health condition serious
-
ఖమేనీ ఆరోగ్యం విషమం?
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (85) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆయన వారసుడు ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. ఖమేనీ తనయుడు ముజ్తబా ఖమేనీ (55) తదుపరి సుప్రీం లీడర్ కావొచ్చని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఖమేనీ 1989 నుంచి సుప్రీం లీడర్‌గా ఉన్నారు. రుహొల్లా ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు, మరోవైపు దిగజారుతున్న ఖమేనీ ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఇరాన్లో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఘర్షణలు మరింత ముదరడం తాము కోరుకోవడం లేదని ఇరాన్ అధికారులు చెప్పారు. -
టీఎంసీ నేత ముకుల్ రాయ్ పరిస్థితి విషమం
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ రాయ్(70) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కోల్‌కతాలోని తన నివాసంలోని బాత్రూంలో ఈ నెల 4న ముకుల్ రాయ్ జారిపడ్డారు. తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజులుగా వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. శనివారం ఆయన ఆరోగ్యం విషమించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా ఆ యన డిమెన్షియా(మతిమరుపు వ్యాధి)తో బాధపడుతున్నట్లు కుటుంబస భ్యులు తెలిపారు. ముకుల్ రాయ్ టీఎంసీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. -
మనోహర్ జోషి పరిస్థితి ఆందోళనకరం
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి ఆరోగ్య స్థితి ఆందోళనకరంగా మారింది. శివసేన సీనియర్ నేత అయిన జోషిని మెదడులో రక్తస్రావంతో రెండు రోజుల క్రితం హుటాహుటిన ముంబైలోని పీడీ హిందూజా ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన స్పృహలోలేరని, దాదాపు కోమాలో ఉన్నారని ఆయన కుమారుడు ఉన్మేశ్ సోమవారం చెప్పారు. ‘ 85 ఏళ్ల జోషి ఐసీయూలో ఉన్నా వెంటిలేటర్ సాయంలేకుండా సాధారణ శ్వాస తీసుకుంటున్నారు. ప్రస్తుత రక్తస్రావం పరిస్థితి అదుపులో ఉంది’ అని ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్దేశ్ ఠాక్రే, ఆయన భార్య రష్మీ ఆస్పత్రికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెల్సుకున్నారు. 1995లో బీజేపీతో పార్టీ సంకీర్ణం అయ్యాక మహారాష్ట్రలో శివసేన నుంచి తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి పొందిన వ్యక్తి జోషియే. 1966లో శివసేన స్థాపించాక అప్పటినుంచీ జోషి అందులో సభ్యునిగా కొనసాగుతున్నారు. లోక్‌సభకు గతంలో స్పీకర్‌గా వ్యవహరించారు. ముంబై మేయర్‌గా సేవలందించారు. మహారాష్ట్ర శాసనసభలో విపక్షనేతగా కొనసాగారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. -
ప్రకాష్ సింగ్ బాదల్‌కు అస్వస్థత.. అమిత్ షా ఆరా
చండీగఢ్: శిరోమణి అకాలీదళ్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్(95) అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. బాదల్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివరాల ప్రకారం.. ప్రకాశ్ సింగ్ బాదల్ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కుటుంబసభ్యులు ఆయనను మొహాలీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడటంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. బాదల్ ఆరోగ్య పరిస్థితి విషయం తెలిసిన వెంటనే అమిత్ షా.. ప్రకాశ్ సింగ్ బాదల్ కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని అమిత్ షా ట్విట్టర్ వేదికగా తెలిపారు. “ప్రకాశ్ సింగ్ బాదల్ అనారోగ్యానికి గురయ్యారన్న వార్త నాకు చాలా బాధ కలిగిస్తోంది. ప్రకాశ్ సింగ్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి నేను సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు ఫోన్ చేసి తెలుసుకున్నా” అని షా ట్వీట్ చేశారు. Concerned to know that the veteran leader Shri Parkash Singh Badal Ji is unwell and admitted to hospital. Had a telephone discussion about his health with Shri Sukhbir Singh Badal Ji. I pray to God for his speedy recovery. — Amit Shah (@AmitShah) April 21, 2023 ఇదిలా ఉండగా.. గతేడాది కూడా ప్రకాష్ సింగ్ బాదల్ శ్వాస నాళాల ఆస్తమా కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఇక, 2022లో కోవిడ్ బారినపడ్డారు. అనంతరం, కరోనా నుంచి కోలుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా, ప్రకాష్ సింగ్ బాదల్.. ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక, -
విషమంగా ములాయం సింగ్ ఆరోగ్యం
లక్నో: సమాజ్‌వాదీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే.. సోమవారం వరకు ఆయనకు క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స అందించారు వైద్యులు. ఈ క్రమంలో ఇవాళ ఆరోగ్యం విషమించడంతో ఆయన్ని ఐసీయూలోకి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చికిత్సకు ఆయన శరీరం సహకరించడం లేదని, పరిస్థితి మెరుగుపడడం లేదని వైద్యులు చెప్తున్నారు. ఈ మేరకు హెల్త్ బులిటెన్‌ను పార్టీ వర్గాలు ట్విటర్ ద్వారా ధృవీకరించాయి. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాయి. मेदांता अस्पताल ने जारी किया आदरणीय नेताजी का हेल्थ बुलेटिन। हम सभी आदरणीय नेताजी के जल्द स्वस्थ और दीर्घायु होने की कामना करते हैं। pic.twitter.com/myCZJIzKMY — Samajwadi Party (@samajwadiparty) October 4, 2022 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్.. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా పని చేశారు. ప్రస్తుతం మణిపురి(యూపీ) పార్లమెంట్ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. అనారోగ్య సమస్యలతో ఈ ఆగస్టు నుంచి మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఆదివారం(అక్టోబర్ 2న) ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఇదీ చదవండి: జమ్ములో రక్తపాతమా? ఏమైందిప్పుడు?- అమిత్ షా -
ములాయం హెల్త్ కండీషన్ సీరియస్.. హుటాహుటిన ఆసుపత్రికి అఖిలేష్!
Mulayam Singh.. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్(82) ఆరోగ్య విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ములాయంను గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. అయితే, కొద్దిరోజులుగా పలు రకాల ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటున్న ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి ఆదివారం విషమంగా మారిందని వైద్యులు తెలిపారు. కాగా, మూలయంకు డాక్టర్ సుశీల కటారియా ఆధ్వర్యంలో వైద్య చికిత్స జరుగుతోందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఇక, ములాయం సింగ్ హెల్త్ కండీషన్ గురించి తెలుసుకున్న అఖిలేష్ యాదవ్ హుటాహుటిన ఢిల్లీ నుంచి ఆసుపత్రికి చేరుకున్నట్టు సమాచారం. #SamajwadiParty founder Mulayam Singh Yadav shifted to ICU at Gurugram's Medanta hospitalhttps://t.co/dVN0bXMzca — TIMES NOW (@TimesNow) October 2, 2022 -
Lalu Prasad Yadav: లాలూ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం
న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆయన శరీరంలో కదలికలు లేవని తనయుడు తేజస్వీ యాదవ్ తెలిపారు. ఇప్పటి వరకు వైద్యులు చాలా మందులు ఇచ్చారని, అయినా ఎలాంటి పురోగతి లేదని చెప్పారు. వైద్యులు మరోసారి పరిశీలించిన తర్వాత ఏం చేయాలనే దానిపై తేజస్వీ యాదవ్ నిర్ణయం తీసుకుంటామన్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోతే సింగపూర్ తీసుకెళ్తామని తేజస్వి యాదవ్ ఇది వరకే వెల్లడించారు. ఇంట్లో మెట్లపై నుంచి కిందపడిన సమయంలో లాలూకు మూడు చోట్ల గాయాలయ్యాయి. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం ఆయనను ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. లాలూ పరిస్థితి విషమించిన నేపథ్యంలో పలువురు బిహార్ మంత్రులు, రాజకీయ ప్రముఖులు ఢిల్లీ ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడారు. లాలూ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చదవండి: (Corona Updates: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు) -
మరణశయ్యపై ‘ముషారఫ్’.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
పాకిస్తాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్(78) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్టు ముషారఫ్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. వైద్యులు కూడా ఆయన కోలుకోవడం సాధ్యం కాదని తెలిపినట్టు వెల్లడించారు. ముషారఫ్.. దుబాయ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇక, బ్రిటిష్ పాలనా కాలంలో (11 ఆగష్టు 1943) ముషారఫ్ ఢిల్లీలో జన్మించగా.. అనంతరం కరాచీ, ఇస్తాంబుల్‌లో పెరిగారు. 2001 నుండి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా కొనసాగారు. కాగా, ముషారఫ్ 1961లో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో చేరి.. 1964లో ఆఫ్ఘన్ అంతర్యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. 1990వ దశకంలో, ముషారఫ్ మేజర్ జనరల్‌గా పదోన్నతి పొందారు. 1998లో ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ చేత ఫోర్-స్టార్ జనరల్‌గా పదోన్నతి పొందడంతో ముషారఫ్ జాతీయ స్థాయికి ఎదిగారు. 1999లో భారత్, పాకిస్తాన్ మధ్య చోటుచేసుకున్న కార్గిల్ యుద్ధంలో పాక్ సైన్యానికి ముషారఫ్ నాయకత్వం వహించారు. 2007లో పదవీ విరమణ చేసే వరకు ముషారఫ్ ఆర్మీ చీఫ్‌గా కొనసాగాడు. 2007లో ప్రజా ప్రభుత్వాన్ని రద్దు చేసినందుకు గానూ పాక్ సుప్రీంకోర్టు 2013లో ముషారఫ్‌కు మరణ శిక్ష విధించింది. కాగా, ఆరోగ్య పరిస్థితి బాగా లేదని ముషారఫ్ 2016లో పాకిస్తాన్ నుండి దుబాయ్‌కు వెళ్లిపోయారు. Prayers and Thoughts 🙏 He's on Ventilator... Allah pak bless with good health ame...#pervezmusharraf pic.twitter.com/3rt3EB7Flq — Fabiha Ejaz Hussain (@Fabiha1810) June 10, 2022 ఇది కూడా చదవండి: రష్యా ఊగిసలాట.. పుతిన్ డబుల్ గేమ్? వాళ్లను నిండా ముంచడమే లక్ష్యంగా..! -
లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమం!
ముంబై: సుప్రసిద్ధ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆమె ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు వైద్యుడొకరు శనివారం చెప్పారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ఆరోగ్యం చాలావరకు క్షీణించినట్లు సమాచారం. ఆమెకు కరోనా సోకడంతో స్వల్ప లక్షణాలు బయటపడ్డాయి. దీంతో జనవరి 8న బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో చేరారు. డాక్టర్ ప్రతీత్ సందానీ, ఆయన బృందం లతకు చికిత్స అందిస్తోంది. చికిత్సకు లతా దీదీ చక్కగా స్పందిస్తున్నారని, వెంటిలేటర్‌పై ఉన్నారని శనివారం ఆసుపత్రి బయట సందానీ మీడియాతో చెప్పారు. అంతకుముందు ఉదయం మాట్లాడుతూ.. లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు. జనవరి 29న మాట్లాడినప్పుడు ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, వెంటిలేటర్ తొలగించామని, ఐసీయూలోనే మరికొంత కాలం పరిశీలనలో ఉంచుతామని అన్నారు. 2019 నవంబర్‌లో లతా మంగేష్కర్‌కు శ్వాస సంబంధిత సమస్య తలెత్తింది. బ్రీచ్‌క్యాండీలో ఆసుపత్రిలో చేరారు. న్యుమోనియా సోకినట్లు తేలింది. 28 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. 1942లో కేవలం 13 ఏళ్ల వయసులో గాయనిగా జీవనం ఆరంభించిన లతా మంగేష్కర్ వివిధ భారతీయ భాషల్లో 30,000కు పైగా పాటలు పాడారు. ‘మెలోడీ క్వీన్ ఆఫ్ ఇండియా’గా కీర్తి ప్రతిష్టలు పొందారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్నతోపాటు సినీ రంగంలో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. -
కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
సాక్షి, కోలారు(కర్ణాటక): గత రెండు రెండురోజులుగా ఆనారోగ్యం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్ఎల్ జాలప్పను మాజీ సీఎం సిద్ధరామయ్య ఆదివారం పరామర్శించారు. జాలప్ప ఆరోగ్యం విషమంగా ఉందని, ప్రస్తుతానికి స్థిరంగానే ఉందని సిద్ధరామయ్య అన్నారు. మత మార్పిడి నిషేధ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. జేడీఎస్ ఎప్పటికి బీజేపీకి బి – టీం గానే ఉంటుందని అన్నారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల రిజర్వేషన్లు రద్దు చేయాలి -
Kalyan Singh: క్షీణించిన మాజీ సీఎం ఆరోగ్యం
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ (89) ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్జీపీజీఐఎంఎస్) బుధ వారం వెల్లడించింది. మంగళవారం సాయం త్రం నుంచి ఆయన వెంటిలేటర్ మీదనే ఉన్నా డని చెప్పింది. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని తెలిపింది. కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఎండోక్రైనోలజీ విభాగాలకు చెం దిన నిపుణులు నిరంతరం ఆయన్ను పరిశీ లిస్తున్నారని ఆస్పత్రి వెల్లడించింది. ఇదిలా ఉం డగా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆస్ప త్రిని సందర్శించారు. కల్యాణ్ సింగ్ ఆరో గ్యం గురించి వాకబు చేసినట్లు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలి పారు. -
వ్యాక్సిన్: దంత వైద్యురాలి ఆరోగ్యం విషమం
సాక్షి, ఒంగోలు టౌన్: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న దంత వైద్యురాలు ధనలక్ష్మి ఆరోగ్యం విషమించింది. ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన ధనలక్ష్మి (24) కోవిడ్ వైద్యుల నియామకం కింద దాదాపు ఏడు నెలల క్రితం ఒంగోలులోని జీజీహెచ్‌లో చేరారు. ఈనెల 23న కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నారు. 26న జ్వరం రావడంతో జీజీహెచ్ ప్రత్యేక వార్డులో చేర్చారు. అక్కడ ఒక్కసారిగా బీపీ డ్రాప్ అవుతుండటాన్ని గమనించిన వైద్యులు వెంటనే రమేష్ సంఘమిత్ర హాస్పిటల్‌కు తరలించారు. ఆమెలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కలెక్టర్ పోల భాస్కర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అర్ధరాత్రి 12.50 గంటలకు అంబులెన్స్‌లో చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. చదవండి: (వికటించిన వ్యాక్సిన్.. ఆశ కార్యకర్త బ్రెయిన్ డెడ్!) (వ్యాక్సిన్: బ్రెయిన్ డెడ్ అయిన ఆశా వర్కర్ మృతి) -
క్షీణిస్తున్న లాలూ ఆరోగ్యం
రాంచీ: రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్(72) ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో శనివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ వివిధ ఆరోగ్య సమస్యలతో రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. ‘ఆయనకు న్యుమోనియా సోకింది. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని నిర్ణయించాం. ఎయిమ్స్ నిపుణులను ఇప్పటికే సంప్రదించాం. 8 మంది సభ్యులతో కూడిన కమిటీ నుంచి నివేదిక అందిన వెంటనే ఢిల్లీకి తీసుకెళ్తాం’ అని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ శనివారం సాయంత్రం తెలిపారు. అధికారులు, లాలూ కుటుంబసభ్యులు ఢిల్లీకి తరలించేందుకు ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్సును ఏర్పాటు చేశారని కూడా ఆయన వెల్లడించారు. లాలూను ఢిల్లీకి తరలించేందుకు రాంచీ జైలు అధికారులు సీబీఐ కోర్టు అనుమతి తీసుకున్నారు. లాలూ ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిసిన భార్య రబ్రీదేవి, కూతురు మిసా భారతి, కుమారులు తేజ్ ప్రతాప్, తేజస్వి శుక్రవారం రాత్రి ఆయనను కలుసుకున్నారు. అనంతరం తేజస్వీ యాదవ్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో భేటీ అయి, తమ తండ్రికి మెరుగైన వైద్యం అందించేందుకు సాయం అర్థించారు. రిమ్స్‌లో ఉండగా లాలూ జైలు నిబంధనలను అతిక్రమించారన్న కేసుపై జార్ఖండ్ హైకోర్టు విచారణ జరిపింది. ఈ విషయంలో ఆస్పత్రి యంత్రాంగం, జైలు అధికారులు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. -
విషమంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పరిస్థితి ప్రస్తుతం బాగా క్షీణించినట్లు సమాచారం. ఈ మేరకు డాక్టర్ ఉమేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీలు ప్రస్తుతం 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. ఆయన కిడ్నీ పనితీరు ఎప్పుడైనా పూర్తిగా క్షీణించొచ్చు. అది ఎప్పుడు అనేది ఊహించడం కష్టం. కానీ అది ఖచ్చితంగా జరగుతుంది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. అందుకే నేను ఈ విషయం గురించి అధికారులకు లిఖితపూర్వకంగా తెలిపాను. ఇప్పటికే అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొందటున్న ఆయనకు.. ఇప్పుడు కొత్తగా మూత్రపిండాల పనితీరు క్షీణిస్తుంది. ఇప్పటికే లాలూ డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు తెలిసింది. అందువల్ల ఆయన కిడ్నీల నితీరు క్రమంగా క్షీణించిందని' రిమ్స్ వైద్యుడు ప్రసాద్ వెల్లడించారు. ఇదిలా ఉండగా, లాలూకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాది వేసిన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు జనవరి 22కి వాయిదా వేసింది. చదవండి: (‘నాడు పవార్‌కు దక్కని ప్రధాని పదవి’) -
మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం
సాక్షి, బెల్లంపల్లి: సీపీఐలో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారం క్రితం శ్వా సకోస సమస్యలు ఏర్పడగా అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించారు. అప్పటినుంచి ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నారు. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న మల్లేష్‌కు తాజాగా కిడ్నీ సంబంధమైన సమస్యలు తోడైనట్లు పార్టీ శ్రేణులు అంటున్నారు. శుక్రవారం సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నిమ్స్‌కు వెళ్లి మల్లేష్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో చర్చించారు. మల్లేష్ ఆరోగ్య సమాచారాన్ని బెల్లంపల్లిలోని పార్టీ శ్రేణులకు చాడ ఫోన్‌చేసి చెప్పినట్లు సమాచారం. మల్లేష్ ఆరోగ్యంపై సీపీఐ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. -
కోలుకుంటున్నాను.. కానీ...
వాషింగ్టన్: కరోనా వైరస్ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని, ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వైట్‌హౌస్ కూడా అధ్యక్షుడి ఆరోగ్యంపై పూటకో రకంగా ప్రకటనలు చేయడం, ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడడంతో ట్రంప్ ఆరోగ్యం ఎలా ఉందా అన్న సందేహాలు అందరినీ వేధించాయి. ప్రధానంగా వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మీడోస్ ట్రంప్ ఆరోగ్యం అత్యంత ఆందోళనకరంగా ఉందని, మరో రెండు రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని, తన పేరు బయటకు వెల్లడి చేయొద్దంటూ విలేకరులకు చెబుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆయన నేరుగా మీడియాతో మాట్లాడుతూ అధ్యక్షుడిని ఆస్పత్రికి తీసుకురావడానికి ముందు ఆక్సిజన్ లెవల్స్ బాగా తగ్గిపోయాయని, ఆయనకు కృత్రిమంగా శ్వాస అందించామని వెల్లడించారు. వైద్య నిపుణుల సలహా మేరకే ఆయనను మిలటరీ ఆస్పత్రికి తరలించామన్నారు. తన ఆరోగ్యం గురించి అలా మాట్లాడిన మీడోస్పై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. కాగా ట్రంప్ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యబృందం తెలిపింది. రాబోయే రోజుల్లో అసలు పరీక్ష ఈ పరిణామాలతో ట్రంప్ శనివారం స్వయంగా వాల్టర్ రీడ్ ఆస్పత్రి నుంచి ఒక వీడియో విడుదల చేశారు. నాలుగు నిమిషాలు ఉన్న ఆ వీడియోలో తన ఆరోగ్యం మెరుగుపడుతోందని, త్వరలోనే ఇంటికి వచ్చేస్తానని చెప్పారు. అయితే రాబోయే రోజుల్లోనే అసలైన పరీక్ష ఎదురవబోతోందన్నారు. ‘‘నేను ఆస్పత్రికి వచ్చిన సమయానికి నాకు వంట్లో అంతగా బాగా లేదు. కానీ ఇక్కడ చికిత్స మొదలయ్యాక బాగానే ఉంది. నేను కోలుకోవడానికి అందరం కలిసి అత్యంత శ్రమిస్తున్నాం. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా నిలపడానికి నేను త్వరగా బయటకి రావాలి’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు. ‘‘నేను కరోనా వైరస్‌తో పోరాడుతున్నాను. త్వరలోనే దానిని ఓడిస్తాను. ఇంకా ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించాల్సి ఉంది. కానీ అసలు సిసలైన పరీక్ష ముందుంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలీదు. ఈ సమయంలో అన్ని వర్గాల వారు నాకు అండగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. మెలానియా కూడా ధైర్యంగా పోరాడుతున్నారు’’ అని ట్రంప్ ఆ వీడియోలో చెప్పారు. తాను గతంలో కరోనా వైరస్‌కు ఇవ్వాల్సిన మందుల గురించి చెబితే అందరూ తనని హేళన చేశారని, ఇప్పుడు అవే ఔషధాలు తనకు ఇవ్వడం వల్ల త్వరగా కోలుకుంటున్నానని ట్రంప్ చెప్పారు. ఆ వీడియోలో ట్రంప్ తెల్ల షర్టు, బ్లూ కోటు వేసుకొని ఉన్నారు. ఆయన చూడడానికి బాగానే ఉన్నప్పటికీ, మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఉన్నంత ఉత్సాహం కనిపించలేదు. ఆస్పత్రిలోనే ఉంటూ ట్రంప్ అధ్యక్షుడిగా రోజువారీ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. ఆరోగ్యం ప్రమాదకరమా? ట్రంప్ వీడియో విడుదల చేయడానికి ముందు వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ సీన్ కాన్లే అధ్యక్షుడు ఇంకా ప్రమాదం నుంచి బయటడపడలేదని వెల్లడించారు. అయితే ఆస్పత్రి వైద్యులు ట్రంప్ త్వరగా కోలుకుంటారన్న ఆశాభావంతో ఉన్నారని అన్నారు. గత 24 గంటల్లో ట్రంప్‌కి జ్వరం కూడా రాలేదన్న కాన్లే మరికొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ట్రంప్‌లో ఆక్సిజన్ లెవల్స్ కూడా బాగానే ఉన్నాయని తెలిపారు. ట్రంప్‌కి రెమిడెసివిర్ ఇంజెక్షన్ రెండో డోసు ఇచ్చా మని చెప్పారు. మరోవైపు వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మీడోస్ కూడా ట్రంప్ బాగా కోలుకుంటున్నారని చెప్పారు. శనివారం రాత్రి ఆయన ఓ ఇంటర్వ్యూలో..ఆస్పత్రిలో చేరిన తర్వాత ట్రంప్ ఆరోగ్యంలో చాలా మార్పు వచ్చిందన్నారు. వీడియో ఎడిట్ చేశారా? అధ్యక్షుడు ట్రంప్‌కి దగ్గు బాగా ఎక్కువగా ఉందని, ఆ విషయం తెలీకుండా ఆయన విడుదల చేసిన వీడియోని ఎడిట్ చేశారన్న ప్రచారం సాగుతోంది. ట్రంప్ ట్విట్టర్ అకౌంట్లో ఆ వీడియో చూసిన నెటిజన్లు ట్రంప్ మధ్యలో కాస్త వెక్కినట్టుగా అనిపించిందని, ఆయన భుజం కూడా కాస్త పైకి కదిలిన శబ్దం వినిపించిందని సందేహాలు వ్యక్తం చేశారు. ట్రంప్ మాట్లాడుతుండగా దగ్గు వచ్చిందని, అది తెలీకుండా ఆ వీడియోని ఎడిట్ చేసి పోస్టు చేశారని అంటున్నారు. ఎంఏజీఏ ప్రచారం ప్రారంభం కోవిడ్–19తో ట్రంప్ ఆస్పత్రిలో పోరాడుతూ ఉన్న సమయంలోనే ఆయన శిబిరం కొత్త ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (ఎంఏజీఏ) అన్న కలని సాకారం చేసుకోవడానికి ఆపరేషన్ ఎంఏజీఏ పేరుతో వివిధ రాష్ట్రాల్లో ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ట్రంప్ కుటుంబ సభ్యులు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ట్రంప్ కరోనాతో పోరాడుతున్నప్పటికీ ఏ మాత్రం వెనుకబడి పోకుండా ఉండడానికి స్వింగ్ స్టేట్స్లో ఈ ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించనున్నారు. -
వెంటిలేటర్‌పైనే ప్రణబ్
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆయన కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ తెలిపారు. ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందుతోంది. అయితే, పరిస్థితి దిగజారలేదనీ, ఆయన కీలక అవయవాలన్నీ నిలకడగానే పనిచేస్తున్నాయని కుమార్తె శర్మిష్ఠ శుక్రవారం చెప్పారు. ‘వైద్యపరమైన అంశాల జోలికి వెళ్లడం లేదు. రెండు రోజులుగా మా నాన్న ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. అయితే, నిలకడగా మాత్రం ఉంది. ఆయన నేత్రాలు వెలుతురుకు కాస్తంత స్పందించడం కనిపిస్తోంది’అని ట్విట్టర్లో శర్మిష్ఠ ముఖర్జీ పేర్కొన్నారు. ‘ప్రణబ్ ముఖర్జీ బాహ్య స్పర్శకు, చికిత్సకు స్పందిస్తున్నారు. 96 గంటల అబ్జర్వేషన్ సమయం నేటితో పూర్తవుతోంది’అని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్లో తెలిపారు. ‘దేశ ప్రజల నుంచి నేను ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగానే పొందాను..అని మా నాన్న ప్రణబ్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. దయచేసి ఆయన కోసం ప్రార్థించండి’అని అభిజిత్ కోరారు. -
ప్రణబ్ ఆరోగ్యం విషమమే
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతం లోని ఆసుపత్రిలో ప్రణబ్ 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మొదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్–19 పరీక్షలు జరపగా పాజిటివ్‌గా తేలింది. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆసుపత్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. మాజీ రాష్ట్రపతి త్వరగా కోలుకోవా లని ఆయన స్వగ్రామమైన బెంగాల్‌లోని మిరిటీలో మూడు రోజులుగా మృత్యుంజయ మంత్ర జపం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా..ప్రణబ్ ముఖర్జీకి ఏది మంచిదైతే భగవంతుడు తనకు అదే ఇవ్వాలని కుమార్తె షర్మిష్ట ముఖర్జీ వ్యాఖ్యానించారు. దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’అందుకున్న ఏడాదికే ఆయన ఆరోగ్యం విషమంగా మారడం తనను బాధిస్తోందని కాంగ్రెస్ నేత కూడా అయిన షర్మిష్ట తెలిపారు. -
విషమంగా వరవరరావు ఆరోగ్య పరిస్థితి
-
వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం
సాక్షి, ముంబై : విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు మహారాష్ట్రలోని తలోజా జైలు సిబ్బంది ఆయన భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ప్రస్తుతం తలొజా జైల్లో ఉన్న ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని జైళ్ల శాఖ తెలిపింది. వరవరరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు అరెస్ట్ అయ్యారు. వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపున లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను కొద్దిరోజుల క్రితం కోర్టు కొట్టి వేసింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో అరెస్టయిన వరవరరావును తొలుత మహారాష్ట్ర పుణేలోని ఎరవాడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. తలోజా జైలులో కరోనా బారిన పడి ఒకరు మరణించినట్లు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ నేపథ్యం లో వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు ఇటీవల మహా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖలు కూడా రాశారు. -
వరవరరావుకు తీవ్ర అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్న విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నవీముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. వరవరరావును ఆసుపత్రికి తరలించిన విష యాన్ని పుణేలోని విశ్రాంబాగ్ పోలీసు స్టేషన్ అధికారులు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు శుక్రవారం సాయంత్రం సమాచారమం దించారు. ఇదే విషయాన్ని చిక్కడపల్లి పోలీసులు వరవరరావు కుటుంబసభ్యులకు చేరవేశారు. వరవరరావు అనారోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆయన కుటుంబ సభ్యులు ముంబైకి వెళ్లేందుకు అనుమతినిచ్చినట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. వరవరరావు కుటుంబ సభ్యుల ప్రయాణ ఏర్పాట్లకు సంబంధించి సమన్వయం చేసే బాధ్యతను డీసీపీ స్థాయి అధికారికి అప్పగించినట్లు కమిషనర్ తెలిపారు. 2018 నవంబర్‌లో అరెస్టు..: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో అరెస్టయిన వరవరరావును తొలుత మహారాష్ట్ర పుణేలోని ఎరవాడ జైలుకు తరలించారు. తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. తలోజా జైలులో కరోనా బారిన పడి ఒకరు మరణించినట్లు ఇటీవల మహారాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ నేపథ్యం లోనే వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడు దల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు సహజ, అనల, పవన మూడ్రోజుల క్రితం మహా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖ రాశారు. తమ తండ్రిని చూసేందుకూ అనుమతినివ్వడం లేదని లేఖలో పేర్కొన్నారు. పలువురు రచయితలు, ప్రజా సంఘాలు కూడా వరవరరావును విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. -
నాకేం కాలేదు.. ఆరోగ్యంగా ఉన్నా
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: తాను ఎలాంటి జబ్బుతో బాధపడడం లేదని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ట్విట్టర్లో హిందీ భాషలో ఒక ప్రకటన జారీ చేశారు. అమిత్ షా ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వదంతులు వెల్లువెత్తుతుండడంతో ఆయన తన ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చారు. ‘గత రెండు రోజులుగా ‘కొందరు మిత్రులు’ నా ఆరోగ్యంపై పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. నాకు మరణం ప్రాప్తించాలని వారు కోరుకుంటున్నారు. నా ఆరోగ్యంపై ఎలాంటి స్పష్టత ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాను. కానీ, లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు నా ఆరోగ్యంపై ఆందోళన చెందుతుండడంతో స్పష్టత ఇవ్వక తప్పడం లేదు. నా ఆరోగ్యంపై ఆరా తీసిన వారందరికీ కృతజ్ఞతలు. పుకార్లు సృష్టించిన వారికి కూడా కృతజ్ఞతలు. వారి పట్ల నాకు ఏమాత్రం ప్రతికూల భావన లేదు. వారు ఇలాంటి పనికిమాలిన వ్యవహారాలు పక్కనపెట్టి సొంత పనులు చూసుకుంటే మంచిది’ అని అమిత్‌షా పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాన్ని ఖండించిన జె.పి.నడ్డా అమిత్ షా ఆరోగ్యంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా తీవ్రంగా ఖండించారు. అమానవీయమైన ఇలాంటి ప్రచారం చేసేవారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. అమిత్ షా ఆరోగ్యం విషయంలో సోషల్ మీడియాలో కొనసాగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. షా ఆరోగ్యంపై నకిలీ ట్విట్టర్ ఖాతా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిన నలుగురు వ్యక్తులను అహ్మదాబాద్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారు ఏకంగా అమిత్ షా పేరిటే ట్విట్టర్ ఖాతా తెరవడం గమనార్హం. కేంద్ర హోంమంత్రి తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నారంటూ ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
విషమంగానే జైట్లీ ఆరోగ్యం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన లైఫ్ సపోర్ట్ సిస్టంపై ఉన్నారు. వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ఆయన్ను పర్యవేక్షిస్తున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శనివారం జైట్లీని పరామర్శించారు. కాంగ్రెస్‌కు చెందిన అభిషేక్ సింఘ్వీ, జ్యోతిరాదిత్య సింధియా, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ధనోవా ఆసుపత్రికి వచ్చారు. శ్వాసకోస సంబంధిత అనారోగ్యంతో ఈ నెల 9న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆగస్టు 10 తర్వాత ఆయన ఆరోగ్యం గురించి ఎయిమ్స్ ఎలాంటి బులెటిన్ విడుదల చేయలేదు. ఇప్పటికే రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా జైట్లీని పరామర్శించారు. ఎయిమ్స్ నుంచి వెలువడుతున్న పొగ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎయిమ్స్‌లో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. 34 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు శ్రమించాయి. ప్రమాద సమయంలో ఎయిమ్స్‌లో ఉన్న రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. కొన్ని ఎమర్జెన్సీ సర్వీసులకు విఘాతం కలిగిందని రోగుల బంధువులు అన్నారు. మంటలు చెలరేగిన పై అంతస్తులో ఉన్న కొందరు రోగులను వేరే భవనానికి తరలించారు. టీచింగ్ భవనంలో విద్యుత్ సంబంధిత పనులు జరుతుగున్న మైక్రోబయాలజీలోని వైరాలజీ యూనిట్లో మంటలు ప్రారంభం అయినట్లు అధికారులు గుర్తించారు. -
జైట్లీ పరిస్థితి విషమం
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఈ నెల 9 నుంచి ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతుండగా, శుక్రవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వైద్యశాలకు వెళ్లి జైట్లీని పరామర్శించారు. మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌లు కూడా ఆసుపత్రికి వచ్చి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. శ్వాసతీసుకోవడంలో సమస్య తలెత్తడంతో ఆయన ఆగస్టు 9న ఉదయం ఎయిమ్స్‌లో చేరారు. ఆ రోజు రాత్రి నుంచి ఆయనను వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. జైట్లీ ఆరోగ్యం నిలకడగానే ఉందని అదే రోజు రాత్రే ఎయిమ్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాతి నుంచి ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. -
పాపం.. కవిత
ఏడాది క్రితం గూడూరుకు చెందిన సునీల్, కవితలకు వివాహమైంది.. కవిత నవమాసాలు నిండి ప్రసవానికి ముందుగా ఆమెకు ఫిట్స్ రావడంతో ఆస్పత్రిలో చేరింది.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. అయితే మళ్లీ ఫిట్స్ రావడంతో వైద్యులు పరీక్షించారు.. తలలో రక్తం గడ్డ కట్టిందని, వైద్యం చేయాలంటే రూ.10 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో నిరుపేదలైన ఆ కుటుంబానికి ఏం చేయాలో దిక్కుతోచలేదు.. ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పడంతో అప్పు చేసి కొంత, స్నేహితుల సాయంతో మరికొంత నగదు సమకూర్చి వైద్యం చేయించారు.. ఇంకా నగదు అవసరమై వైద్యం కోసం ఎదురుచూస్తున్న కవిత గత 10 రోజులుగా మృత్యువుతో పోరాడుతోంది. సాక్షి, గూడూరు: గూడూరు పట్టణంలోని కటకరాజవీధిలో అన్నం నాగమణి, సురేష్ దంపతులు జీవిస్తున్నారు. వారికి గాంధీ, సునీల్ అనే ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు గాంధీ పూర్తిగా మానసిక, శారీరక దివ్యాంగుడు. భర్త సురేష్ 2002లో అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో నాగమణి అన్నీతానైనే కుటుంబాన్ని పోషిస్తోంది. సునీల్ 10వ తరగతి వరకూ చదువుకుని గత మూడేళ్లుగా ఒక ఆటో మొబైల్ కంపెనీలో మెకానిక్ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. సునీల్‌కు 2018 జూన్ 25న నాయుడుపేట మండలం కాపులూరు గ్రామానికి చెందిన కవితతో వివాహమైంది. కవిత గర్భవతై నవమాసాలు నిండాయి. ఈ నెల 2వ తేదీ ఉన్నట్లుండి ఆమెకు ఫిట్స్ వచ్చాయి. హుటాహుటిన స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా కుమారుడు జన్మించాడు. 5వ తేదీన కవితకు మళ్లీ ఫిట్స్ రావడంతో వైద్యులు ఎమ్మారై తీయాలని సూచించారు. దీంతో ఆమెను గూడూరుకు తీసుకెళ్లి ఎమ్మారై తీయించగా తలలో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించగా వైద్యులు అదేరోజు రాత్రి ఇక మేమేం చేయలేం తీసుకెళ్లండని చెప్పారు. దీంతో ఏంచేయాలో దిక్కుతోచక వారు అక్కడ నుంచి మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు దీనికి ఆరోగ్యశ్రీ వర్తించదని, వెంటనే రూ.50 వేలు చెల్లిస్తే వైద్యం ప్రారంభిస్తామని, అయినా గ్యారంటీ లేదని తెలిపారు. చేతిలో చిల్లిగవ్వలేని ఆ కుటుంబం ఏం చేయాలో తెలీక అప్పులు చేసి, సునీల్ స్నేహితులు అందజేసిన మొత్తంతో ఇప్పటివరకూ రూ.2.50 లక్షలు ఖర్చు చేసి వైద్యం అందించారు. అయినా రూ.10 లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఆ మొత్తం వారి వద్ద లేక.. రూ.లక్షలు తీసుకొచ్చి వైద్యం చేయించలేక.. కవితను ఎలా కాపాడుకోవాలో తెలీక.. అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు సహకరించాలని వేడుకుంటున్నారు. సాయం చేయదలచిన వారు 8186810313(నాగమణి) ఫోన్నంబర్లో సంప్రదించాలని కోరారు.