ఎలాంటి అంచాలు లేకుండా విడుదలై.. రికార్డులు సృష్టించిన సినిమా కేజీఎఫ్. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రూ .200 కోట్ల వసూళ్లు చేసిన మొదటి కన్నడ సినిమాగా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా విడుదలకు ముందే భారీ క్రేజ్ వచ్చింది. ఈ సినిమా కోసం అన్ని భాషల ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తొలి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం బిజినెస్‌కు రెక్కలొస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు నిర్మాతలు చెప్తున్న ధరలు విని బయ్యర్లకు వణుకు పుడుతుందట. ఈ చిత్రం ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. దీనితో ఈ చిత్రానికి ఏ స్థాయి క్రేజ్ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.
అలాగే కన్నడలో ఈ సినిమాను 100 కోట్లకు పైగా అమ్మడానికి చూస్తున్నారట. ఇక తెలుగులో కూడా ఏకంగా 70 కోట్లు చెప్తున్నారని ప్రచారం ఉంది. మరోవైపు హిందీలో కూడా ఈ సినిమాకు 50 కోట్లకు పైగానే రైట్స్ చెప్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కెజిఎఫ్ 2 సినిమా బిజినెస్ 200 కోట్లకు పైగానే జరుగుతుంది. ఈ సినిమా విజయం సాధించాలంటే కచ్చితంగా 250 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాలి. ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే మాత్రం కేజీఎఫ్ 2 బిజినెస్ భారీగానే జరుగుతుంది. అయితే ఇది ఎంత వరకు వాస్తవమనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment