లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ (91) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయనను గతరాత్రి కుటుంబసభ్యులు రామ్ మనోహర్ లోహియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్పించారు. తివారీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ...ఇవాళ తివారిని పరామర్శించారు.
ఆయన ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ’తివారీ తమకు వారసత్వ సంపద’ లాంటివారిని సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తివారీ తనయుడు రోహిత్...సీఎంను చూసి భావోద్వేగానికి గురయ్యాడు. కాగా ఈ నెల 19న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తివారీ హాజరయ్యారు.