
డెహ్రాడూన్: దాదాపు తొమ్మిది నెలలుగా ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్‌డీ తివారీ(92) ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. మరింత మెరుగైన చికిత్సలో భాగంగా బుధవారం ఆయనకు పలు వైద్యపరీక్షలు నిర్వహించినట్లు తివారీ క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
బ్రెయిన్‌స్ట్రోక్ కారణంగా గతేడాది సెప్టెంబర్ 20న తివారీని ఢిల్లీలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. గత రెండు, మూడు వారాలుగా తివారీ ఆరోగ్యం మరింత క్షీణించిందని, దీంతో ఛాతి ఎక్స్–రే, ఇతర వైద్యపరీక్షలు నిర్వహించారని క్యాంపు కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తివారీ కొడుకు రోహిత్ శేఖర్‌కు వైద్యులు వివరించారు. తివారీకి ఎంఆర్‌ఐ పరీక్ష నిర్వహించాలని వైద్యులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment