‘బీసీ ఓవర్సీస్‌’కు దరఖాస్తుల ఆహ్వానం | Telangana Govt Invite Applications for Overseas Scholarship | Sakshi
Sakshi News home page

‘బీసీ ఓవర్సీస్‌’కు దరఖాస్తుల ఆహ్వానం

Published Wed, Jul 31 2019 5:03 PM | Last Updated on Wed, Jul 31 2019 5:10 PM

Telangana Govt Invite Applications for Overseas Scholarship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కింద అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌ అనితా రాజేంద్ర సూచించారు. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలకు మించరాదని, కుటుంబ వార్షికాదాయం ఐదు లక్షల్లోపు ఉండాలని తెలిపారు. టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, జీఆర్‌ఈ, జీమ్యాట్‌లలో కనీస స్కోరు సాధించాలన్నారు. రిజర్వేషన్, మెరిట్‌ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు https://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు. అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement