అజ్ఞాతవాసి ఇక్కడ ఫట్‌.. అక్కడ హిట్‌ | agnyaathavaasi reached 2 million mark in overseas | Sakshi
Sakshi News home page

అజ్ఞాతవాసి ఇక్కడ ఫట్‌.. అక్కడ హిట్‌

Published Tue, Jan 16 2018 11:00 AM | Last Updated on Tue, Jan 16 2018 11:00 AM

agnyaathavaasi reached 2 million mark in overseas - Sakshi

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటించిన తాజా చిత్రం ‘అజ్ఞాతవాసి‘. భారీ అం‍చనాల నడుమ విడుదలైన ఈచిత్రం అభిమానులను నిరాశపరిచింది. తొలి ఆట నుంచే డివైడ్‌ టాక్‌ వచ్చింది. అయితే పండుగ సందర్భంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ​కొన్ని సీన్లకు కోతపెట్టి, విక్టరీ వెంకటేష్‌ అతిథి పాత్రలో నటించిన సన్నివేశాలను జత చేశారు. దీంతో సినిమా కలెక్షన్లు కొంతమేర ఊపు అందుకున్నాయి.

అయితే సినిమాకు ఇక్కడ కలెక్షన్లు లేకపోయినా ఓవర్‌సీస్‌లో మాత్రం బాగా రాబడుతోంది. టాక్ తో సంబంధం లేకుండా 2మిలియన్ల డాలర్ల మార్క్‌ చేరుకుంది. ఇందులో 1.5 మిలియన్లు ప్రీమియర్‌ షోల ద్వారానే వచ్చాయి. ఇప్పటివరకు పవన్‌ సినిమా ఏది ఇంత కలెక్షన్లు రాబట్టకపోవడం గమనార్హం. అమెరికాలో ఎన్నడూలేని విధంగా ఎక్కువ స్క్రీన్లలో అజ్ఞాతవాసి విడుదల చేయడం వల్లే కలెక్షన్లు వస్తున్నాయనే టాక్‌ వినిపిస్తోంది. త్రివిక్రమ్‌ క్లాస్‌ అమెరికా ప్రేక్షకులకు ఎక్కువగా నచ్చుతోంది. అంతేకాకుండా ఇటీవల విడుదలైన మాస్‌ కంటెంట్‌ ఉన్న జైసింహా, గ్యాంగ్‌ చిత్రాలు పోటీ ఇవ్వలేకపోవడంతో అజ్ఞాతవాసికి కలిసొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement