మృతుడు రాజేశ్ మారు (ఫైల్‌ఫొటో)
సాక్షి, ముంబై : ముంబైలోని ఓ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొన్నది. బీవైఎల్ నాయర్ చారిటబుల్ ఆసుపత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఎమ్‌ఆర్‌ఐ స్కాన్ కోసం వెళ్లిన రాజేశ్ మారు(32) అనే పేషంట్ అదే యంత్రానికి అతుక్కుపోయి మరణించాడు. శనివారం జరిగిన ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ప్రమాదానికి కారణమైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజేశ్ మారు ఆక్సిజన్ సిలిండర్‌తో ఎమ్‌ఆర్‌ఐ స్కాన్ గదిలోకి వెళ్లాడు. నిజానికి ఎంఆర్‌ఐ తీసుకునే సమయంలో లోహపు వస్తువులు, బంగారం, మెడికల్ ఇంప్లాంట్స్ కలిగిన దుస్తులను సైతం అనుమతించారు. కానీ వార్డు బాయ్ నిర్లక్ష్యంగా ఆక్సిజన్ సిలిండర్‌తో రాజేశ్‌ను ఎమ్‌ఆర్‌ఐ స్కాన్ గదిలోకి పంపించాడు. అప్పటికి రాజేశ్ బంధువు వార్డు బాయ్‌ని ఇదే విషయంపై ప్రశ్నించాడని మెషిన్ ఆఫ్‌లో ఉంది ఏమికాదంటూ పంపించాడని మృతుడి తల్లి సోలాంకి పేర్కొన్నారు. మెషిన్ ఆన్‌లో ఉండటంతో అయాస్కాంతత్వంతో సిలిండర్‌తో సహా రాజేశ్‌ను లాగేసుకుంది. దీంతో అతను మెషిన్‌లో ఇరుక్కొవడంతో తీవ్ర రక్తం స్రావమైంది. వెంటనే అత్యవసర విభాగానికి తరలించగా అప్పటికే అతను మరణించాడు.
Comments
Please login to add a commentAdd a comment