ఎన్డీ తివారీ మరో ‘చిలిపి’ చేష్ట! | Age is no bar for ND Tiwari who shakes a leg with show host | Sakshi
Sakshi News home page

ఎన్డీ తివారీ మరో ‘చిలిపి’ చేష్ట!

Published Tue, Sep 24 2013 11:55 PM | Last Updated on Fri, Sep 1 2017 11:00 PM

ఎన్డీ తివారీ మరో ‘చిలిపి’ చేష్ట!

ఎన్డీ తివారీ మరో ‘చిలిపి’ చేష్ట!

లక్నో: ఎనిమిది పదుల వయసు దాటినా తానింకా రసికుడినేనని ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్‌డీ తివారీ ప్రదర్శించుకుంటూనే ఉన్నారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో ప్రచారంలో ఉండే ఆయన... తాజాగా మరో ‘చిలిపి’ చేష్టతో వార్తల్లోకి ఎక్కారు. తన వయసులో నాలుగోవంతు ఉండే యువతిని పట్టుకుని బలవంతంగా నృత్యం చేయడానికి ప్రయత్నించారు.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అమరవీరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి తివారీ అతిథిగా హాజరయ్యారు. వేదికపైకి ఎక్కిన ఆయన ‘కదమ్ కదమ్ బఢాయేగా’ అంటూ దేశభక్తి గీతం పాడడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికి ఆ కార్యక్రమం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 25 ఏళ్ల యువతిని గట్టిగా పట్టుకొని బలవంతంగా నృత్యం చేయడం మొదలుపెట్టారు. దీంతో అవాక్కయిన నిర్వాహకులు వేదిక ఎక్కి.. తివారీని కిందికి దింపాల్సి వచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement