successor announcement
-
ఖమేనీ ఆరోగ్యం విషమం?
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (85) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆయన వారసుడు ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. ఖమేనీ తనయుడు ముజ్తబా ఖమేనీ (55) తదుపరి సుప్రీం లీడర్ కావొచ్చని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఖమేనీ 1989 నుంచి సుప్రీం లీడర్‌గా ఉన్నారు. రుహొల్లా ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు, మరోవైపు దిగజారుతున్న ఖమేనీ ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఇరాన్లో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఘర్షణలు మరింత ముదరడం తాము కోరుకోవడం లేదని ఇరాన్ అధికారులు చెప్పారు. -
‘డీ’ గ్యాంగ్ నయా డాన్.. అనీస్!
సోదరుడిని వారసుడిగా ప్రకటించనున్న దావూద్! * 60వ బర్త్‌డే పార్టీలో ప్రకటించే అవకాశం ముంబై: మాఫియా డాన్, ముంబై పేలుళ్ల కీలక నిందితుడు దావూద్ ఇబ్రహీం రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడా?వారసుడిని ప్రకటించనున్నాడా?.. ఈ ప్రశ్నలకు ముంబైలోని ‘డీ’ కంపెనీ సన్నిహిత వర్గాలు అవుననే అంటున్నాయి. ‘డీ’ కంపెనీ వర్గాల సమాచారం మేరకు.. సోదరుడు అనీస్ అహ్మద్‌కు డీ కంపెనీ పగ్గాలు అప్పగించేందుకు దావూద్ నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు డీ గ్యాంగ్ సీఈఓగా ఉన్న దావూద్ ముఖ్య అనుచరుడు చోటా షకీల్ ఇకపైనా అదే బాధ్యతల్లో కొనసాగుతారు. అనీస్, షకీల్‌లు కలిసి, దావూద్ సలహ సంప్రదింపుల మేరకు ‘డీ’ కంపెనీ మాఫియా బిజినెస్‌ను నిర్వహిస్తారు. పలు దేశాల్లో డ్రగ్స్, అక్రమ ఆయుధాల అమ్మకం, బెట్టింగ్, హవాలా తదితర కార్యకలాపాల ద్వారా వెయ్యి కోట్ల డాలర్ల(సుమారు రూ. 66 వేల కోట్లు) మాఫియా సామ్రాజ్యాన్ని దావూద్ నిర్మించారు. దావూద్ సోదరుల్లో అనీస్, హుమాయున్, ముస్తఖీమ్.. దావూద్‌తోనే ఉంటున్నారు. వారిలో ముస్తఖీమ్ దీర్ఘకాల వ్యాధితో బాధపడ్తూ, ఇంట్లోనే ఉంటున్నాడు. హుమాయున్ ‘డీ’ వ్యవహారాల్లో అంత క్రియాశీలకంగా లేడు. అందువల్ల అనీస్‌కే వారసత్వ పగ్గాలు అప్పగించవచ్చు. దావూద్ రిటైర్మెంట్ నిర్ణయం వెనుక ఆయన భార్య మెహజబీన్, ఇద్దరు పిల్లలు మహరూఖ్, మొయిన్‌లు ఉండొచ్చని భావిస్తున్నారు. అనారోగ్యంతో బాధ పడ్తున్న దావూద్‌కు విశ్రాంతి అవసరమన్న ఉద్దేశంతో వారు బాధ్యతలను తగ్గించుకోవాలంటూ దావూద్‌పై ఒత్తిడి తెచ్చి ఉండొచ్చనుకుంటున్నారు. రహస్యం.. అంగరంగ వైభవం తన 60వ పుట్టిన రోజును దావూద్ శనివారం కరాచీలో వైభవంగా జరుపుకుంటున్నాడు. వేదిక ఎక్కడ అనేది అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు. అతిధులకు కూడా ఆ వివరాలు ఇవ్వడం లేదు. బర్త్‌డే వేడుకలకు కాసేపు ముందు పికప్ చేసుకుంటామని వారికి చెప్పినట్లు సమాచారం. దావూద్ పాక్‌లో ఉండడు! ముంబై: ‘దావూద్ పాక్‌లో ఉండడు.. తరచుగా పాక్‌కు వస్తాడని వింటుంటాను.’ అని కరాచీకి చెందిన మీడియా గ్రూప్ ‘డాన్’ సీఈఓ హమీద్ పేర్కొన్నారు. ముంబై ప్రెస్ క్లబ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. -
షష్టిపూర్తి రోజున మాఫియాడాన్ వారసుడి ప్రకటన?
పాకిస్థాన్‌లో ఉండి.. ముంబై నేర సామ్రాజ్యాన్ని శాసిస్తున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఇక రిటైర్ అవుదామని చూస్తున్నట్లుంది. శనివారం షష్టిపూర్తి చేసుకోబోతున్న దావూద్.. ఆరోజు తన వారసుడిని ప్రకటించే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. తన సోదరులలో ఒకరిని వారసుడిగా చేయొచ్చని, అందులో అనీస్ అహ్మద్‌కు అవకాశాలు ఎక్కువని అంటున్నారు. ఇక దావూద్ గ్యాంగులో అత్యంత కీలకమైన వ్యక్తి, గ్యాంగు సీఈవోగా చెప్పుకొనే ఛోటా షకీల్‌కు అతడి స్థానం యథాతథంగా ఉంచుతారని తెలుస్తోంది. అయితే, సాధారణంగా దావూద్ ఏం చేసినా ముంబైలోని బిగ్షాట్లకు తెలిసిపోతుంది. వాళ్లు కూడా 'భాయ్' దిగిపోతున్న విషయం తమకు తెలియదనే అంటున్నారు. కేవలం కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఈ విషయాన్ని తన 60వ పుట్టినరోజు సందర్భంగా జరిగే పార్టీలో ప్రకటిస్తాడని అంచనా. పార్టీ ఎక్కడ జరుగుతుందన్న విషయం కూడా టాప్ సీక్రెట్‌గా ఉంచారు. పార్టీకి పిలిచినవాళ్లకు కూడా ఎక్కడన్న విషయం చివరి నిమిషంలోనే చెబుతున్నారు. డ్రగ్స్, బెట్టింగ్, హవాలా, ఆయుధాల స్మగ్లింగ్ లాంటి వ్యవహారాల ద్వారా 66 వేల కోట్ల రూపాయల డి కంపెనీ సామ్రాజ్యం తన అనారోగ్యం కారణంగా కుప్పకూలకూడదని దావూద్ భావిస్తున్నట్లు తెలిసింది. రాబోయే రెండు మూడేళ్ల పాటు మాత్రమే తాను కూడా ఉండి.. వచ్చేవాళ్లకు కాస్త మార్గదర్శనం చేయాలన్నది దావూద్ ప్లాన్ అంటున్నారు. దావూద్ సోదరుల్లో నూరుల్ హక్ అలియాస్ నూరా చనిపోయాడు. ఇక్బాల్ కస్కర్‌ను దుబాయ్ నుంచి వెనక్కి పంపేశారు. దాంతో మరో ముగ్గురు సోదరులు మాత్రమే ఉన్నారు. వాళ్లు అనీస్, హుమాయూన్, ముస్తఖీమ్. వీళ్లలో అనీస్ తప్ప మిగిలిన ఇద్దరూ గ్యాంగు కార్యకలాపాల్లో అంత చురుగ్గా ఉండరు. ముస్తఖీమ్ ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. దాంతో అతడు ఇంటికే పరిమితం. దాంతో ఇక ఛోటా షకీల్ సాయంతో అనీస్ గ్యాంగు పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కూతుళ్ల ఒత్తిడి దావూద్ ఇబ్రహీంకు మహరూఖ్, మోయిన్ అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వాళ్లలో మహరూఖ్ను మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కొడుకు జునైద్ మియాందాద్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. మోయిన్ నిఖార్సైన ముస్లిం. వీళ్లిద్దరూ కూడా తమ తండ్రిని ఇక పని ఒత్తిడి తగ్గించుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఎవరో ఒకరికి గ్యాంగు అప్పగించి ఇక విశ్రాంతి తీసుకోవాలని దావూద్ భార్య మెహజబీన్ కూడా ఎన్నాళ్ల నుంచో పోరు పెడుతోంది. అందుకే ఇక రిటైర్మెంటు గురించి డాన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.