పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పరిస్థితి ప్రస్తుతం బాగా క్షీణించినట్లు సమాచారం. ఈ మేరకు డాక్టర్ ఉమేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీలు ప్రస్తుతం 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. ఆయన కిడ్నీ పనితీరు ఎప్పుడైనా పూర్తిగా క్షీణించొచ్చు. అది ఎప్పుడు అనేది ఊహించడం కష్టం. కానీ అది ఖచ్చితంగా జరగుతుంది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం.
అందుకే నేను ఈ విషయం గురించి అధికారులకు లిఖితపూర్వకంగా తెలిపాను. ఇప్పటికే అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొందటున్న ఆయనకు.. ఇప్పుడు కొత్తగా మూత్రపిండాల పనితీరు క్షీణిస్తుంది. ఇప్పటికే లాలూ డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు తెలిసింది. అందువల్ల ఆయన కిడ్నీల నితీరు క్రమంగా క్షీణించిందని' రిమ్స్ వైద్యుడు ప్రసాద్ వెల్లడించారు. ఇదిలా ఉండగా, లాలూకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాది వేసిన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు జనవరి 22కి వాయిదా వేసింది. చదవండి: (‘నాడు పవార్‌కు దక్కని ప్రధాని పదవి’)
Comments
Please login to add a commentAdd a comment