సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్న విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నవీముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. వరవరరావును ఆసుపత్రికి తరలించిన విష యాన్ని పుణేలోని విశ్రాంబాగ్ పోలీసు స్టేషన్ అధికారులు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు శుక్రవారం సాయంత్రం సమాచారమం దించారు. ఇదే విషయాన్ని చిక్కడపల్లి పోలీసులు వరవరరావు కుటుంబసభ్యులకు చేరవేశారు. వరవరరావు అనారోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆయన కుటుంబ సభ్యులు ముంబైకి వెళ్లేందుకు అనుమతినిచ్చినట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. వరవరరావు కుటుంబ సభ్యుల ప్రయాణ ఏర్పాట్లకు సంబంధించి సమన్వయం చేసే బాధ్యతను డీసీపీ స్థాయి అధికారికి అప్పగించినట్లు కమిషనర్ తెలిపారు.
2018 నవంబర్‌లో అరెస్టు..: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో అరెస్టయిన వరవరరావును తొలుత మహారాష్ట్ర పుణేలోని ఎరవాడ జైలుకు తరలించారు. తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. తలోజా జైలులో కరోనా బారిన పడి ఒకరు మరణించినట్లు ఇటీవల మహారాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ నేపథ్యం లోనే వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడు దల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు సహజ, అనల, పవన మూడ్రోజుల క్రితం మహా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖ రాశారు. తమ తండ్రిని చూసేందుకూ అనుమతినివ్వడం లేదని లేఖలో పేర్కొన్నారు. పలువురు రచయితలు, ప్రజా సంఘాలు కూడా వరవరరావును విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment