రిజిస్టర్డ్‌ ఏజెంట్‌ ద్వారానే విదేశాలకు వెళ్లాలి : డీఆర్వో | Go abroad through the registered agent: DRO | Sakshi
Sakshi News home page

రిజిస్టర్డ్‌ ఏజెంట్‌ ద్వారానే విదేశాలకు వెళ్లాలి : డీఆర్వో

Published Mon, Jul 24 2017 11:02 PM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

Go abroad through the registered agent: DRO

అనంతపురం అర్బన్‌:

ప్రభుత్వ గుర్తింపు పొందిన రిజిస్టర్డ్‌ ఏజెంటు ద్వారానే విదేశాల్లో ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లాలని ప్రజలకు జిల్లా రెవెన్యూ అధికారి సి.మల్లీశ్వరిదేవి సూచించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.  బోగస్‌ ఏజెంట్ల ద్వారా విదేశాలకు వెళ్లరాదని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లే సమయంలో ఇతరులు ఇచ్చిన పార్సిళ్లు, ప్యాకెట్లను తీసుకెళ్లరాదన్నారు. అలా వెళితే ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుందన్నారు. విదేశాలకు వెళ్లిన తరువాత ముందుగా భారత దౌత్యవేత్తలను కలవాలన్నారు.  మరింత సమాచారం కోసం 1800 113 090 టోల్‌ ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement