- దేశ,విదేశీయుల మనస్సులు గెల్చుకున్న శశిధర్‌రెడ్డి
- అక్షరాలతో సమస్యలపై సమరం
- నేడు మాతృభాషా దినోత్సవం
సనత్‌నగర్,న్యూస్‌లైన్: బీఆర్క్ (ఆర్కిటెక్చర్)...ఆపై ముంబయి ఐఐటీ లో విజువల్ డిజైనింగ్ చేశాడు ఆ కుర్రోడు. ఆంగ్లాన్ని అవపోశన పట్టేశాడు...ఇందులో వింతేముంది...అనుకుంటున్నారా..ఒక్క క్షణం...ఆంగ్లంలో గలగలా మాట్లా డే ఆ కుర్రోడే మాతృభాష తెలుగుదనం గొప్పతనాన్ని విశ్వమంతా ఖ్యాతింపజేస్తున్నాడు. బడిఒడిలో మొదటగా తాను నేర్చుకున్న తెలుగు ఓనమాలనే అస్త్రాలుగా చేసుకుని అద్భుతాలకు నాంది పలికాడు. కోట్లాది హృదయాలను తనఅక్షర ప్రయోగంతో తట్టిలేపాడు.
పరదేశీయుల మనస్సులనూ గెలుచుకున్నాడు. ఆయనే బహురూపాల్లో స్వభాషా ప్రియత్వాన్ని చాటుతోన్న హైదరాబాదీ నేస్తం జి.శశిధర్‌రెడ్డి. అంతరించిపోతున్న భాషల్లో తెలుగు కూడా ఒకటి అన్న చేదువార్తను జీర్ణించుకోలేని ఆ కుర్రోడు తనవంతుగా టైపోగ్రఫీ (ఖతిచిత్రకళ)తో తెలుగుభాష గొప్పతనాన్ని చాటుతున్నాడు. కేవలం అక్షరాలను ఉపయోగించి భావవ్యక్తీరణ చేయడమే టైపోగ్రఫీ. నేడు మాతృభాష దినోత్సవం సందర్భంగా...శశిధర్‌రెడ్డి తెలుగుఅక్షరాలతో చేసిన ప్రయోగాలతో కొన్ని..
‘అమ్మ’కం...ఓ అద్భుతం: పెంచిన తల్లి ప్రేమ.. జన్మనిచ్చిన తల్లి ప్రేమ.. సహజత్వానికి... కృత్రిమతత్వానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. అందుకే మాతృభాషలోని మధురామృతాన్ని తానొక్కడే జుర్రుకోవడమే కాదు... ఇతరులకు పంచాలని కంకణం కట్టుకున్నాడు. అ అంటే అమ్మ అని అందరికీ తెలుసు. ‘అ’ అక్షరంతోనే అమ్మ ప్రేమను టైపోగ్రఫీతో కళ్లకు కట్టినట్లు చూపించా డు.
పేదరికంతో గర్భాన్ని అద్దెకిస్తున్న తల్లులు (సరోగసీ), పుట్టిన బిడ్డలను వివిధ కారణాలతో అమ్ముకుం టున్న మాతృమూర్తులు, గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్సలు వంటివాటిపై ఒక్క అక్షరంతో తన సందేశాన్ని వ్యక్తపర్చాడు. సహజత్వం ఉట్టిపడే తెలుగు అక్షరాలకు శశిధర్‌రెడ్డి సృజనను జోడించి తల్లిగర్భంలో బిడ్డ ఆకా రం వచ్చేలా టైపోగ్రఫీ చేయడం అందరినీ ఆకట్టుకుం ది. గత ఏడాది గౌహతిలో జరిగిన అంతర్జాతీయ టైపోగ్రఫీ పోటీలకు హాజరై ప్రపంచదేశాల ప్రతినిధులను ఆలోచింపజేయడమే కాదు శశిధర్‌రెడ్డిని విజేతగా నిలిపింది.
తెలుగు అక్షరాలతో మద్యంపై పోరాటం: సాధారణంగా మనం రాసే అక్షరాలకు సృజనాత్మకతను జోడించి టైపోగ్రఫీ ద్వారా మద్యం రక్కసిపై ఆయన పోరాడుతున్నాడు. మద్యంతో బతుకులు ఏవిధంగా ఛిద్రమవుతున్నాయో ఖతిచిత్రకళ ద్వారా సందేశాన్ని అందించారు. మద్యం సేవించడం ద్వారా ఆరోగ్యం పాడై, కుటుంబ బాధ్యతలు మరిచి చివరకు ఉరితాడును పట్టుకుంటున్నట్లుగా తాడుతో అక్షరరూపంలోకి తేవడం విశేషం.
ఇంగ్లీష్....తిప్పిచూస్తే తెలుగు: తెలుగు భాష ప్రాశస్త్యాన్ని చాటడంలో శశిధర్‌రెడ్డి ప్రత్యేకత సాధించారని చెప్పొచ్చు. ఇంగ్లీష్ పదం ఒక అర్థాన్ని చెబితే...అదే పదాన్ని 180 డిగ్రీలో తిప్పి చూస్తే తెలుగుపదం మరో అర్ధాన్ని ఇస్తోంది. ఇలాంటి ప్రయోగాల ద్వారా తెలుగుభాష గొప్పతనం గురించి కొంతైనా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే నా తాపత్రయం అని చెప్పుకొచ్చారు.
శ్రీముత్యాలు ఫాంట్‌కు రూపకల్పన: తెలుగుభాషపై అభిమానంతో శ్రీముత్యాలు ఫాంట్‌కు రూపొందించారు. మిగతా ఫాంట్ల కంటే భిన్నంగా తెలుగు భాషను సులువుగా చదువుకునేలా దీనిని తయారుచేయడం జరిగిం ది. శ్రీ అంటే తన గురువు శ్రీకుమార్, ముత్యాలు అంటే హైదరాబాద్ పెరల్స్ పేరిట శ్రీముత్యాలు అని పెట్టిన ట్లు శశిధర్ తెలిపారు. ఇదే కాకుండా చిన్నపిల్లలు సులువుగా అర్థం చేసుకునేలా పుస్తకాలు రూపొందిస్తున్నట్లు శశిధర్ చెప్పారు.