
రోహిత్ తివారి, అపూర్వ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ ఎన్‌డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తివారిని హత్య చేసిన ఆరోపణలతో ఆయన భార్య అపూర్వను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖంపై దిండుతో ఒత్తి రోహిత్‌ను హత్య చేశారన్న అభియోగాలపై ఆమెను బుధవారం అరెస్ట్ చేశారు.
కాగా ఈనెల16న రోహిత్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అయితే పోస్టుమార్టమ్‌లో నివేదికలో రోహిత్‌ది సహజ మరణం కాదని తేలిన సంగతి తెలిసిందే. దీంతో కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు రోహిత్ భార్య అపూర్వను వరుసగా మూడు రోజుల పాటు ప్రశ్నించారు. పొంతనలేని ఆమె సమాధానాలు మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో రోహిత్ తల్లి ఉజ్వల స్పందిస్తూ రోహిత్, అపూర్వ దంపతుల మధ్య అంతగా సఖ్యత లేదని..పెళ్లైన మొదటిరోజు నుంచే వారి మధ్య విభేదాలు తలెత్తాయన్నారు. అంతేకాదు అపూర్వ, ఆమె కుటుంబం, రోహిత్ ఆస్తిపై కన్నేసారని కూడా ఆమె ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment