
రోహిత్ భార్య శుక్లా
ఢిల్లీ: దివంగత గవర్నర్, యూపీ మాజీ సీఏం ఎన్‌డీ తివారీ తనయుడు రోహిత్ తివారి హత్య కేసులో నిందితురాలు అయిన అతడి భార్య అపూర్వ శుక్లాపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో అపూర్వ రోహిత్‌ను ఊపిరాడకుండా చేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె జైలు జీవితం గడుపుతున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలతో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు మంగళవారం ఆమెపై 518 పేజీల చార్జీ షీట్ దాఖలు చేశారు.
చదవండి : ఆమె వీడియో కాల్ వల్లే ఇదంతా...నిందితురాలిగా సుప్రీంకోర్టు లాయర్
Comments
Please login to add a commentAdd a comment