ఓవర్ సీస్లో బాహుబలికి షాక్..!
ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న బాహుబలి 2 నిర్మాతలకు ఓవర్ సీస్ ఆడియన్స్ షాక్ ఇచ్చారు. తొలి భాగం ఘనవిజయం సాధించటం, రెండో భాగంపై అంతకు మించి భారీ హైప్ క్రియేట్ అవ్వటంతో భారీ రేట్లకు డిస్ట్రిబ్యూషన్ హక్కులను అమ్మారు. ఒక్క అమెరికాలోనే బాహుబలి 2 వంద కోట్లు వసూళ్లు సాధిస్తే తప్ప అక్కడి డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్ లోకి వెల్లే అవకాశం లేదట. దీంతో అదే స్థాయిలో టికెట్ రేట్లను పెంచి క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్.
మామూలుగా ఇండియన్ సినిమాలు ఓవర్ సీస్ లో రిలీజ్ అయితే టికెట్ ధర పది డాలర్ల లోపే ఉంటుంది. కానీ బాహుబలి 2 సినిమా టికెట్ ను మాత్రం 30 డాలర్లకు పైగా విక్రయించేందుకు నిర్ణయించారు. ఈ భారీ రేట్లపై స్పందించిన కెనడా వాసులు బాహుబలి యూనిట్ కు షాక్ ఇచ్చారు. టికెట్ రేట్లు తగ్గించకపోతే బాహుబలి సినిమాను బైకాట్ చేయాలంటూ ఒట్టావా తెలుగు అసోషియన్ నిర్ణయం తీసుకుందన్న ప్రచారం జరుగుతోంది. ఓవర్ సీస్ ఆడియన్స్ ఇచ్చిన షాక్ తో దిగి వచ్చిన డిస్ట్రిబ్యూటర్ లు టికెట్ ధరను 12.25 డాలర్లకు తగ్గించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.