‘వీకెండ్‌ సినిమా’ ద్వారా యూఎస్‌లో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ | Weekend Cinema Releasing Lakshmis NTR In USA | Sakshi
Sakshi News home page

‘వీకెండ్‌ సినిమా’ ద్వారా యూఎస్‌లో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’

Mar 28 2019 5:57 PM | Updated on Mar 28 2019 5:57 PM

Weekend Cinema Releasing Lakshmis NTR In USA - Sakshi

ఆసక్తికరంగా మొత్తం రెండు రాష్ట్రాలూ వేచి చూస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ని ఊహించనంత పెద్ద యెత్తున, మార్చ్ 28న, 120 కన్నా ఎక్కువ థియేటర్లలో USA లో వీకెండ్ సినిమా సంస్థ రిలీజ్ చేస్తోంది. ఇది ఎన్టీఆర్ మీద వస్తున్న మూడో బయోపిక్ అయినా కూడా, ఈ సంవత్సరంలో అత్యంత ఉత్సుకత రేపిన సినిమా అని అనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.  ఈ సినిమా చేసింది కాంట్రవర్సీ లకు పితామహుడు రామ్ గోపాల్ వర్మ. తన మాటల్లో చెప్పాలంటే ఈ సినిమా ఒక గొప్ప కథానాయకుడి, ఒక గొప్ప మహానాయకుడిని పూర్తి చేసే నిజమైన సినిమా. 

ఈ చిత్రం రిలీజ్ కి చాలా అడ్డంకులను ఎదుర్కొంది, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద దీని ముద్ర ఉంటుందేమో అన్న భయాలు దానికి కారణం. అన్ని అవాంతరాలను దాటి ఈ మార్చి28న, ఎలక్షన్ కి రెండు వారాల ముందు రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి చివరి రోజుల గురించి చూపించిన విధానానికి ప్రేక్షకులు తరలి వచ్చి ఈ సినిమా చూస్తారు అని ఊహిస్తున్నారు. ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ కోసం కాకపోయినా, ఎన్టీఆర్ కోసం కాకపోయినా, ఒక సినిమా నిజంగా పొలిటికల్ సినారియోని మార్చగలుగుతుంది అని భయపడి అడ్డంకులు కలిగించిన కొందరి అభిప్రాయం నిజమా కాదా అని చూడాడానికైనా ఈ సినిమా తప్పకుండా చూడాలి. యూఎస్‌లో మార్చ్ 28న భారీ ఎత్తున ప్రీమియర్స్ తో ఈ సినిమా ప్రతి నగరంలో రిలీజ్ చేస్తుంది వీకెండ్ సినిమా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement