Dental doctor
-
హైదరాబాద్: మలక్‌పేట హిట్ అండ్ రన్ కేసులో డాక్టర్ శ్రావణి మృతి
-
హిట్&రన్ కేసు: డాక్టర్ శ్రావణి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట్ హిట్ అండ్ రన్ కేసు విషాదంగా ముగిసింది. కారు ఢీ కొన్న ప్రమాదంలో గాయపడ్డ డాక్టర్ శ్రావణి కన్నుమూసింది. చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ.. మూడు రోజులుగా ఆమె నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే.. ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతోనే ఆమె కన్నుమూసిందని వైద్యులు ప్రకటించారు. ఇక నిందితుడిని ఓల్డ్ మలక్‌పేటకు చెందిన ఇబ్రహీంగా గుర్తించారు. అంతేకాదు.. నిందితుడికి లైసెన్స్, కారుకు పేపర్లు సైతం లేవని వెల్లడించారు పోలీసులు. శ్రావణి హస్తినాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డెంటల్ డాక్టర్‌గా విధులు నిర్వహించేవారు. ఇదిలా ఉంటే.. నెల వ్యవధిలో ఆ కుటుంబంలో ఇది రెండో విషాదం. సుమారు 25 రోజుల కిందటే శ్రావణి తల్లి గుండెపోటుతో కన్నుమూయడం గమనార్హం. దీంతో ఆ కుటుంబం శోకంలో మునిగిపోయింది. సెప్టెంబర్ 21వ తేదీన ఓలా బైక్ బుక్ చేస్కొని శ్రావణి వెళ్తుండగా.. గుర్తు తెలియని కారు ఒకటి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓలా బైక్ డ్రైవర్ వెంకటయ్య, శ్రావణి గాయపడగా.. పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రావణి పరిస్థితి విషమంగా మారింది. చివరకు ఆమె తుది శ్వాస విడిచింది. ఇక సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు ఇబ్రహీంను గుర్తించారు పోలీసులు. ఇదీ చదవండి: న్యూడ్ కాల్స్‌తో ఆమె నన్ను వేధిస్తోంది సార్.. -
Tooth Extraction: ఇదేం పైత్యం.. 13 పళ్లు రాలగొట్టుకున్న మహిళ!
లండన్: ఏదైనా గొడవ జరిగితే నీ పళ్లు రాలగొడతా అని తిడతారు. ఎవరైనా కొడితే ఒకటో రెండో పళ్లు రాలిన సంఘటనలు ఉన్నాయి. కానీ, తమకు తామే సొంతగా పళ్లు రాలగొట్టుకున్నవారు ఎవరైనా ఉన్నారా? అంటే నేనున్నానని చెబుతున్నారు బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ. దంత వైద్యుడు లేడనే కారణంతో 13 పళ్లు రాలగొట్టుకుంది. ఇదెక్కడి పైత్యంరాబాబు అనిపిస్తోంది కాదా? కానీ, దానికొక కారణం లేకపోలేదు లెండీ. బూరి సెయింట్స్ ఎడ్మండ్స్కు చెందిన డేనియల్ వాట్స్ అనే 42 ఏళ్ల మహిళ దీర్ఘకాలంగా చిగుళ్ల వ్యాధితో బాధపడుతోంది. అయితే.. ఆమెకు పరిచయం ఉన్న స్థానిక ఎన్హెచ్ఎస్ డెంటిస్ట్ ఏడేళ్ల క్రితమే తన క్లినిక్‌ను మూసివేయటం వల్ల నిస్సహాయురాలిగా మారిపోయారు. ఆ తర్వాత మరో ‘ఈ బాధతోనే రోజులు గడుపుతున్నా. పెయిన్‌కిల్లర్స్ తీసుకుంటూ పనికి వెళ్తున్నా.నా పిల్లలు కనిపిస్తే నవ్వలేకపోతున్నా. కనీసం తెలిసివారితోనూ సరిగా మాట్లాడలేకపోతున్నా.’ అని తెలిపారు డేనియల్ వాట్స్. ఇంకా 8 తొలగించాలి.. ఆమె ఇప్పటికే 14 పళ్లను తొలగించుకున్నారు. ఇంకా ఎనిమిది తొలగించాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెకు ప్రైవటు ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు.. స్థానిక కౌన్సిలర్ కాటీ పార్కర్ 1500 పౌండ్లు విరాళాలు సేకరించే పనిలో పడ్డారు.‘డేనియల్ కోసం విరాళాలు సేకరించటం సంతోషంగా ఉంది. ఆమె ఇందుకు ఒప్పుకోదు కానీ, చేయాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు. తన కోసం విరాళాలు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ముందుకు వస్తున్న నేపథ్యంలో కన్నీటిపర్యంతమయ్యారు డేనియల్. ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో వైద్యం చేసుకునేందుకు మైడెంటిస్ట్ వద్ద అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆగస్టు మధ్యలో పడాపోయిన నాలుగు దంతాలను తొలగించనున్నారు. మిగిలిన నాలుగు మరుసటి రోజున తీసేస్తారు. ‘అవును, నా పళ్లు ఎలాగైనా తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ, వాటిని నేనే తొలగించుకోనూ. పళ్లు లేకుండా, నొప్పితో తిరగాల్సి వస్తోంది.’ అని పేర్కొన్నారు డేనియల్. ఇదీ చదవండి: గులాబీ వర్ణంలోకి ఆకాశం.. సినిమాను తలపించిన దృశ్యం.. ఏలియన్స్ పనేనా? -
దంత వైద్యునితో వివాహం.. ఆర్ఐ ఆత్మహత్య..
సాక్షి, గంగావతి (కర్ణాటక): కొప్పళ నగరసభలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న చైత్ర(28) సిరుగుప్పలోని స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెకు కొన్నేళ్ల క్రితం దంత వైద్యునితో వివాహమైంది. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె ఆత్మహత్యకు దారితీసిన కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. తల్లి లేని జీవితం వద్దని ... శివమొగ్గ: రెండు నెలల క్రితం తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె మరణాన్ని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని మైదూళలు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సూరజ్ (28) తల్లి మరణంతో మనోవేదనలో ఉంటున్నాడు. సోమవారం ఉదయం తన తోటకు వెళ్లాడు. అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. భద్రావతి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
విశాఖ జిల్లా ఆనందపురం ఎంపీపీగా డెంటల్ డాక్టర్
-
మాస్కుతో ఇబ్బందులు.. పీల్చిన గాలే పీల్చి..!
సాక్షి,హైదరాబాద్: ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్కు తప్పనిసరి. కరోనా బారినపడకుండా ఉండేందుకు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మాసు్కలు ధరిస్తున్నారు. చాలాసేపు మాస్కు ధరించడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తోంది. ఇది పరోక్షంగా గొంతు నొప్పి, చిగుళ్లవాపు, బ్లీడింగ్ సమస్యలకు కారణమవుతోందని దంత వైద్య నిపుణలు చెబుతున్నారు. కనీసం ఆరు నెలలకోసారైనా నోటిని క్లీనింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇతర చికిత్సలతో పోలిస్తే.. దంత చికిత్సలు ఎమర్జెన్సీ కాకపోవడంతో చాలా మంది వీటిని వాయిదా వేసుకుంటున్నారు. కోవిడ్‌కు భయపడి గతేడాది నుంచి వీటికి దూరంగా ఉంటున్నారు. అయితే నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నోటిలో సూక్ష్మజీవులు పెరిగి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని దంత వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లపై ప్రముఖ దంత వైద్య నిపుణుడు డాక్టర్ చంద్రకాంత్ పలు సూచనలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 90 శాతం మందిలో దంత సమస్యలు.. ప్రస్తుతం జనాభాలో 90 శాతం మంది ఏదో ఒక దంత సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. 45 నుంచి 48 శాతం మంది పిప్పి పళ్ల సమస్యతో బాధపడుతుండగా.. 75 శాతం మంది చిగుళ్లవాపుతో ఇబ్బంది పడుతున్నారు. కరోనా వైరస్ ముక్కు, నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువ. జన సమూహంలోకి వెళ్లినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాక్ ధరించడం తప్పనిసరిగా మారింది. దీంతో పీల్చిన గాలే పీల్చడంతో నోటిలో బ్యాక్టీరియా వృద్ధి చెంది వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. నోటి దుర్వాసన, గొంతు నొప్పికే కాకుండా గుండె రక్తనాళాల పనితీరును దెబ్బతీస్తూ గుండెపోటుకు కారణమవుతుంది. నోరు ఎండిపోయి సూక్ష్మజీవుల వృద్ధి నిజానికి 6 నెలలకోసారి దంతాలను క్లీన్ చేయించుకోవాలి. లేదంటే దంతాల చుట్టూ పాచీ పేరుకుపోయి వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్‌కు నిలయంగా మారుతుంది. అనేక మంది చిగుళ్ల వ్యాధితో బాధపడుతున్నారు. దంతాల మధ్యలో పాచీ పేరుకుపోయి చిగుళ్ల సమస్యలు తలెత్తి దంతాలు పటుత్వాన్ని కోల్పోతాయి. రోజంతా మాస్కు ధరించడం వల్ల మంచినీరు తక్కువగా తీసుకోవడం వల్ల నోరు ఎండిపోతుంటుంది. దీంతో దుర్వాసన రావడమే కాకుండా బ్యాక్టీరియా, వైరస్ల వృద్ధికి కారణమవుతుంది. ఇప్పటికే కోవిడ్ టీకా తీసుకున్న వారు దంత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. పిప్పి పళ్లు ఉంటే బ్లాక్ ఫంగస్ ముప్పు.. కరోనా బారిన పడి, ఆస్పత్రుల్లో చేరిన వారిలో చాలామందికి స్టెరాయిడ్స్ అవసరమయ్యాయి. చికిత్సల్లో భాగంగా అవసరానికి మించి స్టెరాయిడ్స్ వాడటం వల్ల కొందరికి బ్లాక్‌ఫంగస్ సోకింది. స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడి ఇప్పటికే పిప్పి పళ్ల సమస్యతో బాధపడుతున్న వారికి బ్లాక్ ఫంగస్ ముప్పు ఎక్కువ. బ్లాక్ ఫంగస్ లక్షణాల్లో చిగుళ్లు, దవడ వాపు కూడా లక్షణం కావడంతో ఏది బ్లాక్ ఫంగసో? ఏదీ చిగుళ్ల వాపు వ్యాధో? గుర్తించడం వైద్యులకు కష్టంగా మారింది. పిల్లల్లో కూడా దంతాలను సరిగా శుభ్రం చేయకపోవడం, ఏడాదిగా ఫాలోఅప్ చికిత్సలకు దూరంగా ఉండటంతో వారిలోనూ దంత సమస్యలు రెట్టింపయ్యాయి. చదవండి: దాడి చేశాకే తీవ్రత తెలిసేది.. సెకండ్‌వేవ్‌కు అదే కారణం -
కరోనా: ఈ వ్యాధి ఉన్నోళ్లు జర జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: చిగుళ్ల వ్యాధితో కరోనా వైరస్ త్వరగా శరీరంలోకి ప్రవేశిస్తుందని డాక్టర్ గౌడ్స్ డెంటల్ పరిశోధనా బృందం అధిపతి డాక్టర్ వికాస్‌గౌడ్ వెల్లడించారు. చిగుళ్లు చెడిపోయినప్పుడు వైరస్ సులువుగా ఊపిరితిత్తుల్లోకి లేదా నేరుగా రక్తంలోకి వెళ్తుందని తెలిపారు. అంతర్జాతీయ జర్నల్స్‌లో గత కొన్నాళ్లుగా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈ వివరాలు తెలిపారు. నోటి పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వల్ల, చిగుళ్ల వాపు ద్వారా వైరస్ తీవ్రతను పెంచుతాయని ఓ ప్రకటనలో వివరించారు. చిగుళ్ల వద్ద ఉండే వాహకాలు (ఏసీఈ–2) వైరస్‌ను శరీరంలోకి తీసుకెళ్తాయని పేర్కొన్నారు. మధుమేహం, విటమిన్–సి కొరత, కేన్సర్, పొగాకు, గుట్కా వినియోగించే వారికి చిగుళ్ల సమస్యలు ఎక్కువగా వస్తాయని, వీరికి మరింత ఎక్కువ ప్రమాదం ఉంటుందని తెలిపారు. అందుకే 6 నెలలకో సారి వైద్యులను సంప్రదించి, వారి పర్యవేక్షణలో దంతాలను శుభ్రం చేయించుకోవాలని సూచించారు. ఉబ్బిన చిగుళ్లతో వైరస్ లోడ్ పెరుగుతుందని, నోటి పరిశుభ్రతను పాటించడం ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్ రేటు తగ్గుతుందని వివరించారు. (చదవండి: తెలంగాణ మాజీ మంత్రి చందూలాల్ కన్నుమూత) -
వ్యాక్సిన్: దంత వైద్యురాలి ఆరోగ్యం విషమం
సాక్షి, ఒంగోలు టౌన్: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న దంత వైద్యురాలు ధనలక్ష్మి ఆరోగ్యం విషమించింది. ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన ధనలక్ష్మి (24) కోవిడ్ వైద్యుల నియామకం కింద దాదాపు ఏడు నెలల క్రితం ఒంగోలులోని జీజీహెచ్‌లో చేరారు. ఈనెల 23న కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నారు. 26న జ్వరం రావడంతో జీజీహెచ్ ప్రత్యేక వార్డులో చేర్చారు. అక్కడ ఒక్కసారిగా బీపీ డ్రాప్ అవుతుండటాన్ని గమనించిన వైద్యులు వెంటనే రమేష్ సంఘమిత్ర హాస్పిటల్‌కు తరలించారు. ఆమెలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కలెక్టర్ పోల భాస్కర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అర్ధరాత్రి 12.50 గంటలకు అంబులెన్స్‌లో చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. చదవండి: (వికటించిన వ్యాక్సిన్.. ఆశ కార్యకర్త బ్రెయిన్ డెడ్!) (వ్యాక్సిన్: బ్రెయిన్ డెడ్ అయిన ఆశా వర్కర్ మృతి) -
ఓ దంత దేవతా! పన్ను మిస్సింగ్ ఇక్కడ
క్రిస్మస్ తాత కానుకలతో సర్ప్రైజ్ చేస్తాడు. ఈస్టర్ బన్నీ ఇన్నిన్ని బొమ్మలు తెచ్చిస్తుంది. పాశ్చాత్య దేశాల్లో పిల్లల కోసం..పెద్దలు సృష్టించిన ఫీల్ గుడ్ భావనలివి. అలాంటిదే మరొకటి.. టూత్ ఫెయిరీ. పిల్లల పాల పళ్లు ఊడిపోతే పరిహారంగా.. ధనాన్ని ఇచ్చిపోతుంది ‘టూత్ ఫెయిరీ’. అంటే.. దంత దేవత. కెనడాలోని ఓ స్కూల్లో పన్నూడిన పిల్లాడికి..గోల్డ్ కాయిన్ ఇచ్చి వెళ్లింది టూత్ ఫెయిరీ. ఆ దేవత ‘శాండీ’ అని లోకానికి తెలుసు. ఆ పిల్లాడికి పెరిగి పెద్దయ్యాక తెలుస్తుంది. హార్ట్ ఐలాండ్స్ ఎలిమెంటరీ స్కూల్. ప్రిన్స్ జార్జ్ టౌన్. కెనడా. ఆ స్కూలు వైస్–ప్రిన్సిపాల్ శాండీ వైట్‌హెడ్. ప్రిన్సిపాల్ ఉన్నారు కానీ, వైస్ ప్రిన్సిపాల్‌గా శాండీనే పిల్లల చదువుల్ని, వారి లైంచ్ టైమ్‌ని పర్యవేక్షిస్తుంటారు. ఆ రోజు లంచ్ బెల్ మోగిన కొద్దిసేపటికి శాండీ దగ్గరకు ఒక ముఖ్యమైన వర్తమానం చేరింది. ఐదేళ్ల గవిన్ పాల పన్ను ఊడిపోయింది. ఊడి, ఎక్కడ పడిందో ఎవరికీ కనిపించడం లేదు. గవిన్ని ఆఫీస్ రూమ్‌కి పిలిపించలేదు శాండీ. గవిన్ దిగాలుగా కూర్చొని ఉన్న లంచ్ రూమ్‌లోకి తనే స్వయంగా వెళ్లారు. ‘ఏదీ.. నోరు తెరువు’ అన్నారు. గవిన్ నోరు తెరిచాడు. ఆ పలు వరుసలో ఒక పన్ను మిస్సింగ్! అప్పుడే ఊడిపడిపోయినట్లుగా పచ్చిగా ఉంది ఆ ఖాళీ స్థలం. ‘‘అంతా వెతికాం మేమ్. గవిన్ పన్ను కనిపించలేదు’’ అని చెప్పారు గవిన్ క్లాస్మేట్స్ శాండీ చుట్టూ చేరి. ‘ఏం చేద్దాం?’ అన్నట్లు దీర్ఘాలోచనగా ముఖం పెట్టారు కొందరు చిన్నారులు. ‘‘గవిన్ పన్ను ఇక ఎప్పటికీ దొరకదా?’’ అని నిరామయంగా చూస్తున్నారు మిగతా చిన్నారులు. గవిన్ మౌనంగా ఉన్నాడు. ‘‘ఏమాలోచిస్తున్నావ్ గవిన్?’’ అని అడిగారు శాండీ. ‘‘మా మమ్మీ డాడీ ఏమంటారోనని..’’ అన్నాడు గవిన్ మెల్లిగా. వాడికి ఏడుపు రాబోతోంది. పన్నును తనే పడేసుకున్నట్లు ఫీల్ అవుతున్నాడు. ‘‘ఏం కాదులే. మమ్మీ డాడీకి నేను చెప్తాను’’అన్నారు శాండీ. ‘‘మరి.. పన్ను పోయినందుకు టూత్ ఫెయిరీ నాకు మనీ ఇస్తుందా?’’ అని అడిగాడు గవిన్. ‘‘నిజమే. టూత్ ఫెయిరీ ఉంది కదా. అడుగుతాం. తప్పక ఇస్తుంది’’ అని గవిన్ బుగ్గ పుణికి పిల్లలందర్నీ లంచ్ రూమ్‌కి పంపించారు శాండీ. ∙∙ గవిన్ పన్ను ఊడింది జనవరి 12 మధ్యాహ్నం. ఆ మధ్యాహ్నమే శాండీ ‘టూత్ ఫెయిరీ’కి లెటర్ రాసి నోటీస్ బోర్డులో పెట్టారు! ఆ లెటర్ కూడా మామూలు కాగితం మీద కాదు. స్కూల్ లెటర్‌హెడ్ మీద!! ౖటైప్ చేసిన ఆ లెటర్ కింద శాండీ తన సంతకం కూడా పెట్టారు. ఆ లెటర్లో ఇలా ఉంది: ‘‘డియర్ టూత్ ఫెయిరీ, ఈరోజు గవిన్ లంచ్ చేయడం కోసం రెడీ అవుతుండగా ఆ చిన్నారి పాల పన్ను ఒకటి ఊyì పోయింది. అది క్లాస్ రూమ్‌లోనే ఎక్కడో పడింది కానీ, ఎంత వెతికినా ఎవరికీ కనిపించలేదు. ఎంతో సాహసోపేతమైన మా చిన్నారి టీమ్ మొత్తం నిర్భయంగా ఆ పన్ను కోసం గాలించింది. అయినప్పటికీ పన్ను ఎవరి కంటా పడలేదు. నేను సుశిక్షితురాలైన వైస్–ప్రిన్సిపాల్‌ని. అంతేకాదు. హాబీ డెంటిస్ట్‌ని. అభిరుచి కొద్దీ నేర్చుకున్న దంత పరిజ్ఞానం నాక్కొంత ఉంది. ఆ పరిజ్ఞానంతో మొదట నేను గవిన్ని నోరు తెరవమని అడిగాను. తెరిచాడు. నిజమే. ఒక పన్ను తన స్థానం నుంచి రాలిపోయింది! రాలి పడిన గుర్తుగా అక్కడ ఖాళీస్థలం కనిపించింది. ఉదయం గెవిన్ స్కూల్‌కి వచ్చినప్పుడు అక్కడ ఆ ఖాళీ స్థలం లేదని నిశ్చయంగా చెప్పగలను. కనుక దయచేసి ఓ దంత దేవతా.. ఈ లెటర్ ను అధికారిక పరిశీలనకు స్వీకరించి, నిజంగా పోయిన పన్నుకు ప్రామాణికమైన విలువను నిర్ణయించి ఆ విలువకు సరిపడా డబ్బును గెవిన్కు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. ఈ విషయమై నీకేమైనా సందేహాలు ఉంటే ఈ లెటర్లో పైన కనిపిస్తున్న చిరునామాకు పంపేందుకు సంకోచించనవసరం లేదు. సిన్సియర్లీ శాండీ ఎం. వైట్‌హెడ్. పి.ఎస్ – నా పన్ను 2000 సంవత్సరంలో ఊడిపోయింది. ఇప్పటి వరకు నాకు అందవలసిన మొత్తం అందనేలేదు. కనుక సాధ్యమైనంత త్వరగా పంపించగలవు. నేను చెల్లించవలసిన బిల్లులు ఉన్నాయి. ∙∙ వారం గడిచింది. ఇరవై ఏళ్ల క్రితం ఊడిపోయిన శాండీ పన్నుకు పరిహారం రాలేదు. వారం క్రితం ఊడిన గెవిన్కి మాత్రం రెండో రోజే వచ్చింది! ‘‘ఉదయాన్నే లేచి చూశాను. ఒక గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్‌ను తెచ్చిచ్చి, నాకు ఇవ్వమని చెప్పి వెళ్లిపోయిందట టూత్ ఫెయిరీ’’ అని గెవిన్.. మేడమ్ శాండీకి చెప్పాడు తొర్రి పన్ను కనిపించేలా నవ్వుతూ. శాండీ కూడా ‘గుడ్’ అని నవ్వారు. ఆమె రాసిన లెటర్ ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ అవుతోంది. అంతమంచి లెటర్ రాసిన శాండీకి, గెవిన్ ముఖంలో సంతోషాన్ని ఎలా తెప్పించాలో తెలియకుండా ఉంటుందా?! నెట్ నిండా ఆమెకు అభినందనలే అభినందనలు. ఇలాంటి టీచర్ ఉండాలి అని. -
డెంటల్ డాక్టర్ కిడ్నాప్ కథ సుఖాంతం
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో కిడ్నాపైన డెంటల్ డాక్టర్ హుస్సేన్ కథ సుఖాంతమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ హుస్సేన్ అకౌంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉందని అతడి బంధువు ముస్తఫా తెలుసుకున్నాడు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ముస్తఫా డాక్టర్‌ను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని ప్లాన్ చేశాడు. ప్లాన్ అమలులో భాగంగా కిడ్నాప్ చేసేందుకు కొంతమందిని మాట్లాడుకొని హుస్సేన్‌ను కిడ్నాప్ చేశారు. అనంతరం కిడ్నాపర్లు డబ్బుల కోసం హుస్సేన్ కుటుంబ సభ్యులకు వాట్సాప్ కాల్ చేశారు. ఆ డబ్బులు కూడా బిట్‌కాయిన్ రూపంలో కావాలని డిమాండ్ చేశారు. మొబైల్ నంబర్ ఆధారంగా వెహికల్ని ట్రేస్ చేసిన సైబరాబాద్ పోలీసులు ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయిన ఏపీ పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ నిర్వహించగా.. అనంతపురం జిల్లా తపోవనం దగ్గర ఓ వాహనం ఆగకుండా వేగంగా వెళ్లడాన్ని గుర్తించిన పోలీసులు దానిని వెంబడించారు. రాప్తాడు మండలం బుక్కచర్ల వద్ద పోలీసులు కిడ్నాపర్ల వాహనాన్ని చేజ్ చేసి డాక్టర్ హుస్సేన్‌ను రక్షించారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (డెంటల్ డాక్టర్ కిడ్నాప్) కిడ్నాప్ ఉదంతాన్ని పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం డాక్టర్ హుస్సేన్ కిడ్నాపయ్యారు. రాత్రయినా హుస్సేన్ ఇంటికి తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్లు అనంతపురం మీదుగా బెంగళూరు వెళ్తున్నట్టు గుర్తించారు. వెంటనే అనంతపురం ఎస్పీ సత్యయేసుబాబుకు కిడ్నాపర్ల కదలికలపై సమాచారమిచ్చారు. దీంతో అనంతపురం ఎస్పీ జిల్లాలోని చెక్‌పోస్ట్‌లను అలర్ట్ చేశారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో తపోవనం దగ్గర ఓ వాహనం ఆగకుండా వేగంగా వెళ్లడాన్ని గుర్తించిన పోలీసులు దానిని వెంబడించారు. రాప్తాడు మండలం బుక్కచర్ల వద్ద పోలీసులు కిడ్నాపర్ల వాహనాన్ని చేజ్ చేసి డాక్టర్ హుస్సేన్‌ను రక్షించారు. కిడ్నాపర్ల వద్ద నుంచి రివాల్వర్, కత్తి, మత్తు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై రాప్తాడు సీఐ మాట్లాడుతూ.. రూ.10 కోట్ల కోసం డాక్టర్ హుస్సేన్‌ను కిడ్నాప్ చేశారు. డబ్బు ఇవ్వాలని లేదంటే చంపుతామని కిడ్నాపర్లు బెదిరించారు. హైదరాబాద్‌లో కిడ్నాప్ చేసిన అనంతరం బెంగళూరుకు తరలిస్తుండగా కిడ్నాపర్లను పట్టుకున్నారు. -
డెంటల్ డాక్టర్ కిడ్నాప్
సాక్షి, రాజేంద్రనగర్/అత్తాపూర్: రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం ఓ డెంటల్ డాక్టర్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. కిస్మత్పూర్ ప్రాంతంలోని ప్రెస్టేజ్ విల్లాలో నివసిస్తున్న డాక్టర్ హుస్సేన్ (50) ఇదే ప్రాంతంలోని ఎక్సైజ్ పోలీస్ అకాడమీ పక్క కాలనీలో ఓ అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పనులు పరిశీలించేందుకు తన కారులో డ్రైవర్‌తో కలిసి వచ్చాడు. అపార్ట్మెంట్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తుండగా, బురఖా వేసుకున్న ఆరుగురు వ్యక్తులు అపార్ట్మెంట్ ప్రాంతానికి చేరుకున్నారు. (సైకో డాక్టర్.. భార్య కాపురానికి రాలేదని..) రెండవ అంతస్తులో కార్మికులతో మాట్లాడుతున్న హుస్సేన్‌ను బంధించి బలవంతంగా ఆయన కారులోనే తీసుకెళ్లారు. దీంతో డ్రైవర్, బిల్డింగ్‌లో పనిచేస్తున్న కార్మికులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. హుస్సేన్ కుటుంబ సభ్యులు 100 నంబర్‌కు ఫోన్ చేయడంతో పాటు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ ఆశోకచక్రవర్తితో పాటు శంషాబాద్, మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను, వాహనం వెళ్లిన ప్రాంతాలలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. హుస్సేన్‌కు ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. -
26 పోస్టులకు 3,278 దరఖాస్తులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులకు భారీ డిమాండ్ నెలకొంది. 26 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఏకంగా 3,278 దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనం. జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ పోస్టులకు కూడా అభ్యర్థుల నుంచి మంచి స్పందన లభించింది. 2010 తర్వాత ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో మెడికల్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేశారు. ► తాజాగా విడుదల చేసిన ప్రొవిజనల్ మెరిట్ జాబితా ప్రకారం మొత్తం 718 పోస్టులకు 4,430 దరఖాస్తులు వచ్చాయి. ► గైనకాలజీ విభాగంలో 333 పోస్టులుండగా 189 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మార్కెట్లో గైనకాలజిస్టులకు డిమాండ్ ఉండటంతో ఎక్కువ మంది ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లకే మొగ్గు చూపారు. ► దరఖాస్తులపై ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 16 వరకు రాతపూర్వకంగా ఇవ్వొచ్చు. ► ఆ తర్వాత ఒరిజినల్ మెరిట్ జాబితా ప్రకటించి రెండ్రోజుల్లోనే నియామక ఉత్తర్వులిస్తారు. ► ఎంపికైన వైద్యులు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో పనిచేయాల్సి ఉంటుంది. -
మామయ్యను సాగనంపి...
శ్రీకాకుళం, సోంపేట: కుమారుడు ప్రయోజకుడై కుటుంబాన్ని పోషించాలని, గ్రామంలో తమకు మంచి పేరు తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. తల్లిదండ్రులు కన్న కలలకు అనుగుణంగానే ఆ కుమారుడు కష్టపడి చదివాడు. ప్రయోజకుడు అయ్యాడు. గ్రామస్తులకు తోడునీడగా ఉంటూ, కుటుంబం బాధ్యతలు మోస్తూ అందరినోటా మంచివాడుగా పేరు తెచ్చుకున్నాడు. అంతా సక్రమంగా జరిగి ఉంటే మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుని తల్లిదండ్రులు, కుటుంబంతో హాయిగా గడిపేవాడు. ఇంతలో విధి వక్రీకరించింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో టి.శాసనాం గ్రామానికి చెందిన ప్రైవేటు వైద్యుడు వెదుళ్ళ భీమశంకర్ దుర్మరణం చెందాడు. ఈ సంఘటనపై బారువ పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టి.శాసనాం గ్రామానికి చెందిన వెదుళ్ళ కంగాళి, తులసమ్మ దంపతుల కుమారుడు భీమశంకర్. కంగాళి విశ్రాంత ఉపాధ్యాయుడు. వీరికి నలుగు కుమార్తెలు, కుమారుడు. కుమారుడు భీమశంకర్‌ను ముద్దుగా పెంచుకోవడంతో పాటు, వైద్యుడిని చేయాలని కలలు కన్నాడు. కలలు నిజం చేసే విధంగా భీమశంకర్ దంత వైద్యుడిగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాడు. సోంపేటలో ప్రాక్టీస్ ప్రారంభించిన భీమశంకర్, గత పది సంవత్సరాలుగా మందస మండలం హరిపురం, పలాస మండలంలోని కాశీబుగ్గలలో విఘ్నేష్ దంత వైద్యశాల నిర్వహిస్తూ, దంత వైద్యుడిగా ప్రజలతో మమేకమయ్యాడు. అయితే తన మామయ్య అజేయ్కుమార్ను హరిపురం రైల్వేస్టేషన్లో డీఎంయూ రైలు ఎక్కించడానికి తురకశాసనాం గ్రామం నుంచి భీమశంకర్, 9వ తరగతి చదువుతున్న తన మేనకోడలు జాగృతితో కలిసి మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కారులో బయలుదేరి వెళ్లారు. మామయ్యను హరిపురం రైల్వే స్టేషన్లో రైలు ఎక్కించి తర్వాత జాగృతి, భీమశంకర్ వారి నివాసానికి తిరిగి పయనమయ్యారు. టి.శాసనాం గ్రామానికి మరో ఐదు నిమిషాల్లో చేరుకోబోతుండగా సుమారు 5.30 గంటలకు మండలంలోని చినమామిడిపల్లి, మామిడిపల్లి గ్రామాల మధ్య కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొని, రహదారి పక్కన తోటలోకి 50 మీటర్లు వరకు వెళ్లిపోయింది. చెట్టుకు కారు ఢీకొట్టడంతో నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో భీమశంకర్ మృతి చెందాడు. జాగృతి వెనుక సీటులో ఉండడంతో స్వల్పగాయాలతో బయటపడింది. ప్రమాదానికి కారణం నిద్ర మత్తా, బ్రేక్ ఫెయిల్ అయిందా అనే విషయం తెలియలేదు. నిద్రమత్తులోకి జారుకుని చెట్టుకు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు, గ్రామస్తులు భావిస్తున్నారు. అటుగా వెళ్లిన మార్నింగ్ వాకర్స్ ప్రమాదాన్ని గుర్తించి మృతుని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. భీమశంకర్ మృతి విషయం తెలుసుకుని సంఘటనా స్థలంలో స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. సరదాగా కారులో వెళ్లిన జాగృతికి గాయాలు మామయ్యతో సరదాగా కారులో వెళ్లి తిరిగి రావచ్చునని భావించిన జాగృతికి కన్నీరు మిగిలింది. కారు చెట్టుకు ఢీకొట్టడం, మామయ్య చనిపోవడం కళ్లేదుటే చూసిన జాగృతి షాక్‌కు గురయింది. కారు ప్రమాదం జరుగుతుండగా ఏమి జరుగుతుందో తెలియక ఆందోళన చెందింది. కారులో ఇరుక్కుపోయి కొద్దినిమిషాలు భయభ్రాంతులకు లోనయింది. స్థానికులు వెళ్లి భీమశంకర్‌ను కారు నుంచి బయటకు తీసి, జాగృతిని ఓదార్చారు. కారులో వెళ్లిన నేను మామయ్య చావును చూడాల్సి వచ్చిందని జాగృతి తీవ్రంగా రోదిస్తుంది. కన్నీరుమున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు భీమశంకర్ తన పెద్ద అక్క కుమార్తె అనితను ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి పాప శ్రీమహి(3), శ్రీవెంకట మోహిత్(మూడు నెలలు) పిల్లలు ఉన్నారు. భీమశంకర్‌కు నలుగురు అక్కలు. కుటుంబ బాధ్యతను భీమశంకర్ మోస్తూ ఉన్నాడు. ఇతడి మృతితో ఆ కుటుంబ సభ్యుల రోదనను ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. కుమారుడి శవంపై çపడి తల్లి రోదించిన తీరు కన్నీరు తెప్పించింది. భార్య, తండ్రి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. టి.శాసనాంలో విషాదఛాయలు ప్రైవేటు వైద్యుడు భీమశంకర్ మృతితో టి.శాసనాం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మండలంలో ప్రముఖ వ్యక్తిగా ఉంటూ, అందరికీ సహాయ సహకారాలు అందించే వాడని, యువతకు మంచి మార్గం చూపించేవాడని స్నేహితులు తెలియజేస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే బతికి ఉన్నాడనే ఆశతో హరిపురం ఆస్పత్రికి తీసుకువెళ్లి, అక్కడి నుంచి సోంపేట సామాజిక ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. ఇక్కడ మృతదేహానికి శవపంచనామా నిర్వహించారు. సంఘటనా స్థలాన్ని సోంపేట సీఐ సన్యాసినాయుడు, బారువ ఎస్ఐ సందీప్ కుమార్ పరిశీలించారు. బారువ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాంగ్ కాల్ తెచ్చిన తంటా
కడప అర్బన్ : కడప నగరంలోని మారుతినగర్‌కు చెందిన ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌కు ఆదివారం రాంగ్ నెంబరుతోకాల్ వచ్చింది. ఆ సమయంలో ఎవరు మాట్లాడుతున్నారని సదరు వ్యక్తి అడిగితే, తాను దంత వైద్యకళాశాల విద్యార్థి అని చెప్పాడు. పొరపాటున వచ్చిందని అనడంతో సరిపెట్టుకోకుండా పరస్పరం ఫోన్లోనే వాగ్వివాదం జరిగింది. సవాళ్లు విసురుకున్నారు. దీంతో మారుతినగర్‌కు చెందిన సదరు వ్యక్తి పది మంది గుర్తు తెలియని వారిని వెంట తీసుకెళ్లి దంత వైద్య కళాశాల హాస్టల్ వద్దకు హుటాహుటిన వెళ్లాడు. ఆ సమయంలో విద్యార్థులు వీరిని చూసి పరారయ్యారు. అంతేకాకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు. రిమ్స్ ఎస్ఐ కుళాయప్ప కడప నగరం నుంచి దంత వైద్య కళాశాల హాస్టల్ వద్దకు మనుషులతో వచ్చినవారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎస్ఐని ఈ సంఘటనపై వివరణ కోరగా ఘర్షణ పడేందుకు వచ్చారని ప్రాథమికంగా తెలిసిందని, విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
తమిళనాడు, పెరంబూరు: వివాహేతర సంబంధం ఒక ఉద్యోగి ప్రాణం బలిగొంది. దీనికి సంబంధించి దంత వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మామల్లపురంలో కలకలం రేపింది. వివరాలు.. స్థానిక గిండికి చెందిన సెంథిల్‌రాజ్ (42) దంత వైద్యుడు. చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో గతంలో దంత వైద్యుడిగా పనిచేసిన ఈయన ప్రస్తుతం గిండిలోని ఒక ప్రైవేట్ కంపెనీలో చీఫ్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. వివాహితుడైన ఈయన భార్యతో విడాకులు పొందారు. కాగా ఈయన స్నేహితుడు సంజీవ్‌రాజ్ (33). ఉడుమలై పేటకు చెందిన ఇతను గిండీలో నివసిస్తూ ఆ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. ఇతను కూడా తన భార్యకు విడాకులిచ్చి విడిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో సెంథిల్‌రాజ్ మొదటి భార్యతో సంజీవ్‌రాజ్ వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ విషయం సెంథిల్రాజ్కు తెలిసింది. ఈ స్థితిలో పది మందికి పైగా స్నేహితులు క్రిస్మస్ పండగ సందర్భంగా శనివారం రాత్రి మామల్లపురంలోని గెస్ట్ హౌస్‌లో విందు ఏర్పాటు చేసుకున్నారు. వారిలో సెంధిల్రాజ్, ఆయన భార్య, సంజీవ్‌రాజ్ కూడా ఉన్నారు. అందరూ కలిసి మద్యం సేవిస్తుండగా సెంథిల్‌రాజ్ ఆగ్రహంతో సంజీవ్రాజ్ను వివాహతేర సంబంధంపై ప్రశ్నిస్తూ కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని అక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనిపై మహాబలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని సెంథిల్రాజ్ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. సంజీవ్‌రాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. -
డెంటల్ వైద్యురాలి సూసైడ్ కలకలం
సాక్షి, హైదరాబాద్ : యువకుడి చేతిలో మోసపోయిన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. దిల్‌సుఖ్‌నగర్‌లో డెంటల్ డాక్టర్ గీతాకృష్ణ ఆత్మహత్యకి పాల్పడింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన నరేష్ అనే వ్యక్తితో జగిత్యాలకు చెందిన గీతాకృష్ణ గత కొంత కాలంగా ప్రేమలో ఉంది. దిల్‌సుఖ్‌నగర్‌లో ఆమె ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటోంది. పెళ్లి చేసుకుంటానని నరేష్ మోసం చేయటంతో మనస్థాపం చెందిన ఆమె సూసైడ్‌కి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కళ్లు బైర్లు కమ్మేటన్ని పళ్లు
ముంబై: కుడివైపు దవడ వాపుతో పది రోజుల క్రితం డెంటల్ డాక్టర్ దగ్గరవెళ్లాడు ఇక్కడి బుల్దానా ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల ఆషిక్ గవాయ్. పరీక్షలు చేసిన తర్వాత దంతంలోని అసాధారణ పెరుగుదల వల్ల దవడ ఎముకపై ప్రభావం పడి వాపు వచ్చిందని డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు. దానికి ఆపరేషన్ చేయడమే పరిష్కారమని నిర్ణయించుకుని సోమవారం ఆ పని ప్రారంభించారు. అంతే.. ఆషిక్ నోటి నుంచి ఒక్కో పన్ను బయటపడుతుంటే డాక్టర్లు నోళ్లు వెళ్లబెట్టారు. అలా ఆ అసాధారణ దంతం పక్కల నుంచి 232 చిన్న చిన్న పళ్లు తీశారు. తమ ఆస్పత్రి చరిత్రలోనే ఇప్పటివరకూ ఇలాం టి పన్ను చూడలేదంటూ ఆశ్చర్యపోయారు. అవన్నీ వేటికవే విడివిడిగా ఉంటూ ఒక దంతంలా అభివృద్ధి చెందాయని శస్త్రచికిత్స చేసిన జేజే ఆస్పత్రి డెంటల్ డిపార్ట్మెంట్ హెడ్ దివారే పల్వాంకర్ పేర్కొన్నారు. ఆ దంతం సైజు 3.5ఁ2 సెంటీమీటర్లతో రాయిలా ఉందని మంగళవారం చెప్పారు. ఆ పన్ను లోపల రాయి లాంటి గట్టి పదార్థం ఒకటుందని, దానిని డెంటిస్టుల డ్రిల్‌తో తీసే పరిస్థితి లేదన్నారు. పక్క దంతాలు, దవడ దెబ్బతినకుండా సుత్తి-సేనంతోనే దానిని జాగ్రత్తగా పగలకొట్టి తీయాలని చెప్పారు. పాల పళ్ల తర్వాత దశ నుంచి ఈ అసాధారణ పెరుగుదల ప్రారంభమై ఉంటుందని దివారే వివరించారు. దీనిని వైద్య పరిభాషలో ‘కాంప్లెక్స్ కాంపోజిట్ ఒడాన్టమ్’ అంటారని చెప్పారు. -
దంతాలు చూసి వయసు చెప్పొచ్చు
అన్నానగర్ : దంత వైద్యులు మీ దంతాలను పరీక్షించి మీరు ఏ సంవత్సరంలో పుట్టారో చెప్పే ఒక కొత్త టెక్నిక్ త్వరలో నగర ప్రజలకు అందుబాటులోకి రానుంది. వృక్షాల వయస్సును నిర్ధారించడానికి శాస్త్రవేత్తలు ఏ విధంగా అయితే వార్షిక వలయాల మీద ఆధారపడతారో సరిగ్గా అదే విధానానికి దగ్గరగా ఉండే శాశ్వత దంతాల్లోని పదార్థాన్ని విశ్లేషించడం ద్వారా దంత వైద్యులు మీరు ఏ సంవత్సరంలో, ఏ నెలలో పుట్టారో ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉందట. డెంటల్ డేటా టెక్నిక్ అనే పేరుతో ఇది అందుబాటులోకి రానుంది. మానవ నోటిలోని మోలార్స్, ప్రీమోలార్స్, కానైన్స్ ఇన్సిసార్స్ అనే మూడు రకాల దంతాలను ఈ టెక్నిక్ ద్వారా విశ్లేషిస్తారు. 32 దంతాలు పూర్తిగా ఏర్పడడానికి 192 నెలల కాలం పడుతుంది. అంటే ఒక్కొక్క పల్లు పూర్తిగా ఏర్పడడానికి ఆరు నెలలు పడుతుంది. అంటే అన్ని దంతాలు ఏర్పడడానికి 16 ఏళ్లు పడుతుంది. పూర్తిగా ఏర్పడిన దంతంలోని పల్స్ పైన పేరుకొన్న వృద్ధి కారకాలను అనుసరించి సదరు దంతం ఎన్నేళ్ల వయసునో నిర్ధారిస్తారు. దీని ఆధారంగా వ్యక్తి వయసును అంచనా వేసి దానిని సంవత్సరాల్లోని మార్చి రివర్స్ టైమ్, ఎనాలసిస్ పద్ధతి ద్వారా వచ్చిన మనిషి వయసును ఖచ్చితంగా లెక్కగ డుతారు. విదేశాల్లో ఈ పద్ధతి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఒక వేళ వ్యక్తి తాలుకూ బర్త్‌డే సర్టిఫికెట్లు ప్రభుత్వ రికార్డుల్లో నుంచి మాయమైతే అక్కడి వైద్యులు ఈ పద్ధతిని ఉపయోగించి వారి పుట్టిన తేదీ వివరాలను అందిస్తున్నారు. వ్యక్తి పుట్టిన తేదీలో అటు - ఇటుగా ప్లస్ ఆర్ మైనస్ ఆరు గంటల వ్యవధిలో దంత వైద్యులు వ్యక్తి పుట్టిన తేదీన, నెలను, సంవత్సరాన్ని విజయవంతంగా అందిస్తున్నారు. హాంగ్‌కాంగ్‌కు చెందిన ఒక డెంటల్ వైద్య సంస్థ ఇందుకు కావాల్సిన సాంకేతిక సాయాన్ని అందించడానికి ముందుకొచ్చిందని చెన్నై డెంటల్ సర్జన్ల సమాఖ్య తెలిపింది. -
అమ్మో ‘హా’సుపత్రి..!
పరిగి, న్యూస్‌లైన్: పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు కరువయ్యాయి. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండాల్సిన ఈ ఆస్పత్రిలో కనీసం పగలు కూడా ప్రజలకు చికిత్స అందడం లేదు. శనివారం ఉదయం 11 గంటలు దాటినా వైద్యులు ఆస్పత్రికి రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో మొత్తం నలుగురు అసిస్టెంట్ సివిల్ సర్జన్లు, ఇద్దరు సాధారణ వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఇద్దరు కాంట్రాక్టు వైద్యులు, ఒక డెంటల్ వైద్యుడు ఉన్నారు. అయితే వారు కూడా వెసులుబాటుని బట్టి రెండు రోజుల చొప్పున డ్యూటీలు చేస్తున్నారు. ఇలా మొత్తం నెలలో ఒక్కొక్కరు 10 రోజులు విధులకు హాజరవుతారు. కాగా శనివారం డ్యూటీ తనది కాదంటే తనది కాదంటూ ఎవరూ విధులకు హాజరుకాలేదు. రోజంతా విధులకు హాజరుకాని వైద్యులు పరిగి ఆస్పత్రికి ఉదయం 6-00 గంటల నుంచే రోగుల రాక ప్రారంభమైంది. అందులో ఆత్మహత్యాయత్నం, వడదెబ్బ, డెలవరీ వంటి సీరియస్ కేసులు కూడా ఉన్నాయి. ఉదయం 11 గంటల వరకు ఓపీ హాల్లో మొత్తం 200 మందికిపైగా రోగులు వైద్యుల గురించి వేచి చూస్తున్నారు. గంటల తరబడి వేచిచూసినా వైద్యులు రాకపోవడంతో రోగులు ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సిబ్బంది వైద్యులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చినా తమ డ్యూటీ కాదంటూ వైద్యుడు విధులకు రాలేదు. అందులో ఓ వైద్యుడు పరిగిలోనే తన ప్రైవేటు క్లీనిక్‌లోనే ఉన్నప్పటికీ విధులకు రానంటూ ఖరాకండిగా చెప్పేశాడు. శనివారం సంత కావడంతో ప్రైవుటు క్లీనిక్‌కు రోగులు అధిక సంఖ్యలో తరలివస్తారనే ఇలా చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో రోగులు పరిగి సీహెచ్ఎన్సీ ఎస్పీహెచ్ఓ డాక్టర్ దశరథ్కు ఫిర్యాదు చేశారు. చివరకు ఆయనే వచ్చి ఫోన్ చేసినా వైద్యులెవరు స్పందించలేదు. దీంతో తనకున్న ఫీల్డ్ విజిట్లు రద్దు చేసుకుని స్వయంగా ఎస్పీహెచ్ఓ ఓపీలో కూర్చొని రోగులకు వైద్యం చేశాడు.