
కుమారుడే తదుపరి సుప్రీం లీడర్!
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (85) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆయన వారసుడు ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. ఖమేనీ తనయుడు ముజ్తబా ఖమేనీ (55) తదుపరి సుప్రీం లీడర్ కావొచ్చని ప్రచారం సాగుతోంది.
ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఖమేనీ 1989 నుంచి సుప్రీం లీడర్‌గా ఉన్నారు. రుహొల్లా ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు, మరోవైపు దిగజారుతున్న ఖమేనీ ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఇరాన్‌లో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఘర్షణలు మరింత ముదరడం తాము కోరుకోవడం లేదని ఇరాన్ అధికారులు చెప్పారు.