అక్కడ రెండు రోజుల ముందే రిలీజ్ | Shahrukh khan Dear Zindagi Overseas Release Date | Sakshi
Sakshi News home page

అక్కడ రెండు రోజుల ముందే రిలీజ్

Published Wed, Nov 16 2016 11:32 AM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM

అక్కడ రెండు రోజుల ముందే రిలీజ్

అక్కడ రెండు రోజుల ముందే రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరోలందరూ వందల కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంటే.. కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ మాత్రం కొద్ది రోజులుగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నాడు. ముఖ్యంగా అసహనంపై షారూఖ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాలకు దారితీయటంతో ఆయన సినిమాలపై కమర్షియల్గా కూడా తీవ్ర ప్రభావం పడింది. దీంతో కొద్ది రోజులుగా షారూఖ్ సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆడటం లేదు.

అందుకే తన నెక్ట్స్ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బాద్షా. లిమిటెడ్ బడ్జెట్లో అలియా భట్తో కలిసి డియర్ జిందగీ సినిమాలో నటించాడు షారూఖ్. ఎలాంటి హడావిడి లేకుండా తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో మరోసారి తన కమర్షియల్ స్టామినా ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్న షారూఖ్ కొత్త ప్లాన్ చేస్తున్నాడట.

రెగ్యులర్గా ఇండియన్ సినిమాలన్నీ ఒక్క రోజు ముందుగానే ఓవర్సీస్లో రిలీజ్ అవుతాయి. అయితే షారూఖ్ మాత్రం డియర్ జిందగీ సినిమాను రెండు రోజుల ముందే ఓవర్సీస్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అక్కడి ప్రేక్షకులకు నచ్చే అంశాలన్ని ఉన్న సినిమా కావటంతో ముందుగా అక్కడ రిలీజ్ అయితే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. అందుకే ఇండియాలో నవంబర్ 25న రిలీజ్ కానున్న డియర్ జిందగీ సినిమాను ఓవర్సీస్లో మాత్రం నవంబర్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement