మొదటి షోకే మిలియన్ డాలర్లు | Kabali Overseas Collections Record | Sakshi
Sakshi News home page

మొదటి షోకే మిలియన్ డాలర్లు

Jul 22 2016 12:48 PM | Updated on Sep 4 2017 5:51 AM

మొదటి షోకే మిలియన్ డాలర్లు

మొదటి షోకే మిలియన్ డాలర్లు

కబాలి మేనియా ప్రపంచాన్నిచుట్టేస్తోంది. రిలీజ్కు మూడు రోజుల ముందు నుంచే మొదలైన ఫీవర్.. చివరకు తలైవాను తెరమీద చూసే సరికి పీక్స్కు చేరింది. ఇన్నాళ్లు ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తున్న ఫ్యాన్స్. ఇప్పుడు బద్దలవుతున్న...

కబాలి మేనియా ప్రపంచాన్నిచుట్టేస్తోంది. రిలీజ్కు మూడు రోజుల ముందు నుంచే మొదలైన ఫీవర్.. చివరకు తలైవాను తెరమీద చూసే సరికి పీక్స్కు చేరింది. ఇన్నాళ్లు ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తున్న ఫ్యాన్స్. ఇప్పుడు బద్దలవుతున్న రికార్డ్లను లెక్కలేస్తున్నారు. ఇప్పటికే తొలి షో ప్రదర్శనలు, ప్రపంచ దేశాల్లో రిలీజ్ లాంటి అంశాలతో రికార్డ్ సృష్టించిన కబాలి, ఓవర్ సీస్ మార్కెట్లో వసూళ్ల బాద్షాగా అవతరించాడు.

స్టార్ హీరోలు కూడా ఓవర్ సీస్లో వన్ మిలియన్ డాలర్ల మార్క్ కోసం మూడు నాలుగు రోజుల పాటు ఎదురుచూస్తుంటే రజనీ మాత్రం కబాలి తొలి షోకే ఆ రికార్డ్ను రీచ్ అయ్యాడట. అధికారికంగా ప్రకటించకపోయినా.. అత్యధిక సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శించటంతో పాటు.. టికెట్ ధరలు కూడా భారీగా పెరగటంతో ఈ రికార్డ్ సాధ్యమయ్యిందంటున్నారు. మార్నింగ్ షో పూర్తి కాక ముందే రికార్డ్ల వేట మొదలెట్టిన రజనీ.. ముందు ముందు మరిన్ని రికార్డ్లు సృష్టిస్తాడంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement