ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చిన అధికారి పాముకాటుకు గురైన సంఘటన ఆదివారం అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. కుందుర్తి మండలం బండమీదపల్లిలో పోలింగ్ కేంద్రానికి ఆదివారం ఉదయం ఎన్నికల అధికారి అంజిబాబు వచ్చారు. ఆ సమయంలో పోలింగ్ కేంద్రంలో మాటు వేసిన పాము అయనను కాటు వేసింది.ఆ విషయాన్ని గమనించిన స్థానిక సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. అయితే అంజిబాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.