టీఎంసీ నేత ముకుల్‌ రాయ్‌ పరిస్థితి విషమం | Trinamool Congress leader Mukul Roy health condition critical | Sakshi
Sakshi News home page

టీఎంసీ నేత ముకుల్‌ రాయ్‌ పరిస్థితి విషమం

Published Sun, Jul 7 2024 4:51 AM | Last Updated on Sun, Jul 7 2024 4:51 AM

Trinamool Congress leader Mukul Roy health condition critical

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ముకుల్‌ రాయ్‌(70) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కోల్‌కతాలోని తన నివాసంలోని బాత్‌రూంలో ఈ నెల 4న ముకుల్‌ రాయ్‌ జారిపడ్డారు. తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు.

 మూడు రోజులుగా వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. శనివారం ఆయన ఆరోగ్యం విషమించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా ఆ యన డిమెన్షియా(మతిమరుపు వ్యాధి)తో బాధపడుతున్నట్లు కుటుంబస భ్యులు తెలిపారు. ముకుల్‌ రాయ్‌ టీఎంసీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement