తివారీ వ్యవహారంలో ట్విస్ట్!
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాజకీయాల్లో మరో ట్విస్ట్. మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నారాయణదత్త తివారీ పార్టీ మారినట్టు వచ్చిన వార్తలు తూచ్ అని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి ఎన్డీ తివారీ బీజేపీలో చేరిపోయినట్టు ఈరోజు వార్తలు వచ్చాయి. అయితే ఆయన తమ పార్టీలో చేరలేదని బీజేపీ వెల్లడించింది. తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ మాత్రమే తమ పార్టీలోకి వచ్చారని తెలిపింది.
తన కుమారుడితో పాటు ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ కావడంతో తివారీ పార్టీ మారినట్టు ప్రచారం జరిగింది. తన కుమారుడిని బీజేపీలో చేర్పించేందుకే ఆయన అమిత్ షాను కలిసినట్టు తేలింది. అయితే తివారీ బీజేపీలో చేరినట్టు వచ్చిన వార్తలపై కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడం గమనార్హం.