overseas
-
#HBDYSJAGAN ఎన్ఆర్ఐల గ్రాండ్ సెలబ్రేషన్స్
-
విదేశాల్లో కీలక ఖనిజాలపై ఎన్ఎండీసీ దృష్టి
న్యూఢిల్లీ: విదేశాల్లో కీలక ఖనిజ వనరులపై దృష్టి సారించినట్టు ప్రభుత్వరంగ ఐరన్ ఓర్ ఉత్పత్తి సంస్థ ఎన్ఎండీసీ ప్రకటించింది. పర్యావరణ అనుకూల శుద్ధ ఇంధన వనరులకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తుండడం తెలిసిందే. వీటి కోసం కాపర్, లిథియం, నికెల్, కోబాల్ట్ అవసరం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రభుత్వరంగ సంస్థలు విదేశాల్లో ఈ కీలకమైన ఖనిజాల అన్వేషణ అవకాశాలను పరిశీలిస్తుండడం తెలిసిందే. ఇందులో ఎన్ఎండీసీ కూడా ఒకటి. ‘‘లిథియం, కోబాల్ట్, నికెల్ తదితర ఖనిజ అవకాశాలను సబ్సిడరీ సంస్థ లెగసీ ఇండియా ఐరన్ ఓర్ ద్వారా పరిశీలిస్తున్నాం. ఆస్ట్రేలియాలో లిథియం మైనింగ్ కూడా ఈ అన్వేషణలో భాగంగా ఉంది’’అని ఎన్ఎండీసీ తన ప్రకటనలో వివరించింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 8 మిలియన్ టన్నుల కోకింగ్ కోల్ ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపింది. దీంతో దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని పేర్కొంది. 2030 నాటికి రెట్టింపు స్థాయిలో 100 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పింది. రూ.2,200 కోట్ల పెట్టుబడులు:‘‘కేవలం ఉత్పత్తి పెంపునకే మా కార్యాచరణ పరిమితం కాదు. బాధ్యతతో చేయడం ఇది. పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించి, సమాజానికి సానుకూల ఫలితాలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం’’అని ఎన్ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ వివరించారు. 45 మిలియన్ టన్నుల నుంచి 100 మిలియన్ టన్నుల ఉత్పత్తికి విస్తరించేందుకు పెద్ద మొత్తం నిధులు అవసరం పడతాయంటూ.. 2024–25లోనే ఇందుకు రూ.2,200 కోట్లు కేటాయించినట్టు ఎన్ఎండీసీ తెలిపింది. స్లర్నీ పైపులైన్, కొత్త ప్రాసెసింగ్ ప్లాంట్లపై పెట్టుబడులు పెట్టనున్నట్టు, సామర్థ్య విస్తరణకు, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేందుకు ఇవి కీలకమని వివరించింది. కేకే లైన్ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రైలు ద్వారా ఐరన్ ఓర్ రవాణాను విస్తరించనున్నట్టు తెలిపింది. ఐరన్ ఓర్ వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా బచేలీలో 4 మిలియన్ టన్నుల బెనిఫికేషన్ ప్లాంట్, నాగర్నార్లో 2 మిలియన్ టన్నుల పెల్లెట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. -
విదేశాలకే వి‘హారం’
సాక్షి, అమరావతి: భారతీయులు విదేశీయానాల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. 2019తో పోలిస్తే జపాన్‌లో 53 శాతం, అమెరికాలో 59 శాతం, వియత్నాంలో 248 శాతం భారతీయ ప్రయాణికులు రాకపోకలు పెరగడం విశేషం. మాస్టర్ కార్డ్ ఎకనామిక్స్ ఇన్స్టిట్యూట్ ‘బ్రేకింగ్ బౌండరీస్’ పేరుతో తాజా ట్రావెల్ ట్రెండ్స్‌ను విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయులు అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ఆదాయాన్ని మెరుగు పరచుకోవడంతో విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులు సంఖ్య ట్రావెల్, టూరిజం రంగానికి ఊతమిస్తోందని నివేదిక పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల మందికిపైగా మధ్య తరగతి ప్రజలు (ఏడాదికి రూ.12 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నవారు). దాదాపు 20 లక్షల మంది అధిక ఆదాయ ప్రజలు (ఏటా రూ.66 లక్షలు కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారు) కూడా అంతర్జాతీయ ప్రయాణికుల జాబితాలో చేరతారని అంచనా వేసింది. విస్తరిస్తున్న విలాసవంతమైన ఆలోచనలు ఔట్ బౌండ్ ఇండియా ట్రావెల్ రంగాన్ని అసాధారణ వృద్ధిలోకి తీసుకెళ్తున్నాయని అభిప్రాయపడింది. తొలి త్రైమాసికంలో 10 కోట్ల మంది ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే సుమారు 10 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒక దశాబ్దం కిందటి వరకు ఈ సంఖ్యలో ప్రయాణాలు చేయాలంటే ఏడాది సమయం పట్టేది. అంటే భారతీయుల్లో ఏ స్థాయిలో ప్రయాణాలు వృద్ధి చెందాయో నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి దేశీయ ప్రయాణాలు 21శాతం, విదేశీ ప్రయాణాలు 4 శాతం మేర పెరిగినట్టు గుర్తించింది. ఆమ్స్టర్డామ్, సింగపూర్, లండన్, ఫ్రాంక్‌ఫర్డ్, మెల్‌బోర్న్‌లు ఈ వేసవి (జూన్–ఆగస్టు)లో భారతీయ ప్రయాణికులు సందర్శించే ఐదు ట్రెండింగ్ గమ్యస్థానాలుగా నిలవడం విశేషం. 2019, 2020లో ఒక పర్యటన సగటు వ్యవధి నాలుగు రోజులుగా ఉంటే ఈ ఏడాది ఐదు రోజులకు పెరిగింది. పెరిగిన క్రూయిజ్ ప్రయాణాలు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే యూరోపియన్ చాంపియన్íÙప్ కారణంగా 2024లో జర్మనీలోని మ్యూనిచ్ టాప్ ట్రెండింగ్ డెస్టినేషన్‌గా నిలిచింది. గత మార్చికి ముందు 12 నెలల్లో ప్రజలు అత్యధికంగా ప్రయాణించిన గమ్యస్థానంగా జపాన్ నిలిచింది. ముఖ్యంగా ఐదు మార్కెట్లలో నాలుగు యూరోపియన్ గమ్యస్థానాలు, టాప్ 10లో 50 శాతం ఆసియా–పసిఫిక్ గమ్యస్థానాలు ఉన్నాయి. గడిచిన ఏడాది అత్యధికంగా ప్రయాణికులను ఆకర్షించిన గమ్యస్థానాల్లో జపాన్, ఐర్లాండ్, రొమేనియా, ఇటలీ, స్పెయిన్, మలేషియా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, యూఏఈ, ఇండోనేషియా నిలిచాయి. అయితే విదేశీ సందర్శకుల రికవరీలో అమెరికా 2019తో పోలిస్తే 6 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. హోటల్ పరిశ్రమలలో నిరంతరం ధరల పెరుగుదల కారణంగా క్రూయిజ్ ప్రయాణాలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గ్లోబల్ క్రూయిజ్ ప్యాసింజర్ లావాదేవీల సంఖ్య 2019 కంటే దాదాపు 16 శాతం పెరిగాయి. -
పాక్‌లో ప్రవాసుల ఓటు హక్కు రద్దు చేసే సవరణ బిల్లు
Pakistan To Ban Overseas Citizens From Voting, Stops Use Of EVMs: ఎలక్ట్రానిక్ యంత్రాల(ఈవీఎం)ల వినియోగాన్ని నిలిపేయడం తోపాటు, ప్రవాసులు ఓటు హక్కు రద్దు చేస్తు పాక్ నేషనల్ అసెంబ్లీ ఒక కొత్త చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. అంతేకాదు సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడాని కంటే ముందు స్థానిక ఉప ఎన్నికల్లో మరిన్ని పైలెట్ ప్రాజెక్టులు నిర్వహించడమే ఈ బిల్లు మొదటి లక్ష్యంగా పేర్కొంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముర్తాజా జావేద్ అబ్బాసీ సమర్పించిన ఎన్నికల చట్ట సవరణ బిల్లు 2022ను దిగువ సభలో మెజారిటీ ఓట్లతో ఆమోదిం పొందింది. ఐతే ఈ బిల్లును కేవలం గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు. ఈ మేరకు ముస్లిం లీగ్ నవాజ్(పీఎంఎల్ఎన్) మంత్రి అజం నజీర్ తరార్ ఈ బిల్లు ప్రాముఖ్యతను వివరిస్తూ....ఎన్నికల చట్టం 2017 సవరణలకు ముందు ఉన్న విధంగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా ఈ బిల్లు చేస్తుందని చెప్పారు. ఈ బిల్లు చట్టంలోని సెక్షన్ 94, 107కి సంబంధించిన సవరణలని తెలిపారు. అంతేకాదు గత పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) ప్రభుత్వం ఎన్నికల చట్టం 2017కి పలు సవరణలు చేసిందని గుర్తు చేశారు. అలాగే పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ) కూడా తక్కువ సమయంలో ఈవీఎంల ద్వారా ఎలాంటి గ్రౌండ్ వర్క్ లేకుండా ఎన్నికలు నిర్వహించలేమంటూ అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని కూడా స్పష్టం చేశారు. ఐతే పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. అంతేకాదు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్ఎన్) ప్రధాన మంత్రి షెహబాజ్ షెరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వ తిరోగమన చర్యగా పేర్కొంది. పీటీఐతొమ్మిది మిలియన్లకు పైగా పాకిస్తానీ విదేశీయులకు ఓటు హక్కును కల్పిస్తే ఈ దుండగుల ప్రభుత్వం వాటిని హరించే లక్ష్యంతో సవరణలు చేసిందంటూ ఆరోపణలు గుప్పించింది. -
చక్కెర ఎగుమతులు 90 లక్షల టన్నులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం నుంచి ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర ఎగుమతులు 90 లక్షల టన్నులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) ప్రకారం.. 2021 సెప్టెంబర్‌తో ముగిసిన మార్కెటింగ్ సంవత్సరంలో 71–72 లక్షల టన్నుల చక్కెర విదేశాలకు సరఫరా అయింది. మార్కెట్ నివేదికలు, నౌకాశ్రయాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు సుమారు 80 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి ఒప్పందం జరిగింది. 2021 అక్టోబర్ నుంచి 2022 మార్చి మధ్య ఇప్పటికే 57.17 లక్షల టన్నుల చక్కెర విదేశాలకు చేరింది. అంత క్రితం మార్కెటింగ్ సంవత్సరం ఇదే కాలంలో ఎగుమతులు 31.85 లక్షల టన్నులకు పరిమితం అయింది. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో ఎగుమతి అయిన పరిమాణంలో 44 శాతం ఇండోనేషియా, బంగ్లాదేశ్ కైవసం చేసుకున్నాయి. అంత క్రితం ఏడాదిలో ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్లు 48 శాతం వాటా చేజిక్కించుకున్నాయి. 2021–22లో 350 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి కానుంది. ఇందులో ఇప్పటికే మిల్లులు 330 లక్షల టన్నులు ఉత్పత్తి చేశాయి. దేశీయంగా 272 లక్షల టన్నుల చక్కెర వినియోగం అవుతుంది. ఎగుమతులు, దేశీయ వినియోగం పోను సెప్టెంబర్ నాటికి మిగులు 68 లక్షల టన్నులు ఉంటుంది. -
విదేశాల్లో ఉద్యోగానికి సై.. ఐటీదే ఆధిపత్యం
ముంబై: కోవిడ్–19 నేపథ్యంలో ప్రయాణ అంక్షలు ఉన్నప్పటికీ విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు భారతీయులు ఉత్సాహం కనబరుస్తున్నారని జాబ్ సైట్ ఇండీడ్ నివేదిక వెల్లడించింది. ‘2019–21లో విదేశీ ఉద్యోగాల కోసం శోధన పెరిగింది. వీరిలో యూఎస్‌లో జాబ్ కోసం 40 శాతం మంది ఉత్సాహం కనబరిచారు. కెనడాలో ఉద్యోగం కోసం 16 శాతం మంది సర్చ్ చేశారు. జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో యూఏఈ, గ్రేట్ బ్రిటన్, ఖతార్, సింగపూర్, ఆస్ట్రేలియా ఉన్నాయి. భారత్ వెలుపల జాబ్ కోసం 2019 నవంబర్–2020 ఏప్రిల్ మధ్య అత్యధికంగా శోధించారు. అంత క్రితం కాలంతో పోలిస్తే ఇది 72 శాతం అధికం. సెకండ్ వేవ్‌తో ప్రయాణ అంక్షల కారణంగా ఆ తర్వాత ఈ ప్రక్రియ తగ్గింది. మహమ్మారి సెకండ్ వేవ్ నుండి ప్రపంచం కోలుకున్న వెంటనే విదేశీ అవకాశాల కోసం ఉద్యోగ శోధనలు ఊపందుకుని స్థిరంగా కొనసాగాయి. థర్డ్‌వేవ్ మధ్య కూడా భారతీయులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రధానంగా ఐటీ ఉద్యోగాల కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ ప్రతిభ ప్రపంచ దృష్టిని చాలా ఆకర్షిస్తోంది. విదేశీ ఉద్యోగ వేటలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ డెవలపర్, డేటా అనలిస్ట్ టాప్‌లో ఉన్నారు. ఐటీ సాంకేతిక నిపుణులకు యూఎస్, ఉత్తర అమెరికా, యూకే టార్గెట్ కాగా, ఇంజనీరింగ్ అభ్యర్థులు గల్ఫ్ ప్రాంతంపై ఫోకస్ చేశారు’ అని నివేదిక వివరించింది. చదవండి: విదేశాలకు చెక్కేస్తున్న దేశ మిలియనీర్లు..! -
కేజీఎఫ్ 2 బిజినెస్ అన్ని కోట్లా?
ఎలాంటి అంచాలు లేకుండా విడుదలై.. రికార్డులు సృష్టించిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రూ .200 కోట్ల వసూళ్లు చేసిన మొదటి కన్నడ సినిమాగా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా విడుదలకు ముందే భారీ క్రేజ్ వచ్చింది. ఈ సినిమా కోసం అన్ని భాషల ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం బిజినెస్‌కు రెక్కలొస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు నిర్మాతలు చెప్తున్న ధరలు విని బయ్యర్లకు వణుకు పుడుతుందట. ఈ చిత్రం ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. దీనితో ఈ చిత్రానికి ఏ స్థాయి క్రేజ్ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. అలాగే కన్నడలో ఈ సినిమాను 100 కోట్లకు పైగా అమ్మడానికి చూస్తున్నారట. ఇక తెలుగులో కూడా ఏకంగా 70 కోట్లు చెప్తున్నారని ప్రచారం ఉంది. మరోవైపు హిందీలో కూడా ఈ సినిమాకు 50 కోట్లకు పైగానే రైట్స్ చెప్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కెజిఎఫ్ 2 సినిమా బిజినెస్ 200 కోట్లకు పైగానే జరుగుతుంది. ఈ సినిమా విజయం సాధించాలంటే కచ్చితంగా 250 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాలి. ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే మాత్రం కేజీఎఫ్ 2 బిజినెస్ భారీగానే జరుగుతుంది. అయితే ఇది ఎంత వరకు వాస్తవమనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. -
మన కంపెనీల విదేశీ పెట్టుబడులు అదరహో
ముంబై: విదేశాల్లో మన కంపెనీల పెట్టుబడులు జోరుగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఎనిమిది నెలల కాలంలో భారత కంపెనీలు విదేశాల్లో 1,225 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశాయని కేర్ రేటింగ్స్ వెల్లడించింది. భారత కంపెనీలకు సంబంధించి విదేశీ పెట్టుబడులపై ఈ సంస్థ పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు... ► మన కంపెనీలు విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, సింగపూర్, నెదర్లాండ్స్‌ల్లోని తమ అనుబంధ సంస్థల్లో అధికంగా పెట్టుబడులు పెట్టాయి. ► ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలానికి మన కంపెనీలు అమెరికాలో 236 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. సింగపూర్‌లో 207 కోట్ల డాలర్లు, నెదర్లాండ్స్‌లో 150 కోట్ల డాలర్లు, బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్‌లో 137 కోట్ల డాలర్లు, మారిషస్‌లో 130 కోట్ల డాలర్లు చొప్పున మన కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. మన కంపెనీలు విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన నిధుల్లో దాదాపు 70 శాతం వాటా ఈ ఐదు దేశాలదే కావడం గమనార్హం. ► ఇక కంపెనీల పరంగా అత్యధికంగా విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీగా ఓఎన్జీసీ విదేశ్ (185 కోట్ల డాలర్లు) నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్(87 కోట్ల డాలర్లు), హల్దియా పెట్రోకెమికల్స్(60 కోట్ల డాలర్లు), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్(59 కోట్ల డాలర్లు), మహీంద్రా అండ్ మహీంద్రా(55 కోట్ల డాలర్లు), అదానీ ప్రాపర్టీస్(39 కోట్ల డాలర్లు), లుపిన్ (38 కోట్ల డాలర్లు), పిరమల్ ఎంటర్ప్రైజెస్ (31 కోట్ల డాలర్లు), క్యాడిలా హెల్త్‌కేర్(22 కోట్ల డాలర్లు), ఇన్ఫోసిస్(22 కోట్ల డాలర్లు), టాటా స్టీల్(20 కోట్ల డాలర్లు) నిలిచాయి. ► గత ఆర్థిక సంవత్సరం(2019–20)లో భారత కంపెనీలు 1,300 కోట్ల డాలర్ల మేర విదేశాల్లో ఇన్వెస్ట్ చేశాయి. మన కంపెనీల విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ 1,000 కోట్ల డాలర్లు మించడం ఇది వరుసగా రెండో ఆర్థిక సంవత్సరం. ► 2008–09 ఆర్థిక సంవత్సరంలో మన కంపెనీలు అత్యధికంగా 1,900 కోట్ల డాలర్లు విదేశాల్లో ఇన్వెస్ట్ చేశాయి. 2007–08 ఆర్థిక సంవత్సరంలో కూడా 1,800 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. ► ఇక ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ మన కంపెనీలు విదేశాల్లో చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 297 కోట్ల డాలర్లు ఈక్విటీ సెగ్మెంట్లో ఉన్నాయి. 338 కోట్ల డాలర్లు తీర్చాల్సిన రుణాలు కాగా, 590 కోట్ల డాలర్లు గ్యారంటీల రూపంలో ఇచ్చాయి. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్టు కాలానికి భారత్‌లోకి మొత్తం 3,573 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఒక ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల కాలంలో ఈ స్థాయి ఎఫ్‌డీఐలు రావడం ఇదే రికార్డ్ స్థాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి వచ్చిన ఎఫ్‌డీఐలు(3,160 కోట్ల డాలర్లు)తో పోల్చితే ఇది 13 శాతం అధికం. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్, టెలికం విభాగాలు జోరుగా ఎఫ్‌డీఐలను ఆకర్షించాయి. ► గత ఆర్థిక సంవత్సరంలో 7,600 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు మన దేశంలోకి వచ్చాయి. రిప్రాట్రియేషన్ సర్దుబాటు అనంతరం నికరంగా 5,600 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఈ స్థాయి ఎఫ్‌డీఐలు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. -
ఆ విషయంలో మనోళ్లే ముందున్నారు!
ఐక్యరాజ్యసమితి: దేశం వలసబాట పడుతోంది. బతుకుదెరువుకోసమో, చదువుకోసమో, ఉపాధి కోసమో కారణమేదైనా కావచ్చు ప్రపంచ దేశాలతో పోలిస్తే అత్యధిక మంది భారతీయులు వివిధ దేశాల్లో వలసలుగా జీవిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 27.2 కోట్ల మంది ప్రజలు వివిధ దేశాల్లో వలస జీవనం సాగిస్తోంటే, ఒక్క భారత దేశంలోనే అత్యధికంగా 1.75 కోట్ల మంది ప్రజలు ప్రవాసజీవితాన్ని గడుపుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ సోషల్ ఎఫైర్స్ జనాభా విభాగం విడుదల చేసిన ఇంటర్నేషనల్ మైగ్రెంట్ స్టాక్ 2019 వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ప్రాంతాల వారీగా, స్త్రీ పురుషుల, వయసునుబట్టి వలసబాటపట్టిన వారి వివరాలను ఈ రిపోర్టు వెల్లడించింది. అంతర్జాతీయంగా అత్యధికమంది వలసబాటపట్టిన టాప్ టెన్ దేశాల్లోనే మూడొంతుల మంది ప్రవాసులు ఉన్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేశాయి. 1.75 కోట్లమంది మన దేశ ప్రజలు వివిధ దేశాల్లో వలసజీవితం సాగిస్తోన్న వారిలో అగ్రభాగాన ఉంటే మెక్సికో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. ♦ 2015లో భారత దేశం వివిధ దేశాల నుంచి వచ్చిన 52 లక్షల మందికి ఆశ్రయం కల్పిస్తే, 2019కి ఆ సంఖ్య కొద్దిగా తగ్గి 51 లక్షలకు చేరింది. అంతర్జాతీయంగా 2010 నుంచి 2019 వరకు 0.4 శాతం మందికి భారత్ ఆశ్రయంకల్పిస్తూ నిలకడగా ఉంది. ♦ 207,000 మంది శరణార్థులకి మన దేశం ఆశ్రయమిస్తోంది. మన దేశంలో నివసిస్తోన్న అంతర్జాతీయ శరణార్థుల సంఖ్య 4 శాతం. ఇందులో మహిళా శరణార్థులు 48.8 శాతం. భారతదేశంలో ఆశ్రయంపొందుతోన్న శరణార్థుల్లో అత్యధిక మంది బాంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ నుంచి వచ్చినవారేనని ఈ రిపోర్టు వెల్లడించింది. -
బీపీసీఎల్ మళ్లీ ‘విదేశీ’ పరం!
న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)ను విదేశీ చమురు సంస్థకు విక్రయించాలని కేంద్రం భావిస్తోందని సమాచారం. దేశంలోనే రెండో అతి పెద్ద రిఫైనరీ, ఇంధన రిటైల్ సంస్థ, బీపీసీఎల్‌లో తనకున్న నియంత్రిత వాటాను విక్రయించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగానే బీపీసీఎల్‌లో తన వాటా(53.3 శాతం)ను విదేశీ సంస్థలకు విక్రయించాలని, తద్వారా భారత ఇంధన రిటైల్ రంగంలోకి బహుళ జాతి సంస్థలను ఆకర్షించాలని కేంద్రం యోచిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ రంగంలో సుదీర్ఘకాలం ప్రభుత్వ రంగ సంస్థలే పెత్తనం చెలాయించాయని, దీనికి స్వస్తి చెప్పడానికి, మరోవైపు ఈ రంగంలో పోటీని పెంచడానికి ఈ చర్య ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 1,05 లక్ష కోట్ల నిధులు సమీకరించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బీపీసీఎల్‌లో వాటా విక్రయం కారణంగా ఈ లక్ష్యంలో 40 శాతం మొత్తాన్ని సమీకరించే అవకాశముందని అంచనా. (శుక్రవారం నాటి ముగింపు ధరతో పోల్చితే) అలాగే ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేసుకోవాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆర్థిక మందగమనం కారణంగా రెవెన్యూ వసూళ్లు తగ్గడంతో మౌలిక, సంక్షేమ పథకాలకు నిధుల లభ్యత దుర్లభమవుతోంది. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో బీపీసీఎల్ వాటా విక్రయం ఒకింత ఊరటనివ్వగలదని నిపుణుల అంచనా. ప్రారంభ స్థాయిలోనే చర్చలు.. అయితే విదేశీ సంస్థకు వాటా విక్రయ చర్చలు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయని, ఈ చర్చలు పూర్తవ్వడానికి ఎంతకాలం పడుతుందో స్పష్టత లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బీపీసీఎల్‌ను ఐఓసీకి విక్రయించాలని మొదట్లో ప్రభుత్వం భావించింది. అయితే బీపీసీఎల్‌ను కొనుగోలు చేయడానికి ఐఓసీ మళ్లీ నిధులు సమీకరించాల్సి రావడం తదితర తలనొప్పులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ ఆలోచనను అటకెక్కించింది. గతంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్)లో తన వాటాను కేంద్రం మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీకి విక్రయించిన సంగతి తెలిసిందే. దీనికోసం ఓఎన్జీసీ భారీగా నిధులను సమీకరించాల్సి వచి్చంది. ఇక బీపీసీఎల్ వాటా విక్రయానికి ఏ మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకుంటుందో ఇంత వరకైతే స్పష్టత లేదని నిపుణులంటున్నారు. అయితే బీపీసీఎల్ ప్రైవేటీకరణకు పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. విదేశీ కంపెనీగా ఉన్న బర్మా షెల్ కంపెనీని కేంద్రం 1970లో జాతీయం చేసి బీపీసీఎల్‌గా పేరు మార్చింది. మళ్లీ బీపీసీఎల్ విదేశీ సంస్థల పరమయ్యే అవకాశాలు ఉండటం విశేషం. భారత్‌పై చమురు దిగ్గజాల కన్ను... ఇక పలు బహుళ జాతి సంస్థలు భారత ఇంధన రిటైల్ రంగంపై ఆసక్తి చూపుతున్నాయి. సౌదీ ఆరామ్కో, రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్ పీజేఎస్సీ, టోటల్ ఎస్, షెల్, బ్రిటిష్ పెట్రోలియమ్(బీపీ)లు ఈ జాబితాలో ఉన్నాయి. భారత్‌లో ఇంధన డిమాండ్ 2040 కల్లా రెట్టింపవ్వగలదని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ అంచనా వేస్తోంది. మరోవైపు ఈ ఏడాది, వచ్చే ఏడాది... ఈ రెండేళ్లలో ప్రపంచంలోనే చమురుకు అత్యంత డిమాండ్ భారత్‌లోనే ఉండగలదని ఇటీవలే ఒపెక్ కూడా తన నెలవారీ ఆయిల్ డిమాండ్ నివేదికలో వెల్లడించింది. దీంతో భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి చమురు బహుళ జాతి సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటా విక్రయం ఆ సంస్థలకు ఆయాచిత వరంగా అందివచి్చంది. ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంధన రిటైల్ వ్యాపారంలో 49% వాటాను బీపీ కొనుగోలు చేసిన విషయం విదితమే. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో బీపీసీఎల్ షేర్ శుక్రవారం 6.4 శాతం లాభంతో రూ. 409 వద్ద ముగిసింది. రిఫైనరీల సంఖ్య (నుమాలీగఢ్, బినా, ముంబై, కోచి) =4 దేశవ్యాప్తంగా బంకులు =13,439 భారత్ గ్యాస్ కస్టమర్ల సంఖ్య కోట్లలో=4.2 ఆదాయం రూ. కోట్లలో 2018–19= 3,37,623 2018–19 నికర లాభం రూ. కోట్లలో=7,132 -
సాహో రివ్యూ.. ఓవర్ సీస్ రిపోర్ట్
బాహుబలి తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ సాహో. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సీన్స్‌తో ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను సాహో అందుకుందా..? బాహుబలి తరువాత మరోసారి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ప్రూవ్ చేసుకున్నాడా..? కేవలం ఒక సినిమా అనుభవంతో సుజీత్, సాహో లాంటి మెగా ప్రాజెక్ట్‌ను ఎలా డీల్ చేశాడు..? అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే దుమ్ము రేపిన సాహో, ఓవర్‌సీన్‌లో ప్రీమియర్స్‌తో మంచి వసూళ్లను సాధించింది. ఇక సినిమా విషయానికి వస్తే బాహుబలిగా ఆకట్టుకున్న ప్రభాస్, సాహోతో మరోసారి మెస్మరైజ్ చేశాడంటున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్, యాక్షన్ సీన్స్‌లో ప్రభాస్ ఈజ్ సూపర్బ్ అన్న టాక్ వినిపిస్తోంది. సినిమా కథ ఏంటి అన్నది దాదాపు ట్రైలర్లోనే చెప్పేశారు. కోట్ల డబ్బు, చాలా మంది విలన్స్ వారి మధ్య ఆదిపత్యపోరు. ఈ యుద్ధాన్ని సూపర్ హీరోలాంటి ఒక్క ఆఫీసర్ ఎలా ఆపాడు? విలన్స్ ఆట ఎలా కట్టించాడు? అన్నదే కథ. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి : సాహో) చెప్పడానికి సింపుల్‌గానే అనిపించినా దర్శకుడు సుజీత్ తన స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో సినిమాను ప్రేక్షకుడి ఊహకందని రీతిలో నడిపించాడు. ప్రారంభ సన్నివేశాలతోనే సినిమాను యాక్షన్ మూడ్‌లోకి తీసుకెళ్లిన దర్శకుడు ఆకట్టుకున్నాడు. తొలి షాట్‌లోనే సినిమా స్కేల్ ఎలా ఉండబోతుంది అన్నది చూపించిన యూనిట్, ప్రతీ సీన్ ది బెస్ట్ అనే స్థాయిలో రూపొందించారు. అయితే కథ పరంగా తొలి అర్ధభాగంలో చెప్పడానికి ఏమీ లేకపోవడంతో ప్రధాన పాత్రల పరిచయం, గ్రాండ్ విజువల్స్‌తో సరిపెట్టాడన్న టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా రెగ్యులర్ సినిమాల స్టైల్లోనే ఉందంటున్నారు ఓవర్సీస్ ఆడియన్స్. శ్రద్ధా కపూర్ క్యారెక్టర్ కూడా ఆశించిన స్థాయిలో లేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ లోపాలన్నింటినీ ప్రభాస్ తన స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో కవర్ చేశాడంటున్నారు ఫ్యాన్స్. ఇక ఇతర పాత్రల విషయానికి వస్తే ప్రభాస్ వన్‌మేన్ షో కావటంతో భారీ స్టార్ కాస్ట్ ఉన్నా సినిమాలో ఎవరికీ పెద్దగా పర్ఫామెన్స్‌కు స్కోప్ దక్కలేదు. ఉన్నంతలో ఒక్క చంకీ పాండే మాత్రం తన మార్క్ చూపించారు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. పాటలు, వాటి పిక్చరైజేషన్ అద్భుతంగా ఉన్నా కథనంలో స్పీడు బ్రేకర్లలా మారాయి. కామెడీ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ద్వితీయార్థం ఆసక్తికరంగానే ఉన్నా సినిమా మీద ఉన్న అంచనాలను అందుకునే స్థాయిలో మాత్రం లేదంటున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ సినిమాకు మేజర్ డ్రా బ్యాక్‌గా చెపుతున్నారు. ఓవరాల్‌గా సాహో విజువల్ గ్రాండియర్, యాక్షన్ ఎపిసోడ్స్‌తో అలరించినా బలహీనమైన కథ, కథనంలోని లోపాల కారణంగా అక్కడక్కడా కాస్త నిరాశపరుస్తుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘బీసీ ఓవర్సీస్’కు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ కమిషనర్ అనితా రాజేంద్ర సూచించారు. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలకు మించరాదని, కుటుంబ వార్షికాదాయం ఐదు లక్షల్లోపు ఉండాలని తెలిపారు. టోఫెల్, ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ, జీమ్యాట్లలో కనీస స్కోరు సాధించాలన్నారు. రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు https://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు. అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
‘వీకెండ్ సినిమా’ ద్వారా యూఎస్‌లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
ఆసక్తికరంగా మొత్తం రెండు రాష్ట్రాలూ వేచి చూస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ని ఊహించనంత పెద్ద యెత్తున, మార్చ్ 28న, 120 కన్నా ఎక్కువ థియేటర్లలో USA లో వీకెండ్ సినిమా సంస్థ రిలీజ్ చేస్తోంది. ఇది ఎన్టీఆర్ మీద వస్తున్న మూడో బయోపిక్ అయినా కూడా, ఈ సంవత్సరంలో అత్యంత ఉత్సుకత రేపిన సినిమా అని అనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఈ సినిమా చేసింది కాంట్రవర్సీ లకు పితామహుడు రామ్ గోపాల్ వర్మ. తన మాటల్లో చెప్పాలంటే ఈ సినిమా ఒక గొప్ప కథానాయకుడి, ఒక గొప్ప మహానాయకుడిని పూర్తి చేసే నిజమైన సినిమా. ఈ చిత్రం రిలీజ్ కి చాలా అడ్డంకులను ఎదుర్కొంది, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద దీని ముద్ర ఉంటుందేమో అన్న భయాలు దానికి కారణం. అన్ని అవాంతరాలను దాటి ఈ మార్చి28న, ఎలక్షన్ కి రెండు వారాల ముందు రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి చివరి రోజుల గురించి చూపించిన విధానానికి ప్రేక్షకులు తరలి వచ్చి ఈ సినిమా చూస్తారు అని ఊహిస్తున్నారు. ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ కోసం కాకపోయినా, ఎన్టీఆర్ కోసం కాకపోయినా, ఒక సినిమా నిజంగా పొలిటికల్ సినారియోని మార్చగలుగుతుంది అని భయపడి అడ్డంకులు కలిగించిన కొందరి అభిప్రాయం నిజమా కాదా అని చూడాడానికైనా ఈ సినిమా తప్పకుండా చూడాలి. యూఎస్‌లో మార్చ్ 28న భారీ ఎత్తున ప్రీమియర్స్ తో ఈ సినిమా ప్రతి నగరంలో రిలీజ్ చేస్తుంది వీకెండ్ సినిమా. -
‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్య’ అద్భుతం
సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి(ఏవోవీఎన్) పథకం అద్భుత ఫలితాలు సాధిస్తోంది. విదేశాల్లో ఉన్నతవిద్య అభ్యసించాలనే ప్రతిభావంతులైన దళిత, గిరిజన యువత కల సాకారం చేసే పథకం ఇది. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు విదేశాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తే ప్రభుత్వం తరఫున గరిష్టంగా రూ.20 లక్షల ఆర్థికసాయం అందుతుంది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఉన్నత విద్యావకాశాన్ని సాకారం చేస్తున్న ఏవోవీఎన్ సత్ఫలితాలిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ ఇటీవల ఒక పరిశీలన చేసింది. 117 మంది విద్యార్థుల వివరాలు తెలుసుకుని వారి పరిస్థితిని ఆరా తీసింది. ఇందులో మెజార్టీ విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించి జీవితంలో స్థిరపడినట్లుగా గుర్తించింది. ఐటీ రంగంలోనే అధికం... ఈ పథకం కింద ఇప్పటివరకు 518 మందిని అధికారులు ఎంపిక చేశారు. వీరిలో 407 మంది ఆయాదేశాల్లోని వర్సిటీల్లో ప్రవేశాలు పొందారు. 2017 వరకు ఎంపికైన విద్యార్థులు కోర్సులు పూర్తిచేయగా మిగతావారు కోర్సు కొనసాగిస్తున్నారు. పరిశీలన చేసిన 117 మందిలో 74 మంది ఇప్పటికే ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడ్డారు. ఇందులో అత్యధికులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు సాధించారు. వారిలో దాదాపు 65 శాతం మంది చదువుకున్న చోటే ఉద్యోగాలు పొందారు. మరో 30 మంది అత్యుత్తమ ఉద్యోగాల కోసం ప్రయత్ని స్తున్నట్లు గుర్తించారు. మరో 13 మంది మాత్రం కోర్సు తుదిదశలో ఉన్నట్లు నిర్ధారించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.63.03 కోట్లు ఖర్చు చేయగా 78.57 శాతం సక్సెస్ రేటు సాధించినట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరో ఆర్నెళ్లలో సక్సెస్‌రేటు 95 శాతం ఉంటుందని ఆ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఐదేళ్లలో ఏవోవీఎన్ పథకం అమలుతీరు ఏవోవీఎన్‌కు ఎంపికైన విద్యార్థులు : 518 కోర్సుల కోసం విదేశాలకు వెళ్లినవారు : 407 సక్సెస్ రేట్: 78.57 శాతం పథకం కింద ఖర్చు చేసిన మొత్తం: రూ. 63.03 కోట్లు ఏవోవీఎన్ లబ్ధిదారుల పరిశీలన ఇలా... పరిశీలించిన విద్యార్థులు : 117 ఉద్యోగాలు పొందినవారు : 74 ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారు : 30 మాస్టర్స్ కోర్సు కొనసాగిస్తున్నవారు : 13 సంతృప్తికర స్థాయిలో లబ్ధి ఏవోవీఎన్ పథకం కింద లబ్ధిదారుల సంఖ్యను అపరిమితం చేశాం. అర్హులు ఎంతమంది వస్తే అంతమందికీ లబ్ధి కలిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది. ఈ పథకం నిధులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతిపాదనలు సమర్పించిన వెంటనే ప్రభుత్వం ఆమోదిస్తుండడంతో విద్యార్థులు సైతం సాఫీగా కోర్సు పూర్తి చేయగలుగుతున్నారు. – పి.కరుణాకర్ ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు -
ఓవర్సీస్లో తెలుగు సినిమాల దూకుడు
తెలుగు సినిమాల స్టామినా పెరిగింది. వంద కోట్లు ఈజీగా కలెక్ట్ చేసేస్తున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్‌కు హద్దులు ఉండేవి. తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఆడేవి. వసూళ్లలో పెద్ద రికార్డులు కూడా క్రియేట్ చేసేవి కాదు. అయితే బాహుబలి సినిమాతో దేశం మొత్తం టాలీవుడ్ వైపు చూసింది. రాజమౌళి తన బాహుబలి సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్‌కు క్రేజ్ తీసుకొచ్చాడు. ఇప్పుడు తెలుగు సినిమాలు రాష్ట్రాలు దాటి దేశాల హద్దులను చెరిపేసి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. 2018లో టాలీవుడ్ బాక్సాఫీస్ కలకలలాడింది . ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్లో కూడా వసూళ్ల మోతను మోగించాయి. ఈ ఏడాదిలో రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి సినిమాలు టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు తాజాగా ‘అరవింద సమేత’ రికార్డుల వేటకు బయలుదేరింది. ఇప్పటికే వంద కోట్లను కలెక్ట్ చేసి వేగాన్ని పెంచుతోంది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఆస్ట్రేలియా, అమెరికాల్లో వసూళ్లలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. హిందీ సినిమాల కంటే మన తెలుగు సినిమాలకే ఓవర్సీస్లో ఆదరణ ఎక్కువ ఉందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ఇప్పటికే మన సినిమాలు జపాన్, చైనా దేశాల్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. తెలుగు సినిమా ఇంకా తన పరిధిని పెంచుకుంటూ.. కథ, కథనాల్లో కొత్తదనాన్ని చూపిస్తూ.. మరింత ముందుకు దూసుకుపోవాలి. -
కేవైసీ నిబంధనల సవరణ
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)కు సంబంధించి సవరించిన కేవైసీ నిబంధనలను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ శుక్రవారం విడుదల చేసింది. ఎన్ఆర్ఐలు, దేశీయంగా నివసించే పౌరులు ఎఫ్‌పీఏల్లో అనియంత్రిత వాటా కలిగి ఉండేందుకు సెబీ తాజాగా అనుమతించింది. కేవైసీ (మీ కస్టర్ ఎవరన్నది తెలుసుకోవడం)కి సంబంధించి రెండు సర్క్యులర్లను విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన మార్గదర్శకాలపై ఎఫ్‌పీఏల్లో ఆందోళన తలెత్తడం, నిబంధనల పాటింపు విషయంలో గందరగోళం కారణంగా రూ.4 లక్షల కోట్ల మేర ఎఫ్‌పీఐల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతాయన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. వీటికి పరిష్కారంగా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ హెచ్ఆర్ ఖాన్ అధ్యక్షతన గల ప్యానల్ పలు సవరణలను సూచించింది. ఈ మేరకు సెబీ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త నిబంధనలు ఎన్ఆర్ఐలు, ఓసీఐలు (విదేశాల్లోని భారత పౌరులు), ఆర్ఐ (భారత్‌లో నివాసం ఉండేవారు)లు ఎఫ్‌పీఐల్లో అనియంత్రింత వాటా కలిగి ఉండొచ్చు. ఒక్కరే అయితే 25 శాతం, ఎన్ఆర్ఐ/ఓసీఐ/ఆర్ఐ మొత్తం హోల్డింగ్స్ కలిపి ఓ ఎఫ్‌పీఐ ఆధ్వర్యంలోని ఆస్తుల్లో 50 శాతం మించకూడదు. వీరిని భాగస్వాములుగానూ అనుమతిస్తారు. ఎఫ్‌పీఐలను ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ (ఐఎం) నియంత్రించొచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఎన్ఆర్ఐ లేదా ఓసీఐ లేదా ఆర్ఐ అయినా కావచ్చు. లేదా వీరి నియంత్రణలో అయినా ఉండొచ్చు. ఇలాంటి సవరణలు, వెసులుబాట్లు నూతన నిబంధనల్లో ఉన్నాయి. వీటిని పాటించేందుకు ఎఫ్‌పీఐలకు ఆరు నెలల సమయం ఇవ్వగా, నిబంధనలు పాటించని వారు తమ పొజిషన్లను మూసివేసేందుకు మరో 180 రోజుల గడువు ఇచ్చింది. కేటిగిరీ–2, 3 పరిధిలోని ఎఫ్‌పీఐలు తమ నిర్వహణలోని ఆస్తుల లబ్దిదారులతో జాబితాను నిర్వహించాలి. ఈ వివరాలను సెబీకి కూడా సమర్పించాల్సి ఉంటుంది. -
‘యన్.టి.ఆర్’కి బిగ్ టార్గెట్
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా యన్.టి.ఆర్(బయోపిక్). ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా స్టార్ట్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు సినీ రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ బయోపిక్ కావటంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఓవర్సీస్లో ఈ సినిమా దాదాపు 20 కోట్లు పలికినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంత ఎమౌంట్‌ను యన్.టి.ఆర్ తిరిగి వసూళు చేయగలదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమాలేవి ఓవర్సీస్లో ఈ స్థాయిలో వసూళ్లు సాధించలేదు. మరి యన్.టి.ఆర్తో బాలయ్య సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తాడేమో చూడాలి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేశారు. ఒక్కో పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్, చంద్రబాబులకు సంబంధించిన స్టిల్‌ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్‌గా బాలయ్య, చంద్రబాబు పాత్రలో రానా కనిపిస్తుండగా ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు. -
‘భరత్’కు భారీ కలెక్షన్లు
సాక్షి, హైదరాబాద్: ప్రిన్స్ మహేష్‌బాబు తాజా సినిమా ‘భరత్ అనే నేను’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. హిట్ టాక్ రావడంలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విదేశాల్లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. అమెరికాలో మొదటి వారంలో(ప్రివ్యూస్‌తో కలుపుకుని) ఈ సినిమా మూడు మిలియన్ డాలర్ల మార్కును దాటింది. అటు ఆస్ట్రేలియాలోనూ ‘భరత్..’ సందడి చేస్తున్నాడు. మొత్తంగా ఓవర్సిస్లో ఇప్పటికి 4 మిలియన్ డాలర్లను క్రాస్ చేసి ఐదు మిలియన్ డాలర్లకు పరుగులు పెడుతోందని ప్రముఖ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేశారు. కేరళలోనూ ఈ సినిమాకు ఆదరణ బాగుంది. మొదటి 5 రోజుల్లో రూ. 7.63 లక్షలు తెచ్చుకుంది. ఈ సినిమా ఇప్పటికే రూ. 125 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. మహేష్‌బాబుకు జోడిగా కియారా అద్వాని నటించిన ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. It's MAHESH MANIA Overseas... Telugu film #BharatAneNenu takes international markets by storm... Week 1: N America $ 3.015 million [incl non-reported] Au NZ $ 535k Europe & UK $ 350k Africa, Malaysia, Singapore [2 days] & Rest $ 150k GCC $ 600k Total: $ 4.65 mn [₹ 31.04 cr]. — taran adarsh (@taran_adarsh) 27 April 2018 -
చికిత్స కోసం విదేశాలకు వెళ్లనున్న పరీకర్
పనాజీ: కొంతకాలంగా క్లోమ గ్రంధి సమస్యతో బాధపడుతోన్న గోవా సీఎం మనోహర్ పరీకర్ ముంబైలోని ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యుల సూచన మేరకు విదేశాలకు వెళ్లనున్నట్లు సీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. చికిత్స నిమిత్తం ఆయన అమెరికా వెళ్లనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం రాష్ట్రంలో లేని సమయంలో పాలనాపరమైన సూచనలిచ్చేందుకు ‘కేబినేట్ సలహా కమిటీ’ఏర్పాటైంది.పరీకర్ నేతృత్వంలో సోమవారం ఇక్కడ జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయించారు. బీజేపీకి చెందిన సీనియర్ మంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా, గోవా ఫార్వార్డ్ పార్టీ(జీఎఫ్‌పీ)కి చెందిన విజయ్ సర్దేశాయ్, మహారాష్ట్రవాదీ గోమంత్రక్ పార్టీ(ఎమ్జీపీ)కి చెందిన పలువురు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సీఎం పలువురు పోలీసు ఉన్నతాధికారులతో కూడా సమావేశమయ్యారు. -
అజ్ఞాతవాసి ఇక్కడ ఫట్.. అక్కడ హిట్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన తాజా చిత్రం ‘అజ్ఞాతవాసి‘. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈచిత్రం అభిమానులను నిరాశపరిచింది. తొలి ఆట నుంచే డివైడ్ టాక్ వచ్చింది. అయితే పండుగ సందర్భంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కొన్ని సీన్లకు కోతపెట్టి, విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో నటించిన సన్నివేశాలను జత చేశారు. దీంతో సినిమా కలెక్షన్లు కొంతమేర ఊపు అందుకున్నాయి. అయితే సినిమాకు ఇక్కడ కలెక్షన్లు లేకపోయినా ఓవర్సీస్లో మాత్రం బాగా రాబడుతోంది. టాక్ తో సంబంధం లేకుండా 2మిలియన్ల డాలర్ల మార్క్ చేరుకుంది. ఇందులో 1.5 మిలియన్లు ప్రీమియర్ షోల ద్వారానే వచ్చాయి. ఇప్పటివరకు పవన్ సినిమా ఏది ఇంత కలెక్షన్లు రాబట్టకపోవడం గమనార్హం. అమెరికాలో ఎన్నడూలేని విధంగా ఎక్కువ స్క్రీన్లలో అజ్ఞాతవాసి విడుదల చేయడం వల్లే కలెక్షన్లు వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ క్లాస్ అమెరికా ప్రేక్షకులకు ఎక్కువగా నచ్చుతోంది. అంతేకాకుండా ఇటీవల విడుదలైన మాస్ కంటెంట్ ఉన్న జైసింహా, గ్యాంగ్ చిత్రాలు పోటీ ఇవ్వలేకపోవడంతో అజ్ఞాతవాసికి కలిసొచ్చింది. -
సరికొత్తగా ‘విద్యానిధి’
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించే నిరుపేదలకు శుభవార్త. ప్రభుత్వం అమలు చేస్తున్న ఓవర్సీస్ విద్యానిధి పథకంలో పలు సవరణలు చేసింది. ఎక్కువమంది విద్యార్థులు లబ్ధిపొందేలా కఠినతర నిబంధనలను సడలించింది. దాదాపు 10 కేటగిరీల్లో మార్పులు చేసింది. బీసీ సంక్షేమ శాఖతో పాటు ఎస్సీ అభివృద్ధి శాఖ, ఎస్టీ సంక్షేమ శాఖ, మైనార్టీ సంక్షే మ శాఖలు అమలు చేస్తున్న ఓవర్సీస్ విద్యానిధి పథకాలకు తాజా నిబంధనలు వర్తించనున్నాయి. వార్షికాదాయం 3 లక్షలకు పెంపు.. విద్యార్థి కుటుంబ వార్షికాదాయాన్ని రూ.2 లక్షల పరిమితి నుంచి రూ.3 లక్షలకు పెంచింది. తల్లిదండ్రులతో పాటు విద్యార్థి పనిచేసినట్లు నివేదిస్తే అతని వార్షికాదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో ఉద్యోగాల్లో చేరిన పలువురు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోగా వారి వార్షికాదాయాన్ని పరిగణించి రూ.2 లక్షలకు మించడంతో ఎంపిక చేయలేదు. ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వెజ్ టెస్టింగ్ సిస్టం (ఐఈఎల్టీఎస్) పరీక్షలో 6.5 పాయింట్లు తప్పనిసరి రావాలి. మెజారిటీ అభ్యర్థులు 6 పాయింట్లు సాధిస్తూ పథకానికి అర్హత సాధించలేకపోతున్నారు. దీంతో 6 పాయింట్లకు కుదించింది. టొఫెల్–6 పాయింట్లు, జీఆర్ఈ–260, జీమ్యాట్‌లో– 500 మార్కులు సాధించాలి. వెయిటేజీ కీలకం.. విద్యానిధి పథకానికి తాజాగా వెయిటేజీ నిబంధన తీసుకొచ్చారు. గతంలో ఇంటర్వ్యూకు ప్రాధాన్యం ఉండేది. డిగ్రీలో వచ్చిన మార్కులకు 60 శాతం, జీఆర్ఈ/జీమ్యాట్కు మార్కులకు 20 శాతం, ఐఈఎల్టీఎస్/టోఫెల్లో వచ్చిన పాయింట్లకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు. గతంలో ఏడు దేశాలకే పరిమితమైన విద్యానిధి పథకాన్ని పది దేశాల్లోని యూనివర్సిటీలకు పెంచారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా దేశాల్లోని ప్రఖ్యాత వర్సిటీల్లో సీట్లు సాధిస్తేనే పథకం వర్తిస్తుంది. కాలేజీలు, యూనివర్సిటీల వివరాలు ప్రభుత్వం త్వరలో ఖరారు చేయనుంది. బీసీ సంక్షేమ శాఖ అమలు చేసే విద్యానిధి పథకంలో ఈబీసీలకు 5 శాతం సీట్లు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
తక్కువ ఖర్చుతో ఆ సర్వీసులు- గో ఎయిర్
కోల్కత్తా: ప్రయివేటు విమానయాన సంస్థ గో ఎయిర్ విదేశాలు వెళ్లాలనుకునే విమాన ప్రయణికులకు ఊరటనందిస్తోంది. త్వరలోనే తక్కువ ఖర్చుతో నడిచే విదేశీ విమాన సర్వీసులు ప్రారంభించనున్నామని ప్రకటించింది. తమ విదేశీ కార్యకలాపాలను త్వరలోనే ప్రారంభిస్తామని గో ఎయిర్ మేనేజింగ్ డైరెక్టర్ హెహ్ వాడియా వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి తమ విదేశీ గో ఎయిర్ విమానాలను ప్రారింభిచనున్నామని ఆయన అన్నారు. ప్రారంభంలో ఆసియా రీజన్ తమ సేవలను ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న 24-బలమైన విమానాలకు తోడు నియో ఎ320 143 ఎయిర్ బస్‌లకు ఆర్డర్చేసినట్టు పేర్కొన్నారు. వీటిలో అయిదింటిని ఇప్పటికే తమకు అందాయని, ఇంజీన్ లోపాల కారణంగా డెలివరీ ఆలస్యమవుతున్నట్టు వాడియా వివరించారు. మరోవైపు ప్రభుత్వ రంగ విమాన సంస్థ ఎయిర్ ఇండియా వాటాల కొనుగోలుపై మరో వైమానిక సంస్థ ఇండిగోకు పోటీగా రానుందా అని ప్రశ్నించినపుడు అలాంటిదేమీలేదని స్పష్టం చేశారు. అలాగే సంస్థ ఐపీఓకు వచ్చే అంచనాలను కూడా ఆయన కొట్టి పారేశారు. -
రిజిస్టర్డ్ ఏజెంట్ ద్వారానే విదేశాలకు వెళ్లాలి : డీఆర్వో
అనంతపురం అర్బన్: ప్రభుత్వ గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ ఏజెంటు ద్వారానే విదేశాల్లో ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లాలని ప్రజలకు జిల్లా రెవెన్యూ అధికారి సి.మల్లీశ్వరిదేవి సూచించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బోగస్ ఏజెంట్ల ద్వారా విదేశాలకు వెళ్లరాదని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లే సమయంలో ఇతరులు ఇచ్చిన పార్సిళ్లు, ప్యాకెట్లను తీసుకెళ్లరాదన్నారు. అలా వెళితే ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుందన్నారు. విదేశాలకు వెళ్లిన తరువాత ముందుగా భారత దౌత్యవేత్తలను కలవాలన్నారు. మరింత సమాచారం కోసం 1800 113 090 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలన్నారు. -
ఓవర్ సీస్లో బాహుబలికి షాక్..!
ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న బాహుబలి 2 నిర్మాతలకు ఓవర్ సీస్ ఆడియన్స్ షాక్ ఇచ్చారు. తొలి భాగం ఘనవిజయం సాధించటం, రెండో భాగంపై అంతకు మించి భారీ హైప్ క్రియేట్ అవ్వటంతో భారీ రేట్లకు డిస్ట్రిబ్యూషన్ హక్కులను అమ్మారు. ఒక్క అమెరికాలోనే బాహుబలి 2 వంద కోట్లు వసూళ్లు సాధిస్తే తప్ప అక్కడి డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్ లోకి వెల్లే అవకాశం లేదట. దీంతో అదే స్థాయిలో టికెట్ రేట్లను పెంచి క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్. మామూలుగా ఇండియన్ సినిమాలు ఓవర్ సీస్ లో రిలీజ్ అయితే టికెట్ ధర పది డాలర్ల లోపే ఉంటుంది. కానీ బాహుబలి 2 సినిమా టికెట్ ను మాత్రం 30 డాలర్లకు పైగా విక్రయించేందుకు నిర్ణయించారు. ఈ భారీ రేట్లపై స్పందించిన కెనడా వాసులు బాహుబలి యూనిట్ కు షాక్ ఇచ్చారు. టికెట్ రేట్లు తగ్గించకపోతే బాహుబలి సినిమాను బైకాట్ చేయాలంటూ ఒట్టావా తెలుగు అసోషియన్ నిర్ణయం తీసుకుందన్న ప్రచారం జరుగుతోంది. ఓవర్ సీస్ ఆడియన్స్ ఇచ్చిన షాక్ తో దిగి వచ్చిన డిస్ట్రిబ్యూటర్ లు టికెట్ ధరను 12.25 డాలర్లకు తగ్గించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. -
ఓవర్సీస్లోఖైదీకి భారీ టార్గెట్
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఖైదీ నంబర్ 150. చిరు 150వ సినిమా కూడా కావటంతో ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో మెగా అభిమానులను అలరించే అన్ని రకాల అంశాలతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది ఖైదీ నంబర్ 150. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి రీఎంట్రీ సంచలనాలు నమోదు చేయటం కాయంగా కనిపిస్తుంది. అదే సమయంలో మెగాస్టార్ సినిమాకు ఓవర్సీస్లో కూడా భారీ టార్గెట్లు సెట్ అవుతున్నాయి. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా కావటంతో విదేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా ఆసక్తికనబరుస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భారీ మొత్తాలకు ఖైదీ నంబర్ 150 రైట్స్ అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే జరిగిన బిజినెస్ ప్రకారం 1.8 మిలియన్ డాలర్లు వసూళు చేస్తే ఖైదీ నంబర్ 150 ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. మరి చిరు ఈ ఫీట్ సాధిస్తాడో లేదో చూడాలి.