dental treatment
-
గ్రామస్థాయిలోనే దంత వైద్యం
సాక్షి, అమరావతి : గ్రామస్థాయిలోనే అన్నిరకాల వైద్య సేవలను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వ్యయ, ప్రయాసలను తగ్గిస్తోంది. ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) స్థాయిలోనే వైద్యశాఖ దంత వైద్యసేవలు అందిస్తోంది. ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) పరిధిలోని ఆస్పత్రుల్లో 245 దంత వైద్య విభాగాలు పనిచేస్తున్నాయి. ప్రజలకు దంత వైద్యసేవలను చేరువ చేసేందుకు ఏపీవీవీపీ ఆస్పత్రుల్లోని దంత వైద్యులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,142 పీహెచ్‌సీలను అనుసంధానించారు. ఈ క్రమంలో దంత వైద్యులు నెలలో ఒకసారి ప్రతి పీహెచ్‌సీనీ సందర్శిస్తూ అక్కడే డెంటల్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. 2.14 లక్షల మందికి సేవలు.. నిజానికి.. రెండేళ్ల క్రితం పీహెచ్‌సీల్లో డెంటల్ క్లినిక్స్ నిర్వహణను ప్రారంభించారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీల్లో 35,151 డెంటల్ క్లినిక్‌లను నిర్వహించారు. వీటిల్లో 2,14,410 మంది పీహెచ్‌సీల్లో దంత వైద్యసేవలు అందుకున్నారు. పీహెచ్‌సీలకు వెళ్లే దంత వైద్యులు అక్కడే ప్రజలకు ఓరల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. చిన్నపాటి దంత సమస్యలకు పీహెచ్‌సీలోనే చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం అవసరం ఉంటే దగ్గర్లోని సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ప్రాథమిక దశలోనే సమస్యల గుర్తింపు చాలావరకూ ప్రజలు చిన్నచిన్న దంత సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇవి దీర్ఘకాలం పెద్ద సమస్యలుగా మారుతుంటాయి. ప్రాథమిక దశలోనే దంత సమస్యలను గుర్తించి నివారించడానికి చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా పీహెచ్సీ స్థాయిలోనే డెంటల్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నాం. తద్వారా ప్రజలు సులువుగా వైద్యులను సంప్రదించడానికి వీలుంటుంది. ఓరల్ స్క్రీనింగ్‌పై పీహెచ్సీ వైద్యులకు ఇప్పటికే శిక్షణ ఇప్పించాం. దీంతో ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామాలకు వెళ్తున్న పీహెచ్సీ వైద్యులు ఓరల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ ప్రాథమిక దశలోనే క్యాన్సర్ గుర్తింపునకు.. మరోవైపు.. ప్రాథమిక దశలోనే నోటి క్యాన్సర్ గుర్తించడానికి వైద్యశాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ జిల్లా కడప, విజయవాడ డెంటల్ కళాశాలలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోని బోధనాస్పత్రుల్లోని దంత వి భాగాలకు అధునాతన వెల్‌స్కోప్ పరికరాలను సమకూర్చారు. వీటిద్వారా నోటి క్యాన్సర్ అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిర్ధారిస్తున్నారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి మే నెల మధ్య ఐదుచోట్ల 1,676 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 61 మందిలో నోటి క్యాన్సర్ నిర్ధారణ అయింది. బాధితులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తోంది. -
Tooth Extraction: ఇదేం పైత్యం.. 13 పళ్లు రాలగొట్టుకున్న మహిళ!
లండన్: ఏదైనా గొడవ జరిగితే నీ పళ్లు రాలగొడతా అని తిడతారు. ఎవరైనా కొడితే ఒకటో రెండో పళ్లు రాలిన సంఘటనలు ఉన్నాయి. కానీ, తమకు తామే సొంతగా పళ్లు రాలగొట్టుకున్నవారు ఎవరైనా ఉన్నారా? అంటే నేనున్నానని చెబుతున్నారు బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ. దంత వైద్యుడు లేడనే కారణంతో 13 పళ్లు రాలగొట్టుకుంది. ఇదెక్కడి పైత్యంరాబాబు అనిపిస్తోంది కాదా? కానీ, దానికొక కారణం లేకపోలేదు లెండీ. బూరి సెయింట్స్ ఎడ్మండ్స్కు చెందిన డేనియల్ వాట్స్ అనే 42 ఏళ్ల మహిళ దీర్ఘకాలంగా చిగుళ్ల వ్యాధితో బాధపడుతోంది. అయితే.. ఆమెకు పరిచయం ఉన్న స్థానిక ఎన్హెచ్ఎస్ డెంటిస్ట్ ఏడేళ్ల క్రితమే తన క్లినిక్‌ను మూసివేయటం వల్ల నిస్సహాయురాలిగా మారిపోయారు. ఆ తర్వాత మరో ‘ఈ బాధతోనే రోజులు గడుపుతున్నా. పెయిన్‌కిల్లర్స్ తీసుకుంటూ పనికి వెళ్తున్నా.నా పిల్లలు కనిపిస్తే నవ్వలేకపోతున్నా. కనీసం తెలిసివారితోనూ సరిగా మాట్లాడలేకపోతున్నా.’ అని తెలిపారు డేనియల్ వాట్స్. ఇంకా 8 తొలగించాలి.. ఆమె ఇప్పటికే 14 పళ్లను తొలగించుకున్నారు. ఇంకా ఎనిమిది తొలగించాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెకు ప్రైవటు ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు.. స్థానిక కౌన్సిలర్ కాటీ పార్కర్ 1500 పౌండ్లు విరాళాలు సేకరించే పనిలో పడ్డారు.‘డేనియల్ కోసం విరాళాలు సేకరించటం సంతోషంగా ఉంది. ఆమె ఇందుకు ఒప్పుకోదు కానీ, చేయాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు. తన కోసం విరాళాలు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ముందుకు వస్తున్న నేపథ్యంలో కన్నీటిపర్యంతమయ్యారు డేనియల్. ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో వైద్యం చేసుకునేందుకు మైడెంటిస్ట్ వద్ద అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆగస్టు మధ్యలో పడాపోయిన నాలుగు దంతాలను తొలగించనున్నారు. మిగిలిన నాలుగు మరుసటి రోజున తీసేస్తారు. ‘అవును, నా పళ్లు ఎలాగైనా తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ, వాటిని నేనే తొలగించుకోనూ. పళ్లు లేకుండా, నొప్పితో తిరగాల్సి వస్తోంది.’ అని పేర్కొన్నారు డేనియల్. ఇదీ చదవండి: గులాబీ వర్ణంలోకి ఆకాశం.. సినిమాను తలపించిన దృశ్యం.. ఏలియన్స్ పనేనా? -
హైకోర్టులో ఉచిత దంత, కంటి చికిత్స శిబిరం
సాక్షి,హైదరాబాద్: హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్, రోహిణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి, దంత చికిత్స శిబిరాన్ని మంగళవారం హైకోర్టులో నిర్వహించారు. ఈ శిబిరాన్ని జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ప్రారంభించారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరంలో పలువురు న్యాయవాదులు కంటి, దంత చికిత్సతో పాటు మధుమేహ (షుగర్), రక్తపోటు (బీపీ)కు ఉచిత పరీక్షలు చేయించుకున్నారు. -
ఈఎన్టీ, దంత పరీక్షలకు తాత్కాలిక సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) సహా దంత వైద్య పరీక్షల నిర్వహణకు అవసరమైన వైద్యుల తాత్కాలిక నియామకానికి సర్కారు సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వైద్యులు సరిపోరన్న భావనతో తాత్కాలిక పద్ధతిలో తీసుకోవాలని భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వ వైద్యులను ఈ ప్రత్యేక పరీక్షలకు కేటాయిస్తే సంబంధిత ఆస్పత్రుల్లో సేవలకు అంతరాయం కలిగే అవకాశమూ ఉంది. ఈ రెండు కారణాలతోనే ప్రత్యేక రిక్రూట్మెంట్ జరపాలని భావిస్తోంది. వచ్చే నెల నుంచే పరీక్షలకు ఏర్పాట్లు చేస్తుండటంతో ఆగమేఘాల మీద భర్తీ ప్రక్రియ చేపట్టే అవకాశముందని చెబుతున్నారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం పచ్చజెండా ఊపిన తర్వాత జిల్లాల వారీగా ఎంపిక చేసే అవకాశముందని తెలిసింది. అయితే సమయం తక్కువగా ఉండటంతో ఎలా చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రెండు విడతలుగా పైలట్ ప్రాజెక్టు.. ఈఎన్టీ, దంత పరీక్షలు ఎలా చేయాలన్న దానిపై ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ పైలట్ ప్రాజెక్టులు చేపట్టింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో మొదటి విడత పూర్తయింది. రెండో విడతలో హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, జనగాం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద శిబిరాలు జరుగుతున్నాయి. ఈ శిబిరాల నుంచి వచ్చిన అనుభవాల ఆధారంగా కార్యాచరణ రూపొందిస్తా రు. ఆ మేరకు మార్గదర్శకాలను తయారు చేసి సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపిస్తారు. అక్కడినుంచి వచ్చే నిర్ణయానుసారం ఈ కొత్త కార్యక్రమం ప్రారంభం కానుంది. కంటి వెలుగు 6 నెలల్లోపే పూర్తి చేయగలిగితే, ఈఎన్టీ పరీక్షలు పూర్తి చేయడానికి ఏడాది పడుతుందని అంటున్నారు. ఆ మేరకే కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని చెబుతున్నారు. -
ఇక అందరికీ దంత పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ‘కంటి వెలుగు’కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రజలందరికీ ఈఎన్టీ, దంత పరీక్షలు నిర్వహించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రజలందరికీ వైద్య పరీక్షలు పూర్తి చేసి వారి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని భావిస్తోంది. అందు కు సంబంధించి మార్గదర్శకాలు తయారుచేయాలని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలను తాజాగా ఆదేశించింది. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టిసారించారు. మంత్రివర్గం ఏర్పాటయ్యాక వైద్య, ఆరోగ్య మంత్రి నేతృత్వంలో కసరత్తు చేస్తారు. కాగా, గత ఆగస్టు 15న ప్రారంభమైన ‘కంటి వెలుగు’కార్యక్రమాన్ని 6 నెలల పాటు కొనసాగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పథకం 6 నెలలు పూర్తయ్యాక ఈఎన్టీ, దంత పరీక్షలు ప్రారంభిస్తారు. వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నట్లు కనీసం 2 కోట్ల మందికి ఈఎన్టీ, దంత పరీక్షలు నిర్వహించే అవకాశముంది. ‘కంటి వెలుగు’కార్యక్రమం మాదిరిగా ప్రతి గ్రామంలోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ఈఎన్టీ, దంత స్క్రీనింగ్ చేశాక లోపాలను గుర్తించి వారికి చికిత్స, శస్త్రచికిత్సలు చేస్తారు. కంటి వెలుగు కింద 90% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదలే ఉపయోగించుకున్నందున ఈఎన్టీ, దంత పరీక్షలూ ఆయా వర్గాల వారికే ఉపయోగపడతాయని అంచనా వైద్య నిపుణుల జాబితా.. కంటి వెలుగు కింద ఇప్పటికే కోటి మందికి పరీక్షలు చేశారు. మరో కోటి మందికి చేసే అవకాశముంది. ఇప్పటికే లక్షలాది మందికి కంటి అద్దాలు ఇచ్చారు. ఈ విధంగానే రెండు కోట్ల మందికి ఈఎన్టీ, దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వినికిడి యంత్రాలు, ఆపరేషన్లు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే ఈఎన్టీ వైద్యులు, దంత వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణుల జాబితాను అధికారులు తయారు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అంతేకాదు లోపాలను సరిదిద్దడం, ఆపరేషన్లు చేయడానికి వీలుగా కొన్ని ప్రైవేటు ఈఎన్టీ, దంత ఆసుపత్రులతోనూ ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నారు. ఆయా శస్త్రచికిత్సలకు అవసరమైన సొమ్ము కూడా సంబంధిత ఆసుపత్రులకు ఇస్తారు. అందుకోసం ఎంత ఖర్చు అవుతుందో తేల్చాలని సర్కారు ఆదేశించింది. ప్రజలకు ఉన్న ఇతరత్రా అనారోగ్య సమస్యలను తెలుసుకొని వారి హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయనున్నారు. వారి బీపీ, షుగర్ సహా ఇతరత్రా అనారోగ్య సమస్యలను రికార్డు చేస్తారు. ప్రతి ఒక్కరికీ ఒక నంబర్ కేటాయిస్తారు. అలా చెకప్‌లో వచ్చిన లోపాల ఆధారంగా అవసరమైన వారికి వైద్యం చేస్తారు. లోపాలను సరిదిద్దేందుకు..! పేదలు చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ)కు సంబంధించిన సమస్యలను పెద్దగా పట్టించుకోరు. దీంతో అవి పెద్దవై సమస్యను తీవ్రంగా చేస్తాయి. పంటికి సంబంధించిన అంశాలపైనా దృష్టిపెట్టరు. చిన్నతనంలో వచ్చే మూగ, చెవిటికి సంబంధించిన లోపాలను రెండేళ్లలోపు గుర్తిస్తే పూర్తిగా నయం చేసే వీలుంటుందని వైద్యులు చెబుతున్నారు. పుట్టిన వెంటనే చెవుడును గుర్తించే పరికరాలూ ఉన్నాయి. పుట్టుకతో వచ్చే చెవిటిని నయం చేసే వీలుంది. అలాగే 50–60 ఏళ్లలో చెవుడు వచ్చే అవకాశం ఉంది. ఆయా లోపాలను సరిదిద్ది అవసరమైన వైద్యం చేసేందుకే ప్రభుత్వం ఈఎన్టీ, దంత వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించింది. కంటివెలుగు విజయవంతం కావడంతో ఈఎన్టీ పరీక్షలను కూడా అదేస్థాయిలో చేయాలని సర్కారు భావిస్తోంది. -
యనమల రూటే వేరయా!
-
పంటి వైద్యం ఇంటలేదా?!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పంటి చికిత్సకు దిక్కులేదా? అసలు రాష్ట్రంలో పంటి వైద్య నిపుణులే లేరా? మరి ఐదు లక్షల మంది ఉద్యోగులు, మూడు లక్షల మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు.. మరో 30 లక్షల మంది వైద్యం ఎక్కడ చేయించుకుంటున్నారు? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మారాయి. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దంత వైద్యం(రూట్‌కెనాల్) కోసం సింగపూర్ వెళ్లి రూ.2.88 లక్షల ప్రభుత్వ సొమ్ము వెచ్చించిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మంత్రులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు తదితరులకు వైద్యపరంగా ఎంత ఖర్చయితే అంత ప్రభుత్వమే చెల్లించాలన్న నిబంధనలున్నా.. రూట్‌కెనాల్ ట్రీట్మెంట్కు రూ.2.88 లక్షలా! అంటూ సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. బుధవారం యనమల దంతవైద్యానికి సంబంధించిన సొమ్ము విడుదల చేస్తూ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినా ఉద్యోగులకు గానీ, పెన్షనర్లకుగానీ, వారి కుటుంబ సభ్యులకుగానీ, 4 కోట్ల మంది ఆరోగ్యశ్రీ పేద రోగులకుగానీ.. హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుంటే డబ్బు చెల్లించేది లేదంటూ ఏకంగా సర్కారే నిబంధనలు విధించింది. పెద్ద పెద్ద జబ్బులకు రాష్ట్రంలో మౌలిక వసతులు లేకపోవడం, సరైన డాక్టర్లు లేకపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో సొంత డబ్బులు పెట్టుకుని ఇతర నగరాల్లో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి. ఉద్యోగులకు, పెన్షనర్లకు రూట్‌కెనాల్ ట్రీట్మెంట్కు ఒక్కో సిట్టింగ్‌కు రూ.3,500కు మించి లేదు. మొత్తం రమారమి రూ.10 వేల వరకూ ఖర్చవుతోంది. అలాంటిది ఒక్కసారి సింగపూర్‌లో రూట్‌కెనాల్ చేయించుకున్న యనమలకు రూ.2.88 లక్షలు చెల్లించడంపై సామాన్యులు, ఉద్యోగులు, పెన్షనర్లూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మనం ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకుంటే పన్ను వారికి వెళుతోంది కాబట్టి ఇక్కడే వైద్యం చేయించుకోవాలని చెప్పిన సర్కారు.. మరి మన పన్ను సింగపూర్‌కు వెళ్లదా.. అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులకోన్యాయం.. ఉద్యోగులకోన్యాయమా.. అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ దంత వైద్యకళాశాలకు చెందిన ఓ వైద్యుడు మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో ఆస్పత్రిని బట్టి, డాక్టర్‌ను బట్టి ఒక్కో సిట్టింగ్‌కు రూ.2,500 నుంచి రూ.3000 అవుతుందని.. మూడు సిట్టింగ్‌లలో ఈ వైద్యం పూర్తవుతుందని చెప్పారు. -
పంటి చికిత్స కోసం వెళ్లి గజినీ అయ్యాడు
లండన్: గజిని చిత్రం గుర్తుందిగా.. అందులో హీరోకి ఏ విషయమూ 15 నిమిషాలకంటే ఎక్కువ సేపు గుర్తుండదు. ఆ కాసేపట్లోనే అన్నీ మర్చిపోతుంటాడు. దీన్ని షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అంటారనే విషయం అప్పుడే అందరికీ తెలిసింది. అయితే అది సినిమా... కానీ ఇప్పుడు లండన్‌లో నిజంగానే ఓ గజిని అవతరించాడు. బ్రిటన్‌కు చెందిన ఓ 38 ఏళ్ల వ్యక్తి అచ్చం గజిని సినిమాలోలాగే కొత్త విషయమేదీ ఎక్కువ సేపు గుర్తుంచుకోడు. ఇతడి జ్ఞాపకశక్తి కేవలం 90 నిమిషాలే. ఆ తర్వాత అన్నీ కొత్తగానే ఉంటాయి. అయితే ఇతడు గజినిగా మారడానికి దోహదపడిన కారణం తెలిస్తే మాత్రం జాలేస్తుంది. దాదాపు పదేళ్ల క్రితం ఇతడు పంటి నొప్పితో ఓ వైద్యుడి వద్దకు వెళ్లాడు. అక్కడ వైద్యుడు అతడ్ని పరీక్షించి రూట్ కెనాల్ చికిత్స చేయాలని నిర్ణయించి, మత్తుమందు ఇచ్చాడు. చికిత్స పూర్తి అయినప్పటి నుంచి అతడు గతాన్ని మర్చిపోయాడు. ఇక అప్పటినుంచి అతడి జ్ఞాపకశక్తి కేవలం 90 నిమిషాలుగానే మారిపోయింది. పదేళ్ల నుంచి అతడు ఇదే సమస్యని ఎదుర్కొంటున్నాడు. నిద్రలేవగానే ప్రతిరోజూ ఉదయం తనకు దంతవైద్యుడి దగ్గరకు వెళ్లాలనుకుంటాడు. అప్పటివరకే అతడికి గుర్తుంది. అయితే తన పేరు, వివరాలు మాత్రం ఇప్పటికీ గుర్తున్నాయని అతడు తెలిపాడు.