి కారణమైన వఖాస్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు 2014 మార్చి 22న పట్టుకున్నారు. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు అవసరమైన సైకిళ్లను మలక్‌పేట్, జుమ్మేరాత్ బజార్‌ల్లో కొనుగోలు చేసిన... ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద పేలిన సైకిల్ బాంబును అక్కడ పెట్టిన తెహసీన్ సైతం అదే నెల 25న పశ్చిమ బెంగాల్‌లోని కాఖర్‌ర్బిత ప్రాంతంలో పోలీసులకు చిక్కాడు. దీంతో ఢిల్లీలో నమోదైన మానవ బాంబుల కుట్ర.. హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ పేలుళ్లు సహా అనేక కేసుల్లో వీరిని అరెస్టు చేశారు. ప్రస్తుతం చర్లపల్లి కేంద్ర కారాగారంలో యాసీన్ భత్కల్‌తో పాటు తెహసీన్, వఖాస్... తీహర్ జైల్లో ఉన్న మక్బూల్, ఇమ్రాన్ తదితరులపై ఢిల్లీ స్పెషల్ సెల్ గత వారంలో అభియోగాలు మోపుతూ అక్కడి కోర్టులో మెమో దాఖలు చేసింది. అయితే తెహసీన్, వఖాస్‌లపై సరైన ఆధారాలు లేవంటూ న్యాయస్థానం శుక్రవారం వీరిద్దరినీ డిశ్చార్జ్ చేసింది. మిగిలిన వారిపై ఈ నెల 28 నుంచి విచారణ చేపట్టనుంది. -
మరచిపోలేని పీడకల
♦ రుణమంటే రియాజ్, యాసీన్‌లకు భయం ♦ దీనిపై ఇక్బాల్‌తో పలు సందర్భాల్లో ఘర్షణలు ♦ ‘దిల్సుఖ్నగర్ కేసు’లో ఇద్దరూ నిందితులే సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటక భత్కల్‌లోని మదీనాకాలనీలో పుట్టా రు.. హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో విధ్వంసాలు సృష్టించారు... పదుల సంఖ్యలో ఉగ్రవాదబాట పట్టించారు... బాంబు పేలుళ్ల ద్వారా వందల మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు... ఇలాంటి కరుడుగట్టిన చరిత్ర ఉన్న ‘భత్కల్ ద్వయం’ రియాజ్, యాసీన్‌లకు రుణం అంటే మాత్రం హడల్. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ-1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌లలో జరిగిన మారణహోమం కేసులో రియాజ్ ప్రధాన నిందితుడిగా, యాసీన్ ఐదో నిందితుడిగా ఉన్నాడు. పేలుళ్లు జరిగి మూడేళ్లు పూర్తై నేపథ్యంలో నిఘా, పోలీసు వర్గాల విచారణలో వెలుగులోకి వచ్చిన ఈ ‘లోన్ టై’పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... ‘ఫోన్’ అంటే పొమ్మన్నాడు... అన్నదమ్ములైన రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ముంబైలోని కుర్లా ప్రాంతానికి వలస వెళ్లారు. సిమి ద్వారా ముష్కరబాట పట్టి, 2002 నుంచి దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌లో (ఐఎం) కీలకపాత్ర పోషించారు. అప్పటికే రియాజ్‌పై ముంబైలో కొన్ని కేసులు నమోదు కావడంతో పోలీసు నిఘా పెరిగింది. దీంతో అనుచరులను కలుసుకోవడం కష్టసాధ్యంగా మారడంతో ఇందుకు పరిష్కారంగా ఇక్బాల్ ఓ పథకం వేశాడు. కుర్లా ప్రాంతంలో టెలిఫోన్ బూత్ ఏర్పాటు చేద్దామని... కస్టమర్ల ముసుగులో అనుచరులు వచ్చినా పోలీసులు అనుమానించరని రియాజ్‌తో చెప్పాడు. ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన రియాజ్... బూత్ ఏర్పాటుకు అవసరమైన డబ్బు ఎలా? అన్న సందేహాన్ని బయటపెట్టాడు. ఇక్బాల్ రుణం తీసుకుందామనడంతోనే ససేమిరా అంటూ ప్రతిపాదనను విరమింపజేశాడు. తనకు రుణం అంటేనే భయం అంటూ ఏ ‘అవసరాలకూ’ లోన్లు తీసుకునే ప్రసక్తేలేదంటూ కరాఖండీగా చెప్పేశాడు. ఇది 2003లో చోటు చేసుకున్న పరిణామం. ‘వేట’ ఉన్నా వాహనం ఎక్కనన్నారు... అప్పటికే అనేక విధ్వంసాలు సృష్టించిన భత్కల్ ద్వయానికి 2007లో యాసీన్ భత్కల్ పరిచయమయ్యాడు. అప్పటికే గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌లతో పాటు మహారాష్ట్రలోనూ విధ్వంసాలు సృష్టించడంతో వీరికోసం ముంబై క్రైమ్ బ్రాంచ్ ముమ్మరంగా గాలిస్తున్న సమయంలోనే భవిష్యత్తు కార్యాచరణ కోసం ‘భత్కల్ త్రయం’ ముంబైలో కలుసుకుంది. అక్కడి రైల్వేస్టేషన్లో దిగిన రియాజ్, యాసీన్లను తీసుకువెళ్లేందుకు బైక్‌పై వచ్చినఇక్బాల్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు త్వరగా వాహనం ఎక్కాలంటూ వారిని కోరారు. అయితే వాహనం రుణంపై కొన్నదని తెలుసుకున్న రియాజ్, యాసీన్ ససేమిరా ఎక్కమన్నారు. తమకు ఓ సెంటిమెంట్ ఉందని ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ రుణాలు తీసుకోవడం, రుణాలకు సంబంధించిన వస్తువుల్ని వాడటం చేయమంటూ స్పష్టం చేసిన వారు ట్యాక్సీలోనే ‘గమ్య’ స్థానానికి చేరారు. ఐఎం కార్యకలాపాలు విస్తరించడానికి బెదిరింపులు, దోపిడీలతో పాటు అక్రమ ఆయుధాల వ్యాపారం చేద్దామని, లోన్ల జోలికి మాత్రం పోవద్దంటూ ఇక్బాల్‌కు చెప్పారు. ప్రస్తుతం ఎక్కడున్నారు..! ఢిల్లీలో బాట్లాహౌస్ ఎన్కౌంటర్... దీనికి కొనసాగింపుగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేసిన అరెస్టులతో 2008లో ఐఎం మాడ్యుల్ బ్రేక్ అయింది. ఈ పరిణామంతో దేశం దాటేసిన రియాజ్, ఇక్బాల్ దుబాయ్ మీదుగా పాకిస్థాన్ చేరుకున్నారు. ప్రస్తుతం కరాచీలోని డిఫెన్స్ హౌసింగ్‌కాలనీ ఫేజ్-4లో ఉంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 2009 తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన యాసీన్ భత్కల్ భారత్, నేపాలలో తలదాచుకున్నాడు. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు పాక్ నుంచి రియాజ్ కుట్ర చేయగా... మంగుళూరు నుంచి యాసీన్ అమలు చేశాడు. 2013 ఆగస్టులో బీహార్-నేపాల్ సరిహద్దుల్లో చిక్కిన యాసీన్ ప్రస్తుతం మిగిలిన నిందితులతో పాటు చర్లపల్లి జైల్లో ఉన్నాడు. ప్రస్తుతం కీలక విచారణ దశలో ఉన్న దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసు కోసం జైల్లోనే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి ఆక్టోపస్ కమాండోలు భద్రత కల్పిస్తున్నారు. నేడు బాంబు పేలుళ్ల బాధితుల సంఘం నిరసన దీక్ష చైతన్యపురి: దిల్సుఖ్నగర్, గోకుల్‌చాట్ బాంబు పేలుడు బాధితులు, క్షతగాత్రుల్లో ఆర్థిక సహాయం అందక నిస్సహాయులైన వారికోసం ఆదివారం దిల్సుఖ్నగర్ రాజీవ్‌చౌక్‌లో దుర్ఘటన జరిగిన స్థలంలో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు బాంబు పేలుళ్ల బాధితుల సంఘం కన్వీనర్ దోర్నాల జయప్రకాష్, అధ్యక్షుడు చందర్‌నాయక్, ఉపాధ్యక్షుడు సయ్యద్ రహీం తెలిపారు. ఈ సందర్భంగా పేలుళ్లలో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తామన్నారు. బాధితులకు ప్రభుత్వం తక్షణమే సాయం అందించాలని, మృతుల కుటుంబాలకు ఉద్యోగం, ఉపాధి, ఆర్థిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాజకీయ నాయకులు, విద్యార్థులు, సామాజికవేత్తలు, ప్రజా సంఘాలు పాల్గొనాలని కోరారు. మరచిపోలేని పీడకల జంట బాంబు పేలుళ్లకు నేటికి మూడేళ్లు... మలక్‌పేట: దిల్‌సుఖ్‌నగర్‌లో జంట బాంబు పేలుళ్లు జరిగి నేటికి సరిగ్గా మూడేళ్లు. నిత్యం రద్దీగా ఉండే దిల్సుఖ్నగర్ కోణార్క్ ధియేటర్ సమీపంలోని ఏవన్ మిర్చి సెంటర్, 107 నంబర్ బస్టాప్‌లలో జరిగిన పేలుళ్లను పరిసర ప్రాంతవాసులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఘటనలో 18 మృతి చెందగా, 131 మంది గాయపడ్డారు. మలక్‌పేట పీఎస్ పరిధిలో 107 నంబర్ బస్టాప్‌లో 45 మంది గాయాల పాలుకాగా, 5గురు వ్యక్తులు మృతి చెందారు. మాంసం ముద్దలు, మృతదేహాలు, తెగిపడిన శరీరభాగాలతో నాటి బీభత్సాన్ని గుర్తు చేసుకుంటే నేటికీ భయం వేస్తోందని బాధితులు పేర్కొంటున్నారు. మరువలేకున్నాం మూడేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నాం. మిర్చిసెంటర్లో పని చేస్తున్న నలుగురు వ్యక్తులం గాయపడ్డాం. భగవంతుని దయ వల్ల బతికి బయటపడ్డాం. పేలుడు ధాటికి చెవులు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ సరిగా వినిపించడం లేదు. మనుషుల ప్రాణాలను తీస్తున్న ఉగ్రవాదులపై పాలకులు కఠినంగా వ్యహరించాలి. - ఆశంగారి బక్కారెడ్డి, ఏవన్ మిర్చి సెంటర్, దిల్సుఖ్నగర్ ఉక్కు పాదం మోపాలి హోటల్‌కు అవసరమైన సామాన్లు తీసుకుని వస్తుండగా దిల్సుఖ్నగర్ 107నంబర్ బస్టాప్ వద్ద జరిగిన బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడ్డాను. సర్కార్ అందించిన రూ. 50 వేలు సరిపోకపోవడంతో మరో రూ.30 వేలు ఖర్చుపెట్టి చికిత్స చేయించుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలి. -మహ్మద్ అజ్మదుల్లాఖాన్, రోజ్ కేఫ్ నిర్వాహకుడు,మూసారంబాగ్ ఎటువంటి సహాయం అందలేదు దిల్సుఖ్నగర్ బాంబు దాడి జరిగి మూడేళ్లు గడుస్తున్నా నాకు ఎటువంటి సహాయం అందలేదు. రాజీవ్‌చౌక్‌లోని మిర్చి సెంటర్ ముందే బాంబు పేలడంతో రు.5లక్షలకు పైగా నష్ట పోయా. నా సోదరుడు గోపాల్రెడికి కుడి చేతి చిటికెన వేలు పూర్తిగా పోగా, రు.50 వేలు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం నేను మిర్చి సెంటర్లో పాన్‌షాప్, మరో షాప్ తీసుకుని మిర్చి సెంటర్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానన్నారు. ఆర్ధిక సహాయం చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్ నర్సింహన్, హోంమంత్రి, కలెక్టర్లను కలిసినా పట్టించుకోలేదు. -దిల్సుఖ్నగర్ ఎ-1 మిర్చి సెంటర్ నిర్వహకుడు పాండురెడ్డి -
ఇంటిపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
-
ఇంటిపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
చైతన్యపురి (హైదరాబాద్) : ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దిల్‌సుఖ్‌నగర్‌లోని కమలానగర్లో డీసీసీ బ్యాంక్ వద్ద మంగళవారం ఉదయం జరిగింది. తుకారామ్ గేట్ లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఇన్స్పెక్టర్ కూతురు చంద్రిక.. స్థానిక నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. మంగళవారం ఉదయం ఆమె నివసిస్తున్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని పనిమనిషి చూసే వరకు కుటుంబ సభ్యులు గమనించలేదు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో కాలేజీ లెక్చరర్ల వేధింపులే కారణమా? లేక ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. -
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
దిల్సుఖ్నగర్: అన్యాయంగా తనను సస్పెండ్ చేశారనే మనస్తాపంతో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన దిల్సుఖ్నగర్ బస్ డిపోలో జరిగింది. దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న సైదులును ఆర్టీసీ అధికారులు సస్పెండ్ చేశారు. దీంతో మనస్తాపం చెందిన సైదులు బుధవారం డిపో ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స కోసం ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై తోటి ఉద్యోగులు డిపో ఎదుట ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
ఎల్అండ్టీ కార్యాలయం ముందు కార్మికుల ధర్నా
దిల్సుఖ్నగర్ (హైదరాబాద్) : సకాలంలో జీతాలు అందించాలని కోరుతూ మెట్రో రైలు కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్న కార్మికులు ధర్నాకు దిగారు. కార్మికులంతా కలిసి శనివారం నగరంలోని దిల్సుఖ్నగర్ మలక్‌పేట పరిధిలోని ఎల్ అండ్ టీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఇస్తున్న జీతాలే తక్కువని, మళ్లీ అందులో సగం కట్ చేసి అవి కూడా సమయానికి ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని కార్మికులు వాపోతున్నారు. -
సిమ్ కొంటే ఉల్లి ఫ్రీ
హైదరాబాద్ : నిన్న మొన్నటి వరకు మా కంపెనీ సిమ్ కొంటే... టాక్ టైం ఫ్రీ... మెసేజ్ బ్యాలెన్స్ ఫ్రీ... డేటా ఫ్రీ అంటూ ప్రచారం చేసిన మొబైల్ నెట్వర్క్ కంపెనీలు కొత్త బాట పట్టాయి. మా కంపెనీకి చెందిన సిమ్ కొనుగోలు చేస్తే ఓ కిలో ఉల్లిగడ్డలు ఫ్రీ అని బ్యానర్లు ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ విధంగా హైదరాబాద్ నగరంలోని దిల్సుఖ్నగర్ చౌరస్తాలో బ్యానర్లు వెలిశాయి. -
హైదరాబాద్ లో రెచ్చిపోయిన ఆకతాయిలు
-
హైదరాబాద్ లో రెచ్చిపోయిన ఆకతాయిలు
చైతన్యపురి: హైదరాబాద్ లో ఆకతాయిలు బీభత్సం సృష్టించారు. ఇళ్ల ముందు పార్క్ చేసి ఉన్న కార్లపై గుర్తుతెలియని దుండగులు దాడులకు దిగారు. నగరంలోని దిల్సుఖ్నగర్ పరిధిలోని కోదండరాం నగర్, పీ అండ్ టీ కాలనీ, శారదానగర్‌లలో ఇళ్ల ముందు పార్క్ చేసి ఉన్న కార్లపై శనివారం గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. దీంతో 18 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు ఎవరనే విషయాన్ని నిర్ధరించుకోవడానికి కాలనీలలోని సీసీ టీవీల ఫుటేజిని పరీక్షిస్తున్నారు. పోలీసు పెట్రోలింగ్ లేకపోవడంతోనే ఆకతాయిలు దాడులు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ గతంలో కూడా ఆటోలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. -
'బాహుబలి' బ్లాక్ టికెట్లు స్వాధీనం
చైతన్యపురి (హైదరాబాద్) : బాహుబలి సినిమా టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గురువారం సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్‌లోని రెండు థియేటర్లపై దాడి చేశారు. ఇన్స్పెక్టర్ నర్సింగ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తపేట మహాలక్ష్మీ థియేటర్‌పై దాడి చేసి మొత్తం 1275 టికెట్లు, రూ.95,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. థియేటర్ మేనేజర్ విక్రంను చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. థియేటర్ నిర్వాహకుడు సాంబశివరావు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే దిల్‌సుఖ్‌నగర్‌లోని మెగా థియేటర్ ఆవరణలో బ్లాక్ టికెట్లు అమ్ముతున్న పి.ఆంజనేయులు (37), ఎల్.కృష్ణ (30)లను అదుపులోకి తీసుకుని 66 టికెట్లు, రూ.2820 నగదును స్వాధీనం చేసుకున్నారు. థియేటర్ మేనేజర్ సత్యనారాయణగౌడ్‌తో పాటు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం సరూర్‌నగర్ పోలీసులకు అప్పగించారు. -
గులాబీతో కోర్టులో హాజరైన భత్కల్
రంగారెడ్డి : దిల్సుఖ్నగర్ లో 2013లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు యాసిన్ భత్కల్ను గురువారం పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి ఎదుట గులాబీ పువ్వుతో హాజరయిన భత్కల్ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇదిలా ఉండగా రెండు రోజులుగా భత్కల్ వింతగా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు పేర్కొంటున్నారు. ఉగ్రవాది భత్కల్ వింత ప్రవర్తనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
భత్కల్ను తప్పించేందుకు ప్లాన్
-
దిల్సుఖ్నగర్ పేలుళ్లలో ఎజాజ్
- నగదు సరఫరాలో సూత్రధారి - నిర్ధారించిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు హైదరాబాద్: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్ల కేసులో నిందితుల సంఖ్య ఆరుకు చేరింది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేసిన ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాది ఎజాజ్ షేక్ పాత్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిర్ధారించింది. పేలుళ్లకు అవసరమైన ఆర్థిక సాయం ఇతడే చేశాడనే ఆరోపణలపై హైదరాబాద్ తరలించేందుకు నాంపల్లి కోర్టు నుంచి అనుమతి తీసుకుంది. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎజాజ్‌ను ఆదివారం లోపు నగరానికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. పుణేకు చెందిన ఎజాజ్ షేక్ ఐఎంలో కీలక వ్యక్తి. సాంకేతికంగా దర్యాప్తు చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు ఎజాజ్ పాత్రను గుర్తించాయి. గత ఏడాది సెప్టెంబర్ 6న ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతమైన సహరంగ్‌పూర్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. హైదరాబాద్‌ను 2007లో మాదిరిగానే మరోసారి టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్న రియాజ్ భత్కల్ 2012 సెప్టెంబర్‌లో అసదుల్లా అక్తర్ (ఆజామ్ఘడ్), వఖాస్ (పాకిస్థాన్)లను మంగుళూరుకు పంపాడు. వీరికి అవసరమైన నిధుల్ని పంపే బాధ్యతలు పుణేలో ఉంటున్న ఎజాజ్‌కు అప్పగించాడు. దీంతో ఎజాజ్ మంగుళూరులోని హంపన్‌కట్టలో ఉన్న వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సంస్థ ఔట్లెట్ సుపమ ఫోరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మార్కెట్ రోడ్డులో హవాలా వ్యాపారం చేసే డింగ్ డాంగ్ దుకాణం యజమాని ద్వారా 2013 ఫిబ్రవరిలో రూ.6.8 లక్షలు పంపాడు. ఉగ్రవాదులు ఆ నగదును వినియోగించే దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ-1 మిర్చ్ సెంటర్స్‌లో పేలుళ్లకు పాల్పడి 18 మందిని పొట్టన పెట్టుకున్నారు. -
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో మలుపు
పేలుడు పదార్థాలు సరఫరా చేసిన ముగ్గురి అరెస్ట్ సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల కేసు మరో మలుపు తిరిగింది. హైదరాబాద్ లో బాంబులు పేల్చేందుకు కావలసిన పేలుడు పదార్థాలను సమకూర్చిన ముగ్గురిని సోమవారం బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సయ్యద్ ఇస్మాయిల్ అఫక్, సబూర్, సద్దాం హుసేన్ అనే ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. దిల్సుఖ్నగర్ పేలుళ్లతో ఈ ముగ్గురికీ సంబంధం ఉందని పోలీసు ల విచారణలో తేలింది. ఇక్కడ బాంబులు పేల్చేందు కు కావాల్సిన పేలుడు సామగ్రిని ఈ ముగ్గురే సమకూర్చినట్లు కూడా గుర్తించారు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతిచెందగా 131 మంది గాయపడిన సంగతి తెలి సిందే. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఐదుగురు నిందితులను గుర్తించింది. వీరిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అసదుల్లా అక్తర్ అలియాస్ హాది అలియాస్ తబ్రేజ్ అలియాస్ దానియాల్ అలియాస్ ఆసద్ (28), కర్ణాటకకు చెందిన మహ్మద్ అహ్మద్ సిద్ధిబాప అలియాస్ యాసిన్ భక్తల్ అలియాస్ షుక్రూ(30)లను ఎన్ఐఏ గతంలో అరెస్ట్ చేసింది. వీరు ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఇక కర్ణాటకకు చెందిన మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భక్తల్ అలియాస్ ఇస్మాయిల్ షాబంద్రీ(38), పాకిస్తాన్‌కు చెందిన వఖాస్ అలియాస్ జావిద్ అలియాస్ అహ్మద్ అలియాస్ నాబీల్ అహ్మద్(25), బిహార్‌కు చెందిన మహ్మద్ తహసీన్ అక్తర్ హసన్ అలియాస్ మోను(25) పరారీలో ఉన్నారు. వీరిపై ఎన్ఐఏ రివార్డు కూడా ప్రకటించింది. తాజా అరెస్టులతో ఈ కేసులో నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. బెంగళూరులో అరెస్ట్ అయిన సయ్యద్ ఇస్మాయిల్ అఫక్, సబూర్, సద్దాం హుసేన్‌లను విచారించేందుకు హైదరాబాద్ ఎన్ఐఏ అధికారులు సిద్ధమయ్యారు. సోమవారం బెంగళూరు వెళ్లిన ఎన్ఐఏ బృందం.. పీటీ వారెంట్‌పై ఈ ముగ్గురిని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. -
హైదరాబాద్ విద్యార్థుల శాంతిర్యాలి
-
కొత్త పుస్తకాలు
1.తనను తాను వెతుక్కుంటున్న చరిత్ర (వ్యాసాలు) పేజీలు: 232; వెల: 150 2. మోఢీత్వ (వ్యాసాలు) పేజీలు: 72; వెల: 45 రచన: ఎం.శ్రీనివాస్ ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలతోపాటు, అడుగుజాడలు పబ్లికేషన్స్, 302, వైష్ణవి నెస్ట్, తిరుమల మ్యూజిక్ సెంటర్ వెనుక, మూసారాంబాగ్, దిల్సుఖ్నగర్, హైదరాబాద్-36. ముద్రాశాస్త్ర రహస్యాలు రచన: స్వామి మైత్రేయ పేజీలు: 202; వెల: 190 ప్రతులకు: కె.బి.లక్ష్మి, 17-141, శ్రీనిలయం, కమలానగర్, దిల్సుఖ్నగర్, హైదరాబాద్-60. ఫోన్: 040-24050574 రైతుల కోసం-3 (వ్యవసాయ వ్యాసాలు) రచన: దాసరి ఆళ్వారస్వామి పేజీలు: 176; వెల: 150 ప్రతులకు: రచయిత, కుందేరు, కంకిపాడు మం., కృష్ణాజిల్లా-521245. ఫోన్: 08676-283424 బలిజరాయ తరంగిణి (కాపు, తెలగ, కవరై) రచన: సుంకర ఎస్.గిరిధరప్రసాద్రాయ్ పేజీలు: 230; వెల: 150 ప్రతులకు: అను బుక్ సెంటర్, కమలానగర్, అనంతపురం. ఫోన్: 08554-232819 1. నేనూ బడికి వస్తున్నా (పిల్లల కథలు) పేజీలు: 52; వెల: 30 2. సైన్స్ వ్యాసాలు పేజీలు: 124; వెల: 70 రచన: టి.శాంతాభాస్కర్ ప్రతులకు: లోకేష్ ప్రచురణలు, 3-422, పగడమాను వీధి, గిరింపేట, చిత్తూరు-517002. ఫోన్: 8106595468 1. చిత్రబంధ మాలికా (శేషశైలేశస్తుత్యాత్మక చిత్రబంధ కవిత్వం) రచన: తిరుమల బుక్కపట్టణం అణ్ణయదేశిక పేజీలు:84; వెల: 60 (చిత్రపటంతో) 2.చిత్రమ్ (శ్రీరంగనాథస్తుత్యాత్మక చిత్రకవిత్వం) రచన: ఆయలూరి కందాళయార్య పేజీలు: 108; వెల: 60 సంపాదకుడు: వైద్యమ్ వేంకటేశ్వరాచార్య ప్రతులకు: సంపాదకుడు, 9989679681 -
చట్టం అమలుకు ప్రజలు కలిసి రావాలి
వరంగల్‌క్రైం : ప్రజా సంరక్షణ చట్టం అమలులో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ జి.కిషన్ పిలుపునిచ్చారు. ప్రజా సంరక్షణ చట్టం-2013పై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించేందుకు వరంగల్ అర్బన్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అర్బన్ పరిధిలోని మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, సినిమా హాల్స్, అపార్ట్మెంట్స్ యజమానులతోపాటు అర్బన్ పరిధికి చెందిన పలువురు వ్యాపారస్తులు హాజ రయ్యూరు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని వ్యాపార వర్గాలకు చెందిన వారు అక్టోబర్ 2వ తేదీలోపు తప్పకుండా సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. 2013లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన చట్టం విధివిధానాలకు సంబంధించి వరంగల్ అర్బన్ అదనపు ఎస్పీ యాదయ్య వివరిస్తూ దిల్‌సుఖ్‌నగర్‌లో ఉగ్రవాదులు పాల్పడిన రెండు బాంబు పేలుళ్లలో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయూరని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్పటి ప్రభుత్వం ప్రజాభద్రత చట్టం- 2013 ప్రవేశపెట్టిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో వివిధ ప్రైవేటు సంస్థలు, వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక, ఆస్పత్రులు, క్రీడాప్రాంగణాలు, రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లతోపాటు అపార్టుమెంట్లు, సమావేశ స్థలాలు తదితర ప్రదేశాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు, ప్రవేశ మార్గంలో తనిఖీ పరికరాలు(డోర్‌ఫ్రేమ్‌లు) ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ చట్టం అమలును అర్బన్ పరిధిలో మునిసిపల్ విభాగంకు చెందిన సిటీ ప్లానర్, ఆర్ఐతోపాటు సబ్ డివిజనల్ స్థాయి పోలీసు అధికారితో కూడిన కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే మెుదటి సారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు జరిమా నా విధిస్తారని, మూ డోసారి మాత్రం భవనాన్ని సీజ్ చేయనున్న ట్లు తెలిపారు. మునిసిపల్ కమిషనర్ సువర్ణ పాండాదాస్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఈ చట్టాన్ని అనుసరించి భవన నిర్మాణ అనుమతులను ఇస్తామన్నారు. అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ ప్రజాసంరక్షణ బాధ్యత ఏ ఒక్కరికో సంబంధించిన అంశం అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ సమష్టి బాధ్యతగా గుర్తించాలని కోరారు. సదస్సులో వరంగల్ అర్బన్ పోలీస్ బాంబ్ డిస్పోజల్ విభాగం సిబ్బంది తమ పరికరాలను ప్రదర్శించారు. భద్రత కోసం చేపట్టే సాధనాలను ఉత్పత్తి చేసే పలు కంపెనీ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. భారీ స్క్రీన్‌పై సీసీ కెమెరాల ద్వారా రికార్డరుున నేరాల పుటేజీలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఓఎస్డీ నాగరాజు, వరంగల్, హన్మకొండ, కాజీపేట, మామునూరు, ఎస్బీ, ట్రాఫిక్, క్రైం డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
దిల్సుఖ్నగర్ పేలుడు భాదితులకి చెల్లని చెక్కులా?
-
గుండెకు గాయం.. సాయమేదీ ?
-
ప్రేమికుడి ఇంటిముందు యువతి బైఠాయింపు
తణుకు క్రైం: ప్రేమించి మోసం చేశాడంటూ ప్రేమికుడి ఇంటి ముందు యువతి బైఠాయించిన ఘటన బుధవారం తణుకులో చోటుచేసుకుంది. బాధితురాలు, ఆమె బంధువులు తెలిపిన వివరాలు. స్థానిక సజ్జాపురంలో నివాసముంటున్న డి.సంతోష్ స్వరూప్ అలియాస్ విక్కీ విద్యాభ్యాసం నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో తన బంధువుల ఇంట్లో అద్దెకు ఉంటున్న కొమ్ము కవితతో రెండు సంవత్సరాల క్రితం అతడికి పరిచయం ఏర్పడిండి. కొంతకాలం అనంతరం అది ప్రేమకు దారితీసింది. రెండు నెలల క్రితం కవిత పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో విక్కీ అప్పటి నుంచి ముఖం చాటేస్తున్నాడని, హైదరాబాద్ నుంచి తణుకు వచ్చేశాడని బాధితురాలి బంధువులు తెలిపారు. దీంతో తాము తణుకు రావాల్సి వచ్చిందని చెప్పారు. మూడు రోజులుగా తణుకులోనే ఉంటున్నా విక్కీ కనిపించడంలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంటిముందు బైఠాయించామని బాధితురాలి తల్లి జంగమ్మ, అక్క లావణ్య చెప్పారు. కొంత సమయం బైఠాయించిన అనంతరం ఇరువర్గాలు పోలీసులను ఆశ్రయించారు. -
తూర్పు vs పశ్చిమం!
రియల్ బూమ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హైదరాబాద్‌లో తూర్పు, పశ్చిమలు కొత్త ఆశల్ని నింపుతున్నాయి. మాంద్యంలోనూ స్థిరాస్తి రంగాన్ని ఆదుకున్న ప్రాంతాలేవైనా ఉన్నాయంటే అవి ఇవే. తూర్పున ఉప్పల్, పశ్చిమాన హైటెక్‌సిటీలు రియల్ రంగంలో ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. మెట్రోతో ఉప్పల్ రియల్ పట్టాలెక్కితే.. ఐటీఐఆర్‌తో హైటెక్‌సిటీ కొత్త హంగుల్ని పోతోంది. ఉప్పల్-హైటెక్‌సిటీ భవిష్యత్తు చిత్రంపై ‘సాక్షి రియల్టీ’ ఈవారం ప్రత్యేక కథన ం.. తూర్పు హైదరాబాద్: దిల్సుఖ్నగర్ నుంచి హయత్‌నగర్, నాగోల్ నుంచి నాదర్గుల్, స్నేహపురి నుంచి హస్తినాపురం, కొత్తపేట నుంచి కర్మన్‌ఘాట్, తుర్కయాంజాల్ నుంచి బాటసింగారం.. ఇవీ తూర్పు హైదరాబాద్ కిందికి వచ్చే ప్రాంతాలు. హైటెక్‌సిటీ తర్వాత ఐటీ రంగానికి కేంద్ర బిందువుగా మారుతోంది ఉప్పల్ సర్కిలే అని ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ అడ్వైజర్, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ జే వెంకట్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ‘‘ఉప్పల్ బస్ డిపో పక్కనే రెండున్నర ఎకరాల్లో ఏవీ ఇన్ఫో ప్రైడ్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 210 ఫ్లాట్లు. ధర చ.అ.కి రూ.2,600. ఇదే ప్రాంతంలో 2,800 గజాల్లో హరేరాం రెసిడెన్సీని కూడా నిర్మించాం. ఇది గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉంది. మొత్తం 60 ఫ్లాట్లు. ధర చ.అ.కి రూ.2,400. మేడిపల్లి పీఅండ్‌టీ కాలనీలో 850 గజాల్లో రాచూరీ అరణ్య కూడా వస్తోంది. మొత్తం 20 ఫ్లాట్లు. ధర చ.అ.కి రూ.2,400.’’ అని వెంకట్ రెడ్డి వివరించారు. పశ్చిమ హైదరాబాద్: ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ వంటి అనేక రంగాలకు చిరునామాగా నిలుస్తోంది పశ్చిమ హైదరాబాద్. శేరిలింగంపల్లి, రామచంద్రాపురం, పటాన్చెరువు సర్కిళ్లు దీని కిందికొస్తాయి. వీటిలో స్థిరాస్తి వ్యాపారానికి పెట్టింది పేరు హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ ప్రాంతాలు. ఐటీ, ఫైనాన్షియల్ హబ్‌లతో పశ్చిమ హైదరాబాద్‌కు గిరాకీ బాగా పెరిగింది. ఈ ప్రాంతంలో ఫ్లాట్ల నుంచి విల్లాల వరకు అన్ని రకాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ‘‘కొండాపూర్‌లో మూడున్నర ఎకరాల్లో ఆర్వీ పాంచజన్య ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నట్లు ఆర్వీ నిర్మాణ్ ఎండీ రామచంద్రా రెడ్డి చెప్పారు. రెండు బ్లాకుల్లో మొత్తం 310 ఫ్లాట్లొస్తాయి. ధర చ.అ.కి రూ.3,800గా నిర్ణయించామన్నారు. గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పక్కనే ఎకరంన్నర విస్తీర్ణంలో ఆర్వీ శిల్పహిల్టాప్ను కూడా నిర్మించాం. ఇది గృహప్రవేశానికి సిద్ధంగా ఉంది. మొత్తం 128 ఫ్లాట్లు. 2, 3 పడక గదులతో పాటు డూప్లెక్స్ ఫ్లాట్లు కూడా ఉన్నాయి. ధర చ.అ.కి రూ.4,500గా ఉందన్నారు. ఐటీఐఆర్ ధమాకా క్లస్టర్-3లో ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో 10.3 చ.కి.మీ. పరిధిలో ఐటీఐఆర్ విస్తరించి ఉంది. దీనికి అనుసంధానంగా ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్-1లో 11.5 చ.కి.మీ., గ్రోత్ కారిడార్-2లో 14.3 చ.కి.మీ. పరిధిలో కూడా ఐటీఐఆర్‌ను విస్తరించనున్నారు. ఇప్పటికే ప్రజయ్ టెక్నో పార్క్, జెన్‌ప్యాక్ట్, సురానా ఐటీపార్క్, రహేజా ఐటీ పార్క్, నూజివీడు సీడ్స్, ఎన్ఎస్ఎల్, ఇన్ఫోసిస్ సెజ్, టాప్‌నాచ్ సెజ్, ఐకానియా, భాగ్యనగర్ మెటల్స్ వంటి ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు కొలువుదీరాయి. క్లస్టర్-1లో భాగంగా సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో 86.7 చ.కి.మీ. మేర ఐటీఐఆర్ విస్తరించి ఉంటుంది. హైటెక్‌సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ, వట్టినాగుల పల్లి ప్రాంతాలు ఇందులో ఉంటాయి. రెండు దశాబ్ధాల క్రితమే సైబర్ టవర్స్ కేంద్రంగా ఐటీ సేవలు ప్రారంభమయ్యాయి. హైటెక్‌సిటీలో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, ఓరాకిల్, జీఈ క్యాపిటల్, హెచ్ఎస్బీసీ వంటి వందలాది ఐటీ కంపెనీలున్నాయి. ప్రస్తుతం సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో 3.18 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఔటర్‌పై దూకుడు నగరం చుట్టూ 158 కి.మీ. మేర నిర్మిస్తున్న ఔటర్‌రింగ్ రోడ్ 14 జంక్షన్లతో అనుసంధానమై ఉంటుంది. వీటిలో అన్నోజిగూడ, ఘట్కేసర్, పెద్ద అంబర్‌పేట, బొంగ్లూరు జంక్షన్లు తూర్పు హైదరాబాద్ పరిధిలోకే వస్తాయి. ఓఆర్ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్ మధ్య 195 కి.మీ. మేర 33 రేడియల్ రోడ్లను నిర్మిస్తున్నారు. ఇందులో 59 కి.మీ. తూర్పు హైదరాబాద్ లోనే ఉన్నాయి. హబ్సిగూడ నుంచి బోగారం జంక్షన్-19 కి.మీ., సర్వే ఆఫ్ ఇండియా నుంచి మేడిపల్లి-12 కి.మీ., నాగోల్ బ్రిడ్జి నుంచి సింగారం -14 కి.మీ., నాగోల్ బ్రిడ్జి నుంచి గౌరెల్లి- 14 కి.మీ. ఈ రోడ్లుంటాయి. నగరం చుట్టూ నిర్మిస్తున్న ఔటర్‌రింగ్ రోడ్ చివరి దశకు చేరింది. 22 కి.మీ. గల గచ్చిబౌలి-శంషాబాద్ రోడ్డు, 23.7 కి.మీ. గల నార్సింగి- పటాన్చెరువు రోడ్ పశ్చిమ హైదరాబాద్ నుంచే వెళతాయి. ఇక రేడియల్ రోడ్ల విషయానికొస్తే.. 34.65 కి.మీ. మేర రోడ్లు పశ్చిమ హైదరాబాద్‌లో విస్తరించి ఉన్నాయి. నానల్‌నగర్ జంక్షన్ నుంచి హెచ్‌సీయూ డిపో వరకు 3.95 కి.మీ., హెచ్‌సీయూ డిపో నుంచి వట్టినాగుల పల్లి వరకు 14.30 కి.మీ., నిజాంపేట ఎక్స్ రోడ్ నుంచి ఖాజీపల్లి వరకు 9 కి.మీ., మూసాపేట నుంచి బీహెచ్ఈఎల్ జంక్షన్ వరకు 7.40 కి.మీ. దూరం రేడియల్ రోడ్లు రానున్నాయి. మెట్రో మెరుగులు మెట్రో రైల్ తొలిసారిగా పరుగులు తీసేది తూర్పు హైదరాబాద్ నుంచే. త్వరలోనే నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు 8 కి.మీ. దూరం మెట్రో పరుగులు పెట్టనుంది. కారిడార్-1, కారిడార్-3 మెట్రో ప్రాజె క్ట్లోని కొన్ని ప్రాంతాలు తూర్పు హైదరాబాద్ నుంచే వెళతాయి. 28.87 కి.మీ. గల మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో 27 మెట్రో స్టేషన్లు వస్తాయి. మలక్‌పేట్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, విక్టోరియా మెమోరియల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు రానున్నాయి. అలాగే 27.51 కి.మీ. గల నాగోల్-శిల్పారామం మార్గంలో 23 స్టేషన్లు వస్తాయి. నాగోల్, ఉప్పల్, సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ, హబ్సిగూడ, తార్నాక, మెట్టుగూడల్లో మెట్రో స్టేషన్లు వస్తాయి. ఐటీ రంగంతో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న పశ్చిమ హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణంతో మరింత జోరుగా సాగుతోంది. కారిడార్-1, కారిడార్-3లోని మెట్రో మార్గాలు ఇటు తూర్పు, పశ్చిమ హైదరాబాద్‌లను కలుపుతూ నిర్మిస్తున్నారు. మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో వచ్చే 27 మెట్రో స్టేషన్లలో మియాపూర్, జేఎన్టీయూ కాలేజీ, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్పల్లి, మూసాపేట్, భరత్ నగర్ ప్రాంతాలు పశ్చిమ హైదరాబాద్ కిందికొస్తాయి. అలాగే నాగోల్-శిల్పారామం మార్గంలోని 23 స్టేషన్లలో రోడ్ నం:5 జూబ్లీహిల్స్, జూబ్లీ చెక్‌పోస్ట్, పెద్దమ్మ గుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్‌సిటీ, శిల్పారామంలో మెట్రో స్టేషన్లొస్తాయి. -
పేరడిగి.. కత్తితో దాడి
సైదాబాద్: తెల్లవారు జామున టీ తాగడానికి రోడ్డుపైకి వచ్చిన విద్యార్థిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. సైదాబాద్ ఎస్ఐ రాజేష్‌కుమార్ తెలిపిన ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన యువకడు (23) దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయి డిగ్రీ కళాశాలలో చదువుకుంటూ స్థానిక ద్వారకాపురికాలనీలోని హాస్టల్లో ఉంటున్నాడు. ఖాళీ సమయంలో సంతోష్‌నగర్‌లోని హెరిటేజ్ ఫ్రెష్‌లో స్టోర్ సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. శనివారం తెల్లవారు జామున 3 గంటలకు తనతో పాటు పని చేస్తున్న మరో యువకుడితో కలిసి టీ తాగేందుకు చౌరస్తాకు వచ్చాడు. అక్కడ టీ దొరక్క పోవడంతో సైదాబాద్ ధోబీఘాట్ చౌరస్తాకు నడుచుకుంటూ బయలుదేరారు. అదే సమయంలో అక్కడికి రెండు బైక్‌లపై వచ్చిన ఐదుగురు దుండగులు సైదాబాద్ ఎక్కడ అని వీరిని హిందీలో ప్రశ్నించారు. ఆపై మీ పేర్లేంటని అడిగారు. చెప్పగానే ఒకరి కడుపులో కత్తితో పొడిచి పారిపోయారు. కత్తి పిడి బాధితుడి కడుపులో అలాగే ఉండిపోయింది. వెంటనే 108 అంబులెన్స్‌లో అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. -
దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితుడు తహసీన్ అరెస్ట్
-
దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితుడు తహసీన్ అరెస్ట్
ఢిల్లీ : దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఇండియన్ ముజాహిద్దీన్ నేత తహసీన్ అక్తర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారంతోనే రెండు రోజుల క్రితం జోధ్‌పూర్‌లో వఖాస్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ పోలీసులు అక్తర్ అరెస్ట్‌ను ఆలస్యంగా ప్రకటించారు. మొత్తంమీద దిల్సుఖ్నగర్ కేసులో ఇప్పటిదాకా రియాజ్ మినహా మిగతా వారంతా అరెస్ట్ అయ్యారు. యాసిన్ భత్కల్ అరెస్ట్ అనంతరం తహసీన్ కమాండర్ బాధ్యతలు చేపట్టాడు. కాగా 2013 ఫిబ్రవరి 21 దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల సూత్రధారులు ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాదాలు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్లను ఆరునెల్ల తర్వాత ఎట్టకేలకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇండో-నేపాల్ సరిహద్దులో బీహార్ పోలీసులు అగస్ట్ 28న వారిని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం డిల్లీ తరలించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పలుకోణాల్లో వీరిద్దరిని విచారించింది. భక్తల్, అక్తర్‌లు ఇచ్చిన సమాచారంతో బీహార్‌లో పలుచోట్ల ఎన్ఐఎ బృందం సోదాలు నిర్వహించింది. దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు యాసిన్ భత్కల్ అంగీకరించాడు. హైదరాబాద్ నగరంలో బాంబు పేలుళ్లకు వ్యూహ రచన చేసి విధ్వంసానికి కారణమైనట్లు తెలిపాడు. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులలో భత్కల్ నిందితుడు. -
దిల్సుఖ్నగర్’ కేసులో మరో అరెస్టు
రాజస్థాన్‌లో పట్టుబడిన ఉగ్రవాది వఖాస్ బాంబుల తయారీలో ఇతడు దిట్ట 107 బస్టాప్ వద్ద బాంబు పెట్టిందీ ఇతడే మరిన్ని కుట్రలు భగ్నం చేసిన ఢిల్లీ కాప్స్ సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లో గతేడాది ఫిబ్రవరి 21న చోటు చేసుకున్న జంట బాంబు పేలుళ్ల కేసులో మరో నిందితుడు పట్టుబడ్డాడు. ఈ విధ్వంసానికి కారణమైన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది, పాకిస్థానీ వఖాస్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శనివారం రాజస్థాన్‌లో అరెస్టు చేశారు. వఖాస్‌తో సహా మొత్తం నలుగురిని ఆదివారం ఢిల్లీ తరలించి.. కోర్టు అనుమతితో పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. పాక్ టు భారత్ వయా నేపాల్... పాకిస్థాన్‌కు చెందిన వఖాస్ అసలు పేరు జఖీ ఉర్ రె హ్మాన్. ఫుడ్ టెక్నాలజీలో డిప్లొమా చేశాడు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (ఎల్ఈటీ) ద్వారా ఉగ్రవాదం బాటపట్టాడు. ఆ సంస్థలో శిక్షణ పొందాడు. ఐఎం మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు ఆ సంస్థ కో-ఫౌండర్ యాసీన్ భత్కల్‌కు ప్రధాన అనుచరుడిగా మారాడు. 2010లో నేపాల్‌లోని ఖాట్మండ్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించి, తెహసీన్ అక్తర్‌తో జతకట్టాడు. ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, గుజరాత్‌ల్లో జరిగిన పేలుళ్లలో కీలక పాత్ర పోషించిన వఖాస్ గతేడాది యాసీన్, అసదుల్లా అక్తర్, తెహసీన్ అక్తర్‌లతో కలిసి దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లలో పాలుపంచుకున్నాడు. పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న రియాజ్ భత్కల్ 2007లో మాదిరిగానే హైదరాబాద్‌ను మరోసారి టార్గెట్ చేయాలని 2012లోనే నిర్ణయించుకున్నాడు. ఈ పనిని అసదుల్లా అక్తర్, వఖాస్‌లకు అప్పగించాడు. ముందు షెల్టర్ ఏర్పాటు చేసుకోమని చెప్పి మంగుళూరుకు పంపాడు. పేలుళ్లకు అవసరమైన నగదు, పేలుడు పదార్థాలు అందుకున్నాక ఈ ఇద్దరూ తెహసీన్ అక్తర్‌తో కలిసి రంగంలోకి దిగారు. ముందు రెక్కీ... దిల్సుఖ్నగర్ పేలుళ్ల ఆపరేషన్ పూర్తి చేయడానికి షెల్టర్ వెతకడం కోసం తెహసీన్ అక్తర్ 16 రోజుల ముందు ఇక్కడికి చేరుకుని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఫిబ్రవరి 10న ఓసారి సిటీకి వచ్చి వెళ్లిన అసదుల్లా అక్తర్.. విధ్వంసం సృష్టించడానికి వారం ముందు వఖాస్‌తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ముగ్గురూ కలిసి మలక్‌పేట, అబిడ్స్, దిల్సుఖ్నగర్ల్లోని అనేక జనసమర్థ ప్రాంతాల్లో రెక్కీ చేశారు. చివరకు దిల్‌సుఖ్‌నగర్‌ను టార్గెట్‌గా ఎంచుకున్నారు. ఫిబ్రవరి 20న రెండు పాతసైకిళ్లు కొని మలక్‌పేట్ రైల్వేస్టేషన్ పార్కింగ్‌లో దాచారు. టైమ్ చాలక ‘107’లో పెట్టేసి... బాంబుల తయారీలో దిట్ట అయిన వఖాస్ దిల్సుఖ్నగర్ బాంబుల తయారీ బాధ్యతల్ని తీసుకున్నాడు. బి-డే (బ్లాస్డ్ డే) అయిన ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 3 గంటలకు ప్రెషర్‌కుక్కర్ బాంబుల తయారీ పూర్తి చేశాడు. వాటిని అట్ట పెట్టెల్లో పెట్టి ప్యాక్ చేశాడు. అక్కడి నుంచి మలక్‌పేట్ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. పార్కింగ్‌లో ఉన్న సైకిళ్ల క్యారేజ్‌పై బాంబులున్న పెట్టెలు కట్టి.. అక్కడి నుంచి దిల్సుఖ్నగర్ బయలురేరారు. నల్లగొండ చౌరస్తా దాటాక ఏడు గంట లకు పేలే విధంగా బాంబుల్లోని టైమర్‌ను సెట్ చేశారు. తెహసీన్ అక్తర్, వఖాస్ చెరోసైకిల్పై దిల్సుఖ్నగర్ చౌరస్తా వైపు బయలుదేర గా... అసదుల్లా అక్తర్ గడ్డిఅన్నారం చౌరస్తా వద్దే ఉండిపోయాడు. తెహసీన్ నేరుగా వెళ్లి ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద సైకిల్‌ను పార్క్ చేశాడు. వెనుక వచ్చిన వఖాస్‌కు మద్యం దుకాణం వ రకు వెళ్లే లోపే బాంబు పేలిపోవచ్చని భావిం చాడు. వెంటనే టార్గెట్‌ను మార్చుకొని 107 బస్టాప్ సైకిల్ పెట్టి వెళ్లిపోయాడు. పేలుళ్ల అనంతరం నేరుగా మంగుళూరు వెళ్లిపోయిన వఖాస్... ఎప్పటికప్పుడు తన స్థావరాలు మా రుస్తూ తలదాచుకున్నాడు. గతేడాది ఆగస్టులో యాసీన్, అసదుల్లాలను నిఘా వర్గాలు భారత్-నేపాల్ సరిహద్దుల్లోని రక్సల్ వద్ద అరెస్టు చే శాయి. వీరి విచారణలోనే మొత్త ఆపరేషన్ వెలుగులోకి రావడంతో కేసు దర్యాప్తు చేసిన ఎన్ఐఏ అధికారులు రియాజ్ భత్కల్ను ప్రధాన నిం దితుడిగా (ఏ-1)గా, యాసీన్‌ను ఐదో నింది తుడుగా, అసదుల్లా, వఖాస్, తెహసీన్లను ఏ-2, ఏ-3, ఏ-4గా నిర్థారించారు. ఈ మే రకు ఇటీవలే అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఆరు రాష్ట్రాల్లో తలదాచుకుని... యాసీన్, అసదుల్లా విచారణలోనే వఖాస్ భా రత్‌లోనే ఉన్నాడని కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్రల్లో సంచరిస్తున్నాడని వెలుగులోకి వచ్చింది. దీంతో పక్కా నిఘా ఉంచిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శనివారం ముంబై నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చేరుకున్న వఖాస్‌ను అక్కడి రైల్వేస్టేషన్లో పట్టుకున్నారు. ఇతడిచ్చిన సమాచారంలో జైపూర్, జోధ్‌పూర్‌ల్లో మరో ముగ్గురిని అరెస్టు చేసి భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో వీరు సీరియల్ పేలుళ్లకు కుట్రపన్నినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసు కస్టడీలో ఉన్న వఖాస్‌ను వారి విచారణ పూర్తయ్యాక పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఎన్ఐఏ సన్నాహాలు చేస్తోంది. -
దిల్సుఖ్నగర్ డిపోను మూసేయం: ఆర్టీసీ ఎండీ
చైతన్యపురి, న్యూస్‌లైన్: ప్రయాణికులకు మెరుగైన సేవలందించి ఆక్యుపెన్సీ రేషియో ద్వారా సంస్థను లాభాల బాటలో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ఎండీ జె. పూర్ణచందర్రావు పేర్కొన్నారు. మంగళవారం దిల్సుఖ్నగర్ సిటీ డిపోను సంద ర్శించి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిపో సిబ్బంది బస్సుల నిర్వాహణ, జీత భత్యాలు, ఆదాయం తదితర అంశాలపై ఎండీ ఆరా తీశారు. దిల్సుఖ్నగర్ డిపో నష్టాల్లో నడుస్తున్నందున మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించినట్లు వార్తాలు రావడం, కార్మిక వర్గాల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో స్వయాన సంస్థ ఎండీ పర్యటించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా టీఎన్‌ఎంయూ నాయకులు మల్లేష్, ఎస్‌కేజే పాషా, ఇతర కార్మిక సంఘాలు, డిపో సిబ్బంది ఎండీని ఘనంగా సత్కరించారు. అనంతరం ఎండి పూర్ణచందర్రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదాయం పెంచే మార్గాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామే తప్పా ఈ డిపోను మూసివేసే ఆలోచన లేదన్నారు. -
దిల్సుఖ్నగర్ పేలుళ్లకు నేటితో ఏడాది పూర్తి
-
భార్య షికారుకు రాలేదని బలవన్మరణం
హైదరాబాద్: భార్య షికారుకు రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. సరూర్‌నగర్ ఎస్ఐ నరేందర్ కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లాకు చెందిన వంశీకృష్ణ(26), చిత్తూరుకు చెందిన హిమబిందును ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలంగా వీరు దిల్సుఖ్నగర్ శారదానగర్‌లో ఉంటున్నారు. వంశీకృష్ణ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. శనివారం హిమబిందు పుట్టిన రోజు కావడంతో సాయంత్రం ఇద్దరూ కలిసి బయటకు వెళ్దామని భర్త అన్నాడు. ఇందుకు భార్య నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వంశీకృష్ణ రాత్రి సమయంలో గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత భార్య తలుపు తట్టినా తీయలేదు. దీంతో బావమరిది వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా వంశీకృష్ణ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని మృతి చెంది ఉన్నాడు. ఈ మేరకు కుటుంబసభ్యులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పాక్ ప్రేరణతోనే హైదరాబాద్ పేలుళ్లు: సుశీల్‌కుమార్ షిండే
న్యూఢిల్లీ: ఈ ఏడాది హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) పనేనని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే వెల్లడించారు. దేశంలో ఈ ఏడాది జరిగిన మొత్తం నాలుగు పేలుళ్లకుగాను మూడింటి వెనుక ఐఎం హస్తముందని తెలిపారు. బుద్ధగయ, పాట్నా పేలుళ్లు కూడా దాని దుశ్చర్యేనన్నారు. బెంగళూరు పేలుడు దారితప్పిన కొందరు ఛాందసవాద యువకులు, అల్-ఉమాహ్కు చెందినవారి పనిగా తేల్చారు. పాకిస్థాన్‌లోని ప్రతీఘాత శక్తుల నుంచి ఐఎంకు ప్రేరణ లభిస్తోందన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ఆధ్వర్యంలో జరుగుతున్న డీజీపీలు, ఐజీల మూడు రోజుల సదస్సును షిండే గురువారం ప్రారంభించారు. లేనిపోని సమస్యలు సృష్టించేందుకు సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఆసిఫ్ ఇబ్రహీం చెప్పారు. -
నయ వంచన
