Hombale Films gives clarity on KGF 3 Movie start date - Sakshi

KGF 3 Movie: కేజీఎఫ్-3 మూవీపై క్రేజీ అప్‌ డేట్.. టాలీవుడ్ హీరో సినిమా తర్వాతే..!

Published Fri, Dec 23 2022 4:09 PM | Last Updated on Fri, Dec 23 2022 4:37 PM

 Hombale Films Vijay Kiragandur clarity On KGF 3 Movie starts date - Sakshi

కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రభంజన సృష్టించిన సంగతి తెలిసిందే. యశ్ అభిమానులు కేజీఎఫ్ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంపై క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు హోంబలే ఫిల్స్మ్‌ అధినేత విజయ్‌ కిరంగదూర్. ప్రశాంత్ నీల్ తెరక్కిస్తున్న  ప్రభాస్ మూవీ 'సలార్‌' తర్వాత పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. హోంబలే ఫిల్మ్స్ నుంచి కేజీఎఫ్, కాంతార లాంటి బ్లాక్‌ బస్టర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేజీయఫ్‌‌-3పై అప్‌డేట్ ఇచ్చారు.

2018లో కన్నడ చిత్రంగా వచ్చి భారీ విజయం అందకున్న చిత్రం కేజీయఫ్‌. దీనికి కొనసాగింపుగా ఈ ఏడాదే కేజీయఫ్‌ చాప్టర్‌-2 వచ్చి సందడి చేసింది. ఈ మువీ కూడా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేజీఎఫ్‌-3 స్క్రిప్ట్‌ పనులు మొదలు పెట్టనున్నారని తెలిపారు. నీల్‌ వద్ద ఇప్పటికే స్టోరీ లైన్‌ రెడీగా ఉందని.. వచ్చే ఏడాది లేదా సలార్‌ పూర్తయిన వెంటనే ప్రారంభిస్తామని వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement