mumbai hospital
-
కరోనాతో తల్లి మృతి.. పీపీఈ లేకుండానే!
మంబై : కరోనా వైరస్ ధాటికి ప్రపంచం విలవిల్లాడుతోంది. మానవాళిని మహమ్మారిలా పీడిస్తోంది. ఎన్నో కుటుంబాల్లో విషాద చాయలు మిగులుస్తోంది. తమ వారిని కోల్పోయి వారికి తీరని వేదనను గురిచేస్తోంది. తాజాగా అలాంటి వాటికి అద్దంపట్టే ఘటన ముంబైలో చోటుచేసుకుంది. నగరంలోని బోరివాలకి చెందిన పల్లవి అనే మహిళకు(50) జూన్ 30న కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అంతేగాక ఆమె భర్త సైతం కరోనా బారిన పడ్డారు. వీరికి 21 ఏళ్ల కుమారుడు కునాల్ ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి మృత్యువాత పడింది. తల్లి మరణ వార్తను కుమారుడికి చెప్పి వెంటనే ఆస్పత్రికి రావాలని కోరారు. (రెండుసార్లు కరోనా నెగిటివ్.. డాక్టర్ మృతి ) హుటాహుటిన అక్కడికి చేరిన యువకుడిని తన తల్లి శవాన్ని బ్యాగ్‌లో పెట్టేందుకు ఆస్పత్రి సిబ్బంది బలవంతం చేశారు. ఇందుకు ఆ యువకుడు తనకు పీపీఈ కిట్ ఇవ్వమని కోరినా.. అందుకు వారు నిరాకరించారు. ఒకవైపు తల్లి మరణ వార్తను తట్టుకోలేక తల్లడిల్లుతున్న యువకుడు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే కోవిడ్-19 వార్డులోకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ తల్లి మృతదేహాన్ని బ్యాగ్‌లోకి పెట్టేందుకు సహాయం అందిచాడు. (బుల్లితెర నటుడు రవికృష్ణకు కరోనా పాజిటివ్) ఈ సంఘటను కునాల్ గుర్తు చేసుకుంటూ.. ‘ఆస్పత్రి సిబ్బంది పీపీఈ ఇవ్వడానికి నిరాకరించడం నాకు షాక్‌కు గురి చేసింది. పీపీఈ లేకుండా నేను కరోనా మృతదేహాన్ని ఎలా తాకాలని వారిని ప్రశ్నించాను. ఇందుకు వారు శరీరం బరువుగా ఉందని సాయం చేయాలని కోరారు. అక్కడుంది నా తల్లి, నాకు వేరే దారి లేదు. నా భయాన్ని పక్కన పెట్టి పీపీఈ లేకుండానే నా తల్లిని పట్టుకున్నాను’. అంటూ ఆవేదనకు గురయ్యారు. ఈ ఘటన అనంతరం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్.. ఆసుపత్రికి చెందిన ఇద్దరు సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. (ఉబర్ ముంబై ఆఫీసు శాశ్వతంగా మూత?) -
వరవరరావుకు తీవ్ర అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్న విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నవీముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. వరవరరావును ఆసుపత్రికి తరలించిన విష యాన్ని పుణేలోని విశ్రాంబాగ్ పోలీసు స్టేషన్ అధికారులు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు శుక్రవారం సాయంత్రం సమాచారమం దించారు. ఇదే విషయాన్ని చిక్కడపల్లి పోలీసులు వరవరరావు కుటుంబసభ్యులకు చేరవేశారు. వరవరరావు అనారోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆయన కుటుంబ సభ్యులు ముంబైకి వెళ్లేందుకు అనుమతినిచ్చినట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. వరవరరావు కుటుంబ సభ్యుల ప్రయాణ ఏర్పాట్లకు సంబంధించి సమన్వయం చేసే బాధ్యతను డీసీపీ స్థాయి అధికారికి అప్పగించినట్లు కమిషనర్ తెలిపారు. 2018 నవంబర్‌లో అరెస్టు..: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో అరెస్టయిన వరవరరావును తొలుత మహారాష్ట్ర పుణేలోని ఎరవాడ జైలుకు తరలించారు. తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. తలోజా జైలులో కరోనా బారిన పడి ఒకరు మరణించినట్లు ఇటీవల మహారాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ నేపథ్యం లోనే వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడు దల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు సహజ, అనల, పవన మూడ్రోజుల క్రితం మహా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖ రాశారు. తమ తండ్రిని చూసేందుకూ అనుమతినివ్వడం లేదని లేఖలో పేర్కొన్నారు. పలువురు రచయితలు, ప్రజా సంఘాలు కూడా వరవరరావును విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. -
నిలకడగా బ్రహ్మానందం ఆరోగ్యం
‘అహ నా పెళ్ళంట!’ (1985) సినిమాతో వస్తూనే తెలుగు తెరౖపై నవ్వులు పూయించారు హాస్యనటులు బ్రహ్మానందం. అప్పటినుంచి ఇప్పటివరకూ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నారు. దాదాపు వెయ్యిచిత్రాలు చేసిన బ్రహ్మానందం ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా నటుడిగా ఫామ్‌లో ఉన్నారు. ఇటీవలే ‘గ్రేట్ తెలుగు లాఫ్టర్ చాలెంజ్’ షోతో బుల్లితెర ప్రేక్షకులను కూడా పలకరించారు. ప్రస్తుతం బ్రహ్మానందం ఆస్పత్రిలో ఉన్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు కలవరపడ్డారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. గుండెలో నొప్పి అనిపించడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్ని సంప్రదించారట బ్రహ్మానందం. శస్త్రచికిత్స ఇక్కడ చేయించుకుంటే అభిమానుల రాకపోకలు, వారి ఆందోళనతో ఇబ్బందిగా ఉంటుందని భావించిన ఆయన ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. నేడు ఐసీయు నుంచి సాధారణ గదికి మారనున్నారు. ‘‘ఆదివారం ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో బ్రహ్మానందంగారిని ఆస్పత్రిలో జాయిన్ చేశాం. ఆయనకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది’’ అని బ్రహ్మానందం కుటుంబ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్దార్థ్‌లు తండ్రితో పాటు ముంబైలో ఉన్నారు. -
చికిత్స కోసం విదేశాలకు వెళ్లనున్న పరీకర్
పనాజీ: కొంతకాలంగా క్లోమ గ్రంధి సమస్యతో బాధపడుతోన్న గోవా సీఎం మనోహర్ పరీకర్ ముంబైలోని ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యుల సూచన మేరకు విదేశాలకు వెళ్లనున్నట్లు సీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. చికిత్స నిమిత్తం ఆయన అమెరికా వెళ్లనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం రాష్ట్రంలో లేని సమయంలో పాలనాపరమైన సూచనలిచ్చేందుకు ‘కేబినేట్ సలహా కమిటీ’ఏర్పాటైంది.పరీకర్ నేతృత్వంలో సోమవారం ఇక్కడ జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయించారు. బీజేపీకి చెందిన సీనియర్ మంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా, గోవా ఫార్వార్డ్ పార్టీ(జీఎఫ్‌పీ)కి చెందిన విజయ్ సర్దేశాయ్, మహారాష్ట్రవాదీ గోమంత్రక్ పార్టీ(ఎమ్జీపీ)కి చెందిన పలువురు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సీఎం పలువురు పోలీసు ఉన్నతాధికారులతో కూడా సమావేశమయ్యారు. -
సీఎం ఆరోగ్యంపై వదంతులు.. ఖండన!
సాక్షి, ముంబై : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఆయనకు చికిత్స అందిస్తున్న ముంబైలోని ప్రఖ్యాత లీలావతి ఆస్పత్రి ఖండించింది. పారికర్ ఆరోగ్యం విషయమై మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, రూమర్లు అన్ని అవాస్తవమేనని, ఆయన చక్కగా చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం పారికర్ ఆరోగ్యం గురించి దురుద్దేశంతోనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ఆయన ఆరోగ్యం విషయంలో వస్తున్న కథనాలు బూటకమని ఆస్పత్రి తీవ్రంగా పేర్కొంది. ‘మాగ్నెటిక్ మహారాష్ట్ర’ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొనేందుకు ముంబై వచ్చిన ప్రధాని మోదీ ఆదివారం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పారికర్‌ను పరామర్శించిన సంగతి తెలిసిందే. అనారోగ్యంబారిన పడటంతో ఈ నెల 15న పారికర్ లీలావతి ఆస్పత్రిలో చేరారు. త్వరలోనే ఆయన కోలుకుంటారని, అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారని గోవా సీఎంవో ఇప్పటికే ప్రకటించింది. -
ఎమ్ఆర్ఐ స్కాన్‌కు వెళ్లి మరణించాడు
-
దారుణం : ఎమ్ఆర్ఐ స్కాన్‌కు వెళ్లి మరణించాడు.!
సాక్షి, ముంబై : ముంబైలోని ఓ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొన్నది. బీవైఎల్ నాయర్ చారిటబుల్ ఆసుపత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఎమ్ఆర్ఐ స్కాన్ కోసం వెళ్లిన రాజేశ్ మారు(32) అనే పేషంట్ అదే యంత్రానికి అతుక్కుపోయి మరణించాడు. శనివారం జరిగిన ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ప్రమాదానికి కారణమైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేశ్ మారు ఆక్సిజన్ సిలిండర్‌తో ఎమ్ఆర్ఐ స్కాన్ గదిలోకి వెళ్లాడు. నిజానికి ఎంఆర్ఐ తీసుకునే సమయంలో లోహపు వస్తువులు, బంగారం, మెడికల్ ఇంప్లాంట్స్ కలిగిన దుస్తులను సైతం అనుమతించారు. కానీ వార్డు బాయ్ నిర్లక్ష్యంగా ఆక్సిజన్ సిలిండర్‌తో రాజేశ్‌ను ఎమ్ఆర్ఐ స్కాన్ గదిలోకి పంపించాడు. అప్పటికి రాజేశ్ బంధువు వార్డు బాయ్‌ని ఇదే విషయంపై ప్రశ్నించాడని మెషిన్ ఆఫ్‌లో ఉంది ఏమికాదంటూ పంపించాడని మృతుడి తల్లి సోలాంకి పేర్కొన్నారు. మెషిన్ ఆన్‌లో ఉండటంతో అయాస్కాంతత్వంతో సిలిండర్‌తో సహా రాజేశ్‌ను లాగేసుకుంది. దీంతో అతను మెషిన్లో ఇరుక్కొవడంతో తీవ్ర రక్తం స్రావమైంది. వెంటనే అత్యవసర విభాగానికి తరలించగా అప్పటికే అతను మరణించాడు. -
ఇక దుబాయి ఆస్పత్రిలో లావాటి మహిళ
దుబాయి: ముంబయిలో చికిత్స చేయించుకొని వెళ్లిన ఈజిప్టుకు చెందిన స్థూలకాయురాలు ఎమన్ అహ్మద్ అబుదాబిలోని ఆస్పత్రిలో చేరింది. ఈ ఆస్పత్రిలో ఆమెకు ధీర్ఘకాలంపాటు శారీరక, మానసిక వైద్యాన్ని అందించనున్నారు. దాదాపు అరటన్ను బరువుతో ప్రపంచంలోనే అతి లావాటి మహిళగా రికార్డుల్లోకి ఎక్కిన ఎమన్‌ను ఒక సవాల్‌గా తీసుకొని ముంబయి వైద్యులు ప్రత్యేక శ్రద్ధతో ఆమెను ఈజిప్టు నుంచి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె సర్జరీ చేసి దాదాపు 323 కిలోల బరువు తగ్గించారు. ప్రస్తుతం ఆమె బరువు 176.6కేజీలు. దీంతో తిరిగి ఆమెను పంపించేశారు. ప్రస్తుతం ఏడాదిపాటు చికిత్స పొందేందుకు ఎమన్ అబుదాబిలోని వీపీఎస్ బుర్జీల్ ఆస్పత్రిలో చేరింది. ఈ సందర్భంగా యాసిన్ శహత్ అనే వైద్యుడు మాట్లాడుతూ తన ప్రయాణం సౌకర్యాంగానే సాగినట్లు ఎమన్ తెలిపిందన్నారు. ఆమె కోసం ప్రత్యేకంగా ఇటలీ నుంచి హైడ్రాలిక స్ట్రెచర్ తీసుకొచ్చామని, 20మంది వైద్యులను ఆమెకు కేటాయించి వైద్యం చేయబోతున్నట్లు ప్రకటించారు. -
ఆసుపత్రి నుంచి లాలూ డిశ్చార్జి
ముంబయి: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌ను డిశ్చార్జి చేసినట్లు ఆ ఆసుపత్రి వైస్ చైర్మన్, ఎండీ డాక్టర్ రామాకాంత్ పండా శనివారం వెల్లడించారు. గుండెకు శస్త్ర చికిత్స జరిగిన లాలూ ప్రసాద్ యాదవ్ చాలా త్వరగా కొలుకున్నారని చెప్పారు. ఆయనకు కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంత కాలంగా గుండె నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత నెల ఆగస్టులో ముంబయిలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. గత నెల 27వ తేదీన ఏషియన్ ఇనిస్టిట్యూట్ వైద్యులు లాలూకు గుండెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు.