
రోహిత్‌కు నేను జన్మనివ్వలేదు..: ఎన్డీ తివారీ
న్యూఢిల్లీ: పితృత్వపు కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ మరోసారి తనదైన శైలిలో కోర్టుకు వాదనలు వినిపించారు. రోహిత్ శేఖర్‌కు తాను జన్మనివ్వలేదని ఆయన నొక్కి చెప్పారు. ప్రతివాది ఉజ్వల శర్మ(రోహిత్ తల్లి)తో తనకు ఎలాంటి భౌతిక, శారీరక సంబంధమూ లేదని పేర్కొన్నారు. తనపై నమోదైన పితృత్వపు కేసు వెనుక రాజకీయ ప్రత్యర్థుల కుట్ర ఉందని ఆరోపించారు. ఈ మేరకు కోర్టు నియమించిన స్థానిక కమిషనర్‌కు తివారీ అఫిడవిట్‌ను అందజేశారు.