లండన్: ఏదైనా గొడవ జరిగితే నీ పళ్లు రాలగొడతా అని తిడతారు. ఎవరైనా కొడితే ఒకటో రెండో పళ్లు రాలిన సంఘటనలు ఉన్నాయి. కానీ, తమకు తామే సొంతగా పళ్లు రాలగొట్టుకున్నవారు ఎవరైనా ఉన్నారా? అంటే నేనున్నానని చెబుతున్నారు బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ. దంత వైద్యుడు లేడనే కారణంతో 13 పళ్లు రాలగొట్టుకుంది. ఇదెక్కడి పైత్యంరాబాబు అనిపిస్తోంది కాదా? కానీ, దానికొక కారణం లేకపోలేదు లెండీ.
బూరి సెయింట్స్ ఎడ్మండ్స్‌కు చెందిన డేనియల్ వాట్స్ అనే 42 ఏళ్ల మహిళ దీర్ఘకాలంగా చిగుళ్ల వ్యాధితో బాధపడుతోంది. అయితే.. ఆమెకు పరిచయం ఉన్న స్థానిక ఎన్‌హెచ్‌ఎస్ డెంటిస్ట్ ఏడేళ్ల క్రితమే తన క్లినిక్‌ను మూసివేయటం వల్ల నిస్సహాయురాలిగా మారిపోయారు. ఆ తర్వాత మరో ‘ఈ బాధతోనే రోజులు గడుపుతున్నా. పెయిన్‌కిల్లర్స్ తీసుకుంటూ పనికి వెళ్తున్నా.నా పిల్లలు కనిపిస్తే నవ్వలేకపోతున్నా. కనీసం తెలిసివారితోనూ సరిగా మాట్లాడలేకపోతున్నా.’ అని తెలిపారు డేనియల్ వాట్స్.
ఇంకా 8 తొలగించాలి..
ఆమె ఇప్పటికే 14 పళ్లను తొలగించుకున్నారు. ఇంకా ఎనిమిది తొలగించాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెకు ప్రైవటు ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు.. స్థానిక కౌన్సిలర్ కాటీ పార్కర్ 1500 పౌండ్లు విరాళాలు సేకరించే పనిలో పడ్డారు.‘డేనియల్ కోసం విరాళాలు సేకరించటం సంతోషంగా ఉంది. ఆమె ఇందుకు ఒప్పుకోదు కానీ, చేయాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు. తన కోసం విరాళాలు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ముందుకు వస్తున్న నేపథ్యంలో కన్నీటిపర్యంతమయ్యారు డేనియల్.
ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో వైద్యం చేసుకునేందుకు మైడెంటిస్ట్ వద్ద అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఆగస్టు మధ్యలో పడాపోయిన నాలుగు దంతాలను తొలగించనున్నారు. మిగిలిన నాలుగు మరుసటి రోజున తీసేస్తారు. ‘అవును, నా పళ్లు ఎలాగైనా తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ, వాటిని నేనే తొలగించుకోనూ. పళ్లు లేకుండా, నొప్పితో తిరగాల్సి వస్తోంది.’ అని పేర్కొన్నారు డేనియల్.
ఇదీ చదవండి: గులాబీ వర్ణంలోకి ఆకాశం.. సినిమాను తలపించిన దృశ్యం.. ఏలియన్స్ పనేనా?
Comments
Please login to add a commentAdd a comment