చికిత్స కోసం విదేశాలకు వెళ్లనున్న పరీకర్‌ | Parrikar to go to Mumbai for checkup, may even go abroad for treatment | Sakshi
Sakshi News home page

చికిత్స కోసం విదేశాలకు వెళ్లనున్న పరీకర్‌

Published Tue, Mar 6 2018 2:46 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Parrikar to go to Mumbai for checkup, may even go abroad for treatment - Sakshi

గోవా సీఎం మనోహర్‌ పరీకర్‌

పనాజీ: కొంతకాలంగా క్లోమ గ్రంధి సమస్యతో బాధపడుతోన్న గోవా సీఎం మనోహర్‌ పరీకర్‌ ముంబైలోని ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యుల సూచన మేరకు విదేశాలకు వెళ్లనున్నట్లు సీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. చికిత్స నిమిత్తం ఆయన అమెరికా వెళ్లనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

సీఎం రాష్ట్రంలో లేని సమయంలో పాలనాపరమైన సూచనలిచ్చేందుకు ‘కేబినేట్‌ సలహా కమిటీ’ఏర్పాటైంది.పరీకర్‌ నేతృత్వంలో సోమవారం ఇక్కడ జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయించారు. బీజేపీకి చెందిన సీనియర్‌ మంత్రి ఫ్రాన్సిస్‌ డిసౌజా, గోవా ఫార్వార్డ్‌ పార్టీ(జీఎఫ్‌పీ)కి చెందిన విజయ్‌ సర్దేశాయ్, మహారాష్ట్రవాదీ గోమంత్రక్‌ పార్టీ(ఎమ్‌జీపీ)కి చెందిన పలువురు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సీఎం పలువురు పోలీసు ఉన్నతాధికారులతో కూడా సమావేశమయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement