300 కోట్లు దాటిన 'కబాలి' కలెక్షన్స్
సూపర్ స్టార్ రజనీకాంత్ కలెక్షన్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యింది. సూపర్ హిట్ టాక్ రాకపోయినా కేవలం రజనీ ఫాలోయింగ్తో కబాలి సరికొత్త రికార్డ్లు సృష్టిస్తోంది. రజనీకాంత్, పేదల కోసం పోరాడే మాఫియాడాన్గా నటించిన ఈ సినిమా.. భారత్తో పాటు ఇతర దేశాల్లో కూడా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి వారం కాస్త తడబడినట్టుగా కనిపించినా ప్రస్తుతం కలెక్షన్లు బాగానే ఉన్నాయంటున్నారు చిత్రయూనిట్.
గురువారం సాయంత్రం చెన్నైలో జరిగిన సక్సెస్ మీట్లో కలెక్షన్లపై నిర్మాత థాను క్లారిటీ ఇచ్చారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలి ప్రపంచ వ్యాప్తంగా 320 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా ప్రకటించారు. రజనీ మానీయా కారణంగా కేవలం ఆరు రోజుల్లో ఈ కలెక్షన్లు సాధ్యమయ్యాయన్నారు. ఇప్పటికే తొలి రోజు రికార్డ్ల విషయంలో టాప్గా నిలిచిన కబాలి, రోబో కలెక్షన్ల రికార్డ్లను చెరిపేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.