mri machine
-
విజయా డయాగ్నొస్టిక్స్ విస్తరణ ప్రణాళిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్యపరీక్షల సేవల సంస్థ విజయా డయాగ్నొస్టిక్స్ ఏటా 8–10 కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో మొత్తం 140 పైచిలుకు డయాగ్నొస్టిక్ సెంటర్స్ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నాయి. తమ డయాగ్నొస్టిక్ కేంద్రంలో ఫ్యూజిఫిల్్మకి చెందిన అధునాతన ఓపెన్ ఎంఆర్ఐ మెషీన్‌ను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీవోవో శేషాద్రి వాసన్ ఈ విషయాలు తెలిపారు. క్లోజ్డ్గా ఉండే ఎంఆర్ఐతో పోలిస్తే ఓపెన్‌గా ఉండే అపెర్టో లూసెంట్ మెషీన్.. పేషంట్లలో ఆదుర్దాను తగ్గించగలిగేలా ఉంటుందని ఫ్యూజి ఫిల్మ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (హెల్త్‌కేర్ విభాగం) చందర్ శేఖర్ సిబాల్ తెలిపారు. వచ్చే రెండేళ్లలో భారత్‌లోనూ తయారీ, అభివృద్ధి కార్యకలాపాలు ప్రారంభించే యోచనలో కంపెనీ ఉన్నట్లు వివరించారు. ఫ్యూజిఫిల్మ్ ఇండియా ఎండీ కోజీ వాడా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
షాకింగ్: ‘ఎమ్ఆర్ఐ నన్ను లోపలికి లాక్కుంది..’
ముంబై : ప్రమాదవశాత్తు ఓ అంబులెన్స్ డ్రైవర్ ఎమ్ఆర్ఐ మిషిన్‌లో ఇరుక్కుపోయాడు. ప్రాణాపాయం తప్పి, వేలు విరగొట్టుకుని బయటపడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన విక్రమ్ అబ్నవే అనే అంబులెన్స్ డ్రైవర్ శుక్రవారం ఓ రోగిని ఎమ్ఆర్ఐ స్కానింగ్ కోసమని ‘ప్రతామ్ ఎమ్ఆర్ఐ అండ్ సీటీ స్కాన్ సెంటర్’కు తీసుకుని వచ్చాడు. పేషంట్ పరిస్థితి బాగోలేకపోవటంతో అతడికి ఆక్సిజన్‌పై ఉంచారు. రోగిని ఎమ్ఆర్ఐ సెంటర్లోకి తీసుకువెళుతున్నపుడు విక్రమ్ సిలిండర్‌ను చేతిలో పట్టుకుని లోపలికి వెళ్లాడు. ఎమ్ఆర్ఐ దగ్గరకు రాగానే.. షాక్ కొట్టిన భావనతో అది విక్రమ్‌ను తనలోకి లాక్కుంది. దీంతో అతడు ఎమ్ఆర్ఐ మిషిన్‌లో ఇరుక్కున్నాడు. అప్పుడు విక్రమ్ చేతిలో ఆక్సిజన్ సిలిండర్ ఉంది. అతడి అరచేయి మొత్తం ఎమ్‌ఆర్‌ఐలోకి వెళ్లిపోయింది. అతడు తన చేతిని గట్టిగా వెనక్కులాక్కున్నాడు. ఆ వెంటనే ఎమ్ఆర్ఐ రూములోనుంచి బయటకు వచ్చాడు. దీనిపై విక్రమ్ మాట్లాడుతూ.. ‘‘ గదిలోనుంచి బయటకు రాగానే నా అర చెయ్యి మొత్తం రక్తంతో నిండిపోయి ఉంది. బాగా నొప్పి వేసింది. అది నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. ఆ మిషిన్ నన్ను అలా లాక్కుంటుందని నేను అనుకోలేదు. నా చిటికెన వేలు విరిగిపోయింది. నేను గట్టిగా అరవటంతో సెంటర్ సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి నా వేలులో రాడ్డు వేశారు. చనిపోవాల్సిన ప్రమాదంలో గాయంతో బయటపడ్డానని సెంటర్ సిబ్బంది అన్నారు. విరిగిపోయిన వేలితో నేను ఏ పనిచేయలేకపోతున్నాను. పేదవాడిని.. నా కుటుంబాన్ని ఎలా పోషించగలను’’ అని వాపోయాడు. -
దారుణం : ఎమ్ఆర్ఐ స్కాన్‌కు వెళ్లి మరణించాడు.!
సాక్షి, ముంబై : ముంబైలోని ఓ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొన్నది. బీవైఎల్ నాయర్ చారిటబుల్ ఆసుపత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఎమ్ఆర్ఐ స్కాన్ కోసం వెళ్లిన రాజేశ్ మారు(32) అనే పేషంట్ అదే యంత్రానికి అతుక్కుపోయి మరణించాడు. శనివారం జరిగిన ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ప్రమాదానికి కారణమైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేశ్ మారు ఆక్సిజన్ సిలిండర్‌తో ఎమ్ఆర్ఐ స్కాన్ గదిలోకి వెళ్లాడు. నిజానికి ఎంఆర్ఐ తీసుకునే సమయంలో లోహపు వస్తువులు, బంగారం, మెడికల్ ఇంప్లాంట్స్ కలిగిన దుస్తులను సైతం అనుమతించారు. కానీ వార్డు బాయ్ నిర్లక్ష్యంగా ఆక్సిజన్ సిలిండర్‌తో రాజేశ్‌ను ఎమ్ఆర్ఐ స్కాన్ గదిలోకి పంపించాడు. అప్పటికి రాజేశ్ బంధువు వార్డు బాయ్‌ని ఇదే విషయంపై ప్రశ్నించాడని మెషిన్ ఆఫ్‌లో ఉంది ఏమికాదంటూ పంపించాడని మృతుడి తల్లి సోలాంకి పేర్కొన్నారు. మెషిన్ ఆన్‌లో ఉండటంతో అయాస్కాంతత్వంతో సిలిండర్‌తో సహా రాజేశ్‌ను లాగేసుకుంది. దీంతో అతను మెషిన్లో ఇరుక్కొవడంతో తీవ్ర రక్తం స్రావమైంది. వెంటనే అత్యవసర విభాగానికి తరలించగా అప్పటికే అతను మరణించాడు. -
తొలిసారిగా నిశ్శబ్ద ఎమ్మారై
ఎప్పుడైనా మీరు ఎమ్మారై తీయించుకోవడం గానీ, ఎవరికైనా దగ్గరుండి తీయించడం గానీ జరిగిందా? ఆ సమయంలో దాదాపు చిన్న స్థాయి విమానం వెళ్తున్నంత శబ్దం వస్తుంటుంది. కానీ అసలు ఏమాత్రం శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకెళ్లిపోయే ఎమ్మారైని తొలిసారిగా కొచ్చిలోని అమృతా హాస్పిటల్లో ఏర్పాటు చేశారు. జీఈ కంపెనీ రూపొందించిన ఈ సైలెంట్ స్కాన్ టెక్నాలజీతో అసలు శబ్దం చేయని ఎమ్మారైని అమృతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఎంఎస్)లో ఏర్పాటుచేశారు. సాధారణ ఎమ్మారైల నుంచి 110 డెసిబుల్స్ శబ్దం వస్తుంది. ఇది స్టీలు మిల్లు నడుస్తున్నప్పుడు, లేదా విమానం ఇంజన్ వస్తున్నప్పుడు, బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు వెలువడే శబ్దానికి సమానం. కొత్త ఎమ్మారై యంత్రం మాత్రం అస్సలు శబ్దమన్నదే చేయకుండా కామ్‌గా ఉంటుందని జీఈ హెల్త్ కేర్ ఎమ్మారై ఇమేజింగ్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ కార్తీక్ కుప్పుస్వామి తెలిపారు. దీనివల్ల రోగులకు ప్రశాంతంగా ఉంటుందని, ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఆయన అన్నారు. ఎమ్మారై తీయించుకునేటప్పుడు రోగి ఏమాత్రం కదిలినా.. దాని రిపోర్టు నాణ్యతలో తేడా వస్తుంది. శబ్దం రావడం వల్ల రోగి అసౌకర్యంగా ఫీలై.. ఎంతో కొంత కదులుతారు. ఆ సమస్య ఈ సైలెంట్ ఎమ్మారైతో ఉండబోదని అంటున్నారు. ఈ కొత్త మిషన్‌ను మెదడుతో పాటు కాలేయం స్కానింగ్‌కు కూడా ఉపయోగించవచ్చట.