ND Tiwari
-
అపూర్వ శుక్లాపై చార్జీ షీట్ దాఖలు
ఢిల్లీ: దివంగత గవర్నర్, యూపీ మాజీ సీఏం ఎన్డీ తివారీ తనయుడు రోహిత్ తివారి హత్య కేసులో నిందితురాలు అయిన అతడి భార్య అపూర్వ శుక్లాపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో అపూర్వ రోహిత్‌ను ఊపిరాడకుండా చేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె జైలు జీవితం గడుపుతున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలతో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు మంగళవారం ఆమెపై 518 పేజీల చార్జీ షీట్ దాఖలు చేశారు. చదవండి : ఆమె వీడియో కాల్ వల్లే ఇదంతా...నిందితురాలిగా సుప్రీంకోర్టు లాయర్ -
‘జైలులో జాతకాలు చెప్పడం నేర్చుకుంటుంది’
న్యూఢిల్లీ : మాజీ గవర్నర్ ఎన్డీ తివారి తనయుడు రోహిత్ హత్య కేసులో అతని భార్య అపూర్వ శుక్లా ప్రస్తుతం తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆస్తి కోసం తానే భర్తను చంపినట్లు అపూర్వ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే జైలులో ఆమె ప్రవర్తన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు జైలు సిబ్బంది. చేసిన నేరం పట్ల ఆమె ఏ మాత్రం పశ్చత్తాపం వ్యక్తం చేయడం లేదని తెలిపారు. అంతేకాక ప్రస్తుతం ఆమె జాతకాలు చెప్పడం నేర్చుకుంటుందన్నారు. జైలులో వారానికి రెండు సార్లు మంగళవారం, గురువారం రోజుకు రెండు గంటల పాటు టారోట్ కార్డ్ రీడింగ్(జాతకాల గురించి) క్లాసులు జరుగుతాయని తెలిపారు అధికారులు. అపూర్వ ప్రత్యేక శ్రద్ధతో ఈ కోర్సును నేర్చుకుంటుందన్నారు జైలు అధికారులు. మొదటి వరుసలో కూర్చుని.. ఎంతో ఏకాగ్రతతో పాఠాలు వింటుందని తెలిపారు. అంతేకాక ఈ కోర్సు పట్ల ఆమె ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారని ప్రశంసించారు. గతంలో కోర్టు విచారణ సందర్భంగా ఓ క్లాస్ మిస్సయ్యిందని.. అందుకు ఆమె ఎంతో బాధపడిందని తెలిపారు అధికారులు. -
దూరపు చుట్టంతో ఎఫైర్.. పెళ్లికి ముందే కొడుకు!
న్యూఢిల్లీ: రోహిత్ శేఖర్ తివారీ హత్యకేసులో అరెస్టయిన అతని భార్య అపూర్వ శుక్లా పోలీసుల విచారణలో సంచలన నిజాలు బయటపెట్టారు. తన భర్తకు పెళ్లిముందే ఒక కొడుకు ఉన్నాడని, ఆ కొడుకునే ఆయన ఆస్తికి వారసుడిని చేయాలని భావించారని, అందుకే రోహిత్‌ను చంపేసినట్టు ఆమె పోలీసుల ఎదుట అంగీకరించారు. రెండురోజుల పోలీసు రిమాండ్‌లో ఉన్న ఆమె తన వైవాహిక జీవితం, రోహిత్‌తో ఎదురైన సమస్యలు.. హత్యకు దారితీసిన పరిస్థితులు క్షుణ్నంగా పూస గుచ్చినట్టు వివరించారు. రోహిత్ శేఖర్ తివారీ, అపూర్వ శుక్లాల పెళ్లి ఫొటో రోహిత్‌కు పెళ్లి ముందునుంచే వివాహేతర సంబంధం ఉండటం తనను తీవ్రంగా దహించివేసిందని, అతనికి ఓ దూరపు చుట్టమైన మహిళతో అత్యంత సాన్నిహిత్యం ఉందని ఆమె పోలీసులకు తెలిపారు. ‘ఆ మహిళ తన కొడుకు రోహిత్ ఆస్తిలో వాటా ఇవ్వాలని తరచూ కోరేది. మీ ఇంటి కొడుకే కదా అని తరచూ అంటుండేది. రోహిత్ కూడా ఆ పిల్లాడిపై ప్రేమ, ఆప్యాయతలు ఉండటం నా అనుమానాలను పెంచింది’ అని ఆమె తెలిపింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన అపూర్వ తాను తరచూ ఇండోర్, ఢిల్లీ మధ్య పర్యటించేదానినని, ఇండోర్ జిల్లా కోర్టుతోపాటు సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తుండటంతో అనంతరం ఢిల్లీకి మారానని ఆమె తెలిపారు. రాజకీయ ఆశయాలు ఉండటంతో మాట్రిమోనియల్ సైట్లో దివంగత నాయకుడు ఎన్డీ తివారీ కొడుడైన శేఖర్ తివారీ ప్రొఫైల్‌ను చూడగానే ఎంచుకున్నానని, ఆ తర్వాత కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత 2018 మే 11న తాము పెళ్లి చేసుకున్నామని, కానీ, తమ వైవాహిక జీవితం ఎక్కువరోజులు నిలబడలేదని, అత్తింటివారితో సరిపడకపోవడంతో అదే ఏడాది మే 29న అత్తింటిని వీడి వచ్చానని ఆమె తెలిపారు. అనంతరం జులైలోనే రోహిత్‌కు విడాకుల నోటీసులు పంపానని, కానీ, హృదయ సంబంధ వ్యాధితో అతను ఆస్పత్రిలో చేరడంతో అతన్ని పరామర్శించాక.. తమ అనుబంధాన్నికొనసాగించాలని భావించానని ఆమె తెలిపారు. అత్త ఉజ్వల సింగ్ కూడా తరచూ తనను వేధించేదని, ఆమె అనుమతి లేకుండా కనీసం బెడ్రూమ్ కర్టైన్ కూడా మార్చనిచ్చేది కాదని అపూర్వ తెలిపారు. అంతేకాకుండా రోహిత్ తండ్రి అతనికి వారసత్వంగా ఆస్తులేవీ ఇచ్చి వెళ్లలేదని, ఢిల్లీ ఢిపెన్స్ కాలనీలోని నివాసం కూడా అతని తల్లిదేనని అపూర్వకు తెలియడం ఆమెలో కోపాన్ని మరింత పెంచిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ‘రోహిత్ క్రూరంగా ప్రవర్తించేవాడు. అతను నన్ను ప్రేమించలేదు. మేం ఎప్పుడు అతని ఎఫైర్ గురించి గొడవపడేవాళ్లం. సర్దిచెప్పడానికి బదులు ఆ అఫైర్ గురించి అతను గొప్పలు చెప్పుకునేవాడు. అందుకే అతన్ని నేను చంపేశా’ అని అపూర్వ పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించింది. -
ఆమె వీడియో కాల్ వల్లే ఇదంతా...
భావోద్వేగాలు అదుపులో ఉంచుకోకపోవడం, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం, మితిమీరిన కోపం, అపార్థాలు అన్నీ వెరసి సుప్రీంకోర్టు న్యాయవాది అపూర్వ శుక్లా(35)ను హంతకురాలిగా మార్చాయి. తీరు మార్చుకోవాలని చెప్పినా వినకుండా నిండు జీవితాన్ని కోల్పోయాడు రోహిత్ తివారి(40). ఉన్నత విద్యావంతులై కూడా వైవాహిక బంధంలో తలెత్తిన విభేదాలను పరిష్కరించుకోవడంలో విఫలమైన ఈ న్యాయవాద జంట తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పద్ధతి మార్చుకోక ఒకరు ప్రాణాలు కోల్పోతే.. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో మరొకరు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకున్నారు. ఆరేళ్ల పోరాటం అనంతరం ఉత్తరాఖండ్ మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి ఎన్డీ తివారే తన తండ్రి అని ప్రపంచానికి తనను తాను గర్వంగా పరిచయం చేసుకున్నాడు అపూర్వ భర్త రోహిత్ శేఖర్ . అనంతరం తల్లిదండ్రులకు పెళ్లి చేసి వారితో పాటు కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాలో రోహిత్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. ప్రస్తుతం అతడి హత్యకు సంబంధించిన వార్తలు కూడా అంతే సంచలనంగా మారాయి. పరిచయం.. సహజీవనం ఉజ్వల తివారి తన కుమారుడు రోహిత్ కోసం వధువును అన్వేషించడం మొదలు పెట్టిన కొన్నేళ్ల తర్వాత అతడు అపూర్వను కలుసుకున్నాడు. 2017లో ఓ మ్యాట్రిమొని వెబ్సైట్లో పరిచయమైన వీరిద్దరు అనతికాలంలోనే మంచి స్నేహితులయ్యారు. ఈ క్రమంలో అపూర్వను తల్లికి కూడా పరిచయం చేశాడు రోహిత్. వృత్తిరీత్యా న్యాయవాదులైన ఈ జంట దాదాపు ఏడాది పాటు సహజీవనం చేసింది. అనంతరం కొద్ది కాలం వేరుగా ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఇరువర్గాల కుటుంబ సభ్యులు అంగీకరించడంతో 2018, మే 12న ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్‌లో వైభవంగా పెళ్లిచేసుకున్నారు. న్యూఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో ఉన్న విలాసవంతమైన బంగ్లాలో కాపురం పెట్టారు. ఆమె ఎవరు? కుమారుడు ఓ ఇంటివాడయ్యాడనే సంతోషం ఉజ్వలా తివారీకి ఎంతోకాలం నిలవలేదు. పెళ్లైన రెండో రోజు నుంచే రోహిత్- అపూర్వల మధ్య గొడవలు మొదలయ్యాయి. తన భర్తకు వేరే మహిళతో సంబంధం ఉందనేది అపూర్వ ఆరోపణ. అంతేకాదు ఆమె రోహిత్‌కు సమీప బంధువు కావడంతో అపూర్వ అనుమానం మరింత బలపడింది. తరచుగా తమ ఇంటికి రావడం, తన భర్తతో చనువుగా ఉండటం భరించలేకపోయేది. ఈ క్రమంలోనే పద్ధతి మార్చుకోవాలని భర్తను పదే పదే హెచ్చరించింది. అయితే ఆమె కేవలం స్నేహితురాలు మాత్రమేనని రోహిత్ చెప్పడంతో ఏమీ చేయలేకపోయేది. రోహిత్ తీరుతో అభద్రతా భావానికి లోనైన అపూర్వ తాను, తన తల్లిదండ్రులు ఉండేందుకు విలాసవంతమైన భవనం కట్టించాలంటూ భర్తను డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. అయితే రోహిత్ మాత్రం ఆమె మాటలను ఏనాడు లెక్కచేయలేదు. దీంతో తరచుగా ఇద్దరూ వాదులాడుకునేవారు. ఈ క్రమంలోనే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. చదవండి : అపూర్వను గుడ్డిగా నమ్మాను ఆ వీడియో కాల్ వల్లే ఇదంతా.. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 11న ఓటు వేసేందుకు రోహిత్ తన తల్లితో కలిసి ఉత్తరాఖండ్‌కు బయల్దేరాడు. అపూర్వ మాత్రం ఢిల్లీలోనే ఉండిపోయింది. అయితే ఉత్తరాఖండ్‌లో ఉన్న సమయంలో రోహిత్ బంధువు, అపూర్వ అనుమానాలకు కారణమైన సదరు మహిళ ఉజ్వల, రోహిత్‌లతో పాటే ఉంది. ఓ రోజు కారులో వీరిద్దరు మాత్రమే ప్రయాణిస్తూ మద్యం తాగారు. అప్పుడే అపూర్వ అతడికి వీడియోకాల్ చేసింది. మత్తులో ఉన్న రోహిత్ వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. ‘ఆమె’ గురించి అడుగగా.. కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ అపూర్వ మాత్రం రోహిత్ అబద్ధం చెబుతున్న విషయాన్ని పసిగట్టింది. ఆరోజు ఏం జరిగిందంటే..? ఏప్రిల్ 15 రాత్రి పది గంటల సమయంలో రోహిత్ డిఫెన్స్ కాలనీలో గల తన ఇంటికి చేరుకున్నాడు. అయితే అతడితో ‘ఆమె’ కూడా రావడాన్ని అపూర్వ తట్టుకోలేకపోయింది. కోపాన్ని అదుపుచేసుకొని అతడికి భోజనం వడ్డించింది. అనంతరం ఆమె వెళ్లిపోగా.. ఉజ్వల కొడుకు, కోడలును హాల్లోకి పిలిచి కాసేపు మాట్లాడుకోమని సూచించి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రయాణం కారణంగా అలసిపోయానని చెప్పిన రోహిత్ బెడ్రూంలో నిద్రపోగా.. అపూర్వ మాత్రం 12.45 వరకు టీవీ చూసింది. అనంతరం బెడ్రూంలోకి వెళ్లి ‘ఆమె’ గురించి ప్రశ్నించింది. తామిద్దరం కలిసి కారులో ఒకే గ్లాసులో మందు తాగామని.. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ రోహిత్ బదులిచ్చాడు. దీంతో కోపోద్రిక్తురాలైన అపూర్వ దిండుతో అతడికి ఊపిరాడకుండా చేసింది. మద్యం మత్తులో ఉండటంతో ఆమెను ప్రతిఘటించలేక రోహిత్ ప్రాణాలు కోల్పోయాడు. చదవండి : నా ఇద్దరు కొడుకుల ఆస్తిపై కన్నేసింది : ఎన్డీ తివారి భార్య ఈ విషయం గురించి రోహిత్ హత్య కేసును విచారించిన ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ... ‘ భర్తను హత్యచేసిన తర్వాత అపూర్వకు ఏం చేయాలో అర్థం కాలేదు. అర్ధరాత్రి 2 గంటల వరకు ఆమె నిద్రపోలేదు. ఆ తర్వాత హత్యకు సంబంధించిన ఆధారాలన్నీ మాయం చేసింది. రోహిత్‌ను నిద్రలేపేందుకు పనిమనిషి బోలు ప్రయత్నించగా అతడిని వారించింది. అనంతరం తిలక్ లేన్‌లో నివసించే ఉజ్వల తివారి రాగా.. రోహిత్‌ను డిస్ట్రర్బ్ చేయొద్దని చెప్పింది. ఆ తర్వాత ఆమె వెళ్లిపోవడం, రోహిత్‌కు గుండెపోటు వచ్చిందంటూ ఆస్పత్రిలో చేర్పించడం జరిగాయి. అనేక పరిణామాల అనంతరం రోహిత్‌ను హత్య చేసింది తానేనంటూ అపూర్వ నేరాన్ని అంగీకరించారు’అని కేసుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. -సుష్మారెడ్డి యాళ్ల -
‘అందుకే అపూర్వ.. రోహిత్‌ను హత్య చేసింది’
న్యూఢిల్లీ : వైవాహిక జీవితంలో కలతల కారణంగానే రోహిత్ శేఖర్ తివారి భార్య అపూర్వ శుక్లా అతడిని హత్య చేసినట్లు ఢిల్లీ క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం, దివంగత నేత ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ శేఖర్ తివారి గత మంగళవారం అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఢిల్లీ పోలీసులు రోహిత్‌ది హత్యేనని నిర్దారించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న రోహిత్ భార్య అపూర్వను అరెస్ట్ చేశారు. ముఖంపై దిండుతో ఒత్తి రోహిత్‌ను హత్య చేశారన్న అభియోగాలపై ఆమెను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ అర్ధరాత్రి ఒంటిగంటకు వారిమధ్య తలెత్తిన గొడవ తీవ్రరూపం దాల్చింది. రోహిత్ మద్యం మత్తులో ఉన్న సమయంలో అపూర్వ అతడిని హతమార్చింది. ఈ హత్యలో ఆమెకు ఎవరూ సహకరించలేదు. తనంతట తానే స్వయంగా అతడికి ఊపిరాడకుండా చేసి చంపింది. ఆ తర్వాత ఆధారాలన్నింటినీ మాయం చేసింది. కేవలం గంటన్నర సమయంలో ఆమె ఈ పనులన్నీ పూర్తి చేసింది. త్వరలోనే ఆమెను కోర్టు ముందు హాజరుపరుస్తాం’ అని కేసుకు సంబంధించి విషయాలు వెల్లడించారు. చదవండి : నా ఇద్దరు కొడుకుల ఆస్తిపై కన్నేసింది : ఎన్డీ తివారి భార్య కాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా రోహిత్ పనిమనిషి బోలును కూడా అనేకమార్లు విచారించినట్లు పోలీసులు తెలిపారు. అతడితో పాటు మరో ముగ్గురు పనిమనుషుల వాంగ్మూలం, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసులో పురోగతి సాధించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 15న తాగిన మైకంలో ఇంటికి వచ్చిన రోహిత్ తన గదిలోకి వెళ్లి నిద్రపోయినట్లు ఫుటేజీల ఆధారంగా వెల్లడైందని పేర్కొన్నాయి. డిఫెన్స్ కాలనీలోని రోహిత్ ఇంట్లో మొత్తం ఏడు సీసీటీవీలు ఉన్నాయని, వాటిలో రెండు మాత్రం పనిచేయడం లేదని పేర్కొన్నాయి. హత్యకు ప్లాన్ చేసే క్రమంలోనే వాటిని పనిచేయకుండా చేశారా అనే సందేహాలు వ్యక్తం చేశాయి. చదవండి : అపూర్వను గుడ్డిగా నమ్మాను : ఎన్డీ తివారి భార్య ఇక రోహిత్ మరణానంతరం అతడి తల్లి ఉజ్వల తివారి మాట్లాడుతూ.. రోహిత్, తన భార్య అపూర్వ మధ్య అంతగా సఖ్యత లేదని.. పెళ్లైన మొదటిరోజు నుంచే వారి మధ్య విభేదాలు తలెత్తాయని పేర్కొన్నారు. రాజీవ్ అనే వ్యక్తి భార్యతో.. రోహిత్‌కు అక్రమ సంబంధం ఉందంటూ వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేశారు. ‘ఉత్తరాఖండ్ సీఎంగా పనిచేసిన క్రమంలో ఎన్డీ తివారికి చేదోడువాదోడుగా ఉన్న రాజీవ్ కొడుకు కార్తిక్ రాజ్‌కు ఆస్తిలో వాటా ఇవ్వాలని నా పెద్ద కుమారుడు సిద్ధార్థ్ భావించాడు. ఇందుకు రోహిత్ కూడా సుముఖంగానే ఉన్నట్లు అనిపించింది. కానీ అపూర్వ మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. సుప్రీంకోర్టు సమీపంలో ఉన్న ఆస్తి తన పేరిట రాయించాలని కోరింది. ఈ విషయమై తరచుగా గొడవలు జరిగేవి. అభిప్రాయ భేదాలు తలెత్తడంతో రోహిత్, అపూర్వ ఈ ఏడాది జూన్‌లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలనుకున్నారు’ అని వెల్లడించారు. ఇక రోహిత్, అపూర్వ ఇద్దరూ న్యాయవాదులేనన్న సంగతి తెలిసిందే. -
రోహిత్ తివారీ హత్య : భార్య అపూర్వ అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తివారిని హత్య చేసిన ఆరోపణలతో ఆయన భార్య అపూర్వను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖంపై దిండుతో ఒత్తి రోహిత్‌ను హత్య చేశారన్న అభియోగాలపై ఆమెను బుధవారం అరెస్ట్ చేశారు. కాగా ఈనెల16న రోహిత్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అయితే పోస్టుమార్టమ్‌లో నివేదికలో రోహిత్‌ది సహజ మరణం కాదని తేలిన సంగతి తెలిసిందే. దీంతో కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు రోహిత్ భార్య అపూర్వను వరుసగా మూడు రోజుల పాటు ప్రశ్నించారు. పొంతనలేని ఆమె సమాధానాలు మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో రోహిత్ తల్లి ఉజ్వల స్పందిస్తూ రోహిత్, అపూర్వ దంపతుల మధ్య అంతగా సఖ్యత లేదని..పెళ్లైన మొదటిరోజు నుంచే వారి మధ్య విభేదాలు తలెత్తాయన్నారు. అంతేకాదు అపూర్వ, ఆమె కుటుంబం, రోహిత్ ఆస్తిపై కన్నేసారని కూడా ఆమె ఆరోపించారు. -
నా ఇద్దరు కొడుకుల ఆస్తిపై కన్నేసింది : ఎన్డీ తివారి భార్య
న్యూఢిల్లీ : ‘నా ఇద్దరు కొడుకులు సిద్ధార్థ్, రోహిత్‌ల ఆస్తిపై అపూర్వ, ఆమె కుటుంబ సభ్యులు కన్నేశారు. సుప్రీంకోర్టు సమీపంలో ఉన్న ఇంటిని దక్కించుకోవాలనుకున్నారు’ అంటూ ఎన్డీ తివారి భార్య ఉజ్వల తివారి తన కోడలిపై సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం, దివంగత నేత ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ శేఖర్ తివారి గత మంగళవారం అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఢిల్లీ పోలీసులు రోహిత్‌ది హత్యేననే నిర్దారించారు. ఈ క్రమంలో రోహిత్ భార్య అపూర్వ సహా వాళ్లింట్లోని పనిమనుషులను గత రెండు రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి దాదాపు ఎనిమిది గంటల పాటు అపూర్వను విచారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్ తల్లి ఉజ్వల మాట్లాడుతూ రోహిత్, తన భార్య అపూర్వ మధ్య అంతగా సఖ్యత లేదని.. పెళ్లైన మొదటిరోజు నుంచే వారి మధ్య విభేదాలు తలెత్తాయని పేర్కొన్నారు. రాజీవ్ అనే వ్యక్తి భార్యతో.. రోహిత్‌కు అక్రమ సంబంధం ఉందంటూ వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేశారు. ‘ఉత్తరాఖండ్ సీఎంగా పనిచేసిన క్రమంలో ఎన్డీ తివారికి చేదోడువాదోడుగా ఉన్న రాజీవ్ కొడుకు కార్తిక్ రాజ్‌కు ఆస్తిలో వాటా ఇవ్వాలని నా పెద్ద కుమారుడు సిద్ధార్థ్ భావించాడు. ఇందుకు రోహిత్ కూడా సుముఖంగానే ఉన్నట్లు అనిపించింది. కానీ అపూర్వ మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. సుప్రీంకోర్టు సమీపంలో ఉన్న ఆస్తి తన పేరిట రాయించాలని కోరింది. ఈ విషయమై తరచుగా గొడవలు జరిగేవి. అభిప్రాయ భేదాలు తలెత్తడంతో రోహిత్, అపూర్వ ఈ ఏడాది జూన్‌లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలనుకున్నారు’ అని ఉజ్వల వెల్లడించారు. చదవండి : అపూర్వను గుడ్డిగా నమ్మాను : ఎన్డీ తివారి భార్య కాగా ఉజ్వల తివారికి మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం సిద్ధార్థ్. ఇక 2008లో తివారీ తనకు జన్మనిచ్చిన తండ్రి అంటూ ఆమె రెండో కుమారుడు రోహిత్ శేఖర్ పితృత్వ దావా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు డీఎన్ఏ పరీక్షలకు ఆదేశించగా రోహిత్ తివారీ కుమారుడేనని 2012 జులై 27న ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో 2014 మార్చి 3న రోహిత్ శేఖర్‌ను తివారీ తన కుమారుడిగా అంగీకరించారు. 2014 మే 14న శేఖర్ తల్లి ఉజ్వలా తివారీని వివాహం చేసుకున్నారు. -
అపూర్వను గుడ్డిగా నమ్మాను : ఎన్డీ తివారి భార్య
న్యూఢిల్లీ : ‘నా కుమారుడు హత్య గావించబడ్డాడని తెలియగానే షాక్‌కు గురయ్యాను. ఇప్పుడు నాకు తీరని శోకం మాత్రమే మిగిలింది. ఆరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు రోహిత్ నిద్రలేవక పోవడం ఈ పరిస్థితికి దారితీస్తుందని ఊహించలేకపోయాను’ అని రోహిత్ శేఖర్ తివారి తల్లి ఉజ్వల తివారి భావోద్వేగానికి లోనయ్యారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం, దివంగత నేత ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ శేఖర్ తివారి గత మంగళవారం అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఢిల్లీ పోలీసులు రోహిత్‌ది హత్యేననే నిర్దారణకు వచ్చారు. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తులకు ఈ హత్యతో సంబంధం ఉన్నట్లుగా కేసు నమోదు చేశారు. రోహిత్ శేఖర్‌ది సహజ మరణం కాదని, ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోస్ట్‌మార్టమ్ నివేదికలో వెల్లడైందని వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రోహిత్ తల్లి ఉజ్వల తివారి మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడి జీవితానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. రోహిత్, తన భార్య అపూర్వ మధ్య అంతగా సఖ్యత లేదని.. పెళ్లైన మొదటిరోజు నుంచే వారి మధ్య విభేదాలు తలెత్తాయని పేర్కొన్నారు. రాజకీయ నాయకుడిగా తనకు తగినంత గుర్తింపు దక్కలేదని రోహిత్ ఎల్లప్పుడూ ఆవేదన చెందేవాడని తెలిపారు. ‘ ఏప్రిల్ 11న ఓటు వేయడానికి మేమిద్దం హల్ద్వాని(ఉత్తరాఖండ్) వెళ్లాం. మరుసటిరోజే ఢిల్లీకి తిరిగి రావాలనుకున్నాం. కానీ శేఖర్ తన మనసు మార్చుకున్నాడు. తన వాళ్లను కలుసుకోవాలని నాతో చెప్పాడు. రాజకీయాల్లో అంతగా అనుభవంలేని వాళ్లు కూడా టికెట్లు పొందుతున్నారు. నేను మాత్రం నాన్న వారసత్వాన్ని కొనసాగించలేకపోతున్నానని ఆవేదన చెందాడు. రాణీభాగ్లోని తండ్రి సమాధి వద్దకు వెళ్లాడు. అక్కడే ఓ రిసార్టులో ఆరోజు బస చేశాం. అనంతరం నీమ్ కరోలీ బాబా దగ్గరికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నాం’ అని ఉజ్వల చెప్పుకొచ్చారు. చదవండి : ఎన్డీ తివారీ కుమారుడి మృతి కేసులో కొత్తమలుపు అపూర్వను గుడ్డిగా నమ్మాను.. ‘ఏప్రిల్ 15న ఢిల్లీకి తిరిగి వచ్చాము. శేఖర్ డిఫెన్స్ కాలనీలోని ఇంటికి వెళ్లగా.. నేను తిలక్ లైన్లో ఆస్పత్రికి వెళ్లాను. తిరిగి వచ్చిన తర్వాత రోహిత్ గురించి అపూర్వను అడిగాను. బాగా అలసిపోయాడు కాబట్టి నిద్రపోతున్నాడని చెప్పింది. నా బొటనవ్రేలుకు గాయం కావడంతో 11. 30 గంటలకు తిలక్ నగర్‌కు వెళ్లాను. మ్యాక్స్ ఆస్పత్రిలో అపాయింట్మెంట్ తీసుకున్నాను అని అపూర్వకు చెప్పి.. రోహిత్ ఎక్కడని అడిగాను. తను నిద్ర పోతున్నాడు. డిస్ట్రర్బ్ చేయొద్దని చెప్పింది. నేను అపూర్వను గుడ్డిగా నమ్మాను. అందుకే ఇంతసేపటి దాకా రోహిత్ నిద్రపోవడమేమిటని అడగలేకపోయాను’ అని ఉజ్వల తివారి ఉద్వేగానికి లోనయ్యారు. మొదటి నుంచి గొడవలే.. రోహిత్ పెళ్లి గురించి చెబుతూ.. ‘రోహిత్, అపూర్వ ఏడాది కాలం పాటు ప్రేమించుకుని విడిపోయారు. జనవరి 2018 నుంచి మార్చి వరకు అసలు టచ్‌లో కూడా లేరు. కానీ ఏప్రిల్ 2న నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటామని చెప్పారు. సరేనన్నాను. కానీ ఇప్పుడిలా జరిగింది’ అని ఉజ్వల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అపూర్వ తండ్రి మాట్లాడుతూ.. ‘ నా కూతురు ఇలాంటి దారుణానికి ఒడిగట్టే అవకాశమే లేదు. అల్లుడు చనిపోయాడని తెలియగానే ఇక్కడకు వచ్చేశాం. పోలీసు విచారణ తర్వాతే నిజానిజాలు బయటకు వస్తాయి అని తెలిపారు. కాగా రోహిత్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా అతడి కుటుంబ సభ్యులతో పాటు స్టాఫ్‌ను విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక వృత్తిరీత్యా న్యాయవాది అయిన శేఖర్ తివారీ ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు 2015-2017 మధ్య సలహాదారుగా పనిచేశారు. రోహిత్ శేఖర్ తివారీ తండ్రి నారాయణ్ దత్ తివారీ గత ఏడాది అక్టోబర్‌లో మరణించిన సంగతి తెల్సిందే. మొదట రోహిత్ శేఖర్ తన కుమారుడు కాదని ఎన్డీ తివారీ వాదించిన సంగతి అప్పట్లో సంచలనమే సృష్టించింది. దీంతో రోహిత్ శేఖర్ కోర్టుకు వెళ్లడంతో కోర్టు డీఎన్ఏ టెస్టుకు వెళ్లాలని సూచించింది. ఎట్టకేలకు 2014లో రోహిత్ శేఖర్ తన కుమారుడేనని ఎన్డీ తివారీ ఒప్పుకోవడంతో కథ సుఖాంతమైంది. ఆ తర్వాత ఎన్డీ తివారీ, రోహిత్ శేఖర్ తల్లి ఉజ్జ్వలను వివాహమాడారు. -
ఎన్డీ తివారీ కుమారుడి మృతి కేసులో కొత్తమలుపు
న్యూఢిల్లీ: అనుమానాస్పద స్థితిలో ఈ నెల 16న మృతిచెందిన మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీది హత్యేనని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఓ నిర్దారణకు వచ్చారు. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తులకు ఈ హత్యతో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. శవపరీక్ష ఆధారంగా రోహిత్ శేఖర్ మర్డర్ మిస్టరీ చేధించనున్నట్లు స్పెషల్ పోలీస్ కమిషనర్ ఆర్ఎస్ క్రిష్‌నియా తెలిపారు. శవపరీక్షలో రోహిత్ శేఖర్‌ది సహజ మరణం కాదని, ఊపిరాడకుండా చేసి చంపినట్లు రిపోర్టు వచ్చిందని తెలిపారు. రోహిత్ శేఖర్ నివాసాన్ని ఫోరెన్సిక్ అండ్ క్రైం బ్రాంచ్ టీంలు ఇదివరకే క్షుణ్ణంగా పరిశీలించాయి. బుధవారం రోజు సాయంత్రం 4.41 నిమిషాలకు రోహిత్ శేఖర్ నివాసం నుంచి మాక్స్ ఆసుపత్రికి ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చిందని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. అంబులెన్స్‌లో రోహిత్ శేఖర్‌ను మాక్స్ ఆసుపత్రికి ఆగమేఘాల మీద తీసుకువచ్చారని, డాక్టర్లు పరిశీలించి చూడగా రోహిత్ శేఖర్ అప్పటికే చనిపోయి ఉన్నట్లు నిర్దారించారని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. ఏప్రిల్ 11న హల్డ్వానీలో తన ఓటు హక్కును శేఖర్ తివారీ ఉపయోగించుకున్నారు. శేఖర్ తివారీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సోమవారం ఉదయం ఉత్తరాఖండ్‌లోని హల్డ్‌వానీ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. హల్డ్వానీలో దీపక్ బాలుటియా అనే తన సోదరుడితో శేఖర్ తివారీ కొంతకాలంగా ఉంటున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఇరుగుపొరుగు వారితో శేఖర్ తివారీ చర్చించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో చేరడాన్ని రోహిత్ తివారీ తన సొంతపార్టీలో చేరుతున్నట్లుగా అభివర్ణించాడని బాలుటియా ఇదివరకే తెలిపారు. స్వతహాగా న్యాయవాది అయిన శేఖర్ తివారీ ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు 2015-2017 మధ్య సలహాదారుగా పనిచేశారు. రోహిత్ శేఖర్ తివారీ తండ్రి నారాయణ్ దత్ తివారీ గత ఏడాది అక్టోబర్‌లో మరణించిన సంగతి తెల్సిందే. రోహిత్ శేఖర్ తివారీకి తల్లి, భార్య ఉన్నారు. మొదట రోహిత్ శేఖర్ తన కుమారుడు కాదని ఎన్డీ తివారీ వాదించిన సంగతి అప్పట్లో సంచలనమే సృష్టించింది. దీంతో రోహిత్ శేఖర్ కోర్టుకు వెళ్లడంతో కోర్టు డీఎన్ఏ టెస్టుకు వెళ్లాలని సూచించింది. ఎట్టకేలకు 2014లో రోహిత్ శేఖర్ తన కుమారుడేనని ఎన్డీ తివారీ ఒప్పుకోవడంతో కథ సుఖాంతమైంది. ఆ తర్వాత ఎన్డీ తివారీ, రోహిత్ శేఖర్ తల్లి ఉజ్జ్వలను వివాహమాడారు. -
ఎన్డీ తివారి కొడుకు ఆకస్మిక మృతి
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ సీఎం, దివంగత నేత ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ శేఖర్ తివారి(39) మరణించారు. ముక్కలోంచి రక్తం కారుతుండటంతో ఆస్పత్రికి తరలించే క్రమంలో మంగళవారం ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రోహిత్ తల్లి సాధారణ చెకప్‌ల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన క్రమంలో రోహిత్ ఆకస్మికంగా అనారోగ్యానికి గురికావడంతో నౌకర్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో డిఫెన్స్ కాలనీ ఏరియాలోని తన నివాసం నుంచి సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించేసరికే ఆయన మరణించారని తెలిపారు. రోహిత్ ఆకస్మిక మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కాగా నారాయణ దత్ తివారీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించిన సమయంలో ఆయనపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. రాజ్‌భవన్‌లోనే తివారీ మహిళలతో రాసలీలలు సాగించారన్న వార్తలు కలకలంరేపడంతో ఆయన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇక 2008లో తివారీ తనకు జన్మనిచ్చిన తండ్రి అంటూ రోహిత్ శేఖర్ తివారీ పితృత్వ దావా దాఖలు చేశారు. కోర్టు డీఎన్ఏ పరీక్షలకు ఆదేశించగా రోహిత్ తివారీ కుమారుడేనని 2012 జులై 27న ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో 2014 మార్చి 3న రోహిత్ శేఖర్‌ను తివారీ తన కుమారుడిగా అంగీకరించారు. 2014 మే 14న శేఖర్ తల్లి ఉజ్వలా తివారీని వివాహం చేసుకున్నారు. దీర్ఘకాలంలో కాంగ్రెస్‌లో కొనసాగిన తివారీ ఆశీస్సులతోనే 2017, జనవరి 18న ఆయన రోహిత్ శేఖర్ తివారీ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. -
ఎన్డీ తివారీ సేవలు చిరస్మరణీయం: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ మృతి పట్ల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సంతాపం తెలిపారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో ఎన్డీ తివారీ చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళి అర్పించారు. ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా 2007 ఆగస్టు నుంచి 2009 డిసెంబర్ వరకు తివారీ అందించిన సేవలు చిరస్మరణీయంగా ఉండిపోతాయన్నారు. ఆయన మృతితో దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు. ఢిల్లీలో పనిచేసిన సమయంలో తివారీతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు అనితర కృషిచేశారని కొనియాడారు. యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకూ సీఎంగా పనిచేసిన ఘనత కేవలం ఆయనకే దక్కిందన్నారు. వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, నారాయణ్‌దత్ తివారీ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. భారతదేశంలో రెండు రాష్ట్రాలకు సీఎంగా వ్యవహ రించిన సీనియర్ రాజకీయ నాయకుడు ఎన్డీ తివారీ ఒక్కరేనని జగన్ తన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ మాజీ గవర్నర్ కూడా అయిన తివారీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎన్డీ తివారీ కుటుంబ సభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
పుట్టినరోజు నాడే ఎన్డీ తివారి కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారి(93) గురువారం కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఢిల్లీ సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పుట్టినరోజే ఆయన మరణించడం విషాదకరం. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన తివారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా కూడా సేవలు అందించారు.బ్రెయిన్ స్ర్టోక్ రావడంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఆయన మ్యాక్స్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. రాజకీయ ప్రస్ధానం 1925, అక్టోబర్ 18న నైనిటాల్ జిల్లాలోని బలూటి గ్రామంలో జన్మించిన నారాయణన్ దత్ తివారీ (ఎన్డీ తివారీ) తొలుత ప్రజా సోషలిస్ట్ పార్టీలో పనిచేసి అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. తివారీ మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా (1976-77, 1984-85, 1988-89) వ్యవహరించారు. 2002 నుంచి 2007 వరకూ ఉత్తరాఖండ్ సీఎంగా సేవలందించారు. రాజీవ్ గాంధీ కేబినెట్లో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. దీర్ఘకాలంలో కాంగ్రెస్‌లో కొనసాగిన తివారీ ఆశీస్సులతోనే 2017, జనవరి 18న ఆయన కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. వెంటాడిన వివాదాలు ఎన్డీ తివారీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించిన సమయంలో ఆయనపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజ్‌భవన్‌లోనే తివారీ మహిళలతో రాసలీలలు సాగించారన్న వార్తలు కలకలంరేపడంతో ఆయన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇక 2008లో తివారీ తనకు జన్మనిచ్చిన తండ్రి అంటూ రోహిత్ శేఖర్ తివారీ పితృత్వ దావా దాఖలు చేశారు. కోర్టు డీఎన్ఏ పరీక్షలకు ఆదేశించగా రోహిత్ తివారీ కుమారుడేనని 2012 జులై 27న ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో 2014 మార్చి 3న రోహిత్ శేఖర్‌ను తన కుమారుడిగా తివారీ అంగీకరించారు. 2014 మే 14న శేఖర్ తల్లి ఉజ్వలా తివారీని వివాహం చేసుకున్నారు. ప్రముఖుల సంతాపం ఎన్డీ తివారి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. కార్యదక్షత కలిగిన ఆయన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అభివృద్ధికి పాటు పడ్డారని ప్రశంసించారు. పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా సేవలు అందించిన తివారి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ సంతాపం ప్రకటించారు. తివారి మరణంతో దేశం ఒక గొప్ప రాజనీతిజ్ఞుడుని కోల్పోయిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఎన్డీ తివారికే దక్కిందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తివారి మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. -
ఎన్డీ తివారీ ఆరోగ్య పరిస్థితి విషమం
డెహ్రాడూన్: దాదాపు తొమ్మిది నెలలుగా ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ(92) ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. మరింత మెరుగైన చికిత్సలో భాగంగా బుధవారం ఆయనకు పలు వైద్యపరీక్షలు నిర్వహించినట్లు తివారీ క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. బ్రెయిన్‌స్ట్రోక్ కారణంగా గతేడాది సెప్టెంబర్ 20న తివారీని ఢిల్లీలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. గత రెండు, మూడు వారాలుగా తివారీ ఆరోగ్యం మరింత క్షీణించిందని, దీంతో ఛాతి ఎక్స్–రే, ఇతర వైద్యపరీక్షలు నిర్వహించారని క్యాంపు కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తివారీ కొడుకు రోహిత్ శేఖర్‌కు వైద్యులు వివరించారు. తివారీకి ఎంఆర్ఐ పరీక్ష నిర్వహించాలని వైద్యులు భావిస్తున్నారు. -
యోగికి ఎన్డీ తివారి భార్య లేఖ
డెహ్రాడూన్: యూపీ మాజీ సీఎం ఎన్డీ తివారి భార్య ఉజ్వల, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు లేఖ రాశారు. తాము ఇప్పుడు నివాసం ఉంటున్న బంగ్లాను ఖాళీ చేయడానికి కాస్త సమయం ఇవ్వాలంటూ లేఖలో ఆమె సీఎంను కోరారు. తివారి (92) ఆరోగ్యం బాగోలేదని అమె లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగా తమ కుమారుడు రోహిత్ శేఖర్ కూడా అసుపత్రిలోనే ఉంటూ ఆయన్ని చూసుకుంటున్నారని.. ఈకారణాలతో ప్రస్తుతం నివాసం ఖాళీ చేయలేమని అమె తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా తివారీ గత ఎనిమిది నెలలుగా ఢిల్లీలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మాజీ సీఎంలు ప్రభుత్వ బంగ్లాలను తక్షణమే ఖాళీ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను మేరకు మే 17న యూపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రులకు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కోర్టు ఆదేశాలపై తమకు గౌరవం ఉందని పేర్కొన్న తివారీ భార్య, పరిస్థితుల నేపథ్యంలో కాస్త గడువు ఇవ్వాలని కోరారు. కాగా తివారి నాలుగు సార్లు యూపీ సీఎంగా, ఒకసారి ఉత్తరాఖండ్ సీఎంగా పని చేశారు. మరోపక్క తాము ఇప్పటికిప్పుడు బంగ్లాలు ఖాళీ చేయలేమని మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్‌లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. -
లాయర్‌ను పెళ్లాడనున్న తివారీ కుమారుడు
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ నిశ్చితార్థం శనివారం ఘనంగా జరిగింది. న్యూఢిల్లీలోని రోహిత్ నివాసంలో ఇండోర్‌కు చెందిన అపూర్వ శుక్లాతో నిశ్చితార్థం జరిగింది. అపూర్వ సుప్రీం కోర్టులో లాయర్‌గా పని చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రోహిత్ కుటుంబ సభ్యులు,స్నేహితులు హాజరయ్యారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి దగ్గరకి తల్లి ఉజ్వల తివారీతో కలసి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. దీర్ఘకాల న్యాయ పోరాటం తరువాత రోహిత్‌ను కొడుకుగా తివారీ అంగీకరించారు. 2008లో ఎన్డి తివారీ తన తండ్రి అంటూ రోహిత్ శేఖర్ కోర్టుకెక్కారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు తివారీ-శేఖర్ డీఎన్ఎ రిపోర్టును పరిశీలించి 2012, జులై 27న శేఖర్ తివారీ కొడుకేనని రిపోర్టులు రుజువు చేస్తున్నాయని తేల్చింది. దీంతో తివారీ 2014లో నిజాన్ని ఒప్పేసుకొని ఉజ్వలను పెళ్లి చేసుకున్నారు. 2017 జనవరిలో రోహిత్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. -
ఏపీ మాజీ గవర్నర్ పరిస్థితి విషమం
న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ (91) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు ఢిల్లీలోని సిటీస్ మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గత నెల 26న తీవ్రజ్వరం, న్యూమోనియా రావడంతో కుటుంబసభ్యులు తివారీని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తివారీ ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. తివారీ ఆరోగ్యస్థితిపై ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్, మాజీ ఉత్తరాఖండ్ సీఎం విజయ్ బహుగుణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
మాజీ గవర్నర్‌కు తీవ్ర అస్వస్థత
న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ (91) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం 9 గంటలకు ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఢిల్లీలోని మాక్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉందని, ప్రత్యేక డాక్టర్ల బృందం చికిత్స చేస్తోందని కుమారుడు రోహిత్ శేఖర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన స్పృహలో లేరని తెలిపారు. -
ఆస్పత్రిలో చేరిన ఎన్డీ తివారి
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ (91) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఆయనను గతరాత్రి కుటుంబసభ్యులు రామ్ మనోహర్ లోహియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్పించారు. తివారీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ...ఇవాళ తివారిని పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ’తివారీ తమకు వారసత్వ సంపద’ లాంటివారిని సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తివారీ తనయుడు రోహిత్...సీఎంను చూసి భావోద్వేగానికి గురయ్యాడు. కాగా ఈ నెల 19న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తివారీ హాజరయ్యారు. -
తుది అంకానికి యూపీ పొత్తులు
• ఎస్పీ అభ్యర్థుల తుది జాబితా సిద్ధం • బీజేపీకి ఎన్డీ తివారీ మద్దతు లక్నో/సాక్షి న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ సమీపిస్తున్నకొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. తొలి విడతకు నామినేషన్ల పర్వం మొదలవటంతో.. అధికార సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థుల ఎంపిక పక్రియను పూర్తిచేసింది. దాదాపు 6గంటలపాటు సన్నిహితులతో చర్చించిన అఖిలేశ్.. తుది జాబితాను రూపొందించారు. కాంగ్రెస్, ఇతర పార్టీలతో పొత్తులు ఖరారు చేయాల్సి ఉండడంతో పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 50 మందికి పైగా టికెట్లు లభించే అవకాశాలు లేవని తెలుస్తోంది. మరోవైపు, కాంగ్రెస్‌తో పొత్తుపై నిర్ణయం కూడా తుదిఅంకానికి చేరినట్లు తెలిసింది. గురు, శుక్రవారాల్లో అధికారిక ప్రకటన వెలువడవచ్చని ఎస్పీ వర్గాలు తెలిపాయి. ‘అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. కాంగ్రెస్‌తో పొత్తును దృష్టిలో పెట్టుకుని సీట్లపై తుది నిర్ణయం వెలువడుతుంది. మరోసారి అఖిలేశ్‌ను యూపీ సీఎం చేయాలని మేం కృతనిశ్చయంతో ఉన్నాం’ అని ఎస్పీ ఎమ్మెల్సీ ఆనంద్ భదూరియా తెలిపారు. పార్టీ విజయంకోసం శ్రమించాలని ములాయం చెప్పారని భదూరియా వెల్లడించారు. అయితే ములాయం సూచించిన 38 మంది అభ్యర్ధుల జాబితాలో 28 మందికి సీట్లు ఇచ్చేందుకు అఖిలేశ్ అంగీకరించారని.. అయితే.. కొన్ని పేర్లపై (నేరచరిత ఉన్నవారిపై) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు, ఎస్పీ టికెట్ ఆశిస్తున్న వారంతా తెల్లవారుజామునుంచే చలికి లెక్కచేయకుండా అఖిలేశ్ ఇంటిముందు గుమిగూడారు. కాగా, ఎస్పీ సీనియర్ మంత్రి ఆజంఖాన్ బుధవారం సీఎంతో సమావేశమయ్యారు. కాగా, రెండుమూడు రోజుల్లో రాజకీయ పరిణామాలు మారొచ్చని లోక్‌దళ్ పార్టీ అభిప్రాయపడుతోంది. ‘కొడుకుచేతిలో అవమానానికి గురైన ములాయం ఆలోచనలో మార్పు రావొచ్చు. మా పార్టీ పేరుతో ఆయన తన అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలో దిగుతారని ఆశిస్తున్నాం’ అని లోక్‌దళ్ జాతీయాధ్యక్షుడు సునీల్ సింగ్ తెలిపారు. కాగా, ములాయం సూచించిన జాబితాలో అఖిలేశ్ ఆమోదముద్ర పొందని నేతలంతా లోక్‌దళ్ పేరుతో బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, పార్టీ టికెట్ దక్కలేదన్న నిరాశతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే శివసింగ్ ఎస్పీని ఆశ్రయించారు. అమిత్ షాతో తివారీ భేటీ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ సీఎం నారాయణ్ దత్ తివారీ (91) బుధవారం బీజేపీ చీఫ్ అమిత్‌షాతో భేటీ అయ్యారు. దశాబ్దకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న తివారీ.. 2నెలలుగా తనయుడికి కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. టికెట్ దక్కే అవకాశాలు కనిపించకపోవటంతోనే బీజేపీని ఆశ్రయించారు. దీంతో ప్రస్తుత సీఎం హరీశ్ రావత్ మినహా.. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎంలైన వారంతా బీజేపీతోనే ఉన్నట్లు అవుతుంది. అయితే ఉత్తరాఖండ్ వంటి చిన్న రాష్ట్రంలో ఒక్క శాతం ఓట్లతో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలుండటంతో ఏ చాన్స్‌ను బీజేపీ వదులుకోవటం లేదు. ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత యశ్పాల్ ఆర్య కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. తన తనయుడికి ఎమ్మెల్యేS టికెట్ ఖరారు చేసుకోడానికే యశ్పాల్ తమ పార్టీలో చేరారని బీజేపీ నేతలు వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లో బీజేపీ విడుదల చేసిన 64 మంది జాబితాలో 10 మంది మాజీ కాంగ్రెస్ నేతలే. -
తివారీ వ్యవహారంలో ట్విస్ట్!
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాజకీయాల్లో మరో ట్విస్ట్. మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నారాయణదత్త తివారీ పార్టీ మారినట్టు వచ్చిన వార్తలు తూచ్ అని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి ఎన్డీ తివారీ బీజేపీలో చేరిపోయినట్టు ఈరోజు వార్తలు వచ్చాయి. అయితే ఆయన తమ పార్టీలో చేరలేదని బీజేపీ వెల్లడించింది. తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ మాత్రమే తమ పార్టీలోకి వచ్చారని తెలిపింది. తన కుమారుడితో పాటు ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ కావడంతో తివారీ పార్టీ మారినట్టు ప్రచారం జరిగింది. తన కుమారుడిని బీజేపీలో చేర్పించేందుకే ఆయన అమిత్ షాను కలిసినట్టు తేలింది. అయితే తివారీ బీజేపీలో చేరినట్టు వచ్చిన వార్తలపై కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడం గమనార్హం. -
కొడుకే కాదన్నాడు.. ఇప్పుడు టికెట్ కోరాడు!
-
కొడుకే కాదన్నాడు.. ఇప్పుడు టికెట్ కోరాడు!
ఒకప్పుడు అసలు తన కన్న కొడుకే కాదంటూ కోర్టులలో సైతం గట్టిగా వాదించిన వ్యక్తి, ఇప్పుడు అదే కొడుకు కోసం బీజేపీలో చేరారు. అవును.. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నారాయణదత్త తివారీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తన కొడుకు రోహిత్ శేఖర్‌తో కలిసి వెళ్లి అతడికి కూడా పార్టీ సభ్యత్వం ఇప్పించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలోనే ఇద్దరూ పార్టీలో చేరారు. ఉత్తరాఖండ్ నుంచి బీజేపీ తరఫున అసెంబ్లీ టికెట్ రోహిత్‌కు ఇప్పించాలన్నది తివారీ ఆశ. అంతకుముందు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్ ఇప్పించాలని ప్రయత్నించినా కుదరకపోవడంతో ఇప్పుడు బీజేపీ పంచన చేరారు. ఎవరీ రోహిత్ రోహిత్ శేఖర్.. నిన్న మొన్నటి వరకు ఈ పేరు తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా గట్టిగా వినిపించేది. ఎన్డీ తివారీ తన కన్న తండ్రి అంటూ న్యాయపోరాటం చేసి విజయం సాధించిన వ్యక్తే ఈ రోహిత్ శేఖర్. ఒకప్పుడు తన కొడుకు కాదని, డీఎన్ఏ పరీక్షలకు సైతం ఒప్పుకోని తివారీ ఆ తర్వాత మారిపోయారు. అప్పట్లో కోర్టు విచారణలో.. రోహిత్ శేఖర్‌కు తాను జన్మనివ్వలేదని ఆయన నొక్కి చెప్పారు. ఉజ్వల శర్మ(రోహిత్ తల్లి)తో తనకు ఎలాంటి భౌతిక, శారీరక సంబంధమూ లేదని పేర్కొన్నారు. తనపై నమోదైన పితృత్వపు కేసు వెనుక రాజకీయ ప్రత్యర్థుల కుట్ర ఉందని ఆరోపించారు. (రోహిత్‌కు నేను జన్మనివ్వలేదు..: ఎన్డీ తివారీ) ఇన్ని చేసిన తివారీ.. ఆ తర్వాతి కాలంలో మాత్రం ఆయన దిగివచ్చారు. 2014 మే 4వ తేదీన మీడియా సమావేశం పెట్టి మరీ రోహిత్ తన కన్న కొడుకుని ప్రకటించారు. ‘నేను అతడి(రోహిత్)ని నా కుమారునిగా అంగీకరిస్తున్నా. అతని డీఎన్ఏ నా డీఎన్ఏ సరిపోలడంతో రెండేళ్ల క్రితమే ఈ విషయం నిర్ధారణ అయ్యింది. దీనిపై ఇక ఏ వివాదమూ ఉండదని భావిస్తున్నా’ అని అప్పట్లో తివారీ చెప్పారు. (రోహిత్ నా కుమారుడే.. : ఎన్డీ తివారీ) -
బీజేపీలోకి ఏపీ మాజీ గవర్నర్?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా పనిచేసి, అత్యంత అవమానకరమైన పరిస్థితుల మధ్య ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎన్డీ తివారీ.. ఇప్పుడు బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం. గతంలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన తివారీ, తన కొడుక్కి టికెట్ ఇప్పించుకోవడం కోసమే బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన తన కుమారుడు రోహిత్ తివారీకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ టికెట్ వస్తుందని ఆశించారు. ఎలాగైనా అతడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి సముచిత స్థానం కల్పించాలన్నది వృద్ధ తివారీ ఆశ. కానీ, సమాజ్‌వాదీ పార్టీ మాత్రం రోహిత్ తివారీకి టికెట్ ఇవ్వడానికి ససేమిరా అందని, దాంతో ఆయన బీజేపీ వైపు దృష్టిపెట్టారని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ కాకపోయినా, ఉత్తరాఖండ్‌లో అయినా తన కొడుక్కి ఓ టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించలేదు. దాంతో ఒక అవకాశం ఉంటుందని తివారీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బీజేపీ అయినా ఆయనను ఆదరిస్తుందా.. లేదా అన్న విషయం ఇంకా తెలియట్లేదు. -
సహచరిని పెళ్లాడిన ఎన్డీ తివారీ
-
సహచరిని పెళ్లాడిన ఎన్డీ తివారీ
లక్నో : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ 88 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లికొడుకు అయ్యారు. ఒకప్పటి సహచరి అయిన ఉజ్వలా శర్మను ఆయన గురువారం ఉదయం లక్నోలో వివాహమాడారు. ఢిల్లీకి చెందిన మాజీ ప్రొఫెసర్ అయిన ఉజ్వలా శర్మకు తివారీ ద్వారా గతంలో రోహిత్ శేఖర్ అనే ఓ కుమారుడు జన్మించగా.. కోర్టులో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాతే ఆయన ఇటీవల 32 ఏళ్ల రోహిత్ శేఖర్‌ను తన కుమారుడిగా అంగీకరించిన విషయం తెలిసిందే. వివాహ వేడుక అనంతరం ఉజ్వలా శర్మ విలేకర్లతో మాట్లాడుతూ తివారీ వివాహ ప్రతిపాదన తెచ్చారని, ఈ వేడుక కొద్దిమంది సమక్షంలో జరిగిందన్నారు. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. వివాహ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. 1967లో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న తివారీ, కృష్ణమెనన్ మార్గ్‌లో ఉన్న అప్పటి కేంద్రమంత్రి షేర్ సింగ్ ఇంటికి తరచూ వెళుతుండేవాడు. ఆ తరుణంలో షేర్ సింగ్ కూతురు ఉజ్వలకు తివారీతో ఏర్పడిన సన్నిహిత సంబంధం వారి కుమారుడు రోహిత్ శంకర్ పుట్టుకకు దారితీసింది. 2008లో రోహిత్ తనను కొడుకుగా గుర్తించాలని తివారీపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో దావా వేశాడు. అయితే తివారీ మాత్రం తను రోహిత్ తండ్రినన్న అభివాదాన్ని ఖండించటమే కాకుండా డిఎన్ఏ పరీక్షకు అంగీకరించలేదు. అయితే కోర్టు కల్పించుకోవడంతో రోహిత్ ఎట్టకేలకు విజయం సాధించారు. ఈ వేడుకతో గత కొంతకాలంగా వార్తల్లోకి ఎక్కిన ఈ వివాదానికి పెళ్లి ద్వారా తివారీ శుభం కార్డు పలికారు. -
గృహనిర్బంధంలో ఎన్డీ తివారీ?
కాంగ్రెస్ కురువృద్ధుడు నారాయణ దత్త తివారీ గృహనిర్బంధంలో ఉన్నారా? అవుననే అంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నేత అలనాటి ప్రేయసి, కాంగ్రెస్ నేత ఉజ్వల శర్మ, ఆమె కుమారుడు రోహిత్ శేఖర్. వారు 88 ఏళ్ల నేతను కలిసేందుకు వెళ్తే అధికారులు వారిని ఆపేశారు. దాంతో ఆమె ఇనుప గేటు బద్దలు గొట్టి మరీ అనుచరులతో సహా లోపలికి వెళ్లారు. లక్నోలో శుక్రవారం ప్రజలకు ఈ వివాదం పెద్ద వినోదంగా మారింది. 'తివారీ అనారోగ్యంగా ఉన్నారు. ఆయనకు సహాయం అవసరం. కాబట్టి నేను లోపలికి వెళ్లాల్సిందే. అసలు ఇదంతా ఒక కుట్ర. ఆయనని గృహనిర్బంధంలో ఉంచినట్టుగా ఉంది.' అని 70 ఏళ్ల ఉజ్వల వాదించారు. ఉజ్వలతో తివారీకి వివాహేతర సంబంధం ద్వారా రోహిత్ శేఖర్ జన్మించారు. అయితే చాలా కాలం తివారీ ఈ విషయాన్ని అంగీకరించలేదు. చివరికి కోర్టు బలవంతంగానైనా డీఎన్ ఏ పరీక్ష చేయించాలని ఆదేశించడంతో తివారీ రోహిత్ తన పుత్రుడేనని అంగీకరించారు. ఈ సంఘటన జరిగిన ఇరవై రోజుల తరువాత నుంచీ తనను తివారీని కలవనీయకుండా నిర్బంధాలు పెరుగుతున్నాయని ఉజ్వల ఆరోపిస్తున్నారు. 'నాకు తివారీ ఆస్తిపాస్తులు వద్దు. ఆయన జీవన సంధ్యా కాలంలో కాసింత సేవచేసుకునే అవకాశం కల్పించండి' అని ఆమె అన్నారు. అయితే తివారీ ఆదేశాల మేరకే తాము ఆమెను నిరోధించామని పోలీసులు చెబుతున్నారు. -
రోహిత్ నా కుమారుడే.. : ఎన్డీ తివారీ
పితృత్వం కేసులో దిగివచ్చిన ఎన్డీ తివారీ న్యూఢిల్లీ: పితృత్వం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ ఎట్టకేలకు దిగివచ్చారు. రోహిత్ శేఖర్ తన కన్న కుమారుడే అని ఆయన బహిరంగంగా అంగీకరించారు. 88 ఏళ్ల ఎన్డీ తివారీ సోమవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. దీంతో ఈ అంశంపై సుదీర్ఘంగా సాగిన న్యాయపోరాటానికి తెరపడినట్లయింది. ‘నేను అతడి(రోహిత్)ని నా కుమారునిగా అంగీకరిస్తున్నా. అతని డీఎన్ఏ నా డీఎన్ఏ సరిపోలడంతో రెండేళ్ల క్రితమే ఈ విషయం నిర్ధారణ అయ్యింది. దీనిపై ఇక ఏ వివాదమూ ఉండదని భావిస్తున్నా’ అని తివారీ చెప్పారు. రోహిత్ తన కుమారుడే అని హైకోర్టులో సైతం అంగీకరిస్తానని చెప్పారు. అయితే రోహిత్‌ను చట్టబద్ధమైన వారసునిగా అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు తివారీ సమాధానం దాటవేశారు. మరోవైపు తివారీ నిజాయితీపై రోహిత్ అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. ఇది తన జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజని, తివారీ నిజాన్ని అంగీకరించాలని, తన తల్లికి సరైన గౌరవం ఇవ్వాలనే తాను న్యాయపోరాటం చేశానని రోహిత్ చెప్పారు. తివారీ ప్రకటనతో సంతృప్తి చెందారా అని ప్రశ్నించగా.. ఆయన నిజాయితీపై తనకు కొన్ని అనుమానాలున్నాయన్నారు. మరోవైపు ఉజ్వలశర్మ కూడా తివారీ ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారు. తాము తివారీ ఆస్తిలో హక్కు కోసం పోరాటం చేయలేదన్నారు. -
రోహిత్‌కు నేను జన్మనివ్వలేదు..: ఎన్డీ తివారీ
న్యూఢిల్లీ: పితృత్వపు కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ మరోసారి తనదైన శైలిలో కోర్టుకు వాదనలు వినిపించారు. రోహిత్ శేఖర్‌కు తాను జన్మనివ్వలేదని ఆయన నొక్కి చెప్పారు. ప్రతివాది ఉజ్వల శర్మ(రోహిత్ తల్లి)తో తనకు ఎలాంటి భౌతిక, శారీరక సంబంధమూ లేదని పేర్కొన్నారు. తనపై నమోదైన పితృత్వపు కేసు వెనుక రాజకీయ ప్రత్యర్థుల కుట్ర ఉందని ఆరోపించారు. ఈ మేరకు కోర్టు నియమించిన స్థానిక కమిషనర్‌కు తివారీ అఫిడవిట్‌ను అందజేశారు. -
యాంకర్‌తో పాటు స్టెప్పులేసిన తివారీ
-
ఎన్డీ తివారీ మరో ‘చిలిపి’ చేష్ట!
లక్నో: ఎనిమిది పదుల వయసు దాటినా తానింకా రసికుడినేనని ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్డీ తివారీ ప్రదర్శించుకుంటూనే ఉన్నారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో ప్రచారంలో ఉండే ఆయన... తాజాగా మరో ‘చిలిపి’ చేష్టతో వార్తల్లోకి ఎక్కారు. తన వయసులో నాలుగోవంతు ఉండే యువతిని పట్టుకుని బలవంతంగా నృత్యం చేయడానికి ప్రయత్నించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అమరవీరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి తివారీ అతిథిగా హాజరయ్యారు. వేదికపైకి ఎక్కిన ఆయన ‘కదమ్ కదమ్ బఢాయేగా’ అంటూ దేశభక్తి గీతం పాడడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికి ఆ కార్యక్రమం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 25 ఏళ్ల యువతిని గట్టిగా పట్టుకొని బలవంతంగా నృత్యం చేయడం మొదలుపెట్టారు. దీంతో అవాక్కయిన నిర్వాహకులు వేదిక ఎక్కి.. తివారీని కిందికి దింపాల్సి వచ్చింది.