
సాక్షి, హైదరాబాద్ : యువకుడి చేతిలో మోసపోయిన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. దిల్‌సుఖ్‌నగర్‌లో డెంటల్ డాక్టర్ గీతాకృష్ణ ఆత్మహత్యకి పాల్పడింది.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన నరేష్ అనే వ్యక్తితో జగిత్యాలకు చెందిన గీతాకృష్ణ గత కొంత కాలంగా ప్రేమలో ఉంది. దిల్‌సుఖ్‌నగర్‌లో ఆమె ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటోంది. పెళ్లి చేసుకుంటానని నరేష్ మోసం చేయటంతో మనస్థాపం చెందిన ఆమె సూసైడ్‌కి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment