కేజీఎఫ్ హీరో యశ్‌ భార్య ఎమోషనల్ పోస్ట్.. లవ్‌ యూ అంటూ..! | Yash and wife Radhika Pandit celebrate 6th wedding anniversary Goes Viral | Sakshi
Sakshi News home page

Yash and Radhika Pandit: కేజీఎఫ్‌ హీరో పెళ్లి రోజు.. భార్య ఎమోషనల్ పోస్ట్ వైరల్

Published Fri, Dec 9 2022 5:41 PM | Last Updated on Fri, Dec 9 2022 5:43 PM

Yash and wife Radhika Pandit celebrate 6th wedding anniversary Goes Viral - Sakshi

కేజీఎఫ్‌ హీరో యశ్ టాలీవుడ్‌లోనూ పరిచయం అక్కర్లేని పేరు. అంతలా పేరు తీసుకొచ్చింది ఆ సినిమా. రాఖీభాయ్‌గా విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. శాండల్‌వుడ్‌లో అత్యంత అభిమానించే హీరోల్లో యశ్ ముందువరుసలో ఉంటారు. తాజాగా ఆయన వివాహ వార్షికోత్సవం సందర్భంగా యశ్‌ భార్య రాధిక పండిట్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్నారు. దీంతో ఆయన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

(ఇది చదవండి: బ్రహ్మస్త్ర-2లో కేజీఎఫ్‌‌ హీరో.. కరణ్ జోహార్‌ క్లారిటీ..!)

రాధిక ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇది మనమే.. మనం చాలా ఉల్లాసభరితంగా, గంభీరంగా ఉండొచ్చు. కానీ ఇది నిజం.. ఈ ఆరేళ్ల వైవాహిక జీవితాన్ని అద్భుతంగా మార్చినందుకు ధన్యవాదాలు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. లవ్‌ యూ.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. 

వారిద్దరు ఎలా కలిశారంటే.. యశ్,  రాధిక పండిట్ ఓ సినిమా షూటింగ్ సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు స్నేహం మొదలైంది. కొన్నేళ్లకు వారి స్నేహం ప్రేమగా మారి.. డిసెంబర్ 9, 2016న పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఒక పాప, బాబు జన్మించారు. వారి పిల్లలకు ఐరా, యతర్వ్ అని పేర్లు పెట్టారు.

కాగా.. కేజీఎఫ్ 2 భారీ హిట్ తర్వాత సినిమాలకు కొంత విరామం ప్రకటించారు యశ్. సినీ ప్రియులు కేజీఎఫ్ చాప్టర్- 3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యశ్ తన తదుపరి చిత్రం కోసం దర్శకుడు నర్తన్‌తో కలిసి పని చేయనుండగా.. ఆ చిత్రానికి యశ్ -19 అని పేరు పెట్టారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement