
ఆసుపత్రిలో ధనలక్ష్మి
సాక్షి, ఒంగోలు టౌన్: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న దంత వైద్యురాలు ధనలక్ష్మి ఆరోగ్యం విషమించింది. ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన ధనలక్ష్మి (24) కోవిడ్ వైద్యుల నియామకం కింద దాదాపు ఏడు నెలల క్రితం ఒంగోలులోని జీజీహెచ్‌లో చేరారు. ఈనెల 23న కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నారు. 26న జ్వరం రావడంతో జీజీహెచ్ ప్రత్యేక వార్డులో చేర్చారు. అక్కడ ఒక్కసారిగా బీపీ డ్రాప్ అవుతుండటాన్ని గమనించిన వైద్యులు వెంటనే రమేష్ సంఘమిత్ర హాస్పిటల్‌కు తరలించారు. ఆమెలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కలెక్టర్ పోల భాస్కర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అర్ధరాత్రి 12.50 గంటలకు అంబులెన్స్‌లో చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. చదవండి: (వికటించిన వ్యాక్సిన్.. ఆశ కార్యకర్త బ్రెయిన్ డెడ్!)