సాక్షి, సిటీబ్యూరో : దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లు జరిగిన కొద్దిసేపటికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ రీజనల్ సెంటర్‌కు ఘటనాస్థలిలో బలగాల మోహరింపుపై ఓ ఫోన్‌కాల్ వచ్చింది. ఆర్మీకి చెందిన ఉన్నతాధికారి చేసినట్లు భ్రమింపజేసిన ఈ కాల్ వాస్తవానికి చేసింది ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబాగా తర్వాత నిర్ధారణైంది. తిరువనంతపురం కేంద్రంగా పనిచేసే కోస్ట్‌గార్డ్ ఈ ఏడాది జూన్‌లో సదరన్ నావెల్ కమాండ్‌కు ఓ అలర్ట్ మెసేజ్ ఇచ్చింది. నేవీకి చెందిన ఉన్నతాధికారులమాదిరి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ముష్కరులు ఫోన్ చేసి కీలక సమాచారం సంగ్రహించే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలన్నది ఆ హెచ్చరిక సారాంశం. ఇంటర్నెట్లో విరివిగా లభిస్తున్న కాల్ స్ఫూఫింగ్ సాఫ్ట్వేర్ వల్లే ఇలాంటివి సాధ్యం. ఇప్పటివరకు శత్రుదేశాల నిఘా సంస్థలు, ఉగ్రవాదులకు మాత్రమే పరిమితమై ఉన్న ఈ టెక్నాలజీని ఇప్పుడు మోసగాళ్లు కూడా వినియోగించేస్తున్నారు. కేవలం కాల్ స్ఫూఫింగ్ మాత్రమే కాకుండా మెయిల్ స్ఫూఫింగ్కూ పాల్పడుతూ ఉద్యోగాల పేరుతో ఎర వేస్తున్నారు. నిరుద్యోగుల్ని బురిడీ కొట్టించి అందినకాడికి దండుకుంటున్నారు. దీనిపై పక్కా ఆధారాలు సేకరించిన హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు నిందితుల కోసం గాలిస్తూ లోతుగా కూపీ లాగుతున్నారు. క్లోనింగ్‌ను తలదన్నుతూ... ఒకప్పుడు సిమ్‌కార్డుల్ని క్లోనింగ్ చేసేవారు. అంటే మీ సిమ్‌కార్డును పోలినదాన్ని మరోటి సృష్టించి వినియోగించడం. దీనిద్వారా చేసే ఫోన్ కాల్స్ అన్నీ మీ నెంబర్ నుంచే వెళ్తాయి. ఇలా చేయడానికి కచ్చితంగా సిమ్‌కార్డుకు సంబంధించిన ఇంటర్నేషనల్ మొబైల్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ (ఐఎంఎస్‌ఈ) నెంబర్ తెలిసి ఉండటం తప్పనిసరి. దీన్ని తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు. అయినప్పటికీ అనేక సందర్భాల్లో సిమ్‌కార్డు క్లోనింగ్స్ చోటు చేసుకున్నాయి. ఈ విధానాన్ని తలదన్నేదిగా ఇంటర్నెట్లో అందుబాటులోకి వచ్చిందే స్ఫూఫింగ్. గతంలో కేవలం ఫోన్ కాల్స్‌కు మాత్రమే పరిమితమై ఉన్న ఈ విధానం ఇప్పుడు ఈ-మెయిల్స్‌కు సైతం విస్తరించింది. ఏకంగా ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్‌నూ స్ఫూఫ్ చేయగలుగుతున్నారు. కొన్నేళ్ల క్రితం సరదా కోసం సాఫ్ట్ మేధావులు* రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులతో పాటు మోసగాళ్లుకు సైతం వరంగా మారింది. స్ఫూఫింగ్ చేస్తారిలా... నిర్ణీత రుసుం తీసుకుని స్ఫూఫింగ్ సాఫ్ట్వేర్, సదుపాయాన్ని అందించే వెబ్సైట్లు ఇంటర్నెట్లో అనేకం ఉన్నాయి. వాస్తవానికి ఇది ఇంటర్నెట్ ద్వారా చేసే కాల్. దీనిలోకి ఎంటర్ అయిన తరవాత సదరు వ్యక్తి ఫోన్ నెంబర్‌తో పాటు ఫోన్‌కాల్‌ను అందుకోవాల్సిన వ్యక్తిది, ఫోన్ రిసీవ్ చేసుకునేప్పుడు అతని సెల్ఫోన్లో ఎవరి నెంబర్ డిస్ప్లే కావాలో అది కూడా పొందుపరుస్తారు. ఇదే రకంగా ఈ-మెయిల్ ఐడీ స్ఫూఫింగ్ వెబ్సైట్లలో మెయిల్ ఐడీలను రిజిస్టర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఓ వ్యక్తి ప్రముఖ కంపెనీ నుంచి కాల్ చేసినట్లు, ఈ-మెయిల్ పంపినట్లు మరో వ్యక్తిని బుట్టలో వేసుకునే అవకాశం ఉంటుంది. బ్యాక్ డోర్ అనడంతో బుట్టలో... ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగార్థులు నేరుగా సదరు కంపెనీని సంప్రదిస్తే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. అయితే మోసగాళ్లు వీరికి ముందే తమకు ఆయా సంస్థల్లో ఉన్న పెద్ద మనుషులతో సంబంధాలు ఉన్నాయని, వాటి ద్వారానే బ్యాక్‌డోర్ ఎంట్రీలుగా ఈ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని చెప్పి ముందరికాళ్లకు బంధాలు వేస్తారు. దీంతో ఉద్యోగార్థులు నేరుగా ఆయా కార్యాలయాలకు వెళ్లి వివరాలు సేకరించే, సమాచారం సరిచూసుకునే ధైర్యం చేయట్లేదు. ఇదే మోసగాళ్లకు అన్ని సందర్భాల్లోనూ కలిసి వస్తోంది. ఈ తరహాలో కాల్, మెయిల్ స్ఫూఫింగ్ ద్వారా ఘరానా మోసాలకు పాల్పడి నిరుద్యోగుల్ని ముంచిన వ్యవహారంపై సీసీఎస్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో డీసీపీ జి.పాలరాజు ఆదేశాల మేరకు ఓ ప్రత్యేక బృందం ఈ వ్యవహారంలో బాధ్యుల్ని గుర్తించడానికి లోతుగా ఆరా తీస్తూ సాంకేతికంగా దర్యాప్తు చేస్తోంది. టోకరా వేస్తున్నారిలా... స్ఫూఫింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఎడాపెడా విని యోగించేస్తున్న మోసగాళ్లు నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో టోకరా వేస్తున్నారు. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ ముందు ప్రకట నలు జారీ చేయడం ద్వారా నిరుద్యోగుల్ని ఆకర్షిస్తున్నారు. వారి నుంచి బయోడేటా త దితరాలు సేకరించిన తరవాత ఫోన్ ఇంట ర్వ్యూ దగ్గర అసలు కథ మొదలవుతోంది. సదరు కంపెనీకి చెందిన ఫోన్ నెంబర్‌కు స్ఫూఫింగ్ చేయడం ద్వారా వారే కాల్ చేసినట్లు సృష్టిస్తున్నారు. ఉద్యోగార్థి అనుమా నం వచ్చి ఆ ఫోన్ నెంబర్ ఎవరిదని ఆరా తీసినా ప్రముఖ కంపెనీకి చెందినదిగానే తేలుతుంది. ఆపై అదే కంపెనీకి చెందిన మెయిల్ ఐడీ, ఐపీ అడ్రస్‌ను స్ఫూఫ్ చేస్తు న్న మోసగాళ్లు వాటి ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్, ఆఫర్ లెటర్ వంటివి పంపిస్తున్నారు. వీటిని రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఎంత పరిశీలించినా ప్రముఖ కంపెనీ నుం చి వచ్చినట్లే ఉంటుంది. దీంతో ఆ నిరుద్యోగి ఉద్యోగం వచ్చిందని భావించి మోసగాడు చెప్పిన బ్యాంక్ ఖాతాలో అడిగినంత జమ చేస్తున్నారు. ఇవి కూడా బోగస్ వివరాలతో కూడినవి కావడంతో వీటి ద్వారానూ మోసగాళ్లను పట్టుకునే అవకాశం లేదు. -
వేగవంతమైన దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లపై విచారణ
హైదరాబాద్: నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అతని సహచరుడు అసదుల్లా అఖ్తర్ అలియాస్ తబ్రేజ్ అలియాస్ ‘హడ్డి’లు పోలీసులకు పట్టు బడటంతో దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల విచారణ వేగవంతమైంది. పేలుళ్ల సూత్రదారి అసదుల్లా అఖ్తర్‌ను అర్ధరాత్రి పోలీసులు హైదరాబాద్ తరలించారు. పేలుళ్లకు ముందు తాను షెల్టర్ తీసుకొన్న ఇంటిని సోదాచేసి పలు కీలక ఆధారాలు సేకరించారు. అనంతరం ఉదయాన్నే డిల్లీ తరలించారు. పిటి వారెంట్‌పై పట్టబడిన నిందితులను హైదరాబాద్ తరలించేందుకు రాష్ట్ర పోలీసులు కోర్టును కోరనున్నారు. ఫిబ్రవరి 21 దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల సూత్రధారులు ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాదాలు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్లను ఆరునెల్ల తర్వాత ఎట్టకేలకు పట్టుబడ్డారు. ఇండో-నేపాల్ సరిహద్దులో బీహార్ పోలీసులు అగస్ట్ 28న వారిని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం డిల్లీ తరలించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పలుకోణాల్లో వీరిద్దరిని విచారించింది. భక్తల్, అక్తర్‌లు ఇచ్చిన సమాచారంతో బీహార్‌లో పలుచోట్ల ఎన్ఐఎ బృందం సోదాలు నిర్వహించింది. దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు యాసిన్ భత్కల్ అంగీకరించాడు. హైదరాబాద్ నగరంలో బాంబు పేలుళ్లకు వ్యూహ రచన చేసి విధ్వంసానికి కారణమైనట్లు తెలిపాడు. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులలో భత్కల్ నిందితుడు.