ఓవర్సీస్లోఖైదీకి భారీ టార్గెట్ | Expectations on Chiranjeevi Khaidi Number 150 film overseas Collections | Sakshi
Sakshi News home page

ఓవర్సీస్లోఖైదీకి భారీ టార్గెట్

Published Thu, Dec 29 2016 10:49 AM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM

ఓవర్సీస్లోఖైదీకి భారీ టార్గెట్

ఓవర్సీస్లోఖైదీకి భారీ టార్గెట్

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఖైదీ నంబర్ 150. చిరు 150వ సినిమా కూడా కావటంతో ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్తో మెగా అభిమానులను అలరించే అన్ని రకాల అంశాలతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది ఖైదీ నంబర్ 150. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి రీఎంట్రీ సంచలనాలు నమోదు చేయటం కాయంగా కనిపిస్తుంది. అదే సమయంలో మెగాస్టార్ సినిమాకు ఓవర్సీస్లో కూడా భారీ టార్గెట్లు సెట్ అవుతున్నాయి. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా కావటంతో విదేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా ఆసక్తికనబరుస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భారీ మొత్తాలకు ఖైదీ నంబర్ 150 రైట్స్ అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే జరిగిన బిజినెస్ ప్రకారం 1.8 మిలియన్ డాలర్లు వసూళు చేస్తే ఖైదీ నంబర్ 150 ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. మరి చిరు ఈ ఫీట్ సాధిస్తాడో లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement